గణతంత్ర వేడుకల వేళ ఏపీకి మొత్తంగా 19 పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం–2026 సందర్భంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన పతకాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 19 పతకాలు వరించాయి. పోలీస్ విభాగంలో ఒకరికి అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం (పీఎస్‌ఎం) వరించింది. మరో 15 మందికి ప్రతిభావంతమైన సేవా పతకాలు (ఎంఎస్‌ఎం) దక్కాయి. జైళ్ల శాఖ (కరెక్షనల్ సర్వీసెస్) నుంచి ముగ్గురు సిబ్బంది పతకాలకు ఎంపికయ్యారు.
రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం
విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి ఇచ్చే ‘ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్వి‹Ù్డ సర్వీస్’ ఈసారి రాష్ట్రం నుంచి ఒకే ఒక్క పోలీసు అధికారికి దక్కింది. తిరుపతి జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) రవి మనోహర తిరుమల చారి ఈ గౌరవానికి ఎంపికయ్యారు. ఆయన స్వస్థలం కర్నూలు జిల్లా. పోలీస్ ప్రతిభావంతమైన సేవా పతకాలు విధి నిర్వహణలో అంకితభావం చాటుకున్న అడిషనల్ ఎస్పీ నుంచి హెడ్ కానిస్టేబుల్ స్థాయి సిబ్బంది వరకు మొత్తం 15 మందికి ‘పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్’ లభించింది.
⇒ సింగాల కృష్ణమోహన్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్
⇒ రాయపు శివారెడ్డి, డీఎస్‌పీ
⇒ పోలవరపు వెంకట శేష నాగమల్లికార్జునరావు, అసిస్టెంట్ కమాండెంట్
⇒ కరజాడ రామారావు, అసిస్టెంట్ కమాండెంట్
⇒ కుందేటి నరసింహారావు, ఇన్‌స్పెక్టర్
⇒ కామవరపు విక్రమరావు, సబ్ ఇన్‌స్పెక్టర్
⇒ షేక్ షఫీ ఉల్లా, సబ్ ఇన్‌స్పెక్టర్
⇒ కటారి జయరామ్, ఆర్మ్‌డ్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్
⇒ ఈత వెంకటకృష్ణ మునేశ్వరరావు, ఆర్మ్‌డ్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్
⇒ చిన్నావుల శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్
⇒ మాదాసు గంగాధరరావు, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్
⇒ అబ్రహం అన్నలదాసు, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్
⇒ కొప్పిశెట్టి రామకృష్ణ, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్
⇒ గళ్ల రంగయ్య, హెడ్ కానిస్టేబుల్
⇒ కాళీదేవి నరసింహులు, హెడ్ కానిస్టేబుల్
⇒ జైళ్ల శాఖలో ఉత్తమ సేవలందించినందుకు జైలర్ గొల్లపోతు రవిబాబు, చీఫ్ హెడ్ వార్డర్ దోనేపూడి
⇒ వెంకట కృష్ణప్రసాద్, హెడ్ వార్డర్ గేరా ఆనందరావుకు ‘మెరిటోరియస్ సర్విస్ మెడల్స్’ లభించాయి.


