republic day celebrations
-
డల్లాస్‌లో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
డాలస్, టెక్సాస్, అమెరికా: అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద భారతదేశ 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26వ తేదీన వందలాదిమంది ప్రవాసభారతీయుల ఆనందోత్సాహాలతో ఘనంగా జరిగాయి.మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వాల హాజరైన వారందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి స్వాగతం పలికారు.మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ “చలి తీవ్రంగా ఉన్నప్పటికీ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ప్రవాస భారతీయలకు కృతజ్ఞతలు అన్నారు. అవతారిక, 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలు, మొత్తం 251 పేజీలఉన్న రాజ్యాంగం భారతదేశ పరిపాలనకు సంబంధించిన ప్రామాణిక గ్రంథం అని దీనిలో ప్రభుత్వ నిర్మాణం, అధికారాలు, విధులు, ప్రభుత్వసంస్థల విధులు, పౌర హక్కులు వివరంగా పేర్కొనబడి ఉన్నాయన్నారు. 1950లో జనవరి 26న అమలులోకి వచ్చిన ఈ రాజ్యంగ రచన వెనుక రాజ్యాంగ ముసాయిదాను రూపొందించిన బ్రిటిష్ ప్రభుత్వంలో ఇండియన్ సివిల్ సర్వెంట్‌గా పనిచేసిన సర్ బెనెగళ్ నర్సింగరావు (బి.ఎన్ రావు) కృషి, ముసాయిదా కమిటీకు చైర్మన్ గా విశేష సేవలందించిన బీ.ఆర్ అంబేడ్కర్ మరియు వారి కమిటీ సభ్యులు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్. గోపాలస్వామి, కే.ఎం మున్షి, మహ్మద్ సాదుల్లా, బీ.ఎల్ మిట్టర్, డీ.పీ ఖైతాన్ లు అభినందనీయులు అన్నారు.ప్రధాని నెహ్రు అభ్యర్ధన మేరకు ప్రముఖ చేతివ్రాత నిపుణుడు ‘ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా’ తన సొంత దస్తూరితో ఆరునెలల పాటు శ్రమించి హిందీ, ఆంగ్ల భాషలలో వ్రాసిన మన భారత రాజ్యాంగం ప్రపంచంలో కెల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అని, దీని అసలు ప్రతిని ఇప్పటికీ పార్లమెంట్ గ్రంథాలయంలో అందరూ చూడవచ్చు అని అన్నారు.”ఎంతో కోలాహలంగా మాతృదేశభక్తి స్ఫూర్తి తో జరిగిన ఈ వేడుకలలో మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, కో-ఛైర్మన్ తయాబ్ కుండావాలా, రాజీవ్ కామత్, కార్యదర్శి రావు కల్వాల, బోర్డ్ సభ్యులు బి.యెన్. రావు, మహేంద్ర రావు, అనంత్ మల్లవరపు తో పాటు ఐఎఎన్టి నాయకలు, వివిధ సంఘాల ప్రతినిధులు, పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
వ్యవసాయానికే ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. ఏడాది కాలంలోనే రైతాంగానికి అండగా నిలిచే ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఆయన జాతీయజెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు, రక్షణ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ ప్రసాద్‌కుమార్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ప్రసంగిస్తూ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. వ్యవసాయం, మహిళా సాధికారత, యువతకు ఉద్యోగాలు, విద్య తదితర రంగాల్లో ప్రభుత్వం చేసిన, చేస్తున్న పనులను వివరించారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటున్నట్టు చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో ఉండేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కింద రాష్ట్రంలోని 25.34 లక్షల మందికి రూ.20,616 కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. సన్నరకం ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్ రూ. 500 చొప్పున రూ.1206.44 కోట్లు బోనస్ కింద అందించినట్టు చెప్పారు.2024 వానాకాలం సీజన్లో దేశంలోనే అత్యధికంగా 1.59 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసినట్టు తెలిపారు. వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేయడం ద్వారా నిరంతరం రైతుల సేవలో ప్రభుత్వం ఉంటుందన్నారు. రైతు వేదికలను మరింత అభివృద్ధి చేసి, రైతునేస్తం కార్యక్రమాన్ని 532 గ్రామీణ మండలాల్లో అమలు చేస్తున్నట్టు వివరించారు. రైతుబీమా పథకం కింద 42.16 లక్షల మంది రైతులకు రూ.1433 కోట్ల బీమా చెల్లించినట్టు చెప్పారు. కృష్ణా జలాల ట్రిబ్యునల్–2 ముందు ప్రభుత్వం తన వాదనను బలంగా వినిపించడంతో కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో విజయం సాధించినట్టు చెప్పారు. దావోస్ ఒప్పందాల్లో 1.70 లక్షల కోట్ల పెట్టుబడులకు అవగాహన కుదిరిందని, ఐటీ, పునరుత్పాదక శక్తి, ఫార్మా కంపెనీల ద్వారా 49,500 ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. మహిళా సాధికారత కోసం తెలంగాణ అభివృద్ధి ఎజెండాలో మహిళలు గుండె వంటి వారని గవర్నర్ పేర్కొన్నారు. ఉచితబస్సు సౌకర్యం ద్వారా 133.91 కోట్లసార్లు ప్రయాణించిన మహిళలకు రూ.4,501 కోట్లు ప్రభుత్వం ఆదా చేసిందన్నారు. 50 లక్షల పేద కుటుంబాలకు గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్ అందించామని, రాయితీ గ్యాస్ సిలిండర్ల ద్వారా 43 లక్షల కుటుంబాలకు రూ.433.2 కోట్లు సబ్సిడీ అందించినట్టు చెప్పారు. ఇందిరా మహిళాశక్తి పథకం ద్వారా కోటిమంది మహిళలను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా మార్చి కోటీశ్వరులను చేయాలని సంకల్పించినట్టు చెప్పారు. స్త్రీనిధి పథకం ద్వారా స్వయం సహాయక బృందాలను బలోపేతం చేస్తున్నామని, సామాజిక న్యాయం దిశగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తాంతెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని గవర్నర్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రజాప్రభుత్వం బాగుందని, తెలంగాణ గీతం అద్భుతంగా ఉందని కొనియాడారు. తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వానికి తెలంగాణ తల్లి విగ్రహం ప్రతీక అని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులను స్మరించుకున్నారు. జయజయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించామని, తెలంగాణ ఉద్యమకారులను గౌరవించుకున్నామని తెలిపారు. యువత సాధికారత కోసం యంగ్‌ఇండియా స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు.రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ద్వారా సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే ఔత్సాహికులకు లక్ష రూపాయల ఆర్థిక సహకారాన్ని కూడా అందిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే 55 వేల యువతీయువకులకు ఉద్యోగాలు కల్పించినట్టు చెప్పారు. క్రీడలకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని, క్రీడాకారుల కోసం యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. విద్య, ఆరోగ్య సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని, గురుకులాల్లో సమగ్ర విద్యాబోధనకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. -
గర్వించేలా గణతంత్రం
న్యూఢిల్లీ: భారత సైనిక శక్తిని, ఆయుధ పాటవాన్ని, సాంస్కృతి వైభవాన్ని ప్రదర్శిస్తూ 76వ గణతంత్ర వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. అత్యాధునిక క్షిపణులు, యుద్ధ విమానాల ప్రదర్శన, జవాన్ల కవాతు దేశమంతా గర్వంతో ఉప్పొంగేలా సాగాయి. ‘సశక్త్ ఔర్ సురక్షిత్’ పేరిట తొలిసారి ప్రదర్శించిన త్రివిధ దళాల ఉమ్మడి శకటం ఆకట్టుకుంది. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఆదివారం జరిగిన ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, త్రివిధ దళాధిపతులు, ప్రముఖుల పాల్గొన్నారు. ఇండొనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో కలిసి రాష్ట్రపతి సంప్రదాయ బగ్గీలో కర్తవ్యపథ్‌కు చేరుకున్నారు. త్రివిధ దళాల సైనికులు ఆమెకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పరేడ్ ప్రారంభమైంది. మొదట లెఫ్టినెంట్ అహన్‌కుమార్ నేతృత్వంలో 61 కావల్రీ సైనిక బృందం ముందుకు సాగింది. జాట్ రెజిమెంట్, గర్వాల్ రైఫిల్స్, మహర్ రెజిమెంట్, జమ్మూకశ్మీర్ రైఫిల్స్ రెజిమెంట్ వంటి దళాల కవాతు ఆకట్టుకుంది. దేశాభివృద్ధిని, ప్రజల సంక్షేమం, సాధికారతను కళ్లకు కడుతూ పలు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘స్వర్ణిమ్ భారత్: విరాసత్ ఔర్ వికాస్’ థీమ్‌తో 31 శకటాలను ప్రదర్శించారు. వైమానిక దళానికి చెందిన 40 యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల విన్యాసాలు ఆహూతులను అలరించాయి. 10 వేల మంది ప్రత్యేక అతిథులు రిపబ్లిక్ డే పరేడ్‌కు ప్రముఖులు సహా 10 వేల మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. వీరిలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు, విపత్తు సహాయక చర్యల సిబ్బంది, ఆశా వర్కర్లు, పారా ఒలింపిక్ అథ్లెట్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, కృషి సఖీలు, ఉద్యోగ్ సఖీలు తదితరులు ఉన్నారు. పలు ప్రభుత్వ పథకాల లబి్ధదారులు, రోడ్డు నిర్మాణ కార్మికులు, పేటెంట్ హోల్డర్లు, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులను ఈసారి ప్రత్యేకంగా ఆహ్వానించారు. వీరంతా జాతీయ యుద్ధ స్మారకం, పీఎం సంగ్రహాలయ్ తదితర కట్టడాలను సైతం సందర్శించారు. నాలో ఇండియన్ డీఎన్ఏ సుబియాంటో సరదా వ్యాఖ్యలు ఆహ్లాదంగా ‘ఎట్ హోమ్’గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆనవాయితీ ప్రకారం రాష్ట్రపతి నిలయంలో ఆదివారం రాత్రి ‘ఎట్ హోమ్’ కార్యక్రమం నిర్వహించారు. గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇండొనేసియా అధ్యక్షుడు సుబియాంటో గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విందు ఇచ్చారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. విందు ఆసాంతం సరదా సరదాగా సాగింది. తనకు భారతీయ మూలాలున్నాయని ఈ సందర్భంగా సుబియాంటో చెప్పారు. ‘‘కొన్ని వారాల క్రితమే జెనెటిక్ సీక్వెన్సింగ్, డీఎన్ఏ పరీక్షలు చేయించుకున్నా. నాలో ఇండియన్ డీఎన్ఏ ఉన్నట్లు తేలింది. భారతీయ సంగీతం విన్నప్పుడల్లా నేను డ్యాన్స్ చేస్తానని అందరికీ తెలుసు. నాలోని ఇండియన్ జీన్స్‌లోనే భారతీయ సంగీతం, నృత్యం దాగున్నాయి’’ అని సుబియాంటో చెప్పడంతో అతిథులంతా హాయిగా నవ్వేశారు. తమ భాషలో చాలా భాగం సంస్కృతం నుంచే వచ్చిందిన సుబియాంటో ఈ సందర్భంగా అన్నారు. తమ దేశంలో పేర్లు చాలావరకు సంస్కృతంలోనే ఉంటాయని చెప్పారు. తమరోజువారీ జీవితాల్లో భారతీయ ప్రాచీన నాగరికత ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించారు. భారత్, ఇండొనేసియా మధ్య ఎన్నో సారూప్యతలున్నాయని ఆయన గుర్తు చేశారు. మోదీ తలపాగా గణతంత్ర వేడుకల్లో ప్రధాని మోదీ ఎరుపు, పసుపు రంగు గీతలతో కూడిన తలపాగా ‘సఫా’ను ధరించారు. దాంతోపాటు తెల్లరంగు కుర్తా–పైజామా, దానిపై ఊదారంగు బంద్గలా జాకెట్ ధరించారు. మోదీ ప్రతిఏటా స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర వేడుకల్లో రంగురంగుల తలపాగాలు ధరించడం ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది గణతంత్ర ఉత్సవాల్లో ఆయన బహుళ రంగులతో కూడిన బాంధానీ ప్రింట్ సఫా ధరించారు. గూగుల్ డూడుల్ 76వ గణతంత్ర వేడుకల సందర్భంగా గూగుల్ ఆదివారం తీసుకొచ్చిన ప్రత్యేక డూడుల్ అందరినీ ఆకట్టుకుంది. లద్దాఖీ దుస్తులు ధరించిన మంచు చిరుత, ధోతీ–కుర్తా ధరించిన పులి వంటి జంతువులు ఇందులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ వాయిద్యాలను ఇవి వాయిస్తున్నట్లుగా ఈ డూడుల్‌ను రూపొందించారు. ఇది జంతువుల పరేడ్‌లా ఉందని చెప్పొచ్చు. అంతర్లీనంగా గూగుల్ అనే అక్షరాలు పొందుపర్చారు. విదేశాల్లోనూ ఉప్పొంగిన దేశభక్తి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశా ల్లోనూ భారత గణతంత్ర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రవాస భారతీయులతోపాటు స్థానికులు వాటి లో ఉత్సాహంగా పా ల్గొన్నారు. భారతీ యులు సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. భార తీయ నృత్యాలను ప్రదర్శించారు. నేపాల్, ఆ్రస్టేలియా, సింగపూర్, చైనా, శ్రీలంక, ఇజ్రాయెల్, జపాన్, ఇండొనేసియా, అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో రిపబ్లిక్ డే నిర్వహించారు. భారత రాయబార కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాలు ఎగురవేశారు. సాయుధ శక్తిదేశీయంగా అభివృద్ధి చేసిన షార్ట్–రేంజ్ టాక్టికల్ మిస్సైల్ ‘ప్రళయ్’, టీ–90 భీష్మా యుద్ధ ట్యాంక్, నాగ్ క్షిపణి వ్యవస్థ, బ్రహ్మోస్ సూపర్‌సానిక్ క్రూయిజ్ మిస్సైల్, పినాక మల్టీ–లాంచర్ రాకెట్ సిస్టమ్, అగ్నిబన్ మల్టీ–బ్యారెల్ రాకెట్ లాంచర్, ఆకాశ్ ఆయుధ వ్యవస్థ వంటి వాటిని ప్రదర్శించారు. బజరంగ్ లైట్ స్పెషలిస్టు వాహనం, ఐరావత్ మోర్టర్ సిస్టమ్, నందిఘోష్, త్రిపురాంతక్ వాహనాలు సైతం దర్శనిమిచ్చాయి. హైలైట్స్ → రాజ్యాంగానికి 75 ఏళ్లయిన సందర్భంగా వేడుకలు మరింత వైభవంగా జరిగాయి.→ గణతంత్ర వేడుకల్లో ఇండొనేసియా అధ్యక్షుడు పాల్గొనడం ఇది నాలుగోసారి. ఆ దేశ సైనిక బృందం కూడా పాలుపంచుకుంది.→ పరేడ్‌లో పరమ్‌వీర్ చక్ర అవార్డు గ్రహీతలు సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్, సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్, అశోక చక్ర అవార్డు గ్రహీత లెఫ్టినెంట్ కల్నల్ జస్రామ్ సింగ్ పాల్గొన్నారు.కర్తవ్య పథ్‌పై... మోదీ స్వచ్ఛభారత్ కర్తవ్యపథ్‌పై ప్రధాని మోదీ స్వచ్ఛభారత్ చేసి చూపించారు. ఆదివారం జరిగిన గణతంత్ర వేడుకలు ఇందుకు వేదికయ్యాయి. ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్‌ను స్వాగతించేందుకు వెళ్తుండగా దారిలో చెత్త కన్పించింది. దాంతో వేడుకల్లో పాల్గొన్న వేలాదిమంది చూస్తుండగా ఆయన కిందకు వంగి దాన్ని ఏరారు. డస్ట్‌బిన్‌లో పడేయాల్సిందిగా సెక్యూరిటీ సిబ్బందికి ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మోదీ చర్యను నెటిజన్లంతా ప్రశంసిస్తున్నారు. సాయుధ శక్తిదేశీయంగా అభివృద్ధి చేసిన షార్ట్–రేంజ్ టాక్టికల్ మిస్సైల్ ‘ప్రళయ్’, టీ–90 భీష్మా యుద్ధ ట్యాంక్, నాగ్ క్షిపణి వ్యవస్థ, బ్రహ్మోస్ సూపర్‌సానిక్ క్రూయిజ్ మిస్సైల్, పినాక మల్టీ–లాంచర్ రాకెట్ సిస్టమ్, అగ్నిబన్ మల్టీ–బ్యారెల్ రాకెట్ లాంచర్, ఆకాశ్ ఆయుధ వ్యవస్థ వంటి వాటిని ప్రదర్శించారు. బజరంగ్ లైట్ స్పెషలిస్టు వాహనం, ఐరావత్ మోర్టర్ సిస్టమ్, నందిఘోష్, త్రిపురాంతక్ వాహనాలు సైతం దర్శనిమిచ్చాయి. -
ప్రత్యేక ఆకర్షణగా 18 శకటాలు
సాక్షి, అమరావతి: భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన వేడుకల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న 18 శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నైపుణ్యం–మానవ వనరుల అభివృద్ధి శకటాలు (డిపార్ట్మెంట్లు: హెచ్ఆర్డీ, నైపుణ్యాభివృద్ధి.. ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమం.. మహిళా, శిశు సంక్షేమం) ప్రథమ బహుమతి సాధించాయి. నాణ్యమైన ఉత్పత్తులు, బ్రాండింగ్ (డిపార్ట్మెంట్: ఉద్యాన) శకటం ద్వితీయ బహుమతి దక్కించుకుంది. గ్లోబల్–బెస్ట్ లాజిస్టిక్స్ (డిపార్ట్మెంట్లు : సీఆర్డీఏ, పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి) శకటం తృతీయ స్థానంలో నిలిచింది. -
75 ఏళ్లలో ఇదొక కీలక మైలురాయి
-
NTR జిల్లా YSRCP కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు
-
దేశంలో కౌలు రైతులు కన్నా యువత ఆత్మహత్యలే ఎక్కువ
-
తివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన బీజేపీ అధ్యక్షుడు నడ్డా
-
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
-
తాడేపల్లి YSRCP కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
-
Watch Live: ఢిల్లీలో 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు
-
బీజేపీవి రాజ్యాంగ విరుద్ద కార్యక్రమాలు: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: దేశంలో కాషాయ ఎజెండాను అమలుచేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇదే సమయంలో ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అందిస్తోందని చెప్పుకొచ్చారు.గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్లో జాతీయ పతాకాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్, మాజీ ఎంపీ హనుమంతరావు, చైర్మన్లు శివసేనారెడ్డి, చల్లా నర్సింహారెడ్డి, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. బీజేపీ దేశంలో కాషాయ ఎజెండాను అమలు చేయాలని చూస్తోంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలని ప్లాన్ చేస్తోంది. అందుకే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్‌లోనే అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమాన పరిచారు. ఇక్కడ కేంద్రమంత్రి బండి సంజయ్ ఇందిరమ్మ పేరు పెట్టవద్దని అంటున్నాడు. ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధ కార్యక్రమాలు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన అందిస్తుంది. తెలంగాణలో బీఆర్ఎస్ పదేళ్లు నియంత పాలన చేసింది. ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. ఈరోజు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ భరోసా కింద 12 వేల రూపాయలు, రైతు భరోసా కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. రాజ్యాంగబద్దంగా పాలన చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాము. హైదరాబాద్ మెట్రో విస్తరణ ఒక పెద్ద ముందడుగు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఎల్లప్పుడు ఉంటుంది. అందుకే జై గాంధీ, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ప్రజలంతా మద్దతు ప్రకటించాలి అని కోరారు. -
తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు
-
‘ఊసరవెల్లి చంద్రబాబు.. పెట్టుబడుల రాకపోవడంతో యూటర్న్’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. స్వతంత్ర్య సమరయోధుల ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పార్టీ నేతలు. రిపబ్లిక్ డే సందర్బంగా జాతీయ జెండాను మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక, ఏపీలోని పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నేతలు జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ సమానంగా ఎదగాలనే దృక్పథంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాం. పేదరికం లేని సమాజం కోసం మనమంతా కృషిచేయాలి. మనల్ని మనం పరిపాలించుకుంటూ ఎంతో పురోభివృద్ధిలోకి వెళుతున్నాం. బ్రిటీష్ పాలకుల నుంచి విముక్తి కోసం బానిస సంకెళ్ళు తెంచుకుని పరిపాలించుకోవాలని అనేక మంది పోరాటాలు చేశారు.ఈ క్రమంలో మనల్ని మనం పరిపాలించుకునే సర్వసత్తాక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకున్నాం. అందరూ సమానంగా ఎదగాలనే దృక్పథంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాలను మన పాలనలో చూశాం. ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యంగా ఎదగాలనే మన ప్రయత్నం కొనసాగించాలి. పేదరికాన్ని పారద్రోలి స్వతంత్ర భారతాన్ని నిర్మించుకోవడానికి మనమంతా కృషిచేయాలని పార్టీ తరఫున ప్రజలకు విజ్క్షప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా వేడుకల్లో పార్టీ నేతలు పాల్గొన్నారు. విశాఖలో వేడుకలు..విశాఖలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండానుమాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆవిష్కరించారు. అనంతరం అమర్నాథ్ మాట్లాడుతూ..‘మన రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలులో లేదు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. రాష్ట్ర ప్రజల హక్కులను వైఎస్సార్సీపీ కాపాడుతుంది. విజయసాయి రెడ్డి రాజీనామా గురించి ఆయనే చెప్పారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని మాట్లాడారు. తన లాంటి వారిని వెయ్యి మందిని తయారు చేయగలరని సాయిరెడ్డి చెప్పారు.నాయకులను ఏ విధంగా తయారు చేయాలో వైఎస్ జగన్‌కు తెలుసు. వైఎస్ జగన్ ఒక టార్చ్‌బేరర్. చంద్రబాబు మీద నమ్మకం లేకనే గతంలో టీడీపీ రాజ్యసభ సభ్యులు నలుగురు టీడీపీని వీడిచారా. నాయకుల మీద రాజకీయంగా ఒత్తిడి ఉంటుంది. కొంతమంది తట్టుకుంటారు మరి కొంతమంది తట్టుకొని నిలబడలేరు. పెట్టుబడులు రాకపోయేసరికి దావోస్ పర్యటనపై చంద్రబాబు మాట మార్చారు. దావోస్ పర్యటన ఒక మిథ్య అంటూ మాట్లాడుతున్నారు. పదిసార్లు దావోస్ వెళ్లి వచ్చిన తరువాత మిథ్య అని తెలిసిందా? అంటూ ప్రశ్నించారు. విజయవాడలో..విజయవాడలో జాతీయ జెండా ఎగురవేసిన సెంట్రల్ నియోజకవర్గ మాజీ MLA మల్లాది విష్ణు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ..‘రాజ్యాంగ అమలు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా లేదు. రాజ్యాంగ వ్యతిరేక శక్తులు రాజ్యమేలుతున్నాయి. రాజ్యాంగానికి అనుగుణంగా పని చేయాల్సిన సంస్థలు వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. గవర్నర్ చేత ప్రభుత్వం అన్ని అబద్దాలు చెప్పించింది.దావోస్ పర్యటనలో ఒక్క పరిశ్రమ రాలేదు. పరిశ్రమలు తీసుకురాకుండా ఎదురుదాడి చేస్తున్నారు. షేక్ హాండ్స్ కోసం కాదు దావోస్‌కు వెళ్లేది. సంక్షేమ పథకాలు అమలు చేస్తామని నేడు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. మూడు పార్టీలు భిన్నమైన ఆలోచనతో ముందుకు వెళ్తున్నాయి. ఓటు ద్వారా, నియంతృత్వం ద్వారా ఓటు హక్కును వినియోగించుకొన్నామని చెప్పే వాళ్ళు ముందుకు రావాలి.. ప్రభుత్వాన్ని ప్రశించాలి. విద్య, వైద్యాల్లో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఆసుపత్రుల్లో పిల్లలను ఎత్తుకెళ్తున్నారు.. కనీసం మందులు కూడా లేవు. వ్యవస్థలను ప్రక్షాళన చేయాలి. తప్పులు ఎవరు చేస్తున్నారు, ఎవరు అబద్ధాలు, ఎవరు ప్రజల్లో మోసం చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి అని కామెంట్స్ చేశారు.వైఎస్సార్ జిల్లాలో..వైఎస్ఆర్ జిల్లాలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ జెండా ఎగురవేసిన జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష, మేయర్ సురేష్ బాబు. ఈ సందర్భంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఎన్టీఆర్ జిల్లాలో..ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది త్యాగం ఫలితంగా ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. గత ఐదేళ్లలో అంబేద్కర్, మహాత్మా గాంధీ ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లిన నాయకుడు వైఎస్ జగన్. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సుసాధ్యం చేసిన వ్యక్తి వైఎస్ జగన్. రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడంలో వైఎస్ జగన్ అడుగుజాడల్లో మేము వెళ్తాం అని అన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్ర వేడుకలు
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల గవర్నర్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లాల్లో కూడా గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మంత్రి లోకేశ్ పాల్గొన్నారు.ఇక, తెలంగాణలో సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy), మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
గెలిచిన దారులు మిగిలిన ఆకాంక్షలు
రాజ్యాంగం... దేశ పాలనావ్యవస్థకు పరమగ్రంథం. ప్రతి పౌరునికి శిరోధార్యం. బలహీనులకు వజ్రాయుధం. బలవంతులను అదుపు చేసే అంకుశం. పురుషస్వామ్య పెత్తందారీ నుంచి స్త్రీలు అడుగు ముందుకు వేయడానికి రాజ్యాంగం పరిచిన దారులు వారిని నేడు ఆత్మగౌరవంతో నిలబెట్టి స్వయం సమృద్ధి వైపు నడిపిస్తున్నాయి. సాధించింది ఎంతో. సాధించాల్సింది మరెంతో. ఆకాంక్షలను అలాగే నిలబెట్టుకుంటూ ముందుకు సాగాలని అంటున్నారు సీనియర్ రచయిత్రి.భారత రాజ్యాంగాన్ని స్త్రీల దృష్టితో చూడటానికి ఈరోజొక వజ్రోత్సవ సందర్భం. వాలుకి కొట్టుకుపోయే యాంత్రికత నుంచి బైటకి వచ్చి, దాటి వచ్చిన కాలాలను, నడుస్తున్న సమయాలను నిమ్మళంగా చూస్తున్నప్పుడు కొంత సంతోషం, మరికొంత బాధ. ఈ రోజుల్లో భర్త చనిపోతే భార్య చితిలోకి దూకనవసరం లేదు, అతి బాల్య వివాహాలు చేసుకోనవసరం లేదు, వితంతువులు రహస్య గర్భవిచ్చిత్తిలో ప్రాణాలు పోగొట్టుకోనవసరం లేదు. గడపచాటున నిలబడి మాట్లాడటం, ముట్టుగదుల్లో మగ్గడం, అవిద్య, అజ్ఞానం, మూఢనమ్మకాల నుంచి స్త్రీలు చాలావరకూ బైటపడ్డారు. రాజ్యాంగంలో స్త్రీలకి సమానహక్కులు పొందుపరచడానికి ముందుతరాల వారు చేసిన సంఘసంస్కరణ చాలావరకూ మూలకారణం. దీనికి సమానమైన చేర్పుని రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ ఆలోచనలు ఇచ్చాయి. స్త్రీలని వాహికలుగా చేసుకుని కులం, మతం వ్యాప్తి చెందుతాయని, ఈ సమాజాన్ని కొందరి చెప్పుచేతుల్లోనే ఉంచుతాయన్నది అంబేద్కర్ అవగాహన. అందుకే దళిత, కార్మికవర్గాల కోసం ఆలోచించినంతగా స్త్రీ సమానత్వం కోసం కూడా పాటుబడ్డారు. రాజ్యాంగానికి మూలాధారమైన ‘అందరికీ సమానమైన విలువ’ అనే అంబేద్కర్ ప్రతిపాదన పైకి కనిపించే సాధారణ విషయం కాదు. ఆ కాలానికే కాదు, ఇప్పటికీ మనుషులు సమానంగా లేరు. స్త్రీలు చాలా విషయాల్లో రెండవ తరగతి పౌరులుగానే ఉన్నారు. ఆ స్థితిని పోగొట్టి, స్త్రీల జీవితాల్లో విప్లవాత్మక మార్పుల కోసం అంబేద్కర్ ప్రవేశపెట్టిన ‘హిందూ కోడ్ బిల్’ ఒక సంచలనం. అంతవరకూ స్త్రీలకి సామాజిక, రాజకీయ, కుటుంబహక్కుల వంటివి లేవు. సమానత్వప్రాతిపదిక మీద రాజ్యాంగం ద్వారా వారు ఆ హక్కులను మిగతావారితో పాటు సహజంగానే పొందారు. ఉదాహరణకి రాజ్యాంగ ఏర్పాటుకి మునుపు సార్వత్రిక ఓటుహక్కు లేదు. తొంభైశాతం పైగా స్త్రీలకి ఓటువేయడం అంటే ఏమిటో తెలీదు. కానీ రాజ్యాంగం ద్వారా స్త్రీలంతా ఓటు వేయడమే కాదు, రాజకీయ పార్టీలలో చేరి, ఎన్నికలలో పాల్గొని, శాసనసభలకి చేరారు. ‘బిఎ చదివినా బియ్యంలో రాళ్లేరక తప్పుతుందా’ అన్నవారికి– ఉద్యోగాలు చేసి, ఊళ్ళేలి చూపించారు స్త్రీలు. బ్రిటిష్ పాలనకి భిన్నంగా భారత రాజ్యాంగం స్త్రీల ఉనికిని నిరూపించింది. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను వాడుకుని చేసిన అనేక పోరాటాల ఫలితంగా స్త్రీలకి అనుకూలమైన కొన్ని చట్టాలు రూపొందాయి. వివాహానికి సరైన వయసుప్రాతిపదిక అయింది. అబార్షన్ హక్కులు ఉన్నాయి. విడాకులు పూర్వమంత కఠినం కావు. స్త్రీలపై సాగే గృహహింస, లైంగిక వేధింపులు, అత్యాచారాలకి కఠినశిక్షలు ఉన్నాయి. ఆస్తి, వారసత్వ హక్కుల విషయంలో కూడా ప్రగతి కనబడుతోంది. ముఖ్యంగా స్త్రీల సామాజిక, రాజకీయ భాగస్వామ్యం మెరుగుబడింది. అయితే, స్త్రీల హక్కులన్నిటికీ కాపాడగల రక్షణ వ్యవస్థలు నిష్పక్షపాతంగా లేవు. అవి మగ స్వభావాన్ని, మగ పెత్తనాన్ని తెలియక, తెలిసి ప్రదర్శిస్తాయి. దానివల్ల మొగ్గు పురుషుడి వైపు ఉండి స్త్రీ సమానత్వాన్ని సూచించే రాజ్యాంగస్ఫూర్తిని భగ్నం చేస్తాయి. అందుకే ‘అందరికీ ఒకే విలువ’ సూత్రం ఆచరణలో విఫలం అయింది. స్త్రీలు అన్ని ఉద్యోగాలకి అర్హులు. కానీ సైనికులుగా, భారీ వాహన చోదకులుగా, పెద్దపెద్ద హోదాలు కల ఉద్యోగులుగా, మంత్రులుగా, వ్యాపారవేత్తలుగా వారి ఉనికి ఎంత? ఇటీవలి అంచనాలు కార్మిక వర్గంలో, ‘బాస్’ స్థానాలలో స్త్రీల నిష్పత్తి పతనమవుతున్నదని హెచ్చరిస్తున్నాయి. ఇక కొన్ని ప్రత్యేక రంగాల్లో స్త్రీలు అడుగు పెట్టాల్సే ఉంది. సంసిద్ధత లేకపోవడం సమాజానికే కాదు, సమాజం తయారు చేసే స్త్రీలది కూడా కావొచ్చు. అందరినీ ఒక చోటికి చేర్చాలంటే వెనుకబడి ఉన్నవారిని ముందుకు చేర్చడానికి రిజర్వేషన్లు కావాలి. విద్యా ఉద్యోగ రంగాలలో స్త్రీలకి 33 శాతం రిజర్వేషన్లని అంగీకరించిన రాజ్యాంగం– చట్టసభలకి ఆ హక్కుని వర్తింపజేయలేక పోయింది. 33 శాతం రిజర్వుడ్ స్థానాల్లోనూ, జనరల్ స్థానాల్లో మరి కొందరు స్త్రీలు కలిసి చట్టసభలకి చేరి విధాన నిర్ణయాలు చేయడమన్న ఆలోచనకే రాజకీయపార్టీలు వ్యతిరేకం కనుకనే ఇంతవరకూ మహిళా రిజర్వేషన్ల బిల్లు ముందుకు పోవడం లేదు. స్త్రీల శరీరాల మీద పురుషులకి ఉండే హక్కులకి, స్త్రీల గౌరవానికి భంగకరంగా ఉన్న అడల్టరీ చట్టం ఎత్తి వేయడానికి రాజ్యాంగం ఏర్పడ్డాక కూడా దాదాపు ఏడు దశాబ్దాలు పట్టింది. తల్లికి బిడ్డల మీద ఉండాల్సిన సహజ బాధ్యతలు, హక్కుల విషయంలో కూడా చాలా వివక్ష ఇప్పటికీ ఉంది. పురుషుని ఇంటిపేరుతో స్త్రీ, ఆమె పిల్లలు గుర్తింపు పొందడం– పితృస్వామ్యం బలంగా ఉండడాన్నే సూచిస్తుంది. రాజ్యాంగంలో కూడా స్త్రీలహక్కులకి సంబంధించి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆచరణలో చాలా లోటుపాట్లు కూడా ఉన్నాయి. అయినాసరే స్త్రీలు తాము పోరాడి సాధించుకున్న చైతన్యాన్ని నిలుపుకోవడానికి తమ హక్కులకి రక్షణ ఉండాలని గట్టిగా అడగడానికి రాజ్యాంగమే ఆసరాగా ఉంది. దానికి తోడు మహిళాపోరాటాల సాధించుకున్న, సాధించుకోబోయే మార్పులు– ‘అందరికీ ఒకే విలువ’ సూత్రానికి స్త్రీలని మరింత దగ్గర చేస్తాయని నమ్మిక. ఈ నమ్మకాన్ని సడలనివ్వకుండా మనం ముందుకు సాగాలి.– కె.ఎన్.మల్లీశ్వరి, రచయిత -
Republic Day 2025: ఈసారి గణతంత్ర వేడుకల్లో ప్రత్యేకతలివే..
భారతదేశం 2025, జనవరి 26న 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ కవాతు ప్రత్యేక ఆకర్షణలకు కేంద్రంగా మారనుంది.గణతంత్ర దినోత్సవ కవాతు జనవరి 26న ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కవాతు ఢిల్లీలోని విజయ్ చౌక్ నుండి ప్రారంభమై, కర్తవ్య పథ్ ద్వారా ఎర్రకోటకు చేరుకుంటుంది. ఈ సంవత్సరం కవాతు కార్యక్రమం, శకటాలు, ముఖ్య అతిథి, థీమ్, భద్రతా వివరాలు ఇలా ఉన్నాయి.గణతంత్ర దినోత్సవం 2025 థీమ్76వ గణతంత్ర దినోత్సవం థీమ్ 'స్వర్ణ భారతదేశం: వారసత్వం- పురోగతి'. ఈసారి కవాతు 90 నిమిషాల్లో ముగియనుంది. ఈసారి కవాతులో 31 శకటాలు, 18 మార్చింగ్ కంటింజెంట్లు, 15 బ్యాండ్లు పాల్గొంటాయి. కవాతు సందర్భంగా మొత్తం 5,000 మంది కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు.త్రివిధ సైన్యాల ఉమ్మడి శకటంగణతంత్ర దినోత్సవ చరిత్రలో తొలిసారిగా మూడు దళాలు అంటే సైన్యం, నౌకాదళం, వైమానిక దళాలకు చెందిన ఒకే శకటం ప్రదర్శితం కానుంది. కవాతులో మొదటిసారిగా మూడు సాయుధ దళాల విభాగాల ప్రత్యేక శకటాలు ఉండవు. ఈ మూడు విభాగాల సమన్వయాన్ని తెలిపేదిగా ఉమ్మడి శకటాన్ని రూపొందించారు.రాష్ట్రాల ఘనతను చాటే శకటాలుగణతంత్ర దినోత్సవ కవాతులో బీహార్, మధ్యప్రదేశ్, యూపీ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, చండీగఢ్, గోవా, హర్యానా,జార్ఖండ్‌తో సహా 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన శకటాలు ప్రదర్శితం కానున్నాయి. 2025 మహాకుంభ్ ప్రాముఖ్యతను తెలియజేసే శకటం ప్రత్యేక ఆకర్షణ కానుంది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల శకటాలు కూడా కనిపించనున్నాయి.ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడుఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే ఈసారి తొలిసారిగా ఇండోనేషియాకు చెందిన 352 మంది సభ్యుల మార్చింగ్, బ్యాండ్ బృందం గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొననుంది. కాగా 1950లో జరిగిన భారతదేశ తొలి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.భద్రతా ఏర్పాట్లుగణతంత్ర దినోత్సవం వేడుకల వేదిక సమీపంలో యాంటీ-డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అతిథులకు క్యూఆర్ కోడ్ ద్వారా ప్రవేశం కల్పించనున్నారు. ఆర్మీ హెలికాప్టర్లు గస్తీ తిరుగుతాయి. దీనితో పాటు ఎన్ఎస్జీ కమాండోలు, ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ దళాలు, డీర్డీఓ శాస్త్రవేత్తలు భద్రతా బాధ్యతలు చేపట్టనున్నారు. 14 'పరాక్రమ్' కమాండో వాహనాలను ఇప్పటికే మోహరించారు.ఇది కూడా చదవండి: Mahakumbh: మౌని అమావాస్యకు ఎందుకంత ప్రత్యేకత? -
Republic Day 2025: జయమ్మ విజయం
‘మన దేశంలో పేదలు కలలు కనగలరు. వాటిని నిజం చేసుకోగలరు’ అనే మాట ఎన్నో సందర్భాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నోటి నుంచి వినిపించింది. పేదరాలైన జయమ్మ కల కన్నది. ‘నా కష్టాన్ని చూసి నలుగురు మెచ్చుకుంటే చాలు’ నలుగురు ఏం ఖర్మ... సాక్షాత్తూ రాష్ట్రపతిభవన్ ఆమె కష్టాన్ని గుర్తించింది.‘నీ భర్త ఏం పనిచేస్తాడు?’ అనే ప్రశ్నకు... జయమ్మ చెప్పిన జవాబుకు అవతలి వ్యక్తి ముఖం అదోలా మారిపోయేది. మాటల్లో చిన్న చూపు కనిపించేది.నెల్లూరుకు చెందిన జయమ్మ ఔట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికురాలు. దీంతోపాటు భర్తతో కలిసి సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ పనులు చేస్తుంది.‘చేయడానికి మీకు ఈ పనే దొరికిందా తల్లీ’ అని వెక్కిరించిన వాళ్లు ఎందరో! అయితే ఏ రోజూ చేస్తున్న పనిపట్ల నిర్లక్ష్యం, విముఖత జయమ్మలో కనిపించలేదు. ఆమె రెక్కల కష్టం వృథా పోలేదు. వృత్తి పట్ల జయమ్మ అంకితభావానికి గుర్తింపుగా దిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ఆహ్వానం అందింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇస్తున్న విందులో పాల్గొనబోతోంది జయమ్మ.‘పెద్దోళ్లకు అందరూ చుట్టాలే. పేదోళ్లకు కష్టాలే చుట్టాలు’ అంటుండేది జయమ్మ తల్లి రాజమ్మ.ఆ ఇంటికి కష్టాలు కొత్త కాదు. కష్టపడడం కొత్త కాదు. నెల్లూరు నగరంలోని ఉమ్మారెడ్డిగుంట ప్రాంతానికి చెందిన జయమ్మ తన తల్లిదండ్రులకు సాయంగా రోజువారీ కూలిపనులకు వెళ్తుండేది. ‘ఏ పనీ లేకుండా ఇంట్లో కూర్చోవడం కంటే పనికి పోవడమే నాకు ఇష్టం’ అంటున్న జయమ్మకు ‘శ్రమ’ అనేది చిన్నప్పటి నేస్తం.జయమ్మకు రమేష్‌తో వివాహం జరిగింది. రమేష్ మొదట్లో సెప్టిక్‌ట్యాంక్ వాహనానికి డ్రైవర్‌గా వెళ్తుండేవాడు. పదేళ్లపాటు డ్రైవర్‌గా పనిచేసిన అనుభవంతో తానే సొంతంగా ఓ సెప్టిక్ ట్యాంకర్ సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేసి క్లీనింగ్ పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ చేసేవాడు. ఇద్దరు పిల్లలు స్కూల్‌కి వెళ్లే వయస్సు వచ్చేవరకు గృహిణిగా ఉన్న జయమ్మ ఆ తరువాత భర్త చేసే సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ పనులకు తాను కూడా తోడుగా వెళ్తుండేది.చిన్నచూపు చూసినా..భూగర్భ డ్రైనేజీ పారిశుధ్య పనులకు వెళ్లే జయమ్మను తోటివారే చిన్నచూపు చూసేవారు. అవేమీ పట్టించుకోకుండా భర్తకు చేదోడువాదోడుగా ఉండేది. క్లీనింగ్ సమయాల్లో చర్మవ్యాధుల బారిన పడేది. ఈ దంపతుల కష్టాన్ని చూసిన ‘నవజీవన్ ’ అనే స్వచ్ఛంద సంస్థ నాలుగేళ్ల క్రితం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ షూరిటీతోపాటు ఎన్ ఎస్కేఎఫ్డీ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకు రుణం మంజూరు చేయించింది. రూ.10 లక్షల సబ్సిడీతో రూ.32 లక్షలు విలువైన కొత్త సెప్టిక్ ట్యాంకర్ క్లీనింగ్ వాహనాన్ని మంజూరు చేయించడంతో వారికి సొంతవాహనం సమకూరింది. దీంతో దంపతులిద్దరూ సొంత వాహనంతో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కార్పొరేషన్ అధికారుల సహకారంతో నగరంలోని ఎన్నో నివాసాల్లో సెప్టిక్‌ట్యాంక్ క్లీనింగ్ పనులు చేస్తున్నారు.అన్ని అంశాల్లో మంచి మార్కులుకేంద్ర ప్రభుత్వ ఎన్ ఎస్కేఎఫ్డీసీ (నేషనల్ సఫాయి కర్మచారీస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్) పథకం లబ్ధిదారు అయిన జయమ్మ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనానికి యజమాని అయింది. పథకాన్ని ఏ మేరకు సద్వినియోగం చేసుకున్నారు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా, సకాలంలో ఈఎంఐ కడుతున్నారా, లోడ్‌ను ఎక్కడంటే అక్కడ డంప్ చేస్తున్నారా లేక ప్రభుత్వం చూపిన పాయింట్లోనే డంప్ చేస్తున్నారా... ఇలాంటి అంశాలతో పాటు తగినవిధంగా జీవనోపాధి పొందుతున్నారా.. పోలీస్ స్టేషన్లో ఏమైనా కేసులు నమోదయ్యాయా... ఇలా ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు ఎన్ఎస్కేఎఫ్డీసీ అధికారులు. అన్నింట్లో మంచి మార్కులు రావడంతో జయమ్మ కృషికి గుర్తింపు లభించింది. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనడానికి రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం వచ్చింది.ఆ నమ్మకంతోనే...‘నమ్మిన పని ఎప్పుడూ మోసం చేయదు అనే మాట ఎన్నోసార్లు విన్నాను. ఆ నమ్మకంతోనే ఎంతమంది వెక్కిరించినా పట్టించుకోలేదు. మా ఆర్థిక స్థాయికి సెఫ్టిక్ ట్యాంకర్ క్లీనింగ్ బండికి సొంతదారులమవుతామని అనుకోలేదు. కష్టపడితే ఆ కష్టమే మనల్ని ముందుకు తీసుకువెళుతుంది’ అంటూ ఆత్మవిశ్వాసం నిండిన గొంతుతో అంటుంది జయమ్మ.జీవితంలో మర్చిపోలేని రోజుమేము చేసే వృత్తి తప్పుడు పనేం కాదు. మా రెక్కల కష్టాన్నే నమ్ముకుని పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. అందులోనే మాకు సంతృప్తి ఉంది. ఎవరేమి అనుకున్నా మేము ఎప్పుడూ బాధపడలేదు. నా భర్తకు తోడుగా సాయంగా వెళ్లి క్లీనింగ్ పనులు చేస్తున్నా. గణతంత్ర వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వాన పత్రిక రావడం జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఎంతో సంతోషంగా ఉంది.– జయమ్మ– చిలక మస్తాన్‌రెడ్డి సాక్షి ప్రతినిధి, నెల్లూరు -
పారాలింపియన్లు, సర్పంచులు, చేతివృత్తుల వారు..
సాక్షి, న్యూఢిల్లీ: 76వ గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక అతిథులుగా పదివేల మంది హాజరుకానున్నారు. 26వ తేదీన ఢిల్లీ కర్తవ్య పథ్‌లో జరిగే పరేడ్‌కు ‘స్వర్ణిమ్ భారత్’వాస్తు శిల్పులు, పారాలింపియన్లు, వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారిని ఆహ్వానిస్తున్నట్లు గురువారం పేర్కొంది. వీరిలో ఉత్తమ పనితీరు కనబరిచిన గ్రామ సర్పంచ్‌లు, చేనేత నిపుణులు, విపత్తు సహాయక సిబ్బంది, అటవీ, వన్యమృగ సంరక్షణ కేంద్రాల ఉద్యోగులు తదితరులు ఉంటారని తెలిపింది. ఎంపిక చేసిన ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆరు ప్రధాన పథకాల్లో లక్ష్యాలను సాధించిన పంచాయతీ సర్పంచిలు, ఈ శాన్య రాష్ట్రాలు, బెస్ట్ స్టార్టప్‌లు, రహదారి నిర్మాణ కార్మికులు కూడా ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. వీరందరికీ ఢిల్లీలోని పలు ప్రముఖ ప్రదేశాలైన జాతీయ యుద్ధ స్మారకం, ప్రధానమంత్రి సంగ్రహాలయ వంటివాటిని సందర్శించేందుకు వీలు కల్పిస్తారు. -
ఆంగ్ల మాధ్యమం అనుసరణీయం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ప్రాథ మిక పాఠశాల స్థాయి నుండి బోధనా మాధ్య మంగా ఆంగ్లాన్ని ప్రవేశ పెట్టాలని తీసుకున్న నిర్ణయం సరైన దిశలో ఒక సాహసోపేతమైన ముందడుగు. ఆంధ్రప్ర దేశ్ ఇప్పటికే పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టి దిగ్విజయంగా ముందుకు వెళుతోంది. ఇంగ్లీషు మీడియం విద్య తన ముఖ్య మైన ఎజెండాల్లో ఒకటిగా చేసుకొంది. ఈ ఏడాది ఢిల్లీలోని రిపబ్లిక్ డే వేడుకల్లో ఆంధ్ర ప్రదేశ్ తరఫున పాల్గొన్న శకటం ఇంగ్లీషు మీడియం చదువు ప్రాముఖ్యాన్ని ఎలుగెత్తి చాటింది. దీన్నిబట్టి ఏపీ ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమానికి ఎంత ప్రాముఖ్యం ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో ఈ విద్యా సంవత్సరం నుంచే పాఠశాల, కళాశాల స్థాయుల్లో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టడా నికి కసరత్తు జరుగుతోంది. ఇంగ్లీషు మాధ్యమం విషయంలో కొందరు వ్యతిరేకత వ్యక్తం చేసినా ఇప్పుడు వారూ నిశ్శబ్దాన్ని ఆశ్రయించారు. మొత్తం మీద విద్యావేత్తలు, విద్యా నిర్వాహ కులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుండి ఆంగ్ల మాధ్యమ విద్యకు ఎంతో మద్దతు లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంగ్లీషును బోధనా మాధ్యమంగా ప్రవేశపెట్టాలని నిర్ణయించి నప్పుడు మొదట్లో కొన్ని కార్పొరేట్ పాఠశాలలు, ఇతర స్వార్థ ప్రయోజనాలకుచెందిన కార్టెల్‌లు వ్యతిరేకించినప్పటికీ, తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యా కార్యకర్తలు మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వం బలమైన రాజకీయసంకల్పంతో ముందుకు సాగింది. అనేక దళిత సంఘాలు, ఎన్జీఓ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో ర్యాలీలు నిర్వహించి బోధనా మాధ్యమంలో ప్రతిపాదిత మార్పుకు సంఘీభావం తెలిపాయి. ఆంగ్ల విద్య సామాజిక మార్పుకు నాంది పలుకు తుందనీ, సమాజంలోని పేదలు, అట్టడుగు వర్గాలకు విముక్తి కల్పించే సాధనంగా ఉపయోగ పడుతుందనీ వారు భావించారు. ఇంగ్లీషు చదువు వల్ల మాతృభాషకు నష్టం వాటిల్లుతుందని కొందరు అంటున్నారు. కానీ, భయపడాల్సిన పనిలేదు. ప్రాథమిక స్థాయి నుండే ఇంగ్లీషును ఒక సబ్జెక్ట్‌గా బోధిస్తే, పిల్ల లకు ఆ భాషలో కూడా మెరుగైన వ్యక్తీకరణ నైపుణ్యాలు పెంపొందే అవకాశం ఉంది. సాఫ్ట్ వేర్, ఇంటర్నెట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు నడిచే యుగం ఇది. ఇంగ్లీషు పరిజ్ఞానం ఈ రంగాల్లో చాలా అవసరం. ఇవ్వాళ మన ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటున్న పిల్లలకు మెరుగైన అవకాశాలు లభించడం ఖాయం. ఫలితంగా వారి కుటుంబాల జీవన ప్రమాణాలు పెరుగుతుంది. ఇది అంతిమంగా రాష్ట్ర, దేశ అభివృద్ధికి దారితీస్తుంది. ఇంగ్లీషు ప్రాధాన్యతను పెరుగుతున్న సామాజిక–ఆర్థిక అవసరాల కోణంలో చూడాలి. సృజనాత్మక రచన, సాహిత్య ఎదుగుదల మాతృభాష ద్వారానే సాధ్యమవుతుందనేది నిజం. కానీ ఇంగ్లీషు... దేశం లోపలా, బయటా అన్ని చోట్లా ఉనికిలోకి వచ్చింది. లింక్ లాంగ్వేజ్‌గా ఉంది. ఈ భాష లేకుండా ఈ రోజు ‘ప్రపంచ పౌరుడి’ని ఊహించలేము. ప్రాథమిక పాఠ శాలల నుండే ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే సమాజంలో సమూలమైన మార్పు రావడం ఖాయం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం వల్ల ప్రైవేట్ పాఠ శాలల్లో అధిక ఫీజులు కట్టి పిల్లలను చదివిస్తూ సతమతమవుతున్న మధ్యతరగతి తల్లిదండ్రులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న తెలుగు మాధ్యమాన్ని ఇంగ్లీషులోకి మార్చడం అనేక సవాళ్లతో కూడుకున్న పని. మొదటి అతి ముఖ్యమైనది ఉపాధ్యాయు లకు కొత్తగా శిక్షణ ఇవ్వడం. ముఖ్యంగా మారు మూల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ఇంగ్లీషు కమ్యూనికేషన్ ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది ప్రతి ఒక్కరికీ తెలుసు.అందువల్ల, ఉపాధ్యాయులు ‘ఇంగ్లిష్అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ’ లేదా అటువంటి ఇతర సంస్థల ద్వారా, ‘ఉపాధ్యాయుల ఇండక్షన్ ప్రోగ్రామ్‌ల’ ద్వారా శిక్షణ ఇవ్వాలి. ఇంగ్లీషులో సబ్జె క్టుల బోధనకు ఉపయోగించే రీడింగ్/ టీచింగ్ మెటీరియల్స్ తయారీలో ఉపా ధ్యాయుల పాత్ర, విధి ఉంటుంది. మాతృభాష ఆంగ్లం కాని పిల్లలకు బోధించడంలో అత్యంత సమగ్రమైన పద్ధతి, విధానాలు అత్యంత నైపుణ్యం కలిగి ప్రణాళికాబద్ధంగా అమలు చేయబడేవి. దీనికి తోడు ప్రస్తుతంఉన్న పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కూడా పెంచాలి. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో పాటూ ఎన్ఆర్ఐల ఇష్టపూర్వక సహ కారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడ తాయని ఆశిద్దాం. - వ్యాసకర్త హైదరాబాద్ విశ్వవిద్యాలయం విశ్రాంత హిస్టరీ ప్రొఫెసర్ - కె.ఎస్.ఎస్. శేషన్ -
చికాగోలో ఘనంగా సంక్రాంతి, రిపబ్లిక్ డే వేడుకలు!
అమెరికాలోని చికాగోలో తెలుగువారు సంక్రాంతి, రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ‘ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్’ స్థానిక హిందూ టెంపుల్ ఆఫ్ లేక్ కౌంటీ ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ సంబరాలు అంబరాన్నంటాయి. సంస్థ అధ్యక్షుడు హేమంత్ పప్పు ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇక అందంగా అలంకరించిన వేదిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించిన సంగీత, నాట్య కార్యక్రమాలు అలరించాయి. సంస్థ ప్రతినిధులు, సభ్యులు, వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం వినోదాత్మకంగా నడిపించారు. ఈ వేడుకల్లో 300 మందికిపైగా పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో వచ్చిన సభ్యుల నడుమ నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నారులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ వేడుకలను పురస్కరించుకుని స్థానిక కళాకారులచే ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమాలు ఆహుతులను ఉర్రూతలూగించాయి. ఇక ఈ వేడుకల్లో పాల్గొన్న పార్టిసిపెంట్స్‌కు పలువురు ప్రముఖులు సర్టిఫికెట్లు అందజేసి, ప్రోత్సహించారు. పలు సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ నిర్వహించిన ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ సభ్యులను పలువురు కొనియాడారు. ఇక ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవటం పట్ల సంస్థ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సంస్థకు అండగా ఉంటూ సహాయసహాకారాలు అందిస్తున్న ప్రతిఒక్కరికీ నిర్వహకులు ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: ఫ్లోరిడాలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు) -
AP: రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీ శకటానికి అవార్డు
న్యూఢిల్లీ: భారత 75వ రిపబ్లిక్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శకటానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు దక్కింది. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ చేతుల మీదుగా ఏపీ రెసిడెంట్ కమిషనర్ లవ్అగర్వాల్, ఏపీ సమాచార శాఖ జేడీ కిరణ్ కుమార్ అవార్డును అందుకున్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న ఏపీ గణతంత్ర శకటానికి, సాంస్కృతిక ప్రదర్శనలకు తృతీయ బహుమతి లభించింది. పీపుల్ ఛాయస్ కేటగిరీలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శకటం మూడో స్థానంలో నిలిచింది. డిజిటల్ విద్యా బోధన, నాడు నేడు, ఇంగ్లిష్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్,ఆంగ్ల మాధ్యమంలో బోధన నేపథ్యంతో ఆంధ్రప్రదేశ్ శకటం అకట్టుకుంది.ఇక.. తొలి స్థానంలో గుజరాత్ ప్రభుత్వం రూపొందించిన శకటం, ద్వితీయ స్థానంలో ఉత్తర ప్రదేశ్ చెందిన శకటం నిలిచాయి. -
డాలస్ లో ఘనంగా 75 వ గణతంత్ర వేడుకలు!
డాలస్, టెక్సాస్: టెక్సాస్ రాష్ట్రంలో, డాలస్ నగరంలో నెలకొనిఉన్న అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద భారతదేశ 75వ గణతంత్ర వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “డా. బీఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఎందరో మేధావులు ఎంతో సమయం వెచ్చించి, శ్రమకోర్చి భారత రాజ్యాంగాన్ని తయారుచేసి మనకు అందించారని, ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ తప్పకుండా పాటించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిమీద ఉంది” అన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని రూపొందించిన నేతలకు, మన భారతదేశ స్వాతంత్య్రసిద్ధికి పాటుపడిన మహాత్మాగాంధీ, జవహార్‌లాల్ నెహ్రూ, సర్ధార్ వల్లభాయి పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ మొదలైన నాయకులకు, దేశ స్వాతంత్య్రం కోసం అశువులు బాసిన స్వాతంత్య్ర సమరయోధులకు ప్రవాసభారతీయులు ఘన నివాళులర్పించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ బోర్డు సభ్యులు డా. ప్రసాద్ తోటకూర, రావు కల్వాల, రాజీవ్, బీ.ఎన్ జగదీష్, నవాజ్, జస్టిన్, షబ్నం మోడ్గిల్, వివిధ భారతీయసంస్థల నాయకులతో పాటు ఎంతోమంది ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు. ఇవి చదవండి: అల్లదివో.. ‘మూన్ స్నైపర్’ ఫోటోలు తీసిన ‘నాసా’ ఉపగ్రహం -
రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్‌కు సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో తేనీటి విందు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ, బీఆర్ఎస్ ముఖ్య నేత లు దూరంగా ఉన్నారు. గవర్నర్ తమిళిసై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులతో కలివిడిగా మాట్లాడారు. హైకోర్టు సీజే అలోక్ అరాధే, సీఎస్ శాంతికుమారి, టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, ఏఐసీసీ నేత రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు గోరెటి వెంకన్న, బండ ప్రకాశ్, ఆ ర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు. పద్మ పురస్కార గ్రహీతలకు గవర్నర్, సీఎం శుభాకాంక్షలు తెలిపారు. చిందు, యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య తేనీటి విందుకు హాజరుకాగా, జ్ఞాపిక అందజేసి గవర్నర్ అభినందించారు. కాగా, త్వరలో ఏపీ పర్యటనకు వెళుతున్నట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు. దేవాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశాలపై ఏపీతో చర్చిస్తామన్నారు. -
ఏపీ శకట ప్రదర్శనకు విదేశీయుల క్లాప్స్..
-
రిపబ్లిక్ డే వేడుకలు: ఆకట్టుకున్న ఏపీ విద్యాశాఖ శకటం
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుగుతున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా శకటాల ప్రదర్శన అద్భుతంగా జరిగింది. ఇక, రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీకి చెందిన విద్యాశాఖ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాగా, రిపబ్లిక్ వేడుకల్లో ఏపీకి చెందిన పాఠశాల విద్యాశాఖ శకటం ఆకట్టుకుంది. డిజిటల్ ఎడ్యుకేషన్, సీబీఎస్ఈ, ఐబీ, టోఫెల్, ఫ్యూచర్ స్కిల్స్‌ను వివరిస్తూ శకటం రూపకల్పన చేశారు. శకటం ప్రదర్శన సందర్భంగా విద్యార్థులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు రిపబ్లిక్ డే వేడుకల్లో ఆకట్టుకున్న ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ శకటం డిజిటల్ ఎడ్యుకేషన్, సీబీఎస్ఈ, ఐబీ, టోఫెల్, ఫ్యూచర్ స్కిల్స్‌ను వివరిస్తూ రూపకల్పన#RepublicDay#YSJaganForQualityEducation#AndhraPradesh pic.twitter.com/AyGoFl7T0G — YSR Congress Party (@YSRCParty) January 26, 2024 -
సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్
-
గణతంత్ర వేడుకల్లో ఆకట్టుకున్న శకటాలు
-
రిపబ్లిక్ డే వేడుకలకు ముస్తాబైన విజయవాడ
-
నియంతృత్వ ధోరణికి ప్రజలు చరమగీతం పాడారు: తమిళిసై
Live Updates.. ►ఈరోజు సాయంత్రం రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్ కార్యక్రమం ►ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరు కానున్న సీఎం రేవంత్, మంత్రులు ►హైదరాబాద్ సెక్రటేరియట్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు. ►జాతీయ పతాకవిష్కరణ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి. ►రిపబ్లిడ్ డే సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తూ.. ‘తెలంగాణలో గత పదేళ్లలో పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారు. తెలంగాణ సమాజం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల ఎన్నికల్లో నియంతృత్వ ధోరణికి ప్రజలు తమ తీర్పు ద్వారా చరమగీతం పాడారు. అహంకారం, నియంతృత్వం చెల్లదని ప్రజలు స్పష్టమైన తీర్పు ప్రకటించారు. నియంతృత్వ ధోరణిని ప్రజలు సహించలేదు. ►పదేళ్ల పాలనలో రాజ్యాంగ విలువలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, వ్యవస్థలు ఈ ప్రజా ప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే మళ్లీ పునర్ నిర్మించుకుంటున్నాం. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో రాజ్యాంగబద్ధమైన విలువలు, విధానాలు, పద్ధతులను పునరుద్ధరణ చేసుకుంటున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగించినప్పుడే ప్రజాస్వామ్య, సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందుతాయి. ►ఏకపక్ష నిర్ణయాలు, నియంత పోకడలు ఎప్పుడూ ప్రజాస్వామ్యానికి శోభనివ్వవు. కొత్తగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఈ స్పృహతో పని మొదలు పెట్టింది. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో పని చేస్తోంది. గత ప్రభుత్వ విధానాలతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది’. ►గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో ఆర్థికస్థితి దిగజారింది. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా నిలిచిన యువతకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది. వంద రోజుల్లో అన్ని గ్యారంటీలను అమలు చేస్తాం. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రజా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ►సైనికుల గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్ తమిళిసై ►పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై. ►జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, అధికారులు ►నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌కు చేరుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్ రెడ్డి. ►హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వం రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారు. ►రిపబ్లిక్ డే వేడుకల కోసం పబ్లిక్ గార్డెన్‌ను అధికారులు సిద్ధం చేశారు. సీఎంతో పాటు మంత్రులు, ఐఏఎస్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. గవర్నర్ తమిళి సై జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పోలీసుల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ►శుక్రవారం ఉదయం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ సీఎం రేవంత్ చేరుకున్నారు. పరేడ్ గ్రౌండ్లో వీరుల సైనిక్ స్మారక్ వద్ద సీఎం రేవంత్ రెడ్డికి త్రివిధ దళాలు స్వాగతం పలికాయి. రిపబ్లిక్ డే సందర్భంగా వీరుల సైనిక్ స్మారకం వద్ద యుద్ధ వీరులకు సీఎం రేవంత్ నివాళులు అర్పించారు. -
President Droupadi Murmu: వారసత్వ ప్రతీక రామమందిరం
న్యూఢిల్లీ: భారత్ తన పురాతన నాగరికత వారసత్వాన్ని పునరుజ్జీవింపజేసుకున్న అద్భుత ఘడియగా ‘రామ మందిర నిర్మాణ ఘట్టం’ నిలిచిపోతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వ్యాఖ్యానించారు. భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతినుద్దేశిస్తూ రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. ‘‘ అయోధ్యలో రామమందిర దివ్యధామం ప్రజల విశ్వాసాలను మాత్రమే కాదు న్యాయవ్యవస్థ పట్ల ప్రజలకున్న అచంచల విశ్వాసానికీ నిలువెత్తు నిదర్శనం’’ అని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పనితీరునూ ఆమె ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మధ్య రగులుతున్న ఘర్షణలు, మానవీయ సంక్షోభాలు, యుద్ధాలపై ఆందోళన వ్యక్తంచేశారు. ఘర్షణలకు మూలాలను వెతక్కుండా భయాలు, విద్వేషంతో ఆయా దేశాల ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు కొన్ని ఆమె మాటల్లోనే.. జీ20 ఆతిథ్యం ఎన్నో నేరి్పంది ‘‘న్యాయ ప్రక్రియ, సుప్రీంకోర్టు సముచిత తీర్పుల తర్వాతే అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బాటలు పడ్డాయి. ఈ ఆలయం నిర్మాణం ద్వారా భారత్ తన నాగరికత వారసత్వ పరంపరను కొనసాగిస్తున్నట్లు మరోమారు ప్రపంచానికి చాటింది. ప్రజల విశ్వాసం మాత్రమే కాదు వారు న్యాయవ్యవస్థ మీద వారికున్న నమ్మకానికి నిదర్శనం ఈ ఆలయం. ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించి భారత్ తన పౌరుల భాగస్వామ్యంలో ఎంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలనైనా నిర్వహించగలదని రుజువు చేసింది. వ్యూహాత్మక, దౌత్య అంశాలపై ఏకాభిప్రాయాన్ని సాధించి చూపింది. ప్రజలు తమ సొంత భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోగలరో ప్రపంచ దేశాలకు నేరి్పంది. గ్లోబల్ సౌత్‌కు భారత్ గొంతుకగా నిలిచింది. ఆర్థిక వ్యవస్థ పరిపుష్టితో ధృఢ విశ్వాసంతో భారత్ అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులేస్తోంది’’ అని అన్నారు. అభివృద్ధి భారత్ బాధ్యత పౌరులదే ‘‘ స్వతంత్రభారతావని 75 వసంతాలు పూర్తిచేసుకుని శత స్వాతంత్రోత్సవాల దిశగా అడుగులేస్తోంది. రాబోయే పాతికేళ్ల అమృత్‌కాలంలో సర్వతోముఖాభివృద్ధి సాధించి అభివృద్ధి చెందిన భారత్‌గా దేశాన్ని నిలపాల్సిన బాధ్యత పౌరులదే. ఇప్పుడు మహాత్ముని మాటలు గుర్తొస్తున్నాయి. దేశంలో ప్రజలు ప్రాథమిక హక్కులు గురించి మాత్రమే మాట్లాడితే సరిపోదు. ప్రాథమిక విధులు సైతం ఖచి్చతంగా నిర్వర్తిస్తూ బాధ్యతగా మెలిగినప్పుడే భారత్ అభివృద్ది చెందుతుందని గాం«దీజీ ఉపదేశించారు’’ అని ముర్ము గుర్తుచేశారు. -
నేడు భారత్‌కు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్.. మోదీతో స్పెషల్ ప్రోగ్రామ్..
ఢిల్లీ: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మాక్రాన్ నేడు భారత్‌కు చేరుకుంటారు. మాక్రాన్ నేరుగా రాజస్థాన్‌లోని జైపూర్ విమానాశ్రయంలో గురువారం ల్యాండ్ అవుతారు. వివరాల ప్రకారం.. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇందులో భాగంగా మాక్రాన్ గురువారం భారత్‌కు చేరుకుంటారు. జైపూర్ విమానాశ్రయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత మోదీతో కలిసి మాక్రాన్ జైపూర్‌లోని పలు పర్యాటక ప్రదేశాలను సందర్శించనున్నారు. అలాగే, రాంబాగ్ ప్యాలెస్‌లో మాక్రాన్ కోసం ప్రైవేటు డిన్నర్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. రోడ్ షో.. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన 16వ శతాబ్దానికి చెందిన అమెర్ ఫోర్ట్‌ను సందర్శించనున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఇద్దరు నేతలు ట్రిపోలియా గేట్‌కు కాలినడకన వెళ్లనున్నట్లు తెలుస్తోంది. జైపూర్‌లో ఇద్దరు నేతలు రోడ్ షో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన తర్వాత మాక్రాన్ గురువారం రాత్రికి దేశరాజధాని ఢిల్లీకి చేరుకుంటారు. జనవరి 26వ తేదన జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్లో ‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో పాల్గొంటారు. #WATCH | Rajasthan: Jaipur decked up with posters of PM Narendra Modi and French President Emmanuel Macron ahead of their visit today pic.twitter.com/2tOGZZmxVx — ANI (@ANI) January 24, 2024 ఈ రెండు రోజుల పర్యటనలో భారత్‌తో మాక్రాన్ పలు ఒప్పందాలు చేసుకోనున్నారు. ముఖ్యంగా రక్షణ, భద్రత, క్లీన్ ఎనర్జీ, వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త సాంకేతికత తదితర రంగాల్లో ఒప్పందాలు జరుగనున్నట్టు సమాచారం. ఇక, ఫ్రాన్స్.. భారత్‌కు ఆయుధాలను అందిస్తున్న రెండో అతిపెద్ద మిత్ర దేశంగా కొనసాగుతోంది. -
గణతంత్ర వేడుకల్లో మహిళా త్రివిధ దళాల బృందం
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకల్లో ఈ సారి త్రివిధ దళాలకు చెందిన మహిళా బృందంతోపాటు.. మహిళా అగి్నవీర్ బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. త్రివిధ దళాలు, అగి్నవీర్‌ల్లోని మహిళా బృందం సంయుక్తంగా అడుగులో అడుగు వేసి ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జనవరి 26న సరికొత్త విన్యాసాలు చేయనున్నారు. ఇప్పటి వరకు ఏ గణతంత్ర వేడుకల్లోనూ త్రివిధ దళాల ఉమ్మడి మహిళా దళం పరేడ్‌లో పాల్గొనలేదు. ఈ బృందానికి త్రివిధ దళాలకు చెందిన మహిళా ఆధికారులే నాయకత్వం వహిస్తారు. ఈసారి జరిగే బీటింగ్ రిట్రీట్‌లో పూర్తిగా స్వదేశీ సంగీత స్వరాలే వినిపించనున్నాయి. 1950 నుంచి జనవరి 29న నిర్వహించే బీటింగ్ రిట్రీట్ లో ‘అబైడ్ విత్ మి’ అనే విదేశీ స్వరాన్ని వాయించడం ఆనవాయితీ. అయితే దీనిపై విమర్శలు, వివాదం తలెత్తడంతో 2022లో నిలిపివేశారు. ఈసారి జరిగే బీటింగ్ రిట్రీట్‌లో పూర్తిగా స్వదేశీ స్వరాలే వాయించబోతున్నారు. -
గణతంత్ర వేడుకలకు బైడెన్ దూరం.. కారణం అదేనా?
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత పర్యటన రద్దు అయ్యింది. జనవరిలో ఢిల్లీలో గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు బైడెన్ రావడం లేదు. ఈ విషయాన్ని అమెరికా తెలియజేసిందని సంబంధిత వర్గాలు మంగళవారం వెల్లడించాయి. అయితే, జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి తొలి వారంలో అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి బైడెన్ వార్షిక ప్రసంగం చేయాల్సి ఉంది. దీంతో, ఆయన భారత్ పర్యటన రద్దు అయ్యింది. కాగా, రెండోదఫా మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంపైనా బైడెన్ దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. గణతంత్ర వేడుకలకు బెడెన్‌ను భారత ప్రధాని మోదీ ఆహ్వానించారంటూ గత సెప్టెంబరులో భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తెలిపారు. ఇక, గణతంత్ర వేడుకలప్పుడే క్వాడ్ సమిట్ కూడా జరపాలని భారత్ భావించినా, దాన్ని తర్వాత నిర్వహించాలని తాజాగా నిర్ణయానికొచ్చింది. ఇదే పర్యటన వాయిదాకు మరో కారణమని సమాచారం. దీంతో, క్వాడ్ సదస్సును 2024 చివరిలో నిర్వహించాలని యోచిస్తున్నారు. Joe Biden confirmed tht he will not coming to India for the Republic Day ... QUAD meeting postponed. This is 2nd time when Biden will not attending #QUAD meet. This is sad. Don't knw where Biden is taking this grp. His act will degrading the value & seriousness of the QUAD. pic.twitter.com/zuKEBebSJJ — Atul Chhabra (@AttiAtul) December 12, 2023 -
గణతంత్ర వేడుకలకు బైడెన్!.. ఆహ్వానించిన ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరిలో జరగబోయే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవ్వాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారు. ఈనెల రెండో వారంలో ఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా బైడెన్‌తో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ఆయనను రిపబ్లిక్‌డే వేడుకకు మోదీ ఆహ్వానించారని భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి వెల్లడించారు. అయితే, భారత్ ప్రతీ ఏడాది గణతంత్ర వేడుకలకు ప్రపంచ దేశాల నేతలను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా భారత్ ఆహ్వానాన్ని అంగీకరించి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇప్పుడు బైడెన్ కూడా మోదీ ఆహ్వానాన్ని అంగీకరిస్తే.. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అమెరికా రెండో అధ్యక్షుడిగా బైడెన్ నిలుస్తారు. #PMModi has invited #US President Joe Biden as Chief Guest for the 2024 Republic Day Parade.#IADN pic.twitter.com/N8Rao4EBJC — Indian Aerospace Defence News - IADN (@NewsIADN) September 20, 2023 ఇది కూడా చదవండి: సెల్‌ఫోన్ యూజర్లకు వార్నింగ్ మెసేజ్.. స్పందించిన కేంద్రం -
Padma Awards 2024: ‘పద్మ అవార్డులకు ప్రతిపాదనలు పంపండి’
న్యూఢిల్లీ: ప్రతిభావంతులైన వ్యక్తులను గుర్తించి, వారి గొప్పదనం, విజయాలు పద్మ అవార్డులతో సత్కరించడానికి అర్హులను భావించినట్లయితే ఆ పేర్లను సిఫారసు చేయాలని ప్రజలను సోమవారం కేంద్రం కోరింది. 2024 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డులకు నామినేషన్లు, ప్రతిపాదలను 2023 మే ఒకటో తేదీ నుంచి స్వీకరిస్తున్నట్లు తెలిపింది. పద్మ అవార్డుల సిఫారసులకు ఆఖరు తేదీ సెప్టెంబర్ 15. ప్రతిపాదనలను ఆన్లైన్లో https://awards.gov.in ద్వారా పంపాలని కోరింది. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం ఏటా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులతో గౌరవిస్తుంది. -
ప్రగతి భవన్లో గణతంత్ర వేడుకలు.. జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. 74వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, సీఎస్, డీజీపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు కేసీఆర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ వేడుకల్లో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నవీన్‌రావు, శంభీపూర్ రాజు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు సికింద్రాబాద్ మైదానంలో అమరజవాన్ల స్థూపం వద్ద కేసీఆర్ నివాళులు అర్పించారు. చదవండి: తెలంగాణ రాజ్‌భవన్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు -
‘కేసీఆర్.. రిపబ్లిక్ డే వేడుకల్ని సైతం రద్దు చేసే స్థితికి చేరుకున్నారా?’
హైదరాబాద్: రిపబ్లిక్ వేడుకల్ని రద్దు చేసే పరిస్థితికి చేరుకున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, కేసీఆర్‌కు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని ధ్వజమెత్తారు. అనేక ఏళ్లుగా పరేడ్ గ్రౌండ్లో రిపబ్లిక్ వేడుకలు జరపడం ఆనవాయితీగా వస్తోందని, అన్ని రాష్ట్రాలు ఈ సంప్రదాయాలు కొనసాగిస్తున్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు. రిపబ్లిక్ డే వేడుకల్ని గవర్నర్ జరపకుండా తెలంగాణ సర్కార్ అడ్డుపడుతోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను, రాజ్యాంగాన్ని కేసీఆర్ అవమానపరిచారన్నారు. చివరకు కేంద్రం నిర్వహించే సమావేశాలకు కూడా కేసీఆర్ డుమ్మా కొడుతున్నారని,రాష్ట్రపతి, గవర్నర్‌ను అవమానపరుస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దుర్మార్గపు ఆలోచనలు వస్తున్నాయని కిషన్‌రెడ్డి ఫైరయ్యారు. -
రిపబ్లిక్ డే విషెస్ చెప్పేయండిలా..!
జనవరి 26వ తేదీ.. మనకు ప్రత్యేకమైన రోజు. భారతదేశం గర్వించదగ్గ రోజు. 1950వ సంవత్సరం జనవరి 26న భారత రాజ్యాంగం అధికారికంగా అమల్లోకి వచ్చిన రోజు. దీన్ని పురస్కరించుకునే గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది మనకు 74వ గణతంత్ర దినోత్సవం. అనేక మార్పులు చేర్పులు తర్వాత అప్పటి మన నాయకులు జనవరి 26వ తేదీన రాజ్యాంగంలోని హక్కులను సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 15, 1947వ సంవత్సరంలో మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, రాజ్యాంగం హక్కులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవటానికి రెండేళ్లకు పైగానే సమయం పట్టింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ మార్పులు జరిగి, 1950, జనవరి 26వ తేదీ అధికారికంగా అమల్లోకి తెచ్చారు. ఫలితంగా భారతదేశం పూర్తి గణతంత్ర దేశం అయ్యింది. గణతంత్ర రాజ్యం అంటే.. ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం. ఈ రోజు భారతీయులందరీకి ఎంతో ప్రత్యేకం. భారతదేశం అంతా దీన్ని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాం. మీ స్నేహితులు, బంధువులకు క్రింద ఉన్న గణతంత్ర దినోత్సవ కోట్స్ తో విషెస్ చెప్పండి. మాతృభూమి కోసం.. తమ ధన, మాన ప్రాణాలను.. త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు.. వందనం.. అభివందనం.. పాదాభివందనం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన దేశాన్ని అత్యుత్తమంగా మారుద్దాం. శాంతికి, దయకు మారుపేరుగా నిలుపుదాం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతీయతను బాధ్యతగా ఇచ్చింది నిన్నటితరం.. భారతీయతను బలంగా మార్చుకుంది నేటి తరం.. భారతీయతని సందేశంగా పంపుదాం మనం.. తరం తరం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం అశువులు బాసిన సమర యోధుల దీక్షా దక్షతలను స్మరిస్తూ.. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేటి మన స్వాతంత్ర్య సంభరం.. ఎందరో త్యాగవీరుల త్యాగఫలం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అన్ని దేశాల్లో కెల్లా.. భారతదేశం మిన్న అని చాటి చెప్పే దిశగా అడుగులేస్తూ.. జరుపుకుందాం ఈ గణతంత్ర దినోత్సవ పండుగను మెండుగా కన్నుల పండుగగా..!! అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎందరో వీరుల త్యాగఫలం.. మన నేటి స్వేచ్ఛకే మూలబలం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనం ఈ రోజు వేడుక జరుపుకోవడానికి వారి ప్రాణాలను త్యాగం చేసిన వారికి తల వంచి నమస్కరిస్తున్నాను. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా.. ఎవ్వరేమనినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవము.. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశభక్తితో మీ హృదయాన్ని నింపుకోవాల్సిన సమయం ఇది. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 'గణతంత్ర దినోత్సవంతో భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం.. దీని కోసం ఎందరో మహానుభావుల త్యాగం.. మనం ఎప్పటికీ మరవకూడదు' మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.. 'ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. మన సమరయోధులను స్మరించుకుందాం.. మన వారసత్వాన్ని కాపాడుకుందాం.. మన దేశాన్ని చూసి గర్వపడదాం..' మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.. మన దేశ శ్రేయస్సు కోసం మనం చేయగలిగినదంతా చేస్తామని మన భారతమాతకి ప్రతిజ్ఞ చేద్దాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు! గెలవాలనే మన కోరికకు ఆజ్యం పోద్దాం, మన దేశంలోని ప్రతి భాగాన్ని శక్తివంతం చేద్దాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు! నేను భారతీయుడిని అయినందుకు గర్విస్తున్నాను మరియు నా దేశ సంస్కృతిని గౌరవిస్తున్నాను. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశం యొక్క కీర్తిలో సంతోషించండి మరియు సైనికులకు కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోవద్దు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు బ్రిటిషర్ల దాశ్య సంకెళ్లను వదిలించుకొని భారతదేశం రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్న చారిత్రక రోజు. మీకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. భారతదేశం గొప్ప దేశం. శాంతియుత దేశం. భారతీయతను చాటి చెబుదాం. ప్రపంచానికి దిశానిర్దేశం చేద్దాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం భారతీయులం. మొదటి నుంచీ... చివరి వరకూ - మీకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. గణతంత్రం వల్ల కలిగే ఆశ ఏంటి... ఒక దేశం, ఒక భాష, ఒక జాతీయ జెండా - గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం శాంతిని నమ్ముతాం. శాంతియుత అభివృద్ధి మనకోసం మాత్రమే కాదు... ప్రపంచంలోని ప్రతి ఒక్కరి కోసమూ - గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ దేశ సేవలో నేను మరణిస్తే, అది నాకు గర్వకారణమే. నా రక్తంలోని ప్రతి చుక్కా దేశ అభివృద్ధికి ఉపయోగపడాలి. దేశాన్ని మరింత బలంగా, చురుగ్గా మార్చాలి - మీకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను వాట్సాప్, ఫేస్బుక్, షేర్ చాట్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లలో షేర్ చేస్తూ... మీ స్నేహితులు, బంధువులకు విషెస్ చెప్పండి. -
కేసీఆర్ సర్కార్‌కు షాక్.. రిపబ్లిక్ డే వేడుకలపై హైకోర్టు కీలక ఆదేశాలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జరిగబోయే గణతంత్ర వేడుకల నిర్వహణపై హైకోర్టులో కేసీఆర్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వేడుకలు కచ్చితంగా జరపాల్సిందేనని స్పష్టం చేసింది. కాగా, రిపబ్లిక్ డే వేడుకలపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఇక, విచారణ సందర్బంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర వేడుకలు నిర్వహించాల్సిందేనని పేర్కొంది. పరేడ్‌తో కూడిన గణతంత్ర వేడుకలు జరపాలని ఆదేశించింది. ఎక్కడ పరేడ్ నిర్వహించాలనేది ప్రభుత్వం నిర్ణయించుకోవాలని సూచించింది. అలాగే, వేడుకలపై కేంద్రం ఇచ్చిన గైడ్లైన్ పాటించాలని హైకోర్టు ఆదేశించింది. రేపు(గురువారం) జరగబోయే రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాటు త్వరగా చేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. -
రిపబ్లిక్ డే స్పెషల్: దేశభక్తి చాటే బాలీవుడ్ బాలీవుడ్ సినిమాలు
భారత రిపబ్లిక్ డే జనవరి 26న వేడుకలు జరగనున్నాయి. ఈ ఏడాది జరిగే గణతంత్ర సంబరాలు చేసుకునేందుకు కోట్లాది ప్రజలు సిద్ధమయ్యారు. అయితే ఒక్కసారి స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన వారి చరిత్రలు గురించి తెలుసుకుందాం. ఈ కాలంలో పుస్తకాలు చదివే సమయం లేకపోయినా.. చరిత్రను తెరపై ఆవిష్కరించిన చిత్రాలెన్నో ఉన్నాయి. ఈ గణతంత్ర దినోత్సవం రోజున ఎంచక్కా కుటుంబంతో కలిసి చూడాల్సిన స్వాతంత్ర్య పోరాట సినిమాలను కొన్నింటిని మీకు గుర్తు చేస్తున్నాం. ఈ గణతంత్ర దినోత్సవాన్ని దేశభక్తితో పాటు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే బాలీవుడ్ టాప్ టెన్ చిత్రాలపై ఓ లుక్కేయండి. అమీర్ ఖాన్ లగాన్ అశుతోష్ గోవారికర్ తెరకెక్కించిన చిత్రం లగాన్. ఈ సినిమాలో అధిక మొత్తంలో బ్రిటీష్ పన్నుల నుంచి ప్రజలను విముక్తి చేయడానికి రైతు చేస్తున్న పోరాటాన్ని చక్కగా తెరకెక్కించారు. అన్యాయమైన వ్యవస్థకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం పొందేందుకు బ్రిటిష్ వారికి ఇష్టమైన క్రీడ అయిన క్రికెట్లో ఓడించడం ఈ చిత్రంలో చూపించారు. షారుఖ్ ఖాన్ స్వదేశ్ షారుఖ్ ఖాన్ నటించిన చిత్రం స్వదేశ్. నాసాలో పనిచేసే శాస్ర్తవేత్తగా ఇందులో కనిపించారు. ఈ చిత్రంలో హీరో తన అమ్మను చూసేందుకు భారతదేశానికి వచ్చే వస్తాడు. ఆ తరువాత ఇక్కడి పరిస్థితులకు చలించిపోయి స్వేదేశంలోనే ఉండాలని నిర్ణయించుకుంటాడు. నాసా ప్రధాన కార్యాలయంలో చిత్రీకరించబడిన మొదటి భారతీయ చిత్రం స్వదేశ్. రంగ్ దే బసంతి రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా తెరకెక్కించిన సినిమా రంగ్ దే బసంతి. ఈ చిత్రంలో భారతదేశంలోని సామాజిక సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇండియాలోని ఐదుగురు స్వాతంత్ర్య సమరయోధుల కథను డాక్యుమెంట్ చేయడానికి ఒక బ్రిటిష్ విద్యార్థి భారత్‌కు వస్తాడు. ఇందులో ఐదుగురు భారతీయ విప్లవకారుల పాత్రలు చూపించారు. ఇది బ్రిటీష్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పోరాడాటం చక్కగా తెరకెక్కించారు. చక్ దే ఇండియా కబీర్ ఖాన్ తెరకెక్కించిన మూవీ చక్ దే ఇండియా. ఈ సినిమాలో దేశభక్తిని అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ చిత్రంలో షారూక్ ఖాన్ భారత మహిళా హాకీ జట్టు కోచ్ పాత్రలో కనిపిస్తారు. ఇండియా కోల్పోయిన తన ఖ్యాతిని తిరిగి కాపాడుకోవాలనే సందేశంతో తెరకెక్కించారు. అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత జట్టు హాకీ జట్టు గెలవాలనే కోరికను బలంగా చూపించారు. రాజీ- ఆలియా భట్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రాజీ. రా ఎజెంట్ పాత్రలో ఆలియా భట్ నటించింది. ఈ చిత్రంలో ఇండియాకు కీలకమైన విలువైన సమాచారాన్ని సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఆమె ఒక పాకిస్తాన్ సైనికుడిని వివాహం చేసుకుని ఆ దేశానికి వెళ్లిపోతుంది. దేశం పట్ల ఆమెకున్న ప్రేమతో కుటుంబాన్ని కోల్పోతుంది. ఈ సినిమాలో అలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటించారు. కేసరి- సిక్కు సైనికుల కథ సారాంఘరి యుద్ధంలో పోరాడిన వీర సిక్కు సైనికుల కథను ఈ సినిమాలో చూపించారు. అమరులైన వీరికి కేసరి నివాళులు అర్పించారు. పదివేల మంది పష్టూన్ ఆక్రమణదారులతో జరిగిన పోరాటాలను చక్కగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో 21 మంది సిక్కు సైనికులకు నాయకత్వం వహించిన హవల్దార్ ఇషార్ సింగ్ నేతృత్వంలోని యుద్ధాన్ని ఈ కథలో ఆవిష్కరించారు. భారతదేశ చరిత్రలో గొప్ప యుద్ధాలలో ఇది ఒకటిగా నిలిచింది. మణికర్ణిక- కంగనా రనౌత్ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మణికర్ణిక. ఈ చిత్రంలో ఝాన్సీ రాణి పాత్రను ఆమె పోషించింది. ఈస్ట్ ఇండియన్ కంపెనీ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఝాన్సీ రాణి చేసిన పోరాటాన్ని చక్కగా తెరకెక్కించారు. ఆమె తిరుగుబాటు బ్రిటీష్ వారిపై విపరీతమైన స్వాతంత్ర్య యుద్ధంగా మారింది. ఝాన్సీ రాణి మణికర్ణిక పాత్రలో కంగనా రనౌత్ మెప్పించింది. యూరి -ది సర్జికల్ స్ట్రైక్ యూరిలో జరిగిన దాడికి ప్రతీకారంగా జరిగిన సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 2016లో కాశ్మీర్‌లోని ఒక భాగమైన సైనిక స్థావరం యూరీపై మిలిటెంట్లు దాడి చేశారు. ఆ తర్వాత భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్ అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఆధారంగా రూపొందించబడింది. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా రూపంలో అమరులైన భారత సైనికులకు ఘన నివాళి అర్పించారు. విక్కీ కౌశల్‌లో మేజర్ విహాన్ సింగ్ షెర్గిల్ పాత్రలో కనిపించారు. షేర్షా- కార్గిల్ యుద్ధం షేర్షా పాకిస్తాన్‌పై కార్గిల్ యుద్ధం నాటి సంఘటనల ఆధారంగా షేర్షా మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రం ద్వారా కెప్టెన్ విక్రమ్ బాత్రా త్యాగాలకు గుర్తుగా నివాళులు అర్పించారు. కెప్టెన్ బాత్రా పాత్రలో బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా నటించారు. సర్దార్ ఉధమ్ సింగ్- 1919 జలియన్ వాలాబాగ్ ఉదంతం బ్రిటీష్ పాలనలోని 1919 కాలంలో జరిగిన మారణహోమం జలియన్ వాలాబాగ్ ఉదంతం. ఈ మారణకాండకు ప్రతీకారంగా మైఖేల్ ఓ డయర్ను భారతీయ విప్లవకారుడు సర్దార్ ఉధమ్ సింగ్ హత్య చేశారు. అతని జీవిత ప్రయాణాన్ని షూజిత్ సిర్కార్ ఈ సినిమాలో చూపించారు. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ భారతీయ విప్లవకారుడు ఉధమ్ సింగ్ పాత్రను పోషించాడు. భారతీయ చరిత్రలో నిలిచిపోయిన వీరుడికి ఈ చిత్రం ద్వారా ఘన నివాళి అర్పించారు. -
రిపబ్లిక్ డే వేడుకలు ఎలా చేయాలో ప్రభుత్వానికి తెలుసు: పల్లా రాజేశ్వర్ కౌంటర్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. గణతంత్ర దినోత్సవ వేడుకలపై తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కి లేఖ రాసింది. అనివార్య కారణాలతో పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ వేడుకలు జరపలేమని తెలిపింది. రాజ్‌భవన్‌లోనే వేడుకలు నిర్వహించాలని లేఖలో ప్రభుత్వం పేర్కొంది. దీంతో, ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పంపిన లేఖపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. కాగా, పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. గవర్నర్‌ను ప్రభుత్వం ఎప్పుడూ అవమానించలేదు. రిపబ్లిక్ వేడుకలు ఎలా జరపాలో ప్రభుత్వానికి తెలుసు. రాజ్‌భవన్‌లో కూడా ఏర్పాట్లు చేసేది ప్రభుత్వమే. గవర్నర్‌ను సీఎం కేసీఆర్ ఎప్పుడూ ఒక్క మాట అనలేదు. ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రొటోకాల్ పాటిస్తోంది అని స్పష్టం చేశారు. మరోవైపు.. గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజ్‌భవన్‌లోనే జరుపుకోవాలన్న ప్రభుత్వ లేఖపై గవర్నర్ తమిళిసై అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో రిపబ్లిక్ వేడుకలపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం దిక్కరించడంపై పిటిషన్ దాఖలు చేశారు. వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ మాధవి ధర్మాసనం విచారించనుంది. -
Republic Day Celebrations: కేసీఆర్ ప్రభుత్వంపై గవర్నర్ అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య దూరం రోజురోజుకీ పెరుగుతోంది. కేసీఆర్, గవర్నర్ తమిళిసై మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి వైరం చేరింది. కేసీఆర్ ప్రభుత్వానికి గవర్నర్ అంటే చిన్నచూపు అని, కనీస మర్యాద ఇవ్వకుండా అవమానపరుస్తారని సందర్భం వచ్చినప్పుడల్లా సీఎంపై తమిళిసై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై అసంతృప్తి రాష్ట్ర ప్రభుత్వంపై తాజాగా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజ్‌భవన్‌లోనే జరుపుకోవాలన్న ప్రభుత్వ లేఖపై అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ ఏడాది పరేడ్ గ్రౌండ్లో వేడుకలు జరపకపోవడం బాధాకరమని వాపోయారు. రాష్ట్రంలో గణతంత్ర వేడుకలను నిర్వహించకపోవడంపై గవర్నర్ తమిళిసై కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన్నట్లుగా సమాచారం. హైకోర్టులో పిటిషన్ మరోవైపు తెలంగాణలో రిపబ్లిక్ వేడుకలపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం దిక్కరించడంపై పిటిషన్ దాఖలు చేశారు. వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ మాధవి ధర్మాసనం బుధవారం మధ్యాహ్నం 2.30 నిమిషాలకు విచారించనుంది. గవర్నర్‌కు లేఖ తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ తమిళిసైకి లేఖ రాసింది. అనివార్య కారణాలతో పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ వేడుకలు జరపలేమని తెలిపింది. రాజ్‌భవన్‌లోనే వేడుకలు నిర్వహించాలని లేఖలో ప్రభుత్వం పేర్కొంది. -
మళ్లీ రాజ్‌భవన్‌లోనే గణతంత్ర వేడుక
రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రాష్ట్ర స్థాయిలో అధికారికంగా నిర్వహించాల్సి ఉన్న వేడుకలను ఈ ఏడాది సైతం రాజ్‌భవన్‌కు పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం రాత్రి రాజ్‌భవన్‌కు సమాచారాన్ని అందించింది. సాక్షి, హైదరాబాద్: దేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న రాష్ట్ర స్థాయిలో అధికారికంగా నిర్వహించాల్సి ఉన్న వేడుకలను ఈ ఏడాది సైతం రాజ్‌భవన్‌కు పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం రాత్రి రాజ్‌భవన్‌కు సమాచారాన్ని అందించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి, గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీగా వస్తోంది. గణతంత్ర దినోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుండగా, తెలంగాణ వచ్చిన తర్వాత కొన్నాళ్లకు వేదికను నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌కు మార్చారు. ►తొలిసారిగా రాష్ట్ర స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలను గతేడాది రాజ్‌భవన్‌లో నిర్వహించారు. కోవిడ్–19 మహమ్మారి మూడో వేవ్ ప్రభావం ఉండడంతో వేడుకలను తక్కువ మంది అతిథుల సమక్షంలో రాజ్‌భవన్‌లో నిర్వహించాలని అప్పట్లో రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రసంగం లేకుండానే సాదాసీదాగా ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రసంగ పాఠాన్ని పంపకపోయినా, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాత్రం ఓ అడుగు ముందుకేసి రాజ్‌భవన్ వేదికగా ప్రసంగించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల దుస్థితిపై విమర్శలు చేశారు. కోవిడ్–19 వ్యాప్తి ఉన్న సమయంలో రాజకీయ సభలు, సమావేశాలు నిర్వహించారని, గణతంత్ర వేడుకలను మాత్రం కోవిడ్–19 పేరుతో రాజ్‌భవన్‌లో సాదాసీదా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారని, తనను అవమానించడానికే అలా చేశారని అప్పట్లో విమర్శించారు. ►రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై మధ్య నెలకొన్న తీవ్ర విబేధాల నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది కూడా గణతంత్ర దిన వేడుకలు రాజ్‌భవన్‌లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. ప్రస్తుతానికి కోవిడ్–19 ప్రభావం లేకున్నా వేడుకలను రాజ్‌భవన్‌కు పరిమితం చేయడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల గవర్నర్ తమిళిసై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది. ఇంకా అందని ప్రసంగ పాఠం..: గణతంత్ర దిన వేడుకలకు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండగా, ఇప్పటి వరకు గవర్నర్ ప్రసంగ పాఠాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపించలేదు. ప్రసంగం లేకుండానే ఈ ఏడాది సైతం వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర ప్ర భుత్వం కోరనున్నట్టు సమా చారం. ఈ నేపథ్యంలో గ తేడాది తరహాలోనే ఈ సారి సైతం గవర్నర్ తమిళిసై తన సొంత ప్రసంగాన్ని చదివి వినిపించే అవకాశాలు న్నాయి. సంప్రదాయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పంపించే ప్రసంగాన్ని మాత్రమే గవర్న ర్లు చదవాల్సి ఉంటుంది. గతేడాది ఉత్సవాల్లో గవర్నర్ సొంత ప్రసంగం చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. ఈ సారి సైతం గవర్నర్ తన ప్రసంగంలో ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశాలున్నాయి. పల్లు బిల్లుల ఆమోదం నిలిపివేత రాష్ట్ర యూనివర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుతో సహా రాష్ట్ర శాసనసభ ఆమోదించిన పలు బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గ త కొన్ని నెలలుగా రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో ఉంచడం రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. గత స్వా తంత్య్ర దినోత్సవం సందర్భంగా పలువురు జీవిత ఖైదీ లకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సైతం గవర్నర్ తిరస్కరించారు. గవర్నర్ ఆమోదం లభించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినె న్స్‌ల(అత్యవసర ఉత్తర్వులు) జారీని పూర్తిగా మానేసింది. -
గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిద్దాం
సాక్షి, అమరావతి: గణతంత్ర దిన వేడుకలను ఘనంగా నిర్వహిద్దామని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన 74వ గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో 26న రాష్ట్ర స్థాయిలో వేడుకలను నిర్వహించేందుకు వీలుగా వివిధ శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు వీలుగా గణతంత్ర దినోత్సవ పరేడ్ చీఫ్ కోఆర్డినేటర్ సంబంధిత విభాగాలు, సంస్థల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. వేడుకల్లో గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వంటి ప్రముఖులు పాల్గొంటున్నందున ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేని రీతిలో ఏర్పాట్లు చేయాలని సీఎస్ డా.జవహర్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. వీవీఐపీల రాకపోకలపై సంబంధిత వ్యక్తిగత కార్యదర్శులతో సమన్వయం చేసుకుని ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. స్టేడియంలో వేడుకల రిహార్సల్స్ నిర్వహించాలని, ఈ నెల 24న ఫుల్ డ్రస్ రిహార్సల్స్ నాటికి పరేడ్‌ను పూర్తిగా సిద్ధం చేయాలని చెప్పారు. వీవీఐపీ, వీఐపీలు ఇతర ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక సీట్లను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని, ప్రధాన వేదికను ప్రొటోకాల్ నిబంధనలకు అనుగుణంగా రూపొందించాలని, స్టేడియంలో పోర్ట్ వాల్ డిజైన్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శకటాలను ఆకర్షణీయంగా రూపొందించాలి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేలా వివిధ శాఖలకు సంబంధించిన కార్యక్రమాలు, పథకాలపై వివిధ శాఖలకు చెందిన శకటాలను(టాబ్లూస్) ఆకర్షణీయంగా రూపొందించి ప్రదర్శనకు సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశించారు. వేడుకల్లో సికింద్రాబాద్ నుంచి బ్యాండ్ ఆర్మీ కంటెంజెంట్‌తో పాటు రాష్ట్ర పోలీస్ బెటాలియన్స్, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, పోలీస్ బ్యాండ్ వంటి విభాగాలు కవాతులో పాల్గొంటాయని తెలిపారు. అలాగే వేడుకలను రాష్ట్ర ప్రజలు వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. 26వ తేదీ సాయంత్రం రాజ్ భవన్లో నిర్వహించే తేనీటి(హై టీ) విందుకు రాజ్ భవన్ అధికారుల సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. సమావేశంలో ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రమణ్యంరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, సంయుక్త కలెక్టర్ ఎస్.నుపూర్ అజయ్, మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, విజయవాడ సబ్ కలెక్టర్ అదితి సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో కోనసీమ ‘ప్రభల శకటం’
సాక్షి, న్యూఢిల్లీ, అంబాజీపేట: దేశ రాజధానిలో ఈనెల 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకాదశ రుద్రుల ప్రభల శకటం ఎంపికైంది. సంక్రాంతి సందర్భంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగే వేడుకలు, పంటలు చేతికి అందే సమయంలో రైతన్నల ఆనందోత్సాహాలను ప్రతిబింబించేలా శకటం ముస్తాబవుతోంది. కోనసీమలో కనుమ రోజు జగ్గన్నతోటలో జరిగే ఏకాదశ రుద్రుల ప్రభల చరిత్రను ప్రతిబింబించేలా శకటాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఏకాదశ రుద్రుల ప్రభల చరిత్రను వివరిస్తూ గంగలకుర్రు అగ్రహారానికి చెందిన శివకేశవ యూత్ సభ్యులు రాష్ట్రపతికి లేఖ పంపారు. ప్రభల ఉత్సవంపై వారు రాసిన లేఖకు ప్రధాని మోదీ స్పందిస్తూ నాలుగు శతాబ్దాలుగా ప్రభల వేడుక నిర్వహించడం ఆనందదాయకమన్నారు. సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో గ్రామీణ ప్రాంతాలు పట్టుగొమ్మలుగా నిలుస్తున్నాయని అభినందించారు. ఇదీ విశిష్టత ఏకాదశ రుద్రులను కనుమ రోజు దర్శించుకుంటే ముక్తి కలుగుతుందని, పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. ఏటా సంక్రాంతి మర్నాడు అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో జరిగే ప్రభల తీర్థానికి 410 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. లోకకళ్యాణం కోసం పెద్దాపురం సంస్ధానాధీశుడు రాజా వత్సవాయి జగన్నాథరాజు (జగ్గన్న) హయాంలో 17వ శతాబ్ధంలో తొలిసారిగా ఇక్కడ నిర్వహించారు. ప్రభల ఉత్సవానికి మరో స్థల పురాణం కూడా ఉంది. 17వ శతాబ్ధంలో శివభక్తుడైన జగ్గన్న ఇక్కడున్న పెద్ద మర్రిచెట్టు కింద నిత్యం ధ్యానం చేసుకునేవాడట. పూజలపై పెద్దాపురం సంస్ధానాధీశులు అభ్యంతరం తెలపడంతో జగ్గన్న నేరుగా హైదరాబాద్‌లో ఉండే నవాబును కలిసి ఆయన మెప్పు పొందారట. నవాబు 8 పుట్లు (64 ఎకరాలు) భూమిని దానంగా ఇచ్చి అక్కడే శివ పూజ చేసుకునేందుకు జగ్గన్నకు అనుమతి ఇచ్చారు. కాలక్రమేణ ఆ ప్రాంతం జగ్గన్నతోటగా ప్రసిద్ధికెక్కినట్లు స్థల పురాణం చెబుతోంది. జగన్నాధ మహారాజుకు పరమేశ్వరుడు కలలో కనిపించి ప్రభల తీర్థం నిర్వహించమని, ఆదేశించడంతో జగ్గన్నతోట ప్రభల తీర్ధంగా పేరు వచ్చినట్లు ప్రచారం కూడా ఉంది. -
‘పద్మ’ అవార్డుల నామినేషన్లకు ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం–2023 సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల కోసం ఆన్లైన్ నామినేషన్లు, సిఫారసు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైనట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. పద్మ అవార్డుల నామినేషన్లను ఈ ఏడాది సెప్టెంబర్ 15 వరకు https://padmaawards.gov.in పోర్టల్ ద్వారా స్వీకరిస్తామని తెలిపింది. వివిధ కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ప్రజాసంబంధాలు, సేవ, సివిల్ సర్వీస్, వాణిజ్యం, పరిశ్రమ మొదలైన రంగాలు, విభాగాలలో విశిష్టమైన, అసాధారణ విజయాలు, సేవలకు ఈ పురస్కారాలు ఇవ్వనున్నారు. -
గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలు ఫొటోలు
-
గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలు.. వెయ్యి డ్రోన్లతో ప్రదర్శన
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈరోజు(శనివారం) రిపబ్లిక్ డే ముగింపు వేడుకల్లో భాగంగా బీటింగ్ రిట్రీట్‌లో డ్రోన్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వదేశీ సాంకేతికత ద్వారా రూపొందించబడిన 1,000 డ్రోన్లతో 10 నిమిషాల పాటు ప్రదర్శన ఏర్పాటు చేశారు. 75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’గా జరుపుకునే వేడుకలో భాగంగా డ్రోన్ షో, లేజర్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదే సమయంలో ప్రొజెక్షన్ మ్యాపింగ్ షో కనువిందు చేసింది. ఈ వేడుకల్లో రాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రి సహా కేంద్రమంత్రులు, ప్రముఖులు, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యుద్ధాల్లో సాయం కాలం సమీపించిన అనంతరం ఇరుపక్షాల సైనికులు వెనక్కుతగ్గేందుకు గుర్తుగా ఈ బీటింగ్ రిట్రీట్ను నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా అనేక కొత్త ట్యూన్లను చేర్చారు. రక్షణ శాఖ సహాయంతో కొత్త ట్యూన్లు చేర్చబడ్డాయి.‘హింద్ కి సేన’, కేరళ’, ‘ఏ మేరే వతన్‌కే లోగోన్’ ట్యూన్లు ఉన్నాయి. ‘సారే జహాన్ సే అచ్చా’ ట్యూన్‌తో బీటింగ్ రిట్రీట్ పరేడ్ ముగియనుంది. ఇక డ్రోన్ ప్రదర్శనను ఢిల్లీకి చెందిన బోట్‌ల్యాబ్స్ డైనమిక్స్ స్టార్టప్ సంస్థ నిర్వహించింది. -
Anand Mahindra: సప్త సముద్రాల్లో సారే జహాసే అచ్చా !
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. దేశరాజధాని నడి వీధుల్లో సైనిక కవాతు ఆకట్టుంది. వైమానిక దళం ఆకాశాలంలో అద్భుతాలను ఆవిష్కరించింది. దేశంలో వాడవాడలా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఉద్రిక్తలు ఉండే కశ్మీర్ లాల్‌చౌక్‌లోనూ జాతీయ జెండా ఠీవిగా నిలబడింది. వీటికి తోడు సముద్ర గర్భంలోనూ జాతీయ జెండానె ఎగురవేసి తమ దేశభక్తి చాటుకున్నారు స్కూబా డైవర్లు. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆటోల్ గ్రూప్‌కి చెందిన నలుగురు స్కూబా డైవర్ల బృందం జాతీయ జెండాతో సముద్రం గర్భంలోకి అడుగుపెట్టింది. సముద్రం చిట్టచివరి పాయింట్‌కి చేరుకుని అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తూ.. అన్నిద్వీపాల్లో.. అన్ని సముద్రాల్లో.. సారే జహాసే అచ్చా అంటూ క్యాప్షన్ జోడించారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో ఆకట్టుకుంటోంది. Sare Dweepon se, sare Samudron se, sare Jahaan se accha… pic.twitter.com/5ZLIaBvqfr — anand mahindra (@anandmahindra) January 27, 2022 చదవండి: వారి కోసం ప్రత్యేకం.. పెద్ద మనసు చాటుకున్న ఆనంద్ మహీంద్రా -
బాబూరామ్‌కు అశోక చక్ర
న్యూఢిల్లీ: జమ్ము, కాశ్మీర్‌కు చెందిన పోలీసు అధికారి బాబూరామ్ మరణానంతరం అశోక చక్ర అవార్డుకు ఎంపికయ్యారు. గణతంత్ర వేడుకల్లో ఆయన భార్య రీనారాణి, కుమారుడు మాణిక్‌కు రాష్ట్రపతి కోవింద్ అవార్డును అందజేశారు. 2020 ఆగస్టులో శ్రీనగర్‌లో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో అసిస్టెంట్ సబ్ ఇనస్పెక్టర్ బాబూరామ్ అమరుడయ్యారు. ఆరోజు ఆయన చాకచక్యంగా వ్యవహరించి ఉగ్రవాదులున్న ఇంటిపక్క పౌరులను కాపాడారు. అనంతరం ధైర్యంగా ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నించి ఎదురు కాల్పుల్లో అమరుడయ్యారు. ఈ సాహసానికి ఆయనకు మరణానంతరం అత్యున్నత గాలెంటరీ పురస్కారం దక్కింది. శౌర్యచక్ర అవార్డు మరణానంతరం సుబేదార్ శ్రీజిత్, హవల్దార్ అనిల్ కుమార్, కాశీరాయ్, పింకు కుమార్, జశ్వంత్ కుమార్ రెడ్డికి దక్కింది. -
ఘనంగా గణతంత్ర వేడుకలు
న్యూఢిల్లీ: భారత 73వ గణతంత్ర దిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. వేడుకల్లో భారతీయ సైనిక పాటవాన్ని చాటిచెప్పేలా యుద్ధవిమానాలతో భారీ ఫ్లైపాస్ట్ నిర్వహించారు. 1971 పాకిస్తాన్‌తో యుద్ధంలో కీలక పాత్ర పోషించిన పలు సైనిక వాహనాలను ప్రదర్శించారు. కరోనా కారణంగా వేడుకలకు విదేశీ అతిధిని ఆహ్వానించలేదు. వీక్షకుల సంఖ్యను కూడా పరిమితం చేశారు. అయితే ఫ్రంట్‌లైన్ వర్కర్లు, ఆటోడ్రైవర్లు, నిర్మాణ కార్మికులను ప్రత్యేక అతిధులుగా గౌరవించారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ గౌరవ వందనం స్వీకరించడంతో రిపబ్లిక్ డే పెరేడ్ ఆరంభమైంది. లెఫ్టినెంట్ జనరల్ విజయ్ కుమార్ మిశ్రా, మేజర్ జనరల్ అలోక్ కకేర్ నేతృత్వంలో సైనికులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరణ, జాతీయగీతాలాపన, 21 తుపాకుల గన్‌సెల్యూట్ జరిగాయి. భారత ఆర్మీ 61వ కేవలరీ రెజిమెంట్ సైనికులు మార్చింగ్‌లో ముందు నిలిచారు. ఉత్తరాఖండ్ టోపీతో ప్రధాని గణతంత్ర ఉత్సవాలకు హాజరయ్యే ముందు ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ యుద్ద మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ఆయనతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాధ్, త్రివిధ దళాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వీరు రిపబ్లిక్ డే పెరేడ్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని ఉత్తరాఖండ్‌కు పత్య్రేకమైన టోపీ ధరించారు. దీనిపై ఆ రాష్ట్ర పుష్పం బ్రహ్మకమలం చిత్రీకరించారు. అలాగే మణిపూర్ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా శాలువా ధరించారు. పెరేడ్లో ఎన్సీసీ కేడెట్లు షహీదోం కో శత్ శత్ నమాన్ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయా రాష్ట్రాలకు చెందిన శకటాల ప్రదర్శన జరిగింది. పలు ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు సైతం తమ శకటాలను ప్రదర్శించాయి. కేంద్ర ప్రజాపనుల శాఖ నేతాజీ 125వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయనకు నివాళినర్పిస్తూ శకటాన్ని ప్రదర్శించింది. ఈ ఏడాది కొత్తగా లోక్ అదాలత్ శకటం పెరేడ్లో అడుగుపెట్టింది. విదేశాల్లో గణతంత్ర దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో భారతీయులు 73వ గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బ్రిటన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ సహా పలు దేశాధినేతలు ఈ సందర్భంగా ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. పలు దేశాల్లో భారతీయ కమిషన్ కార్యాలయాల్లో వేడుకలు జరిపారు. బీజింగ్‌లో భారత రాయబారి విమల్ జాతీయజెండాను ఎగురవేసి, రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపించారు. సింగపూర్‌లో హైకమిషనర్ సిద్ధార్ధ్ నాథ్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. భారత్‌లో మరింత బలమైన బంధాన్ని ఏర్పరుచుకుంటామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ హిందీలో భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల సంబంధాలు మరింత బలోపేతం కావాలని నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ ఆకాంక్షించారు. భారత్‌తో కలిసి అనేక అంశాల్లో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు బంగ్లా ప్రధాని షేక్ హసీనా చెప్పారు. భూటాన్, ఇండియాల స్నేహం కాలానికి నిలిచిందని ఆ దేశ ప్రధాని లోటే ష్రింగ్ తెలిపారు. భారత ప్రజలకు శ్రీలంక ప్రధాని ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్తాన్లో ఇండియా రాయబారి సురేశ్ కుమార్ జెండా వందన కార్యక్రమం నిర్వహించారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ఇండో– యూఎస్ బంధం కీలకమని వైట్‌హౌస్ వర్గాలు వ్యాఖ్యానించాయి. బ్రూనై, న్యూజిలాండ్, ఇటలీ, దక్షిణ కొరియా సహా పలు దేశాల్లో రిపబ్లిక్ డే ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. రాష్ట్రాల్లో రిపబ్లిక్ డే సంబరాలు భారత 73వ గణతంత్ర సంబరాలు అన్ని రాష్ట్రాల్లో అంబరాన్నంటాయి. ఆయా రాష్ట్రాల ప్రజలకు గవర్నర్లు, ముఖ్యమంత్రులు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ సూత్రాలను కాపాడేందుకు పాటుపడతామని ప్రతిన పూనారు. కరోనా కారణంగా ప్రేక్షకుల సంఖ్యపై పలు రాష్ట్రాల్లో పరిమితులు విధించారు. కాశ్మీర్లో ప్రఖ్యాత లాల్‌చౌక్ క్లాక్ టవర్‌పై మువ్వన్నెల జెండాను ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు సాజిద్ యూసుఫ్, సాహిల్ బషీర్ పాల్గొన్నారు. ముందు జాగ్రత్తగా కాశ్మీర్లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు. లోయలో పుకార్లు వ్యాపింపజేసేవారిపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తన రిపబ్లిక్‌డే ప్రసంగంలో నిప్పులు చెరిగారు. రాజాంగ్య మౌలికతను కాపాడేందుకు ప్రతినపూనాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి ప్రజలను కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగితను తొలగిస్తామని హర్యానా సీఎం ఖటర్ ప్రతిజ్ఞ చేశారు. పెట్రోల్‌పై సబ్సిడీని జార్ఖండ్ సీఎం సోరెన్ ప్రకటించారు. మహిళా శిశువుల కోసం ప్రత్యేక పథకం తెస్తామని చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ చెప్పారు. కేరళలో మంత్రి అహ్మద్ తలకిందులుగా జాతీయజెండాను ఆవిష్కరించడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. రాష్ట్రాభివృద్ధికి తీసుకునే చర్యలను మేఘాలయ ముఖ్యమంత్రి వివరించారు. మధ్యప్రదేశ్‌లో మద్యనిషేధం ఆవశ్యకతను ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ నొక్కిచెప్పారు. రెండేళ్లలో తమ ప్రభుత్వం ఎన్నోవిజయాలు సాధించిందని మహారాష్ట్ర గవర్నర్ చెప్పారు. కేంద్రం తిరస్కరించిన శకటాన్ని తమిళనాడు ప్రభుత్వం మెరీనా బీచ్‌లో ప్రదర్శించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో రిపబ్లిక్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలో సీఎం అరవింద్, లెఫ్టినెంట్ గవర్నర్ అనీల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ స్వతంత్య్ర యోధుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. సీమా భవానీ బృందం విన్యాసాలు పెరేడ్లో బీఎస్ఎఫ్కు చెందిన మహిళా జవాన్లతో కూడిన సీమా భవానీ మోటర్‌సైకిల్ టీమ్ చేసిన విన్యాసాలు వీక్షకులను మంత్రముగ్దులను చేశాయి. ప్రముఖులంతా ఈ బృందానికి నిల్చొని చప్పట్లతో గౌరవం ప్రకటించారు. భారతీయ ఐక్యతను ప్రతిబింబించేలా 485 మంది డాన్సర్లతో నిర్వహించిన భారీ ప్రదర్శన కూడా అందరినీ ఆకట్టుకుంది. అనంతరం ఆజాదీ కా అమృతోత్సవ్ వేడుకలకు గుర్తుగా 75 యుద్ధ విమానాలు ఆకాశ వీధిలో విన్యాసాలు చేశాయి. విమానాలు గగనతలంలో విన్యాసాలు చేస్తుండగా, కాక్‌పిట్ నుంచి చిత్రీకరించిన వీడియోలను వాయుసేన ప్రదర్శించింది. ఆకాశంలో విమాన విన్యాసాల ప్రత్యక్ష ప్రసారం ఇదే తొలిసారి. వేడుకలకు దాదాపు 5వేల మంది హాజరయ్యారు. కరోనా పూర్వం ఈ వేడుకలకు దాదాపు లక్షమంది వచ్చేవారు. వీక్షకులంతా కరోనా నిబంధనలు పాటించారు. అలాగే వీక్షకులు సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు. వేడుకలకు భద్రతా బలగాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. నగరం మొత్తాన్ని పోలీసులు దిగ్భంధనం చేశారు. -
ప్రతిష్టాత్మక విన్యాసాలకు వేదికగా.. విశాఖ
సాక్షి, విశాఖపట్నం: ప్రతిష్టాత్మక అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాలకు విశాఖపట్నం వేదిక కానుందని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్‌గుప్తా వెల్లడించారు. ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ప్రధాన నేవల్ బేస్ ఐఎన్ఎస్ సర్కార్‌లోని పరేడ్ గ్రౌండ్లో 73వ గణతంత్ర దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ గుప్తా.. గార్డుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వివిధ నౌకలు, సబ్ మెరైన్లు, ఇతర నౌకాదళ సిబ్బందితో కూడిన ప్లటూన్లు నిర్వహించిన పరేడ్‌ను ఆయన సమీక్షించారు. అనంతరం ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. విశాఖ వేదికగా ఫిబ్రవరి 21న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4 వరకూ మిలాన్ విన్యాసాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచంలోని ప్రధాన దేశాలు పాల్గొంటున్న ఈ ప్రతిష్టాత్మక నౌకాదళ విన్యాసాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కశ్మీర్లో టెర్రరిస్టుల్ని మట్టుబెట్టి ధైర్య సాహసాలు ప్రదర్శించిన లీడింగ్ సీమాన్ నవీన్‌కుమార్‌కు, 29 ఏళ్ల పాటు నేవీలో విశిష్ట సేవలందించిన కమాండర్ రాహుల్‌విలాస్ గోఖలేకు నవ్‌సేనా మెడల్‌ను ఈఎన్సీ చీఫ్ అందించారు. టెక్నాలజీ రంగంలో అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను రిటైర్డ్ లెఫ్టినెంట్ సీడీఆర్ తుషార్ బహ్ల్‌కు లెఫ్టినెంట్ వీకే జైన్ మెమోరియల్ అవార్డు, నేవల్ ఎయిర్ ఆపరేషన్స్‌లో ఫ్లైట్ సేఫ్టీని మెరుగుపరిచిన హరనంద్‌కు కెప్టెన్ రవిధీర్ గోల్డ్‌మెడల్‌ను బహూకరించారు. అలాగే తూర్పు నౌకాదళ పరిధిలో 2020కి గాను అత్యుత్తమ సేవలందించిన నేవల్ డాక్‌యార్డు, ఐఎన్ఎస్ జలశ్వా యుద్ధ నౌకల బృందానికి యూనిట్ సైటేషన్ అవార్డు ప్రదానం చేశారు. -
కరోనా పరిస్థితుల్లోను మెరుగైన సేవలు
సాక్షి, అమరావతి: భారత గణతంత్రదిన వేడుకలను బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన రాజ్యాంగం దేశంలోని పౌరులందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించిందని చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ సహా ఇతర ప్రముఖుల త్యాగాలను, వారి కృషిని ప్రతి ఒక్కరూ మననం చేసుకోవాల్సిన తరుణమిదని పేర్కొన్నారు. రెండేళ్లుగా కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ సమస్యలను అధిగమించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు విశేషకృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి సకాలంలో ప్రజలకు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఎనలేని కృషిచేస్తోందని కొనియాడారు. రానున్న రోజుల్లో అధికారులు, సిబ్బంది మరింత చిత్తశుద్ధి, అంకితభావాలతో పనిచేసి ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలందించేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. సచివాలయం చీఫ్ సెక్యూరిటీ అధికారి కృష్ణమూర్తి, సచివాలయ అధికారులు, ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి పెద్దిరెడ్డి గణతంత్ర దినోత్సవం సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ, అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాపు మ్యూజియంలో.. విజయవాడ బాపు మ్యూజియంలో దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య 1921లో ఆ జెండాను మహాత్మాగాంధీకి బాపు మ్యూజియం ప్రాంగణంలో అందజేశారు. బస్ భవన్లో.. ఆర్టీసీ ప్రధాన కార్యాలయం విజయవాడలోని బస్‌భవన్ ప్రాంగణంలో ఆర్టీసీ ఈడీ ఎ.కోటేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈడీలు కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి, పి.కృష్ణమోహన్, ఆర్థిక సలహాదారు ఎన్.వి.రాఘవరెడ్డి, ఏడీ (విజిలెన్స్–సెక్యూరిటీ) శోభామంజరి తదితరులు పాల్గొన్నారు. టిడ్కో ఉత్తమ ఉద్యోగులకు సత్కారం ఈ ఏడాది చివరినాటికి టిడ్కో ద్వారా చేపట్టిన పేదల ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా లబ్ధిదారులకు అందజేసేందుకు కృషిచేయాలని టిడ్కో చైర్మన్ ప్రసన్నకుమార్, ఎండీ సీహెచ్ శ్రీధర్.. అధికారులను, సిబ్బందిని కోరారు. ఏపీ టిడ్కో కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో వారు ప్రసంగించారు. ఉత్తమ సేవలు అందించిన చీఫ్ ఇంజినీర్ గోపాలకృష్ణారెడ్డి, జీఎం హరినాథ్, లైసనింగ్ అధికారి విజయకుమార్, వివిధ విభాగాలకు చెందిన 40 మంది అధికారులు, సిబ్బందిని సత్కరించారు. టిడ్కో డైరెక్టర్లు రాఘవరావు, నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఏపీపీఎస్సీ, ఎస్సెస్సీ బోర్డుల్లో.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కార్యాలయంలో కమిషన్ చైర్మన్ ఎ.వి.రమణారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సభ్యుడు సలాంబాబు, అధికారులు పాల్గొన్నారు. ఎస్సెస్సీ బోర్డులో డైరెక్టర్ దేవానందరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. బోర్డు అధికారులు పాల్గొన్నారు. పవన్‌కళ్యాణ్ పతాకావిష్కరణ హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్, మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాసయాదవ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. -
ప్రగతి రథం పరుగులు
సాక్షి, అమరావతి: రైతుల శ్రేయస్సు, విద్యారంగ సంస్కరణలు, ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ నవరత్నాల పథకాలతో సుస్థిరాభివృద్ధి, సమ్మిళిత వృద్ధి సాధన దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో దూసుకెళుతోందని గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ తెలిపారు. అభివృద్ధి ఫలాలు సమాజంలో అన్ని వర్గాలకు సమానంగా దక్కాలన్న రాజ్యాంగ స్ఫూర్తితో సంక్షేమ, అభివృద్ధి అజెండాను చిత్తశుద్ధితో అమలు చేస్తోందని చెప్పారు. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను బుధవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ వేడుకల్లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు. ఇది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వమని, ప్రజా సంక్షేమం, ఉద్యోగుల హక్కుల్లో సమతుల్యతను పాటిస్తూ కోవిడ్ ఆర్థిక ఇబ్బందుల్లోనూ మెరుగైన పీఆర్సీ ప్రకటించామని గవర్నర్ స్పష్టం చేశారు. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఉగాది నాటికి రాష్ట్రంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమర్థ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా ఎదుగుతోందని తెలిపారు. గత 32 నెలల్లో రికార్డు స్థాయిలో నేరుగా నగదు బదిలీ, నగదేతర పథకాల ద్వారా 9,29,15,170 మంది లబ్ధిదారులకు రూ.1,67,798 కోట్ల మేర ప్రయోజనం కల్పించామని వెల్లడించారు. 6,80,62,804 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.1,27,173 కోట్ల ఆర్థిక సాయాన్ని నేరుగా జమ చేశామన్నారు. 2,48,52,366 మంది లబ్ధిదారులకు ప్రభుత్వ తోడ్పాటుతో రూ.40,625 కోట్ల విలువైన ఆస్తులను సమకూర్చామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఆ వివరాలివీ.. జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తున్న గవర్నర్ ఉద్యోగుల అనుకూల ప్రభుత్వం ఉద్యోగులు మా ప్రభుత్వంలో అంతర్భాగం. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమ చర్యలు చేపట్టింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నడూ లేని విధంగా 27% ఐఆర్ మంజూరు చేసింది. దీనివల్ల రూ.17,265 కోట్ల ఆర్థిక భారం పడింది. రెవెన్యూ లోటు, కోవిడ్ సంక్షోభంతో ఇబ్బందులు తలెత్తినా 11వ వేతన సవరణను 23 శాతం ఫిట్మెంట్తో అమలు చేయడంతో రూ.10,247 కోట్ల అదనపు భారం పడుతోంది. ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేందుకు పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాం. గ్రాట్యుటీ రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచాం. రైతుల శ్రేయస్సే లక్ష్యం.. 10,778 ఆర్బీకేల ద్వారా రైతులకు అన్ని రకాల సేవలు గ్రామాల్లోనే అందిస్తున్నాం. ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు 22.78 లక్షల టన్నుల ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేశాం. లాక్‌డౌన్‌లోనూ రైతుల నుంచి రూ.35,396 కోట్ల విలువైన 1.91 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించాం. రూ.6,499 కోట్ల విలువైన ఇతర పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేశాం. ఇప్పటి వరకు రైతులకు రూ.86,313 కోట్ల సాయం అందించాం. వైఎస్సార్ రైతు భరోసా కింద ఇప్పటి వరకు రూ.19,126 కోట్లు పంపిణీ చేశాం. పంటలు నష్టపోయిన రైతులపై ఒక్కపైసా భారం పడకుండా 31.07 లక్షల మందికి రూ.3,788 కోట్ల మేర పంటల బీమాను ప్రభుత్వం చెల్లించింది. పెట్టుబడి రాయితీ కింద 13.96 లక్షల మందికి రూ.1,071 కోట్లు చెల్లించాం. రైతులకు పగటి పూట 9 గంటల ఉచిత కరెంట్ అందిస్తున్నాం. ► సహకార డెయిరీ వ్యవస్థను పునరుద్ధరించి బలోపేతం చేసేందుకు అమూల్‌తో ఒప్పందం చేసుకున్నాం. 9,899 గ్రామాలను గుర్తించి మహిళా డెయిరీ సహకార సంఘాలను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించాం. ► వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద 1,19,875 మత్స్యకార కుటుంబాలకు రూ.332 కోట్ల మేర ఆర్థిక సాయం అందించాం. నరసాపురంలో మత్స్య యూనివర్సిటీ, 27 చోట్ల ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ► రూ.3,177 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లు, నాలుగు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. రూ.558 కోట్లతో 70 ఆక్వా హబ్‌లు, 14,000 స్పోక్స్ ఆఫ్ రిటైల్ అవుట్‌లెట్స్ నెలకొల్పనున్నాం. విద్యా విప్లవం.. వివిధ విద్యా పథకాల ద్వారా 1,99,38,694 మందికి రూ.34,619.24 కోట్ల మేర లబ్ధి చేకూర్చాం. మనబడి నాడు–నేడు ద్వారా దాదాపు 56,703 ఫౌండేషన్, ఉన్నత పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, జూనియర్ కళాశాలను దశల వారీగా రూ.16,025 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఆంగ్ల బోధనను అందుబాటులోకి తెచ్చాం. ► జగనన్న విద్యా కానుక కింద 50,53,844 మంది విద్యార్థుల కోసం ప్రభుత్వం ఏటా రూ.731.30 కోట్లు ఖర్చు చేస్తోంది. జగనన్న అమ్మ ఒడి ద్వారా 44,48,865 మందికి రూ.13,023 కోట్లు అందచేసింది. జగనన్న విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్మెంట్) కింద 21,55,298 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.6,260 కోట్లు జమ చేసింది. జగనన్న వసతి దీవెన కింద 18,77,863 మంది లబ్ధిదారులకు రూ.2,305 కోట్లు అందజేసింది. ఆరోగ్యానికి భరోసా.. ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు ఉండేలా అదనంగా 172 పీహెచ్‌లను నిర్మిస్తున్నాం. రూ.7,880 కోట్లతో 16 కొత్త అదనపు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. వైద్య రంగంపై రూ.16,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మూడేళ్లలో జిల్లా కేంద్రాల్లో 16 హెల్త్ హబ్‌లు ఏర్పాటవుతాయి. 40,000 మంది వైద్య సిబ్బంది నియామకాలు కూడా చేపట్టాం. ► డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద 2,446 ప్రొసీజర్లకు సంబంధించి వైద్య సేవలను అందిస్తున్నాం. ఆరోగ్య ఆసరా కింద 6,77,559 మందికి రూ.445 కోట్ల మేర సాయం చేశాం. 104 వాహన వైద్య సేవలను మండలానికి ఒకటి చొప్పున విస్తరించి 20 రకాల సేవలను అందిస్తున్నాం. రూ.561 కోట్లతో వైఎస్సార్ కంటి వెలుగు పథకం కింద ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కళ్లజోళ్లు కూడా అందిస్తున్నాం. కోవిడ్‌పై సమష్టి యుద్ధం.. కోవిడ్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా వ్యవహరిస్తోంది. 629 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 53,533 బెడ్లను అందుబాటులో ఉంచాం. ఇప్పుడు 35 దఫా పీవర్ సర్వే ఇంటింటికీ జరుగుతోంది. ఆస్పత్రుల్లో 176 పీఎస్ఏ ప్లాంట్లను ఏర్పాటు చేసి 24,419 బెడ్లకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించాం. 81 ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా పీఎస్ఏ ప్లాంట్లు ఏర్పాటు చేశాం. ► జనవరి 21 నాటికి వంద శాతం మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేశాం. 86 శాతం మంది ప్రజలకు రెండు డోసులు ఇచ్చాం. 15–18 ఏళ్ల వారికి 93 శాతం ఫస్ట్ డోసు వ్యాక్సినేషన్ పూర్తైంది. మహిళా సాధికారత... మహిళల సమగ్ర అభివృద్ధి, సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తోంది. 98 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ కింద రూ.2,354 కోట్లు చెల్లించాం. రూ.25,517 కోట్ల పొదుపు సంఘాల బకాయిలను ప్రభుత్వం రెండు విడతల్లో రూ.12,758 కోట్లు తీర్చింది. వైఎస్సార్ చేయూత ద్వారా 45–60 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,500 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు అందిస్తోంది. రెండేళ్లలో 25 లక్షల మందికి రూ.9,308 కోట్లు జమ చేసింది. వైఎస్సార్ కాపు నేస్తం కింద 45–60 ఏళ్ల కాపు, బలిజ, ఒంటరి సామాజిక వర్గాల మహిళలకు ఏడాదికి రూ.15,000 చొప్పున 3,27,349 మంది లబ్ధిదారులకు రూ.982 కోట్లు అందచేసింది. కొత్తగా వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం కింద అగ్రవర్ణ పేద మహిళలు 3.92 లక్షల మందికి రూ.589 కోట్లు అందచేశాం. 50 శాతం నామినేటెడ్ పనులు, పదవుల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాం. మహిళల రక్షణకు దిశ బిల్లు తీసుకొచ్చాం. వైఎస్సార్ పింఛన్‌కానుక ఎన్నికల హామీ మేరకు పింఛన్ మొత్తాన్ని ప్రభుత్వం రూ.2,500కి పెంచింది. ప్రతి నెలా 62 లక్షల మంది లబ్ధిదారులకు రూ.1,570 కోట్లు అందచేస్తోంది. ఇప్పటి వరకు రూ.45,837 కోట్ల పింఛన్ల సొమ్ము పంపిణీ చేసింది. ► చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం కింద ఏటా రూ.24 వేలు అందిస్తున్నాం. ఐదేళ్లలో ఒక్కో లబ్ధిదారుడికి రూ.1.20 లక్షల మేర ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటి వరకు 81,703 మంది లబ్ధిదారులకు రూ.577 కోట్లు అందజేశాం. ► వైఎస్సార్ బీమా కింద ఏటా రూ.510 కోట్ల బీమా ప్రీమియం చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు 1,03,171 బాధిత కుటుంబాలకు రూ.1,682 కోట్లు బీమా పరిహారంగా అందించాం. ► వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా 2,74,105 మంది లబ్ధిదారులకు రూ.771 కోట్లు ఆర్థిక సాయం చేశాం. పారిశ్రామీకరణకు పెద్దపీట సులభతర వాణిజ్యంలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈలకు రూ.2,029 కోట్ల ప్రోత్సాహకాలు అందించింది. కడప జిల్లా కొప్పర్తిలో 3,155 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేస్తున్నాం. రూ.25వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 75 వేల ఉద్యోగాలు కల్పించనున్నాం. దీనికి అనుబంధంగా 801 ఎకరాల్లో రూ.730 కోట్లతో వైఎస్సార్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అభివృద్ధి చేశాం. తద్వారా రూ.10 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 25 వేల ఉద్యోగాలు కల్పించనున్నాం. రూ.13 వేల కోట్లతో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం. భోగాపురం, దగదర్తిలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తాం. పేదల సొంతింటి కల సాకారం... ప్రభుత్వం ఇప్పటి వరకు 32 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. తొలిదశలో 15.60 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నాం. 17 వేల వైఎస్సార్ జగన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.32,909 కోట్లు ఖర్చు చేశాం. ► మధ్య తరగతి కుటుంబాలకు జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పథకం కింద నివాస స్థలాలను లాభాపేక్ష లేకుండా అందిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం స్థలాలను 20 శాతం రాయితీతో కేటాయిస్తున్నాం. పెన్షనర్లకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాం. జలయజ్ఞం.. 2023 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తాం. ఆర్ అండ్ ఆర్ కింద నిర్వాసితులకు సత్వర న్యాయం చేస్తున్నాం. వెలిగొండ ప్రాజెక్టులో టన్నెల్–1 పూర్తయింది. నల్లమల సాగర్ రిజర్వాయర్ పూర్తి చేశాం. 2022 ఖరీఫ్ నాటికి ప్రకాశం జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాలకు నీటిని అందిస్తాం. నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజీలను మార్చిలోగా ప్రారంభిస్తాం. వంశధార ప్రాజెక్టు ద్వారా శ్రీకాకుళం జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలకు నీటి వసతిని మెరుగుపరుస్తాం. అవుకు టన్నెల్‌ను ఈఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును రూ.15,448 కోట్లతో చేపట్టాం. కరువు నివారణతోపాటు పారిశ్రామిక అవసరాలను తీర్చేలా 54 కొత్త ప్రాజెక్టులను ప్రభుత్వం పరిశీలిస్తోంది. సచివాలయాల శకటానికి ఫస్ట్ ప్రైజ్ సాక్షి ప్రతినిధి, విజయవాడ: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో పోలీసు కవాతు, శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఏపీ స్పెషల్ బెటాలియన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు డాక్టర్ శంఖభ్రాత బాగ్చీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీసు పరేడ్‌కు విశాఖ రూరల్ అడిషనల్ ఎస్పీ ఎస్ సతీష్‌కుమార్ నేతృత్వం వహించారు. కవాతు ప్రదర్శనలో ఏపీఎస్పీ 5వ బెటాలియన్ (విజయనగరం) ప్రథమ బహుమతి సాధించింది. 3వ బెటాలియన్ (కాకినాడ) ద్వితీయ బహుమతి పొందగా, కర్నాటక ఉమెన్ ఆర్మ్డ్ పోలీస్‌లకు స్పైషల్ ప్రైజులు, ట్రోఫీలను గవర్నర్ ప్రదానం చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శకటాలకు సంబంధించి బహుమతులను అందజేస్తున్న గవర్నర్ విశ్వభూషణ్ నవ రత్నాలతో శకటాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించిన 16 శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నవరత్నాల వెలుగులను నలుదిశలా ప్రసరిస్తున్న వైనాన్ని వివరిస్తూ శకటాలు ముందుకు సాగాయి. గ్రామ, వార్డు సచివాలయ శాఖ రూపొందించిన శకటం ప్రథమ బహుమతి సాధించింది. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ శకటం ద్వితీయ బహుమతి, వైద్య, ఆరోగ్యశాఖ శకటం తృతీయ బహుమతిని దక్కించుకున్నాయి. కోవిడ్ నేపథ్యంలో పరిమితంగా మాత్రమే అతిథులను ఆహ్వానించినందున శకటాలను ప్రజలంతా తిలకించేందుకు సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయకుమార్ సూచనల మేరకు విజయవాడ వీధుల్లో ప్రదర్శించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ శకటాలను జెండా ఊపి ప్రారంభించారు. బెంజిసర్కిల్, రామవరప్పాడు రింగ్, ఏలూరు రోడ్డు, కంట్రోల్ రూమ్ మీదుగా ప్రయాణించి శకటాలు తిరిగి స్టేడియం వద్దకు చేరుకున్నాయి. -
Chhattisgarh: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం తీపికబురు.. ఇక నుంచి..
ఛత్తీస్‌ఘడ్: భారతదేశమంతట 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్.. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి ఐదురోజుల పని దినాలతో పాటు పలు విధానపర నిర్ణయాలను ప్రకటించారు. అదే విధంగా, పెన్షన్ పథకంలో రాష్ట్రప్రభుత్వం వాటాను 10 నుంచి 14 శాతానికి పెంచుతున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించారు. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులలో సామర్థ్యం, ఉత్పాదకతను పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు భూపేష్ బఘెల్ తెలిపారు. ఆయా నివాస ప్రాంతంలో వ్యాపారాలు చేసే చిరువ్యాపారుల కోసం ప్రత్యేకంగా చట్టబద్ధత కల్పించే చట్టాన్ని ప్రవేశపెడుతన్నట్లు పేర్కొన్నారు. ఇది చిరువ్యాపారులకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ప్రజా భద్రతకు ఇబ్బందులు కల్గించే ఎలాంటి అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బిల్డింగ్ కోడ్‌లోని నిబంధలను అందరు పాటించాలని సూచించారు. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్లలో సెకండ్ బిల్డింగ్ పర్మిషన్ పథకానికి అనుగుణంగా ప్రణాళిక నిబంధనలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఉపాధి కల్పనతోపాటు రవాణా సౌకర్యాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా రవాణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో పాటు లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ జారీ నిబంధలను సులభతరం చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. మహిళల భద్రత కోసం మహిళ సేఫ్టీ సెల్స్‌ను ఏర్పాటు చేస్తామని భూపేష్ బఘెల్ ప్రకటించారు. ఛత్తీస్‌ఘడ్ ప్రాంతంలో దట్టమైన అడవులతో కూడి ఉంటుంది. ఈ క్రమంలో గిరిజనులు ఎక్కువగా జీవనోపాధి కోసం అడవులపై ఆధారపడతారు. వీరి కోసం అటవీ వాసులకు సంబంధించిన నిబంధనలను సరళతరం చేయనున్నట్లు సీఎం తెలిపారు. పారిశ్రామిక విధానంలో మార్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇండస్ట్రీయల్ పార్కుల్లోని ప్లాట్లలో 10 శాతం భూమిని ఓబీసీ వర్గానికి రిజర్వు చేయనున్నట్లు తెలిపారు. ప్రధానంగా రైతుల కోసం 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి పప్పుధాన్యాలకు కూడా కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని సీఎం తెలిపారు. అలాగే కార్మికులకు జన్మించిన మొదటి ఇద్దరు ఆడపిల్లలకు ఒక్కొక్కరికి 20,000 వేల చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు భూపేష్ బఘెల్ తెలిపారు. చదవండి: టెన్షన్.. టెన్షన్..! పశ్చిమ యూపీలో ఒక్కో ఓటుకై పార్టీల ఆరాటం -
గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: గణతంత్ర వేడుకలకు విజయవాడలోని మునిసిపల్ స్టేడియం ముస్తాబైంది. వేడుకల ఏర్పాట్లను గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా మంగళవారం పరిశీలించారు. ఆయనకు అడిషనల్ డీజీపీ డాక్టర్ రవిశంకర్ అయ్యనార్, ఏపీఎస్పీ బెటాలియన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ బాగ్చీ, కలెక్టర్ జె.నివాస్, నగర పోలీస్ కమిషనర్ టీకే రాణా, ప్రొటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యరెడ్డి తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫుల్‌డ్రెస్ రిహార్సల్స్ ఆకట్టుకున్నాయి. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్‌తో సిసోడియా భేటీ అయ్యారు. ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా కార్యక్రమాలు సజావుగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని కోరారు. కాగా, పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో కర్ణాటక స్టేట్ పోలీస్, ఏపీఎస్పీ రెండో బెటాలియన్ కర్నూలు, మూడో బెటాలియన్ కాకినాడ, ఐదో బెటాలియన్ విజయనగరం, తొమ్మిదో బెటాలియన్ వెంకటగిరి, 11వ బెటాలియన్ భాకరపేట, 14వ బెటాలియన్ అనంతపురం, ఎస్ఏఆర్ సీసీఎల్, ఏపీ యూనిట్ హైదారాబాద్, పైప్ బ్యాండ్ ఏపీఎస్పీ బెటాలియన్ మంగళగిరి బృందాలు కవాతు నిర్వహించాయి. కలెక్టర్ జె.నివాస్ రిహార్సల్స్‌ను తిలకించి పలు సూచనలు చేవారు. జాతీయ సమైక్యత ఉట్టి పడేలా త్రివర్ణ పతాకాలు, విద్యుత్ దీపాలతో మునిసిపల్ స్టేడియాన్ని ముస్తాబు చేశారు. రిహార్సల్స్‌లో జాయింట్ కలెక్టర్లు డాక్టర్ కె.మాధవీలత, కె.మోహన్‌కుమార్, సబ్ కలెక్టర్ జి.సూర్యసాయి ప్రవీణ్‌చంద్, గవర్నర్ ఏడీసీలు సాహిల్ మహాజన్, ఈశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘మన ప్రజాస్వామ్యాన్ని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయి’
న్యూఢిల్లీ: మన ప్రజాస్వామ్యాన్ని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పష్టం చేశారు. బుధవారం రిపబ్లిక్ డే సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ఈరోజు రాత్రి(మంగళవారం) సందేశం ఇచ్చారు. ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలన్నారు. ‘మన ప్రజాస్వామ్యాన్ని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయి. రిపబ్లిక్ డే వేడుకల్ని జరుపుకోవడం మన ఐక్యతకు నిదర్శనం. సరికొత్త ఆర్థిక విధానాలు చేపట్టిన టాప్-50 దేశాల జాబితాలో భారత్ చోటు సంపాదించడం గర్వకారణం. ప్రస్తుతం కోవిడ్ కష్టకాలం నడుస్తోంది. దీనికి సంబంధించిన ప్రోటోకాల్‌ను ప్రతీ ఒక్కరూ విధిగా పాటించాలి .ప్రతీ ఒక్కరూ కచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. డాక్టర్లు, హెల్త్ వర్కర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి కోవిడ్ రోగులను రక్షించిన విషయాన్ని స్మరించుకోవాలి. కోవిడ్ మహమ్మారి వచ్చిన తొలి ఏడాదిలోనే మన హెల్త్ కేర్ సిస్టమ్‌ను బలోపేతం చేసుకోవడమే కాకుండా, ఆ మరుసటి ఏడాది వ్యాక్సిన్ డ్రైవ్‌ను సక్సెస్‌ఫుల్‌గా విజయవంతం చేయడం మన బలానికి సంకేతం’ అని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు. -
చొరబడేందుకు కాచుకు కూర్చున్నారు
శ్రీనగర్/జమ్మూ: గణతంత్ర దినోత్సవాల నేపథ్యంలో దేశంలోకి చొరబడేందుకు దాదాపు 135 మంది మిలిటెంట్లు సరిహద్దు అవతల వేచి చూస్తున్నట్టు సమాచారం అందిందని కశ్మీర్ బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ రాజాబాబు సింగ్ సోమవారం తెలిపారు. చొరబాట్లు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సరిహద్దు వెంబడి గస్తీ పెంచామని చెప్పారు. నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. తాలిబన్ల ముప్పు, అఫ్గానిస్తాన్ నుంచి కశ్మీర్‌కు ఆయుధాలు సరఫరా అవుతాయనే వార్తలపై స్పందిస్తూ.. ఇప్పటివరకైతే అలాంటి సమాచారమేం లేదన్నారు. అయినా పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని, నిఘా పెంచామని చెప్పారు. కొంత మంది గైడ్లు నియంత్రణ రేఖ దాటి అవతలివైపునకు వెళ్లారని.. ఇటువైపు వచ్చాక వాళ్లపైన, వాళ్ల కుటంబాలపైనా నిఘా పెడతామన్నారు. యాంటీ డ్రోన్ పద్ధతులు వాడుతున్నాం సరిహద్దులో డ్రోన్ల సమస్య ఉందని, గతేడాది కూడా కొన్ని తమకు కనిపించాయని, అయితే మనవైపు రాలేదని ఐజీ వివరించారు. ఈ ఏడాది యాంటీ డ్రోన్ పద్ధతులను వాడుతున్నామని, డ్రోన్లు కూడా సమకూర్చుకుంటున్నామని తెలిపారు. సరిహద్దు అవతలివైపు నుంచి నార్కోటిక్ డ్రగ్స్ పంపేందుకు ప్రయత్నిస్తున్నారని, కొన్నింటిని ఇప్పటికే సీజ్ చేశామని తెలిపారు. సరిహద్దుల్లో 2021లో దాదాపు రూ. 88 కోట్ల విలువైన మందుగుండు సామగ్రి, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఆర్మీ, సీఆర్పీఎఫ్తో కలిసి గస్తీ: జమ్మూ ఐజీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు సంఘ విద్రోహక చర్యలకు పాల్పడే అవకాశముందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించడంతో అప్రమత్తమయ్యామని బీఎస్ఎఫ్ జమ్మూ ఐజీ డీకే బోరా చెప్పారు. సరిహద్దు అవతలి నుంచి చొరబాట్లు జరగొచ్చని.. ఆయుధాలు, పేలుడు పదార్థాలను చేరవేయొచ్చని సమాచారం అందిందన్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి యాంటీ డ్రోన్ ఎక్సర్సయిజ్లు, టన్నెల్స్‌ను గుర్తించడం ముమ్మరం చేశామన్నారు. ఆర్మీ, సీఆర్పీఎఫ్తో కలిసి గస్తీ పెంచామని తెలిపారు. వీలైనంత ఎక్కువ మందిని సరిహద్దులో మోహరించామన్నారు. -
గణతంత్ర వేడుకలకు ముస్తాబు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: భారత గణతంత్ర వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ముస్తాబవుతోంది. రాష్ట్రస్థాయిలో జరిగే ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏర్పాట్లను ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ వివిధ శాఖల అధికారులతో కలిసి సోమవారం పరిశీలించి సమీక్ష నిర్వహించారు. ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం, కలెక్టర్ జె.నివాస్, జాయింట్ కలెక్టర్లు కె.మాధవీలత, మోహన్‌కుమార్, విజయవాడ సబ్ కలెక్టర్ జి.సూర్యసాయి ప్రవీణ్‌చంద్, విద్యుత్, సమాచార పౌర సంబంధాలు, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. పరేడ్‌కు సంబంధించిన రిహార్సల్స్‌ను మంగళవారం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి డీజీపీ గౌతంసవాంగ్, ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరవుతారు. కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి ఈ వేడుకలకు 200 మంది అతిథులను మాత్రమే ఆహ్వానిస్తున్నారు. 16 శకటాల ప్రదర్శన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించేందుకు 16 శకటాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ శకటాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల కమిషనర్ టి.విజయకుమార్‌రెడ్డి పరిశీలించి పలు సూచనలు చేశారు. జాతీయ జెండా రంగులతో స్టేడియాన్ని అందంగా తీర్చిదిద్దారు. వేడుకల్లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. గణతంత్ర వేడుకలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ టీకే రాణా తెలిపారు. -
రాజ్‌భవన్‌కు మారిన గణతంత్ర వేడుక
సాక్షి, హైదరాబాద్: కోవిడ్19 మూడో వేవ్ ఉధృతి నేపథ్యంలో గణతంత్ర దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. గతంలో పరేడ్ గ్రౌండ్స్‌లో గణతంత్ర దిన వేడుకలను ఘనంగా నిర్వహించే విషయం తెలిసిందే. కోవిడ్ నేపథ్యంలో గత రెండేళ్లుగా నాంపల్లి లోని పబ్లిక్ గార్డెన్స్‌లో ఈ వేడుకలు నిర్వహిస్తు న్నారు. కాగా ఈ గణతంత్ర దినోత్సవాన రాజ్ భవన్ ప్రాంగణంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ జెండాను ఆవిష్కరిం చనున్నారు. ఉదయం 7 గంటలకు రాజ్ భవన్లో జరిగే వేడుకల్లో ఆమె పాల్గొంటారు. అనంతరం ప్రత్యేక విమానం ద్వారా నేరుగా ఆమె పుదుచ్చేరికు చేరుకుని అక్కడ ఉదయం 9 గంటలకు జెండావిష్కరణ గావిస్తారు. రాజ్ భవన్లో జరిగే వేడుకలకు స్వల్ప సంఖ్యలో మాత్రమే అతిథులను ఆహ్వానించారు. -
బీటింగ్ రిట్రీట్‌లో గాంధీకి ఇష్టమైన పాట తొలగింపు.. ఎందుకంటే?
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా ఈ నెల 29న నిర్వహించే బీటింగ్ రిట్రీట్‌లో ఈసారి గాంధీజీకి ఇష్టమైన ‘అబిడ్ విత్ మీ’ పాటని తొలగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఈ ఏడాది దేశీ ట్యూన్లను వాయిస్తే బాగుంటుందని సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ' ఈ పాట స్థానంలో ప్రముఖ దేశభక్తి గీతం ‘ఏ మేరే వతన్ కే లోగో’ను వాయించనున్నారు. 1962 ఇండో–చైనా యుద్ధంలో వీర మరణం పొందిన సైనికులను స్మరించుకుంటూ కవి ప్రదీప్ ఈ గీతాన్ని రాశారు. దేశ భద్రత, సమగ్రత కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారిని స్మరించుకుంటూ ఈ గీతాన్ని ఆలపిస్తారు. యుద్ధాల్లో సాయం కాలం సమీపించిన అనంతరం ఇరుపక్షాల సైనికులు వెనక్కుతగ్గేందుకు గుర్తుగా ఈ బీటింగ్ రిట్రీట్ను నిర్వహిస్తారు. (చదవండి: పొలిటికల్ ప్లేయర్: ప్రత్యర్థులతో ఫుట్‌బాల్ ఆడేయగలరు) 2020లోనే తొలగించాలనుకున్నా.. ‘అబిడ్ విత్ మీ’ని 1847లో స్కాటిష్ ఆంగ్లికన్ కవి హెన్రీ ఫాన్రిస్ లైట్ రాశారు. 1950 నుంచి బీటింగ్ రిట్రీట్ వేడుకలో దీన్ని వాయిస్తున్నారు. తాజాగా దీన్ని విరమిస్తున్నట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. 2020లోనూ అబిడ్ విత్ మీ పాటను తొలగిం చాలని అనుకున్నా విమర్శలు రావడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. తాజాగా అబిడ్ విత్ మీని బీటింగ్ రిట్రీట్ వేడుక నుంచి తొలగించడంపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. వారసత్వాన్ని తుడిచేసే పనిలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని మండిపడింది. వలస పాలనను గుర్తు చేసే పాట కన్నా దేశీయులకు బాగా తెలిసిన పాటను చేర్చడం మేలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఏ మేరే వతన్ లోగోతో పాటు 26 పాటనలు భారతీయ ఆర్మీ రిపబ్లిక్ డే పెరేడ్లో వాయించనుంది. (చదవండి: తన పేరు మార్పుపై సీఎం స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు) -
రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్ మళ్లీ వచ్చింది
హైదరాబాద్: రిలయన్స్ డిజిటల్ ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకటించే ‘డిజిటల్ ఇండియా సేల్’ మళ్లీ వచ్చింది. అన్ని రకాలైన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై రిలయన్స్ డిజిటల్ భారీ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఏదైనా క్రెడిట్ కార్డు/ డెబిట్‌కార్డు లావాదేవీలపై 6%.., సిటీ బ్యాంక్ క్రిడెట్ కార్డ్స్/డెబిట్ కార్డ్స్ ఈఎంఐ లావాదేవీలపై ఏకంగా 10% తక్షణ తగ్గింపు పొందవచ్చు. అలాగే రూ.5,000కు మించిన కొనుగోళ్లపై డిజిటల్ వోచర్లు అందిస్తున్నట్లు రిలయన్స్ డిజిటల్ ప్రకటించింది. రిలయన్స్ డిజిటల్ స్టోర్లు, మై జియో స్టోర్లలో టీవీలు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఇతర గృహోపకరణాలపై ఈ ఆఫర్లు ఈ నెల 26 వరకూ అమల్లో ఉంటాయని వివరించింది. కంపెనీ వెబ్సైట్ www. reliancedigital.in ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. -
16 కవాతు బృందాలు, 25 శకటాలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 16 కవాతు బృందాలు, 17 మిలటరీ బాండ్లు, వివిధ రాష్ట్రాలు–కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 25 శకటాలు రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొంటాయని ఇండియన్ ఆర్మీ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. రిపబ్లిక్ డే పెరేడ్లో సైనిక విన్యాసాలు, తేలికపాటి హెలికాఫ్టర్ల విన్యాసాలు కూడా ఉంటాయని తెలిపింది. మన దేశ సైనిక సత్తాని చాటి చెప్పేలా పిటి–76 ట్యాంకు, ఒక సెంచురీయన్ ట్యాంకు, రెండు ఎంబిటి అర్జున్ ఎంకే–1 ట్యాంకులు, ఒక ఓటీæ–62తో పస్ ఆర్మర్డ్ పర్సనల్ కేరియల్, ఒక బీఎంపీ–1 ఇన్ఫాంటరీ ఫైటింగ్ వెహికల్‌ను ప్రదర్శించనున్నారు. ఇవే కాకుండా క్షిపణి వ్యవస్థల్ని కూడా ప్రదర్శిస్తారు. సరిహద్దు భద్రతా సిబ్బంది మహిళా బృందం చేసే బైక్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రతీ ఏడాది సంప్రదాయంగా నిర్వహించినట్టే విజయ్‌చౌక్ నుంచి నేషనల్ స్టేడియం వరకు ఈ ప్రదర్శన ఉంటుంది. -
ఢిల్లీ గడ్డపై కలంకారీ మెరుపు
శ్రీకాళహస్తి(చిత్తూరు జిల్లా): గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న ఢిల్లీలోని రాజపథ్‌లో ప్రదర్శించే కళారూపాల్లో శ్రీకాళహస్తి కలంకారీకి చోటుదక్కింది. శ్రీకాళహస్తి యువ కళాకారుడు సుధీర్ ఏపీ, తెలంగాణ తరఫున ఈ ప్రదర్శనకు ఎంపికయ్యాడు. గత నెలలో చండీగఢ్‌లో జరిగిన అమృతోత్సవాల్లో 9 మంది బృందంతో పాల్గొన్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తరఫున మరుగునపడ్డ స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను కలంకారీని మిళితం చేసి 30 మీటర్ల వస్త్రంపై చిత్రీకరించారు. శ్రీకాళహస్తి ఖ్యాతిని రెపరెపలాడించిన కళాకారుడిని ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి అభినందించారు. చదవండి: నెట్ సెంటర్లో వెబ్ వాట్సాప్ లాగౌట్ చేయని మహిళ.. చివరికి.. కలంకారీ చిత్రాలు గీస్తున్న కళాకారులు చాలా ఆనందంగా ఉంది చండీగఢ్‌లో జరిగిన అమృతోత్సవాల్లో ఏపీ, తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించాను. మరుగునపడ్డ జాతీయ నాయకుల చిత్రాలకు జీవం పోశాం. మా కలంకారీ కళను గుర్తించడం చాలా ఆనందంగా ఉంది. 2006 మహాత్మాగాంధీ మెమోరియల్ అవార్డు, 2007లో హ్యాండీక్రాఫ్ట్ విభాగంలో రాష్ట్ర అవార్డు వచ్చింది. హంపీలోని కన్నడ విశ్వవిద్యాలయంలో పెయింటింగ్‌లో బ్యాచిలర్ ఇన్ విజువల్ ఆర్ట్స్ పూర్తి చేశాను. జాతీయ అవార్డు తీసుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నాను. – సుదీర్, కలంకారీ కళాకారుడు -
రిపబ్లిక్ వేడుకల్లో తెలుగు కళారూపం
సాక్షి, హైదరాబాద్: తెలుగు కలంకారీ కళాకారుడు సుధీర్‌కు అరుదైన గుర్తింపు లభించింది. దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ వేడుకల్లో సుధీర్ కలంకారీ కళారూపానికి చోటు దక్కింది. పంజాబ్‌లోని రాజ్‌పురా చిట్కారా విశ్వవిద్యాలయంలోని కళాకుంభ్‌లో స్క్రోల్ తయారీ ప్రక్రియలో భాగంగా ఉన్న కొన్ని సంప్రదాయ రీతులను ఈ నెల 26న గణతంత్ర దినోత్సవ కవాతు సందర్భంగా న్యూఢిల్లీ రాజ్ పథ్‌లో ప్రదర్శించనున్నారు. ఇందులో భాగంగా రాజ్‌పథ్‌లోని ఓపెన్ గ్యాలరీలో నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ (ఎన్జీఎంఎ) భారీ స్క్రోల్స్‌ను ప్రదర్శించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 500 మందికి పైగా కళాకారులు (వీటి పొడవు ఒక్కొక్కటి 750 మీటర్లు) దీనిని చిత్రించారు. కళారూపాల జాబితాలో కలంకారీ కళారూపం గణతంత్ర దినోత్సవ ప్రదర్శనకు ఎంపిక చేసిన ప్రతిష్టాత్మక కళారూపాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తికి చెందిన కళాకారుడు సుధీర్ రూపొందించిన కళారూపం కూడా ఉండటం విశేషం. సుధీర్ అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్న సంప్రదాయ కలంకారీ కళాకారుడు. కలంకారీ అనేది సహజమైన రంగులను ఉపయోగించి, చింతపండు, పెన్నుతో కాటన్ లేదా సిల్క్ ఫ్యాబ్రిక్‌పై చేసే చేతి పెయింటింగ్ పురాతన శైలి. ఈ కళలో డైయింగ్, బ్లీచింగ్, హ్యాండ్ పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్, స్టార్చింగ్, క్లీనింగ్ ఇంకా మరెన్నో 23 శ్రమతో కూడిన దశలుంటాయి. కలంకారీలో గీసిన మోటిఫ్‌లు, పువ్వులు, నెమలి, పైస్లీలు మొదలు మహాభారతం, రామాయణం వంటి హిందూ ఇతిహాసాల దైవిక పాత్రల వరకు విస్తరించి ఉంటాయి. -
డల్లాస్‌లో ఘనంగా 72వ రిపబ్లిక్ వేడుకలు
డల్లాస్: టెక్సస్ - డల్లాస్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ దగ్గర భారత దేశ 72 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర భారతదేశ జెండా ను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. కోవిడ్ కారణంగా అతి సాధారణంగా జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి రావు కల్వల, కో ఛైర్మన్ శైలేష్ షా లు పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని రచించిన బి. ఆర్. అంబేద్కర్, ఇతర సభ్యులకు, మహాత్మాగాంధీతో పాటు పలువురు జాతీయ నాయకులకు ఘన నివాళులర్పించారు. -
రణరంగమైన ఢిల్లీ.. ఎర్రకోట ముట్టడి
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధాని రణరంగంగా మారింది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు గత రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులు మంగళవారం ఒక్కసారిగా రాజధానిలోకి అడుగుపెట్టారు. రోడ్లపై అడ్డుగా పెట్టిన బారికేడ్లను ధ్వంసం చేస్తూ ట్రాక్టర్లతో ఎర్రకోటను ముట్టడించారు. ఎర్రకోట ప్రాకారాలపైకి ఎక్కిన వందలాది రైతులు కోట లోపలికి దూసుకెళ్లారు. ఏటా స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రధాన మంత్రి జెండా వందనం చేసే ప్రదేశంలో, సంప్రదాయ విరుద్ధంగా జాతీయ జెండాకు బదులుగా రైతు సంఘాల జెండా, ఒక మత జెండాను ఆవిష్కరించారు. అనుమతించిన సమయానికన్నా రెండు గంటల ముందే ట్రాక్టర్ ర్యాలీని ప్రారంభించిన రైతులు అనూహ్యంగా ఢిల్లీలోకి చొచ్చుకురావడం ప్రారంభించారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసివేస్తూ.. ‘రంగ్ దే బసంతి’, జై జవాన్ జై కిసాన్’అని నినదిస్తూ రాజధాని వీధుల్లో ట్రాక్టర్లు, బైక్‌లు, గుర్రాలపై కవాతు ప్రారంభించారు. పలు చోట్ల స్థానికులు వారిపై పూలు చల్లుతూ స్వాగతం పలకడం కనిపించింది. వాహనాలపై నిల్చుని పలువురు రైతులు ‘ఐసా దేశ్ హై మేరా’, ‘సారే జహా సే అచ్చా’తదితర దేశభక్తి పాటలకు నృత్యాలు చేశారు. అయితే, ఆ కాసేపటికే పరిస్థితి విషమించింది. వెనక్కు వెళ్లాలని, అనుమతించిన మార్గంలోనే పరేడ్ నిర్వహించాలని పోలీసులు చేసిన విజ్ఞప్తిని వారు పట్టించుకోలేదు. దాంతో, రైతులు ఢిల్లీలోకి ప్రవేశించే క్రమంలో పలు ప్రాంతాల్లో రైతులు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుని, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులను చెదరగొట్టేందుకు పలు ప్రాంతాల్లో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ముఖ్యంగా ఐటీఓ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. అక్కడ బారికేడ్లను ధ్వంసం చేస్తూ పోలీసులపైకి పలువురు రైతులు రాళ్లు, కర్రలతో దూసుకెళ్లారు. అక్కడే నిలిచి ఉన్న ఒక కారును, బస్సును ట్రాక్టర్లతో ధ్వంసం చేశారు. ట్రాక్టర్ బోల్తా పడడంతో ఒక రైతు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఐటీఓ నుంచి వెనక్కు తరమడంతో ట్రాక్టర్లతో రైతులు పెద్ద ఎత్తున ఎర్ర కోటవైపు కదిలారు. ఎర్ర కోటలో సంప్రదాయంగా జెండా వందనం చేసే చోట మత జెండాను, రైతు సంఘాల జెండాను ఎగరేశారు. చింతామణి చౌక్ వద్ద ఆందోళనకారులు బారికేడ్లను, అక్కడ నిలిచి ఉన్న కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. అక్షరధామ్ ఆలయ సమీపంలో నిహంగ్(సంప్రదాయ పంజాబీ యోధులు)లు కత్తులతో పోలీసులపైకి దూసుకెళ్లారు. గణతంత్ర దినోత్సవం రోజు దేశ రాజధానిలో చోటు చేసుకున్న విధ్వంసంపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. తక్షణమే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాజధానిలో అదనంగా పారా మిలటరీ బలగాలను మోహరించాలని నిర్ణయించారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్ నిలిపేశారు. ఈ విధ్వంసంపై రైతు సంఘాల నేతలు స్పందించారు. తమ ఆందోళనలోకి సంఘ వ్యతిరేక శక్తులు చొరబడ్డాయని ‘సంయుక్త కిసాన్ మోర్చా’ప్రకటించింది. ఉదయమే మొదలైన బారికేడ్ల తొలగింపు సింఘు, టిక్రి, ఘాజీపూర్ సరిహద్దుల నుంచి రైతులు మంగళవారం ఉదయం నిర్దేశించిన సమయం కన్నా ముందే ఢిల్లీలోకి చొచ్చుకెళ్లడం ప్రారంభించారు. రైతులు తమకు నిర్దేశించిన మార్గాన్ని కాకుండా ఎర్రకోట వైపు బయలుదేరారు. సింఘు సరిహద్దు నుంచి వస్తున్న ఆందోళనకారులను ముబారకా చౌక్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కానీ ఇరుపక్షాల మధ్య గొడవ తరువాత పోలీసులు తమ బలగాలను ఉపసంహరించుకున్నారు. మరోవైపు ఘాజీపూర్ సరిహద్దు నుంచి బయలుదేరిన రైతులను పాండవ్‌నగర్ సమీపంలోని నోయిడా టర్నింగ్ వద్ద పెద్ద ఎత్తున బ్యారికేడ్లు వేసి ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆ బ్యారికేడ్లపైకి ఎక్కిన నిహాంగ్‌లు కత్తులతో పోలీసులపై దాడిచేసేందుకు ప్రయత్నించారు. నోయిడా టర్నింగ్ వద్ద ఆందోళనకారులను ఆపేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. రైతులు కూడా పోలీసులపై రాళ్లు విసిరి, అడ్డుగా ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. ఏకంగా, పాండవ్ నగర్ పోలీసు పికెట్‌పైకి ట్రాక్టర్లను ఎక్కించేందుకు ప్రయత్నించారని పోలీసులు ఆరోపించారు. ఆ తర్వాత వేలాది మంది రైతులు ఢిల్లీలోకి ప్రవేశించి అక్కడినుంచి ఎర్రకోటలోకి ప్రవేశించారు. అయితే ఎర్రకోటపై త్రివర్ణ పతాకం కాకుండా ఇతర జెండాలను ఎగురవేయడం సరికాదని పోలీసులు వారించినప్పటికీ వినకుండా, సిఖ్ మత జెండాను ఎగురవేశారు. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీదే తప్పు మరోవైపు ట్రాక్టర్ ర్యాలీలో చట్టాన్ని ఎక్కడా ఉల్లంఘించలేదని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు తెలిపారు. ట్రాక్టర్ పరేడ్ కోసం పోలీసులు నిర్దేశించిన మార్గాన్నే కవాతులో పాల్గొన్న 32 రైతు సంస్థలు అనుసరించాయని తెలిపారు. ఎర్రకోటలో జరిగిన ఘటనలకు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ కారణమని పంజాబ్‌కు చెందిన కిసాన్ బచావ్ మోర్చా నాయకుడు కృపా సింగ్ ఆరోపించారు. రైతుల ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది వ్యక్తులు ప్రయత్నించారని అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి మేజర్ సింగ్ పుణెవాల్ వ్యాఖ్యానించారు. మరోవైపు, పంజాబ్‌లోని అమృత్సర్ దగ్గర్లోని వల్లాన్ గ్రామంలో ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా జరిగిన ఒక ప్రమాదంలో ఇద్దరు మహిళలు మరణించారు. అన్నదాతల ముసుగులో తీవ్రవాదులు ఢిల్లీలో విధ్వంసంపై బీజేపీ స్పందించింది. ఇన్నాళ్లూ అన్నదాతల ముసుగులో ఉన్నవారంతా తీవ్రవాదులని తేలిందని వ్యాఖ్యానించింది. ‘అన్నదాతల పరువు తీయొద్దు. తీవ్ర వాదులను తీవ్రవాదులనే పిలవాలి’అని పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ట్వీట్ చేశారు. ఢిల్లీలో జరిగిన ఘటనలపై సిగ్గుపడుతున్నానని, దీనికి బాధ్యత తీసుకుంటున్నానని స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు, రైతు నేత యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. ‘నేడు జరిగిన ఘటనలకు సిగ్గుపడుతున్నా. వీటికి బాధ్యత తీసుకుంటున్నా’ అన్నారు. ‘రైతు ఉద్యమానికి కొందరిని దూరం పెట్టాం, వారే ఈ దుశ్చర్యలకు బాధ్యులని తెలుస్తోంది’ అని వివరించారు. ఢిల్లీలో జరిగిన విధ్వంసాన్ని వామపక్షాలు ఖండించాయి. పరిస్థితి రావడానికి మోదీ ప్రభుత్వమే కారణమని విమర్శించాయి. ట్రాక్టర్ బోల్తా.. రైతు మృతి ఐటీఓ మీదుగా రైతుల బృందం ఇండియా గేట్ వైపు దూసుకెళ్ళేందుకు ప్రయత్నించింది. దాంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచి్చంది. ఆందోళనకారుల్లో కొం దరు పోలీసులపై రాళ్ళు రువ్వారు. ట్రాక్టర్లతో పోలీసులపైకి దూసుకెళ్ళేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో, అక్కడే ఒక ట్రాక్టర్ బోల్తాపడి ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక రైతు మృతి చెందాడు. అది ‘నిషాన్ సాహిబ్’ ఎర్ర కోటపై రైతు ఆందోళన కారులు ఎగరేసిన కాషాయ జెండా సాధారణంగా అన్ని గురుద్వారాల్లో కనిపించే ‘నిషాన్ సాహిబ్’అనే మత పతాకం. త్రికోణాకారంలో ఉండే ఈ జెండాను అత్యంత పవిత్రమైనదిగా సిక్కులు భావిస్తారు. దీనిపై రెండు వైపులా పదునున్న ఖడ్గం(ఖండా), చక్రం, రెండు కృపాణాలు ముద్రించి ఉంటాయి. ఎర్రకోటపై ఒక రైతు సంఘానికి చెందిన మరో జెండాను కూడా ఎగరేశారు. 86 మంది పోలీసులకు గాయాలు రైతులతో ఘర్షణల్లో 86 మంది పోలీసులు గాయపడ్డారని ఢిల్లీ పోలీసు విభాగం ప్రకటించింది. ఢిల్లీ పోలీసులు పూర్తి సంయమనంతో వ్యవహరించారని పేర్కొంది. ఘాజీపూర్ సరిహద్దు వద్ద గాయపడినవారిలో శిక్షణలో ఉన్న ఒక ఐపీఎస్ అధికారి ఉన్నారు. అక్కడే అదనపు డీసీపీ మంజీత్‌ను ట్రాక్టర్‌తో ఢీ కొట్టేందుకు ప్రయత్నించగా, ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఎర్రకోట వద్ద విధుల్లో ఉన్న పోలీసుల్లో దాదాపు సగంమంది రైతుల దాడిలో గాయపడ్డారు. రైతులు నెట్టివేయడంతో వారిలో పలువురు ఎత్తైన గోడపై నుంచి కిందపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఘర్షణలకు సంబంధించి నాలుగు కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ర్యాలీలో ఎప్పుడేం జరిగిందంటే... ఉదయం ► 7.009.30: బారికేడ్లను అడ్డుతొలగించుకుంటూ సింఘూ, టిక్రి, ఘాజీపూర్ సరిహద్దుల నుంచి వేల సంఖ్యలో ట్రాక్టర్లు, మోటార్ సైకిళ్లు, కార్లతో ఢిల్లీలోకి రైతుల ప్రవేశం ► 10.00: సంజయ్ గాంధీ ట్రాన్స్పోర్ట్ నగర్ వద్ద పోలీసులతో గొడవపడిన రైతులు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు ► 10.30: అక్షరధామ్ ఇంటర్సెక్షన్ వద్ద పోలీసులు, రైతులగొడవ. రోడ్లపై ఉన్న వాహనాలను ధ్వంసం చేసిన రైతులు ► 11.00: టియర్ గ్యాస్, లాఠీచార్జ్ చేసిన పోలీసులు, కత్తులతో దాడులు చేసేందుకు రైతుల ప్రయత్నం. సరై కాలే ఖాన్ వైపు రైతుల కదలిక మధ్యాహ్నం ► 12.00: ముకర్బా చౌక్ వద్ద పోలీసులతో రైతుల ఘర్షణ. ఐటీఓ సెక్షన్ చేరుకొని వాహనాలను, బస్సులను ధ్వంసం చేసిన రైతులు. పోలీసులపై దాడులు. పోలీసుల ప్రతిఘటన. ట్రాక్టర్లు బైకులతో పోలీసులను వెంబడించిన రైతులు. అడ్డుగా ఉన్న డీటీసీ బస్సులను ధ్వంసం చేస్తూ ఎర్రకోట వైపు పయనం. ఎర్రకోటపై రైతుసంఘాల జెండా, సిక్కు మత జెండాను ఎగరేశారు. ► 1.00: ట్రాక్టర్ తిరగబడి నవనీత్ సింగ్ అనే రైతు మృతి. అతన్ని కాల్చేశారని రైతుల ఆరోపణ. ప్రతియేటా ప్రధాని దేశ జెండాను ఎగురవేసే చోటు నుంచి సిక్కు జెండాను తీసేసేందుకు సైనికుల ప్రయత్నం. ► 2.30: ఐటీఓ ఇంటర్సెక్షన్, ఎర్రకోట వద్ద పోలీసులతో కొనసాగిన రైతుల ఘర్షణలు, రాళ్లదాడి. ► 3:00 తర్వాత: ఎర్రకోట నుంచి రైతులను పంపించివేసిన పోలీసులు. ఈ క్రమంలో స్వల్ప లాఠీచార్జ్ ► అర్ధరాత్రి వరకూ సింఘు, ఘాజీపూర్, టిక్రి, ముకర్బా చౌక్ పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత -
న్యాయవ్యవస్థ విమర్శలు ఎదుర్కొంటోంది
సాక్షి, అమరావతి: సమర్థవంతమైన న్యాయం అందించే విషయంలో న్యాయవ్యవస్థ ఇటీవల కాలంలో విమర్శలు ఎదుర్కొంటోందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి అన్నారు. ఏపీ హైకోర్టులో మంగళవారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జస్టిస్ గోస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పోలీసు గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. అంకిత భావంతో పనిచేసినప్పుడే ఇలాంటి విమర్శలను ఆధిగమించడం సాధ్యమవుతుందని, ప్రజల విశ్వాసాన్ని చూరగొని విమర్శలకు సమాధానం ఇద్దామని న్యాయవాదులకు పిలుపునిచ్చారు. ఈ దిశగా మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా, విధి నిర్వహణలో రాజీ లేకుండా పనిచేద్దామన్నారు. న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల కొరత, సిబ్బంది లేమి, పెండింగ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడం వంటివి న్యాయవ్యవస్థకు ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రపంచంలో ఏ న్యాయవ్యవస్థపై లేనంత భారం మనదేశ న్యాయవ్యవస్థపై ఉందన్నారు. ఏపీ హైకోర్టు మంచి సంప్రదాయాలను పాటిస్తోందని, ఇప్పుడు జరుగుతున్న వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా కేసుల విచారణ తనకు ఎంతో గొప్ప అనుభూతిని ఇస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏజీ ఎస్.శ్రీరామ్, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యదర్శి జేయూఎంవీ ప్రసాద్ ప్రసంగించారు. లోకాయుక్తలో గణతంత్ర వేడుకలు లోకాయుక్త కార్యాలయ ప్రాంగణంలో రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి జెండా ఎగుర వేసి∙పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి, రిజి్రస్టార్ విజయలక్ష్మి, లోకాయుక్త డైరెక్టర్ (ఇన్వెస్టిగేషన్) కె.నర్సింహారెడ్డి, డైరెక్టర్ (లీగల్) టి.వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
దేశ రక్షణలో రాజీ లేదు
సాక్షి, విశాఖపట్నం: తూర్పు నౌకాదళంలో గణతంత్ర వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. తూర్పు నౌకాదళం నేవల్ బేస్ పరేడ్ గ్రౌండ్లో ఈఎన్సీ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆర్మ్డ్ గార్డ్స్, నౌకాదళ సిబ్బంది, డిఫెన్స్ సెక్యూరిటీ సిబ్బంది, సబ్‌మెరైన్, యుద్ధనౌకల సిబ్బంది, సీ కేడెట్ కార్ప్స్ మార్చ్ పాస్ట్, రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ అడ్మిరల్ జైన్ మాట్లాడుతూ విద్రోహుల్ని ఎదుర్కొనేందుకు నిరంతరం కృషిచేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. దేశ తీర భద్రత విషయంలో అవసరమైన నౌకలు, సబ్మెరైన్లు, యుద్ధవిమానాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. భారత సముద్ర భాగంలో భద్రత పెంచేందుకు అత్యాధునిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. రక్షణ విషయంలో నౌకాదళం రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కోవిడ్–19 సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన వారిని అభినందించారు. ఈ వేడుకల్లో అధికారులు, సిబ్బంది, కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
అలరించిన ఏకశిల సౌందర్యం
సాక్షి, న్యూఢిల్లీ: విజయనగర సామ్రాజ్య తోరణాలు, భిన్న కళాకృతులతో కూడినస్తంభాలు, కళాకారుల ఏకవీర నాట్యం, అతిపెద్ద ఏకశిల నందితో కూడిన ఆంధ్రప్రదేశ్ శకట సౌందర్యం గణతంత్ర వేడుకల ఆహూతులను విశేషంగా ఆకర్షించింది. న్యూడిల్లీలో మంగళవారం గణతంత్ర వేడుకల్లో నిర్వహించిన పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్ శకటం ప్రదర్శించారు. భారతీయ శిల్పకళా వైభవానికి మచ్చుతునకగా నిలిచిన లేపాక్షి కట్టడం స్ఫూర్తిగా రూపుదిద్దిన శకటంలో 12 అడుగుల పొడవు, 7 అడుగుల ఎత్తుతో ఉన్న నంది ముందుభాగంలో ప్రధాన ఆకర్షణగా నిలించింది. నంది వెనుక ఆలయ ముఖ మండపం, అర్ధ మండపం నమూనాలు ఏర్పాటు చేశారు. లేపాక్షి శిల్పకళలో ప్రతి స్తంభానికి ఉండే ఓ విశిష్ట శైలిని కళ్లకు కట్టినట్లుగా భిన్న కళాకృతులతో ఏర్పాటు చేశారు. శివలింగంపై ఏకశిల శోభితమైన ఏడుతలల పామును వెనక భాగంలో ప్రదర్శించారు. ఇరువైపులా వినాయకుడు, గర్భగృహానికి ముందుగా వీరభద్రుడి కుడ్యచిత్రం శకటానికి మరింత అందం తీసుకొచ్చింది. శకటంపైన, ఇరువైపులా నడుస్తూ.. వీరభద్రుడిని శ్లాఘిస్తూ సంప్రదాయ వీరనాట్యం ప్రదర్శించారు. 15వ శతాబ్దం నాటి శిల్పకళా సౌందర్యాన్ని కనులారా వీక్షించిన ఆహూతులు చప్పట్లతో అభినందనలు తెలిపారు. శకటం రాజ్‌పథ్‌లో సాగుతున్న సమయంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. ఏపీ సమాచారశాఖ సంయుక్త సంచాలకుడు కిరణ్‌కుమార్ శకట ప్రదర్శనను పర్యవేక్షించారు. మరోవైపు ఏపీ భవన్లో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అభయ్‌త్రిపాఠి జాతీయ జెండాను ఎగురవేశారు. రెసిడెంట్ కమిషనర్ భావనాసక్సేనా గణతంత్ర దినోత్సవ విశిష్టతను వివరించారు. -
అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు
సాక్షి, అమరావతి/ఇబ్రహీంపట్నం: రాష్ట్రం నలుమూలల మంగళవారం గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాతీయ పతాకాల్ని ఆవిష్కరించారు. శాసనసభ ప్రాంగణంలో స్పీకర్ తమ్మినేని సీతారాం జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు. సామాజిక న్యాయం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా సీఎం వైఎస్ జగన్, ప్రధాని మోదీ విశేష కృషి చేస్తున్నారని చెప్పారు. అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు, సహాయ కార్యదర్శులు, ఉద్యోగులు పాల్గొన్నారు. యువత దేశాభివృద్ధికి పునరంకితం కావాలి శాసనమండలి ప్రాంగణంలో మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ జాతీయ జెండాను ఎగురవేశారు. సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధులు అందించిన స్ఫూర్తితో యువత దేశాభివృద్ధికి పునరంకితం కావాలన్నారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న శాసనమండలి చైర్మన్ షరీఫ్ అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక ప్రాధాన్యత సచివాలయం మొదటి బ్లాకు వద్ద రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ పథకం ఫలాలు సమాజంలోని ప్రతి వ్యక్తికి సక్రమంగా అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వివిధ పథకాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి సక్రమంగా అమలు చేసేందుకు ప్రతి ప్రభుత్వ అధికారి, ఉద్యోగి మరింత కష్టించి పనిచేయాలని కోరారు. సచివాలయ చీఫ్ సెక్యూరిటీ అధికారి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో పతాకావిష్కరణ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ జాతీయ జెండాను ఎగురవేశారు. జాతిపిత మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. సీఎం అదనపు కార్యదర్శులు కె.ధనుంజయరెడ్డి, జె.మురళీ, సీఎం వోఎస్డీ పి.కృష్ణమోహన్‌రెడ్డి, చీఫ్ సెక్యూరిటీ అధికారులు పరమేశ్వర్‌రెడ్డి, అమర్లపూడి జోషి పాల్గొన్నారు. విద్యుత్ రంగం బలోపేతం విజయవాడ విద్యుత్ సౌధలో రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. ఏటా 50 వేల వ్యవసాయ సర్వీసులను కొత్తగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయంలో.. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలోగల రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం వద్ద పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ దేశం కోసం త్యాగాలు చేసిన వారి సేవలను కొనియాడారు. డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ హనుమంతరావు, జాయింట్ డైరెక్టర్ ఎస్సీఆర్ పి.ప్రతాప్‌రెడ్డి, మోడల్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ మధుసూదనరావు, డిప్యూటీ డైరెక్టర్ సుల్తానా పాల్గొన్నారు. పీసీబీ కార్యాలయంలో.. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కార్యాలయంలో సభ్య కార్యదర్శి వివేక్‌యాదవ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యుత్తమ సేవలే లక్ష్యంగా కొన్ని నియామకాలు చేపట్టనున్నామని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో పీసీబీ మూడేళ్లు వరుసగా మొదటి స్థానంలో నిలవడానికి సిబ్బంది ఉత్తమ పనితీరే కారణమని ప్రశంసించారు. చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరు శివప్రసాద్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజరు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా గణతంత్ర వేడుకలు
సాక్షి, అమరావతి/అమరావతి బ్యూరో: మువ్వన్నెల రెపరెపలు.. సాయుధ దళాల కవాతులు.. భారత్‌మాతాకీ జై.. అనే నినాదాలతో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం మురిసింది. 72వ భారత గణతంత్ర దినోత్సవాన్ని మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు వేడుకలకు హాజరయ్యారు. గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పుష్పాలంకృతమైన ప్రత్యేక వాహనంలో పరేడ్‌ను పరిశీలించారు. స్టేడియం గ్యాలరీలో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రత్యేక ఆహ్వానితులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. పోలీసుల కవాతు, శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఏపీ స్పెషల్ బెటాలియన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు శంకబ్రత బాగ్చీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీసు పరేడ్‌కు రంపచోడవరం ఏఎస్పీ గరికపాటి బిందు మాధవ్ నేతృత్వం వహించారు. కవాతుల కనువిందు గవర్నర్ జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం సాయుధ పోలీసులు చేసిన కవాతు ఆకట్టుకుంది. ఇండియన్ ఆర్మీ, ఏపీఎస్పీ 2వ బెటాలియన్ (కర్నూలు), 3వ బెటాలియన్ (కాకినాడ), 9వ బెటాలియన్(వెంకటగిరి), 14వ బెటాలియన్ (అనంతపురం), 16వ బెటాలియన్ (విశాఖ) బృందాలతోపాటు 2, 3, 6, 9, 11, 14 బెటాలియన్లకు చెందిన బ్రాస్ బ్యాండ్ బృందాలు, మంగళగిరి పోలీస్ పైప్ బ్యాండ్, హైదరాబాద్ ఏపీ యూనిట్ కవాతులు కనువిందు చేశాయి. కవాతు ప్రదర్శనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఇండియన్ ఆర్మీ, ఏపీఎస్పీ 16వ బెటాలియన్(విశాఖ), సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థుల స్కాట్లాండ్ పైప్‌లైన్ బ్యాండ్ బృందాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను గవర్నర్ హరిచందన్ ప్రదానం చేశారు. ప్రభుత్వ శాఖల శకటాలు.. ప్రగతి రథ చక్రాలు సీఎం జగన్ నేతృత్వంలో అమలు జరుగుతున్న ప్రజాహిత కార్యక్రమాలను వివరిస్తూ ప్రదర్శించిన ప్రభుత్వ శకటాలు ప్రగతి రథ చక్రాలుగా కదిలాయి. నవరత్నాల వెలుగులను రాష్ట్రం నలుదిశలా ప్రసరిస్తున్న వైనాన్ని వివరిస్తూ శకటాలు ముందుకు సాగాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించేలా తీర్చిదిద్దిన 14 శకటాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ప్రదర్శనలో వ్యవసాయ (విత్తనం నుంచి అమ్మకం వరకు రైతు భరోసా కేంద్రాలు), పశు సంవర్థక (జగనన్న పాల వెల్లువ, జీవక్రాంతి పథకం), డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ (ప్రజలకు నాణ్యమైన వైద్యం, విలేజ్ క్లినిక్‌లు), వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం (కోవిడ్ వ్యాక్సిన్, పరీక్షలు, జాగ్రత్తలపై శకటం), గ్రామ–వార్డు సచివాలయాలు, సమగ్ర శిక్షా–పాఠశాల విద్యాశాఖ (నాడు–నేడు, మన బడి), మహిళాభివృద్ధి–శిశు సంక్షేమ (వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూల్ విద్యా విధానం, అంగన్వాడీ కేంద్రాలు, న్యూట్రీ గార్డెన్స్), గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)(కరోనా కష్టకాలంలో ప్రజలకు వైఎస్సార్ పింఛన్ కానుక, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ బీమా, వైఎస్సార్ సున్నా వడ్డీ), గృహ నిర్మాణం (నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు), రెవెన్యూ (సర్వే సెటిల్మెంట్–మీ భూమి మా హామీ), పరిశ్రమలు (పారిశ్రామికాంధ్రప్రదేశ్), అటవీ (జీవ వైవిధ్య పరిరక్షణ), పర్యాటక (వేంకటేశ్వరస్వామి ఆనంద గోపురం, దశావతారాలు, ఏనుగు అంబారీ, కొండపల్లి కొయ్యబొమ్మ, కూచిపూడి నృత్యం)లు ఆకట్టుకున్నాయి. గృహ నిర్మాణ, వ్యవసాయ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ శకటాలు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించాయి. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సీఎం వైఎస్ జగన్ ఆద్యంతం చిరునవ్వుతో అభివాదం చేస్తూ.. ఆప్యాయంగా పలకరిస్తూ సీఎం జగన్ గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గవర్నర్‌కు స్వాగతం పలికిన సీఎం.. సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ సవాంగ్, పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ప్రజా ప్రతినిధులను పేరు పేరునా పలకరించారు. కార్యక్రమంలో సీఎం జగన్ పేరు ప్రస్తావనకు రాగానే సభికుల నుంచి పెద్ద ఎత్తున హర్షధ్వానాలు విన్పించాయి. ఈ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, మండలి చైర్మన్ షరీఫ్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, కన్నబాబు, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, సమాచార హక్కు చట్టం కమిషనర్ పి.రమేష్‌కుమార్, మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎంపీ బాలశౌరి తదితరులు పాల్గొన్నారు. -
మత వివాదాల కుట్రలను అడ్డుకున్నాం
విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలకు, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా ప్రతి పథకానికి లబ్ధిదారులను పారదర్శకంగా, వంద శాతం సంతృప్త స్థాయిలో ఎంపిక చేస్తోంది. రాష్ట్రాభివృద్ధికి స్పష్టమైన అజెండా కలిగి ఉంది. – గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సాక్షి, అమరావతి: ‘భిన్నత్వంలో ఏకత్వం అనేది మన సిద్ధాంతం. అయితే ప్రజల మధ్య మతపరమైన వివాదాల సృష్టికి కొందరు కుట్రలు చేస్తున్నారు. ఇది చాలా బాధ కలిగించింది. ఇలాంటి చర్యలను ప్రభుత్వం సమర్థవంతంగా అడ్డుకుంది’ అని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. సాహసోపేతమైన నాయకత్వం, నవతరం, యువతరంతో కూడిన రాష్ట్ర మంత్రి మండలి ఏపీని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో పని చేస్తోందని చెప్పారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం 72వ గణతంత్ర దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. కోవిడ్ విపత్కర సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రశంసనీయమన్నారు. కోవిడ్ టెస్టుల నిర్వహణలో దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందిందన్నారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకుందని, సంక్షేమ కార్యక్రమాలన్నీ ఎలాంటి ఆటంకం లేకుండా అమలవుతున్నాయని చెప్పారు. గవర్నర్ ఇంకా ఏమన్నారంటే.. గణతంత్ర వేడుకలకు వస్తున్న గవర్నర్ హరిచందన్. చిత్రంలో సీఎం జగన్, ఉన్నతాధికారులు ప్రాంతాల మధ్య సమతుల్య అభివృద్ధి ► ప్రాంతీయ సమానాభివృద్ధి కోసం పరిపాలన వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. విశాఖను పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు నిర్ణయంతో ప్రాంతాల మధ్య సమతుల్య అభివృద్ధి ఉండేలా చూస్తాం. ► రాష్ట్రం పెట్టుబడిదారులకు, పర్యాటకులకు అనుకూలమైన గమ్యస్థానంగా ఉండబోతోంది. 2020–23 కొత్త పారిశ్రామిక విధానం ద్వారా పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పనపై దృష్టి సారించింది. రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ► విజయవాడ నడిబొడ్డున భారత రాజ్యాంగకర్త బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం, స్మారక ఉద్యానవనం ఏర్పాటు కాబోంది. రైతాంగానికి అన్ని విధాలా భరోసా ► ప్రభుత్వం ఇప్పటి వరకు వివిధ సంక్షేమ పథకాల కింద రూ.79,715.53 కోట్లను నేరుగా లబ్ధిదారులకు అందించింది. రైతు భరోసా కింద రెండు విడతల్లో 51.59 లక్షల మంది రైతులకు రూ.13,101 కోట్ల లబ్ధి. ► రాష్ట్రంలో 10,641 రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల సరఫరా నుంచి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాల వరకు వసతుల కల్పన. ► రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. రూ.5,460 కోట్లతో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ద్వారా 14.96 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల కింద 14.26 లక్షల మంది రైతులకు రూ.289 కోట్ల లబ్ధి. గత ప్రభుత్వ బకాయిలు రూ.904 కోట్ల చెల్లింపు. ► ఉచిత విద్యుత్ సబ్సిడీకి రూ.17,430 కోట్లు వెచ్చింపు. ఉచిత విద్యుత్ కోసం రూ.1,700 కోట్లతో కొత్త ఫీడర్ల ఏర్పాటు. రూ.1,968 కోట్లతో ఉచిత పంటల బీమా. వైఎస్సార్ జలకళ పథకం ద్వారా రూ.4 వేల కోట్లతో బోర్ల తవ్వకానికి శ్రీకారం. జగనన్న జీవక్రాంతి పథకం కింద రూ.18.69 కోట్లతో 2,49,151 గొర్రెలు, మేకల పంపిణీ. వైఎస్సార్ జగనన్న భూ హక్కు ద్వారా భూముల సమగ్ర సర్వే కార్యక్రమం ప్రారంభం. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు ► జగనన్న అమ్మ ఒడి కింద 44.49 లక్షల తల్లుల ఖాతాల్లో రూ.13,121 కోట్లు జమ. జగనన్న విద్యా కానుక కింద రూ.648 కోట్లతో 42,34,322 మంది విద్యార్థులకు స్కూల్ కిట్లు. జగనన్న గోరుముద్ద కింద రూ.1,456 కోట్లతో 36,88,618 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, జగనన్న విద్యా దీవెన కింద ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.4,101 కోట్లు చెల్లింపు. జగనన్న వసతి దీవెన కింద హాస్టల్, భోజన ఖర్చులకు ఏటా రూ.20 వేల వరకు సాయం. ఇందుకు రూ.1,221 కోట్లు చెల్లింపు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రారంభం. ► మనబడి నాడు–నేడు కింద 45,484 స్కూళ్లు, 471 జూనియర్ కళాశాలలు, 171 డిగ్రీ కాలేజీలు, 3,287 çహాస్టళ్లు, 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో మూడు దశల్లో రూ.16,500 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన. 55,607 అంగన్వాడీ కేంద్రాలు వైఎస్సార్ ప్రీప్రైమరీ స్కూళ్లుగా మార్పు. సంక్షేమం కొత్తపుంతలు.. ► రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి ప్రభుత్వం రేషన్ డోర్ డెలివరీని ప్రారంభించనుంది. ఇందుకోసం రూ.830 కోట్ల వ్యయంతో ప్రభుత్వం 9,260 మొబైల్ వాహనాలను ప్రారంభించింది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలనే సంకల్పంతో ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా గత డిసెంబర్ 25న 31 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీని చేపట్టింది. రెండు దశల్లో 17 వేల వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 28.30 లక్షల ఇళ్లు వస్తాయి. మొదటి విడతగా రూ.28,084 కోట్లతో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలైంది. ► వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి 95 శాతం మంది ప్రజలు. ఇప్పటిదాకా రూ.3 వేల కోట్లతో 9.89 లక్షల మందికి ప్రయోజనం. ఈ పథకం పరిధిలోకి వచ్చే వ్యాధుల సంఖ్య 1,059 నుంచి 2,436కు పెంపు. వైఎస్సార్ కంటి వెలుగు కింద రూ. 53.85 కోట్లతో 67.69 లక్షల మందికి కంటి పరీక్షలు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.2 వేల కోట్లతో 10,500 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల నిర్మాణానికి శ్రీకారం. 108, 104 సేవల కోసం 1,088 అంబులెన్స్‌ల కొనుగోలు. ► వైఎస్సార్ ఆసరా పథకం కింద మొదటి దశలో 8.71 లక్షల డ్వాక్రా గ్రూపులకు చెందిన 87 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.6,792 కోట్లు జమ. వైఎస్సార్ చేయూత కింద 45 నుంచి 60 ఏళ్ల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 23 లక్షల మంది మహిళలకు నాలుగేళ్లలో రూ.75 వేల సాయంలో భాగంగా మొదటి విడత డబ్బు జమ. ► వైఎస్సార్ పెన్షన్ కానుక కింద ఇప్పటి వరకు రూ.26,553 కోట్లు చెల్లింపు. 62 లక్షల మందికి ప్రయోజనం. మహిళలకు నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్ల కల్పన. వైఎస్సార్ కాపు నేస్తం పథకం కింద కాపు మహిళలకు ఏటా రూ.15 వేల చొప్పున ఇప్పటి వరకు రూ. 4,092 కోట్లు చెల్లింపు. -
రాజ్యాంగంతోనే సంపూర్ణ స్వరాజ్యం: ఏపీ హైకోర్టు సీజే
సాక్షి, అమరావతి: రాజ్యాంగం రూపకల్పన తోనే భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యం లభించిందని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి అన్నారు. అమరావతిలోని హైకోర్టులో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. హైకోర్టు భద్రతా సిబ్బంది నుంచి చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి గౌరవ వందనం స్వీకరించారు. హైకోర్టు ప్రాంగణంలో భారీ జాతీయ జెండాను చీఫ్ జస్టిస్ ఆవిష్కరించారు. ఎందరో మేధావులు కృషి ఫలితంగా సమున్నతమైన రాజ్యాంగం ఆవిష్కృతమైందన్నారు. చదవండి: అధికార వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఏపీ గవర్నర్ 1947 ఆగస్ట్ 15వ తేదీన భారతదేశానికి స్వతంత్రం వచ్చినా.. రాజ్యాంగం రూపకల్పనతోనే సంపూర్ణ స్వరాజ్యం లభించిందన్నారు. ఎన్నో వ్యవస్థలు మాదిరిగానే న్యాయ వ్యవస్థలోనూ ఎన్నో చాలెంజ్‌లు ఉన్నాయన్నారు. ఇప్పటికీ కొన్ని లోపాలు ఉన్నా.. అందరి సహకారంతో వాటిని అధిగమిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. ప్రపంచంలోనే భారత న్యాయవ్యవస్థ ఉన్నతమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆచారాలు, సాంప్రదాయాలు తననెంతో ఆకట్టుకున్నాయని సీజే తెలిపారు. చదవండి:రాజ్యాంగం ఇప్పటికీ మార్గనిర్దేశం చేస్తూ ఉంది: సీఎం జగన్ -
చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో జెండావిష్కరించిన మెగా ఫ్యామిలీ..
-
రాష్ట్రానికి రెండు శౌర్య పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు కేంద్ర ప్రభుత్వం మెడల్స్ ప్రకటించింది. ఏపీకి రెండు పోలీస్ శౌర్య పతకాలు, ఒక రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకంతో పాటు 15 పోలీసు ప్రతిభా పతకాలు లభించాయి. ఏఏసీ ర్యాంకు అధికారి గొంగటి గిరీష్ కుమార్, జేసీ ర్యాంకు అధికారి కూడుపూడి హరికృష్ణకు పోలీసు శౌర్య పతకాలు వచ్చాయి. విజయవాడ ఏసీబీ అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ మాథుర్తి శ్రీనివాసరావుకు రాష్ట్రపతి పోలీస్ విశిష్ట సేవా పతకం దక్కింది. 15 పోలీస్ మెడల్స్.. పీహెచ్డీ రామకృష్ణ(స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డైరెక్టర్, విజయవాడ), మల్లూర్ కుప్పుస్వామి రాధాకృష్ణ(అడిషనల్ ఎస్పీ, కర్నూలు), రావెల విజయపాల్(అడిషనల్ ఎస్పీ, సీఐడీ), గంటా వెంకటరమణమూర్తి (సబ్ డివిజనల్ పోలీస్ అధికారి, నందిగామ), సదాశివుని వరదరాజు(విజిలెన్స్ ఎస్పీ, ఏలూరు), ఆలపాటి వెంకటేశ్వరరావు (అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్, ఏపీఎస్పీ 6వ బెటాలియన్, మంగళగిరి), నంబూరు నారాయణ మూర్తి (జేఆర్ పురం ఔట్‌పోస్ట్ ఎస్ఐ, శ్రీకాకుళం), జొన్నల విశ్వనాథం(ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ, విజయవాడ), సోమ శ్రీనివాసులు (ఏసీబీ ఎస్ఐ, తిరుపతి), యెండ్లూరు శ్యామ సుందరం(ఇన్స్పెక్టర్, పోలీస్ ట్రైనింగ్ కాలేజ్, కళ్యాణి డ్యామ్), జమ్మలమడుగు నూర్ అహ్మద్ బాషా (ఏఎస్ఐ, వన్‌టౌన్, మదనపల్లి), ఎర్రబోలు నాగేశ్వరరెడ్డి (ఆర్మ్డ్ రిజర్వ్డ్ హెడ్ కానిస్టేబుల్, హోంగార్డ్ యూనిట్, విజయవాడ), మడియ జనార్ధన్ (హెడ్ కానిస్టేబుల్, ఆక్టోపస్), దాచూరు సురేష్‌బాబు (ఏఎస్ఐ, స్పెషల్ బ్రాంచ్, నెల్లూరు), ఎన్ని శశిభూషణ్‌రావు (రిజర్వ్ ఎస్ఐ, ఏపీఎస్పీ 5వ బెటాలియన్, విజయనగరం)లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పోలీస్ ప్రతిభా పతకాలకు ఎంపిక చేసింది. అలాగే ఢిల్లీ పోలీసు విభాగంలో ట్రాఫిక్ డీసీపీగా పనిచేస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన అధికారి డాక్టర్ జి.రాంగోపాల్‌నాయక్‌కు కూడా పోలీస్ శౌర్య పతకం వరించింది. ఇతర బలగాల్లో పనిచేస్తున్న అధికారులకు.. రాష్ట్రానికి సంబంధించి ఇతర బలగాల్లో పనిచేస్తున్న పలువురు అధికారులకు కూడా పురస్కారాలు లభించాయి. సతీష్ కుమార్(కమాండెంట్, సీఆర్పీఎఫ్ 42వ బెటాలియన్, రాజమండ్రి), ఆదిగర్ల లక్ష్మణమూర్తి(అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, వైజాగ్ స్టీల్ ప్రాజెక్ట్ యూనిట్, సీఐఎస్ఎఫ్), లవ్‌కుమార్ (సెకండ్ ఇన్ కమాండ్, 10వ బెటాలియన్ గుంటూరు, ఎన్డీఆర్ఎఫ్)లకు పోలీస్ ప్రతిభా పురస్కారాలు వచ్చాయి. అలాగే జైళ్ల శాఖలో పనిచేస్తున్న ఎం.అరుణ్‌కుమార్ (చీఫ్ వార్డర్, ఏపీ), అరిగెల రత్నరాజు (హెడ్ వార్డర్, ఏపీ)లకు ఖైదీల ప్రవర్తన దిద్దుబాటుకు గానూ అత్యుత్తమ సేవా పురస్కారాలు లభించాయి. ఉన్నతాధికారుల ప్రోత్సాహంతోనే.. ప్రస్తుతం ఏసీబీలో ఏఆర్ ఎస్సైగా పనిచేస్తున్న ఎం.శ్రీనివాసరావు ఇప్పటివరకు 50 నగదు అవార్డులు, 11 పురస్కారాలు, 49 కమాండేషన్స్, 9 అభినందన పత్రాలు అందుకున్నారు. 2014 రిపబ్లిక్ డే సందర్భంలో పోలీస్ మెడల్ అందుకున్నారు. తాజాగా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యారు. ‘రాష్ట్రపతి పోలీస్ విశిష్ట సేవా పతకం నా బాధ్యతను మరింత పెంచింది. దీనికి నన్ను ఎంపిక చేసిన కేంద్రానికి, ప్రోత్సహించిన సీఎం వైఎస్ జగన్, డీజీపీ సవాంగ్, ఏసీబీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు తదితరులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా’ అని శ్రీనివాసరావు తన సంతోషం వ్యక్తం చేశారు. -
గణతంత్ర వేడుకల రిహార్సల్స్
సాక్షి, అమరావతి: విజయవాడ మున్సిపల్ స్టేడియం 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైంది. మువ్వన్నెల కాంతులతో మున్సిపల్ స్టేడియం మెరిసిపోతోంది. మంగళవారం రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించే పోలీసు కవాతుకు సంబంధించిన ఫుల్ డ్రెస్ రిహార్సల్స్‌ను సోమవారం డీజీపీ డి.గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ కార్యదర్శి శశిభూషణ్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు పరిశీలించారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తులు, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, మంత్రులు తదితర ప్రముఖులు, ప్రజలు పాల్గొనే ఈ కార్యక్రమ ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే దానిపై డీజీపీ సవాంగ్, ప్రభుత్వ కార్యదర్శి శశిభూషణ్ పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రముఖుల భద్రత, కోవిడ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సమీక్షించారు. వేడుకల ప్రారంభం నుంచి ముగింపు వరకు నిర్ణయించిన కాల వ్యవధికి అనుగుణంగానే రిహార్సల్స్ చేశారు. 9 గంటలకు ఆరంభం మున్సిపల్ స్టేడియంలో మంగళవారం ఉదయం 9 గంటలకు గణతంత్ర వేడుకలు ప్రారంభమవుతాయి. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పాల్గొని తొలుత పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అనంతరం పోలీసు కవాతు, రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిని వివరించేలా పలు శాఖల శకటాల ప్రదర్శన ఉంటుంది. ఉత్తమ శకటాలకు అవార్డులు అందిస్తారు. అనంతరం ఉదయం 10.07 గంటలకు జాతీయ గీతం ఆలాపనతో వేడుకలను ముగిస్తారు. ఉత్సవాలకు రూ.53.50 లక్షలు రిపబ్లిక్ డే ఉత్సవాల నిర్వహణకు రూ.53.50 లక్షలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయం, అసెంబ్లీ, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమాలకు ఈ నిధుల్ని ఖర్చు చేసేందుకు కేటాయిస్తూ పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. ఈ మేరకు ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు జీవో జారీ చేశారు. -
నేడే కిసాన్ గణతంత్ర పరేడ్
న్యూఢిల్లీ: ఒకవైపు గణతంత్ర దినోత్సవాలు, మరోవైపు మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కిసాన్ గణతంత్ర పరేడ్.. దేశ రాజధాని ఢిల్లీలో ఒకేరోజు రెండు ముఖ్యమైన కార్యక్రమాలు. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు జరిగే రాజ్‌పథ్‌లో, రైతులు ట్రాక్టర్ పరేడ్ తలపెట్టిన మార్గాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజ్‌పథ్‌లో అధికారిక గణతంత్ర వేడుకలు ముగిసిన తర్వాతే ట్రాక్టర్ పరేడ్ ప్రారంభిస్తామని, సెంట్రల్ ఢిల్లీలోకి ప్రవేశించబోమని రైతు సంఘాల నాయకులు సోమవారం ప్రకటించారు. ఈ పరేడ్‌లో దాదాపు 2 లక్షల ట్రాక్టర్లు, రైతుల శకటాలు పాల్గొంటాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీ సరిహద్దులోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్ బోర్డర్ పాయింట్ల నుంచి పరేడ్ మొదలవుతుందన్నారు. ► రిపబ్లిక్ డే వేడుకలు జరిగే రాజ్‌పథ్‌లో 6,000 మంది భద్రతా సిబ్బందిని మోహరిస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ► పరేడ్‌లో పాల్గొనే రైతులు 24 గంటలకు సరిపడా ఆహార పదార్థాలను వెంట తెచ్చుకోవాలని రైతు నాయకులు సూచించారు. ► ఆయుధాలు, మద్యం, అనుచిత బ్యానర్లు ప్రదర్శించవద్దని చెప్పారు. ► సింఘు బోర్డర్ నుంచి ప్రారంభమయ్యే ట్రాక్టర్ పరేడ్ 63 కిలోమీటర్లు, టిక్రీ బోర్డర్ నుంచి మొదలయ్యే పరేడ్ 62 కిలోమీటర్లు, ఘాజీపూర్ బోర్డర్ నుంచి నిర్వహించే పరేడ్ 68 కిలోమీటర్లు కొనసాగుతుంది. రైతులకు బెస్ట్ ఆఫర్ ఇచ్చాం మూడు కొత్త వ్యవసాయ చట్టాల అమలును ఒకటి నుంచి ఒకటిన్నర సంవత్సరాలపాటు నిలిపివేస్తామంటూ ప్రభుత్వం తరపున రైతులకు ‘బెస్ట్ ఆఫర్’ ఇచ్చామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సోమవారం చెప్పారు. ఈ ఆఫర్‌ను రైత సంఘాల నేతలు త్వరలోనే పునఃపరిశీలించి, వారి నిర్ణయాన్ని తమకు తెలియజేస్తారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. రైతు సంఘాలు సానుకూలంగా స్పందిస్తే దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. కొత్త సాగు చట్టాలను రైతులే రద్దు చేస్తారు ముంబై: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో తన మెజార్టీని అడ్డం పెట్టుకొని రాజ్యాంగాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొస్తోందని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత,శరద్ పవార్ మండిపడ్డారు. ఆయా చట్టాలను ప్రభుత్వం రద్దు చేయకపోతే ప్రజలే ఆ పని పూర్తిచేస్తారని, అధికార పార్టీని కూల్చేస్తారని హెచ్చరించారు. అక్కడ కేవలం పంజాబ్ రైతులే ఉన్నారని కొందరు అంటున్నారని, పంజాబ్ ఏమైనా పాకిస్తానా? అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని అవమానించారు పార్లమెంట్లో సమగ్రమైన చర్చ జరగకుండానే వ్యవసాయ బిల్లులను ఆమోదించారని శరద్ పవార్ తప్పుపట్టారు. పూర్తిస్థాయిలో చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇలా చేయడం రాజ్యాంగాన్ని అవమా నించడమే అవుతుందన్నారు. బడ్జెట్ రోజు పాదయాత్ర న్యూఢిల్లీ: మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటంలో ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్ వరకూ పాదయాత్ర చేపట్టనున్నట్లు రైతు సంఘాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. నూతన వ్యవసాయ చట్టాల రద్దు దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుంచి పార్లమెంట్ దాకా పాదయాత్ర చేపట్టనున్నట్లు క్రాంతికారి కిసాన్ యూనియన్ నేత దర్శన్ పాల్ సోమవారం చెప్పారు. కొత్త చట్టాలను పూర్తిగా రద్దు చేయాలన్న తమ డిమాండ్‌లో ఎలాంటి మార్పు లేదన్నారు. -
గణతంత్ర వేడుకలకు సిద్ధం
సాక్షి, అమరావతి: గణతంత్ర వేడుకల కోసం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సిద్ధమైంది. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ సవాంగ్ తదితరులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు. ఇందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్‌ను దృష్టిలో పెట్టుకొని.. ఈసారి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 26వ తేదీ ఉదయం ప్రారంభమయ్యే వేడుకల్లో ప్రదర్శించేందుకు గానూ 14 శకటాలను సిద్ధం చేస్తున్నారు. వ్యవసాయ, పశుసంవర్థక, ఆరోగ్యశ్రీ, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, కోవిడ్, గ్రామ–వార్డు సచివాలయాలు, పాఠశాల విద్య, స్త్రీ–శిశు సంక్షేమం, గ్రామీణ పేదరిక నిర్మూలన, గృహ నిర్మాణం, సర్వే అండ్ సెటిల్మెంట్, పరిశ్రమలు, అటవీ, పర్యాటక–సామాజిక శాఖల శకటాలను ప్రదర్శించనున్నారు. ఈ వేడుకల్లో చేసే కవాతు(పెరేడ్) కోసం రెండు రోజులుగా పోలీస్ ప్రత్యేక బృందాలు రిహార్సల్స్ చేస్తున్నాయి. ఇండియన్ ఆర్మీ, ఏపీఎస్పీ 2వ బెటాలియన్ (కర్నూలు), 3వ బెటాలియన్ (కాకినాడ), 9వ బెటాలియన్ (వెంకటగిరి), 14వ బెటాలియన్ (అనంతపురం), 16వ బెటాలియన్ (విశాఖ)లు గణతంత్ర వేడుకల్లో కవాతు చేయనున్నాయి. వీటితోపాటు ఏపీఎస్పీ బెటాలియన్లు, హైదరాబాద్ స్పెషల్ పోలీస్, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్ పైప్ బ్యాండ్‌ను ప్రదర్శించనున్నాయి. -
విషాదం నుంచి విహారం వైపు..
బీజింగ్: చైనా తన 71వ ప్రజా రిపబ్లిక్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఎనిమిది రోజుల అధికారిక సెలవు దినాలు ప్రకటించింది. జాతీయ సెలవుదినాలతో పాటు ఈ యేడాది శరద్రుతువులో వచ్చే పండుగ కలిసి రావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు కోవిడ్ సంక్షోభం తరువాత, విహార యాత్రలకు సిద్ధమౌతున్నారు. చైనాలో జాతీయ సెలవుదినాలు, ప్రయాణాలపై ఆంక్షలు సడలించడంతో భారీ సంఖ్యలో వివిధ ప్రాంతాలకు ప్రజలు తరలివెళుతున్నట్టు టూర్ ఆపరేటర్లు తెలిపారు. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతుం డడంతో, దేశీయ ప్రయాణాలకు, బంధువులను కలిసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని వారు తెలిపారు. దేశీయ విమాన ప్రయాణాలు 1.5 కోట్లకు చేరవచ్చునని, ఇది గత యేడాదితో పోల్చుకుంటే పది శాతం అధికమని హాంకాంగ్ కేంద్రంగా వెలువడే సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. టికెట్ల బుక్కింగ్ వెబ్సైట్ ‘‘కునార్’’ ప్రారంభించిన కొద్ది సేపటికే టిక్కెట్లన్నీ పూర్తిగా అయిపోయాయని ఆ పత్రిక తెలిపింది. హై స్పీడ్ రైళ్ళల్లో కూడా సీట్లన్నీ రిజర్వు అయిపోయాయని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. కోవిడ్ నుంచి కోలుకుంటోన్న చైనా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతామని ధీమా వ్యక్తం చేసింది. -
డల్లాస్‌లో ఘనంగా 71వ గణతంత్ర వేడుకలు
డల్లాస్ : అమెరికాలోని డల్లస్ ప్రాంతంలో మహాత్మగాంధీ మొమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్(ఎమ్‌జీఎమ్‌ఎన్‌టి) ఆధ్వర్యంలో 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 400 మంది భారతీయ అమెరికన్లు ఈ వేడుకకు ఎంతో ఉత్సాహంతో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్‌జీఎమ్‌ఎన్‌టిచైర్మన్ ప్రసాద్ తోటకూర, సెక్రటరీ రావు కాల్వల, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అభిజిత్ రాయిల్కర్, శైలేష్ షా, తదితరులు హాజరయ్యారు. చైర్మన్ తోటకూర ప్రసాద్ ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యతను అక్కడున్న అందరికి వివరించారు. భారతదేశం గణతంత్రం సాధించి 70 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం నిజంగా గొప్ప విషయమని ప్రసాద్ తెలిపారు. కార్యక్రమం చివర్లో ఎమ్‌జీఎమ్‌ఎన్‌టి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శైలేష్ షా మాట్లాడుతూ.. జనవరి 30న మహాత్మగాంధీ వర్ధంతి పురస్కరించుకొని జాతిపితకు ఘనమైన నివాళులు అర్పించేందుకు అందరూ రావాల్సిందిగా కోరారు. -
అస్సాంలో బాంబు పేలుళ్లు
గువాహటి: అస్సాంలో గణతంత్ర దినోత్సవ రోజు ఉదయం సమయంలో నాలుగు బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ బాంబులను తామే అమర్చినట్లు నిషేధిత మిలిటెంట్ సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం– ఇండిపెండెంట్ (యూఎల్ఎఫ్ఏ–ఐ) ఆదివారం ప్రకటించింది. ఈ పేలుళ్లలో ఎవరూ గాయపడలేదు. అయితే గణతంత్ర వేడుకలు జరుపుకోవద్దంటూ పరేశ్ బారువా నేతృత్వంలోని యూఎల్ఎఫ్ఏ–ఐ సహా పలు సంస్థలు ముందే ప్రకటనలు జారీ చేశాయి. చారైడియో జిల్లాలో ఓ బాంబు పేలుడు జరగ్గా, దిబ్రూగఢ్ జిల్లాలో మూడు బాంబుపేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఉదయం 8:15 నుంచి 8:25 గంటల్లోపే నాలుగు పేలుళ్లు జరిగా యి. ఇందులో ఒక పేలుడు పోలీస్ స్టేషన్‌కు కేవలం 100 మీటర్ల దూరంలో జరగడం గమనార్హం. బైక్‌పై వచ్చిన యువకులు గ్రెనేడ్లను ఉంచడం సీసీటీవీల్లో నమోదైంది. అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవా ల్ ఈ పేలుళ్లను ఖండించారు. ప్రజల చేత తిరస్కారానికి గురైన ఉగ్రసంస్థలు చేసిన పేలుళ్లు అంటూ మండిపడ్డారు. బాధ్యులపై తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ట్విట్టర్ ద్వారా స్పష్టంచేశారు. -
ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
సాక్షి, అమరావతి/అమరావతి బ్యూరో: 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం ఘనంగా జరిగాయి. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.కె.మహేశ్వరి, మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆకట్టుకునేలా కవాతు వేడుకల్లో కవాతు ఆకట్టుకునేలా సాగింది. ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, తెలంగాణ స్టేట్ పోలీసు, ఏపీఎస్పీ 6వ బెటాలియన్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ, ఎన్సీసీ క్యాడెట్లు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, యూత్ రెడ్ క్రాస్లు కవాతుతో అలరించాయి. శకటాల ప్రదర్శన అదుర్స్ సాయుధ బలగాల వెనుక అగ్నిమాపక, వ్యవసాయ, గృహ నిర్మాణ, జల వనరుల, వైద్య, ఆరోగ్య, పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి, అబ్కారీ, విద్యా, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, పశు సంవర్ధక, మత్స్య, అటవీ, నైపుణ్యాభివద్ధి–శిక్షణ, పర్యాటక, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల శకటాలు కవాతులో పాల్గొన్నాయి. ప్రభుత్వ పథకాలు అమలు తీరును శకటాల్లో చూపిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. మహిళల రక్షణలో దేశానికే దిశానిర్ధేశం చేసిన దిశ చట్టం గొప్పతనాన్ని వివరిస్తూ ప్రదర్శించిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అవార్డుల ప్రదానం కవాతులో అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి గవర్నర్ అవార్డులు ప్రదానం చేశారు. సాయుధ బలగాల్లో ప్రథమ బహుమతి ఇండియన్ ఆర్మీ దక్కించుకోగా.. అన్ ఆర్మ్డ్ కంటింజెంట్ విభాగంలో ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రథమ బహుమతి దక్కించుకుంది. ద్వితీయ స్థానాల్లో వరుసగా తెలంగాణ స్టేట్ పోలీసు, ఎన్సీసీ క్యాడెట్(బాలికలు)లు నిలిచారు. శకటాల ప్రదర్శనలో ప్రథమ బహుమతి సమగ్రశిక్ష, పాఠశాల విద్యాశాఖకు, ద్వితీయ స్థానం మహిళాభివృద్ధి–శిశు సంక్షేమ శాఖ(దిశ చట్టంపై)కు, తృతీయ స్థానం వ్యవసాయశాఖకు దక్కాయి. -
హింస.. పరిష్కారం కాదు
న్యూఢిల్లీ: హింసామార్గం ఏ సమస్యనూ పరిష్కరించలేదని, ప్రజల జీవితాలు మెరుగుపడిన దాఖలాలు లేవని ప్రధాని మోదీ అన్నారు. 21వ శతాబ్దం సైన్స్, టెక్నాలజీ, ప్రజాస్వామ్యాలదంటూ ఆయన.. ఏ సమస్య పరిష్కారం అయినా శాంతియుత పద్ధతుల్లోనే జరగాలని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో మొట్టమొదటి మాసాంతపు ‘మన్‌కీ బాత్’లో ఆయన మాట్లాడారు. గణతంత్ర దినోత్సవం నాడే మన్‌కీ బాత్ కూడా రావడంతో ఉదయం 11 గంటలకు బదులు సాయంత్రం 6 గంటలకు ప్రధాని రేడియో ద్వారా మాట్లాడారు. ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటు వాదం తగ్గుముఖం పట్టిందన్నారు. ‘అస్సాంలో 8 సంస్థలకు చెందిన 644 మంది ఉగ్రవాదులు ప్రభుత్వానికి లొంగిపోయారు. ఈ ప్రాంత సమస్యలను చర్చల ద్వారా ప్రభుత్వం పరిష్కరిస్తున్నందునే వీరంతా హింసామార్గం వీడుతున్నారు’అని అన్నారు. నీటి పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా చేపట్టిన జల్‌శక్తి కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో విజయవంతమైందని ప్రధాని మోదీ చెప్పారు. ‘ఉత్తరాఖండ్‌లోని అల్మోరా–హల్ద్వానీ హైవే పక్కన ఉన్న సునియాకోట్ గ్రామంలో ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన కార్యక్రమం విజయవంతమైంది. అలాగే, తమిళనాడులో వర్షం నీటిని బోరుబావి ద్వారా ఒడిసిపట్టడం అద్భుతమైన ఆలోచన’అని ఆయన అన్నారు. ఈ నెల 22వ తేదీతో ముగిసిన మూడో ఖేలో ఇండియా గురించి మాట్లాడుతూ..‘మూడేళ్లుగా చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 32 వేల మంది బాలల ప్రతిభ వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది నుంచి వర్సిటీల స్థాయిలో కూడా ఖేలో ఇండియా నిర్వహించనున్నాం. ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి ఒకటో తేదీ వరకు ఒరిస్సాలో జరగనున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ స్థాయి ఆటల పోటీల్లో 3 వేల మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు’అని తెలిపారు. గగన్‌యాన్ మిషన్ గురించి ఆయన ప్రస్తావిస్తూ... ‘ఈ మిషన్ మరో అడుగు ముందుకు పడింది. ఈ మిషన్‌కు వైమానిక దళానికి చెందిన నలుగురు పైలెట్లు ఎంపికయ్యారు. వీరు దేశం ప్రతిభ, శక్తి సామర్థ్యాలు, ధైర్యం, కలలకు ప్రతిబింబాలు. ఈ మిషన్‌లో భాగస్వాములందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు’అని తెలిపారు. -
నారీ శక్తి సైనిక శక్తి
న్యూఢిల్లీ: భారతదేశ 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజధాని న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ఘనంగా జరిగాయి. శీతాకాలం వేళ ఆదివారంనాడు సూర్యకిరణాల వెచ్చదనం మధ్య త్రివిధ బలగాలు నిర్వహించిన 90 నిమిషాల పెరేడ్ అణువణువునా దేశభక్తిని నింపుతూ రోమాలు నిక్కబొడిచేలా సాగింది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, మన సైనిక సత్తాని ప్రపంచానికి చాటి చెప్పే ఆయుధ ప్రదర్శనలు, సామాజిక, ఆర్థిక పురోగతిని తెలిపే శకటాలు, మహిళా సాధికారతను చాటి చెప్పే విన్యాసాలతో పెరేడ్ దేశానికే గర్వకారణంగా నిలిచింది. రాజ్‌పథ్‌లో గోవా, మేఘాలయ తదితర రాష్ట్రాల శకటాల ప్రదర్శన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ యుద్ధ స్మారక కేంద్రం దగ్గర నివాళులర్పించడం దగ్గర్నుంచి గగనతలంలో త్రివిధ బలగాలకి సంకేతంగా హెలికాప్టర్లు చేసే విన్యాసాల వరకు ఎన్నో తొలి ఘటనలకు ఈ వేడుకలు సాక్షీభూతమయ్యాయి. బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనోరా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసి పెరేడ్ని తిలకించారు. రాజ్‌పథ్‌లో పెరేడ్ మొదలు కావడానికి ముందు జాతీయ గీతం బ్యాండ్‌ని వాయించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ జెండాను ఆవిష్కరించే సమయంలో 21 సార్లు గాల్లోకి తుపాకులు పేల్చి సైనికులు గౌరవ వందనం సమర్పించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ఇతర ప్రముఖులు ఈ ఉత్సవానికి హాజరయ్యారు. యుద్ధస్మారక కేంద్రం వద్ద ప్రధాని నివాళులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ఉదయం పెరేడ్ ప్రారంభం కావడానికి ముందు కొత్తగా నిర్మించిన జాతీయ యుద్ధ స్మారక కేంద్రం వద్ద నివాళులర్పించారు. ఏటా ఇండియా గేట్ దగ్గరున్న అమర్ జ్యోతి జవాన్ వద్ద నివాళుల ర్పించడం సంప్రదాయంగా వస్తోంది. కాషాయ బాందినీ ప్రింట్ తలపాగాతో.. జాతీయ వేడుకల సమయంలో ప్రధానమంత్రి మోదీ రంగుల తలపాగా ధరించే సంప్రదాయాన్ని కొనసాగించారు. తెల్ల రంగు పైజామా, కుర్తా, దానిపైన నీలం రంగు జాకెట్, కాషాయ రంగులో వీపు మీదుగా జారేలా ఉండే బాందినీ ప్రింట్ తలపాగా ధరించారు. రాజస్తాన్, గుజరాత్‌లలో ఇలాంటి తలపాగాలను ధరిస్తారు. ఆకట్టుకున్న శకటాలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాల మేళవింపుతో, సామాజిక బాధ్యతను గుర్తు చేసేలా, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లేలా, మన సైనిక పాటవాన్ని చాటేలా మొత్తం 22 శకటాల ప్రదర్శన ఆద్యంతం మనోహరంగా సాగింది. కప్పల్ని కాపాడాలని గోవా శకటాన్ని రూపొందిస్తే, హిమాచల్ ప్రదేశ్ కులు దసరా ఉత్సవాన్ని, ఒడిశా రథయాత్రను ప్రతిబింబించేలా శకటాల్ని రూపొందించాయి. వాయుసేనకు చెందిన శకటం తేజస్ యుద్ధ విమానాలు, ఆకాశ్, అస్త్ర క్షిపణుల్ని ప్రదర్శించింది. ఇక జల్ శక్తి మంత్రిత్వ శాఖ 2024కల్లా ప్రతీ గ్రామానికి కుళాయి కనెక్షన్ ఇస్తామని చాటిచెప్పే శకటాన్ని ప్రదర్శించింది. ఎన్నో ఫస్ట్లు రాజ్‌పథ్‌లో జరిగిన పెరేడ్ని మహిళా కమాండర్ కెప్టెన్ తాన్యా షెర్గిల్ ముందుండి నడిపించారు. అందరూ పురుషులే పాల్గొన్న ఈ మార్చ్‌కి ఒక మహిళా అధికారి నేతృత్వం వహించడం ఇదే తొలిసారి. ► సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కు చెందిన మహిళా బైకర్లు తొలిసారిగా ఇచ్చిన ప్రదర్శన ఉత్కంఠభరితంగా సాగింది. ఇన్స్పెక్టర్ సీమ నాగ్ నేతృత్వంలో డేర్ డెవిల్ స్టంట్ ప్రదర్శన సాగింది. నడుస్తున్న బైక్ పైభాగాన నిల్చొని సీమ సెల్యూట్ సమర్పించడం ఈ షోకే హైలైట్. ► జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొని ‘‘తిరిగి గ్రామానికి’’అన్న థీమ్‌తో శకటాన్ని ప్రదర్శించింది. ఈ శకటం ముందుభాగంలో కశ్మీర్ చేతి వృత్తులను ప్రతిబింబించేలా శాలువా అల్లుతున్న కార్మికుడ్ని ఉంచారు. ► రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఒ) గత ఏడాది రూపొందించిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి (ఏశాట్)ని ఈ సారి పెరేడ్లో తొలిసారిగా ప్రదర్శించారు. మిషన్ శక్తిలో భాగంగా మన క్షిపణి వ్యవస్థ సత్తా దీంతో తెలుస్తుంది. ► ధనుష్ శతఘ్నులను తొలిసారిగా రిపబ్లిక్ డే పెరేడ్లో ప్రదర్శించారు. 155ఎంఎం/45 కాలిబర్ సామర్థ్యం కలిగిన ఈ శతఘ్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. 36.5కి.మీ. దూరం వరకు ధనుష్ కచ్చితంగా లక్ష్యాలను ఛేదిస్తుంది. ► కొత్తగా మన అమ్ముల పొదిలో వచ్చి చేరిన చినూక్, అపాచీ భారీ యుద్ధ హెలికాప్టర్లు తొలిసారిగా పెరేడ్లో ప్రదర్శించాయి. మారుమూల ప్రాంతాల్లో భారీ లోడ్లను కూడా చినూక్ మోసుకుపోగలదు. ఇక అపాచి హెలికాప్టర్ గగనతలం నుంచి గగనతలానికి, నింగి నుంచి నేలకి కూడా క్షిపణుల్ని ప్రయోగించే సత్తా ఉంది. ► నీలాకాశంలో జరిగే వైమానిక విన్యాసాలు రోమాలు నిక్కబొడుచుకునేలా సాగాయి. 40 విమానాలు త్రిశూల్ ఆకారంలో విన్యాసాలు చేయడంతో మొదలై త్రివిధ దళాలకి గుర్తుగా మూడు ఏఎల్‌హెచ్ హెలికాప్టర్లు ’VIP’ ఆకారంలో వచ్చాయి. ఈ ప్రదర్శనని ఇలా నిర్వహించడం ఇదే తొలిసారి. 17 వేల అడుగుల ఎత్తులో.. న్యూఢిల్లీ: 17 వేల అడుగుల ఎత్తు.. మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత.. మోకాళ్ల లోతు మంచు.. జాతీయ జెండాను ఎగురవేసేందుకు ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)లకు ఇవేవీ అడ్డంకి కాలేదు. 71వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా లదాఖ్‌లో ‘వందేమాతరం.. భారత్ మాతా కీ జై’ నినాదాల నడుమ మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ట్విట్టర్లో వైరల్‌గా మారింది. సైనికులను కీర్తిస్తూ పలువురు యూజర్లు కామెంట్లు చేశారు. దేశానికి నిజమైన హీరోలు మీరే అంటూ ఒకరు.. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది.. గణతంత్ర వేడుకలు జరుపుతున్న హీరోలు అంటూ ఇంకొకరు అని కొనియాడారు. గణతంత్ర వేడుకల్లో మోదీ ధరించిన తలపాగాలు పరేడ్‌లో ఆకాశ్ క్షిపణి బైక్‌పై సీఆర్పీఎఫ్ మహిళా జవాన్ల విన్యాసం -
గణతంత్ర వేడుకలో అపశ్రుతి
సాక్షి, హైదరాబాద్: పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో అపశ్రుతి దొర్లింది. త్రివర్ణ పతాకాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవిష్కరించే క్రమంలో జెండా మొరాయిం చింది. రోప్‌వైర్‌ను ఎంతసేపు లాగినప్పటికీ జెండా ముడి విచ్చుకోలేదు. జెండా పూర్తిగా ఎగరకుండానే జాతీయ గీతం వాయిద్యాన్ని పోలీస్‌బ్యాండ్ బృందం మోగించడంతో అంద రూ జాతీయ గీతాలాపన కొనసాగించారు. జాతీయ గీతాలాపన అనంతరం అక్కడే ఉన్న పోలీస్ అధికారులు జెండాను పూర్తిగా కిందకు దించి సరిచేసి, మళ్లీ ఎగురవేశారు. గవర్నర్ హోదాలో తొలిసారి జాతీయ జెండా ఎగరవేసిన తమిళిసై ఈ అపశుత్రితో తీవ్ర అసహనానికి లోనైనట్లు కనిపించారు. తన ప్రసంగం ముగిసిన వెంటనే దీనిపై ఆమె ప్రోటోకాల్ జాయిం ట్ సెక్రటరీ అర్విందర్ సింగ్‌ను పిలిచి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. సీఎం కేసీఆర్ సైతం ప్రోటోకాల్ అధికారులపై ఆగ్రహాన్ని వెలిబుచ్చినట్లుగా తెలుస్తోంది. పరేడ్‌లో పాల్గొన్న ఏపీఎస్పీ.. గణతంత్ర వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏపీఎస్పీ పోలీసులతోపాటు సిక్ రెజిమెంట్‌కు చెందిన 5వ బెటా లియన్, టీఎస్‌ఎస్సీకి చెందిన 3వ బెటాలియన్, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఎన్సీసీ విద్యార్థులు పరేడ్‌లో పాల్గొన్నారు. ఈ పరేడ్‌లో పాల్గొన్న ఏపీఎస్పీకి గవర్నర్ ప్రత్యేక ట్రోఫీని అందజేశారు. పబ్లిక్ గార్డెన్స్ ప్రాంతం చాలా చిన్నదిగా ఉండటంతో ప్రభుత్వ శకటాల ప్రదర్శన జరగలేదు. తరలివచ్చిన ముఖ్య నేతలు.. గణతంత్ర వేడుకలకు సీఎం కేసీఆర్‌తో పాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాలోతు కవిత, లింగయ్య యాదవ్, మంత్రులు కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, ప్రభుత్వ సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల చైర్మన్లు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అపశ్రుతులు.. అవమానాలు ►వికారాబాద్ జిల్లా ధారూరు బాలికల ఉన్నత పాఠశాలలో ఇన్చార్జ్ హెచ్ఎం కిరణ్మయి జాతీయ జెండాను తలకిందులుగా ఆవిష్కరించారు. అప్పటికే జాతీయ గీతాలాపన ప్రారంభమైంది. వెంటనే పొరపాటును సరిదిద్దారు. ►రంగారెడ్డి జిల్లా నేదునూరు పరిధిలోని ఓ విద్యాసంస్థలో మత చిహ్నం ఉన్న రాడ్‌కు జాతీయ జెండాను ఆవిష్కరించడం కలకలం రేపింది. సర్పంచ్ తదితరులు దీనిపై ఆందోళనకు దిగారు. దీనిపై తమకందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ జంగయ్య తెలిపారు. -
భారతమాతకు మహా హారతి
ఖైరతాబాద్: భారత్ మాతాకీ జై.. వందేమాతరం.. మా తుజే సలాం అంటూ నినాదాలతో భారతమాతకు మహా హారతి కార్యక్రమం మారుమోగింది. ఒకే వేదికపై మూడు వేల మంది విద్యార్థినులు భారతమాత వేషధారణతో త్రివర్ణ పతాకాలు చేతపట్టుకుని భారతమాతకు కర్పూర హారతి సమర్పించిన కార్యక్రమం ఆద్యంతం దేశభక్తిని చాటింది. ఆదివారం సాయంత్రం ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని గవర్నర్ తమిళిసై ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మన సంస్కృతిని తెలియజేసేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని గవర్నర్ అన్నారు. దేశం కోసం, దేశాభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న కార్యక్రమాలు భారతీయుడిని తల ఎత్తుకునేలా చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. తన మెడపై కత్తి పెట్టినా భారతమాతకు జై అనను అన్న వారితో కూడా భారత్‌మాతాకీ జై అనేలా చేయాలనే ఆలోచనతో రెండేళ్ల కిందట ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని ఈ ఫౌండేషన్ చైర్మన్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మన దేహం మీద ఉన్న అభిమానాన్ని దేశం మీద అభిమానంగా మార్చాలనే సంకల్పంతోనే కిషన్‌రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని సహస్ర అవధాని గరికపాటి నర్సింహారావు పేర్కొన్నారు. కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన జనసేన పార్టీ అధ్యక్షుడు, నటుడు పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ రాజకీయాల్లోకి పదవులు ఆశించి రాలేదని భారతమాత తల్లి పిలుపు మేరకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్, జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి తనయుడు హర్ష తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మా తుజే సలాం.. వందేమాతం అంటూ చేసిన నృత్యాలు, మరాఠా వారియర్ డ్యాన్స్ వంటి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
అక్కడ తొలిసారిగా త్రివర్ణ పతాక రెపరెపలు
తిరువనంతపురం: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేరళలలో సరికొత్త దృశ్యం ఆవిష్కృతమైంది. రాష్ట్రంలోని అన్ని మసీదుల్లో కేరళ ముస్లిం వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇలా కేరళలోని అన్ని మసీదుల్లో అధికారికంగా జాతీయ పండగ జరుపుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దీంతో మసీదులన్ని మూడు రంగుల జెండా అలంకరణతో కొత్త శోభను సంతరించుకున్నాయి. జెండా ఆవిష్కరణ అనంతరం మసీదుల్లో భారత రాజ్యాంగా పీఠికను చదివారు. ముస్లింలు తమ మసీదుల్లో జాతీయా జెండాను ఎగురవేసి.. జాతీయా సమైక్యతను ప్రోత్సహించాలనే సందేశాన్ని ఇచ్చారు. జాతీయ జెండాను గౌరవిస్తూ.. దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ముస్లింలు ప్రతిజ్ఞ చేశారు. దేశవ్యాప్తంగా ముస్లింలు సీఏఏకు వ్యతిరేకంగా గళమెత్తుతున్న ఈ తరుణంతో కేరళలోని మసీదుల్లో గణతంత్ర వేడుకలు నిర్వహించడం విశేషం. కాగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని కేరళ ప్రభుత్వం వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా సీఏఏను తమ రాష్ట్రంలో అమలు చేసేది లేదని కేరళ అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది. -
రిపబ్లిక్ డేపై గూగుల్ స్పెషల్ డూడుల్
సాక్షి, న్యూఢిల్లీ : భారత 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక డూడుల్‌తో గూగుల్ తనదైనశైలిలో శుభాకాంక్షలు తెలిపింది. దేశంలోని విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉట్టిపడేలా దీనిని తీర్చిదిద్దింది. ఈ ప్రత్యేక డూడుల్‌ను సింగపూర్‌కు చెందిన మెరో సేథ్ అనే కళాకారుడు రూపుదిద్దారు.అందులో ప్రఖ్యాత ప్రదేశాలను, తాజ్‌మహల్,ఇండియా గేట్, కూడా ప్రతిబింబించేలా తయారు చేశారు. ఇంకా భారత దేశానికి చెందిన శాస్త్రీయ సంగీతం, కళలు, మన జాతీయ పక్షి.. దేశంలోని వస్త్ర పరిశ్రమను కూడా చిత్రంలో చేర్చుతూ.. ప్రత్యేక డూడుల్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక డూడుల్ అందర్నీ ఆకట్టుకుంటుంది. -
ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
-
రిపబ్లిక్ డే : కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు
-
ఆకట్టుకున్న తెలంగాణ శకటం
-
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఏపీ శకటం
-
ఢిల్లీలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
-
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఏపీ శకటం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన 71వ గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వ కళారూపాలు, ప్రజల జీవనశైలిని ప్రతిబింబిస్తూ...ఆకర్షణీయంగా రూపొందించిన ప్రగతిరథం రాజ్‌పథ్‌లో కనువిందు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయం, బ్రహ్మోత్సవాలు, కూచిపూడి నృత్యాలు, ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి బొమ్మలు, సహజరంగుల కలంకారీ అద్దకాలతో కూడిన ఏపీ శకటం అందరినీ ఆకట్టుకుంది. ('అభివృద్ధి వికేంద్రీకరణ వల్లే అన్ని వర్గాలకు న్యాయం') అలాగే తెలంగాణ శకటం అందరినీ ఆకర్షించింది. రాష్ట్ర సంస్కృతి, చరిత్ర, వాస్తు కళలు, పండుగలను చాటేలా ఈ శకటం రూపుదిద్దుకుంది. ముందు భాగంలో రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాలు, మధ్య భాగంలో సమ్మక్క, సారక్కల గద్దెలను ప్రతిబింబించేలా అమ్మవారి భారీ రూపం కొలువుతీరాయి. (ఘనంగా గణతంత్రం.. ప్రధాని మోదీ నివాళి) -
విజయవాడలో గణతంత్ర వేడుకలు
-
వైఎస్సార్సీపీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు
సాక్షి, తాడేపల్లి : గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలకు భారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం ఉమ్మారెడ్డి మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి గణతంత్ర దినోత్సవం ఇది. ఈ లోపే సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీలన్నింటినీ దాదాపు అమలు చేశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 90 శాతం హామీలు నెరవేర్చారు. సీఎం వైఎస్ జగన్ బడుగు, బలహీన వర్గాల వారికి అండగా ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే హామీలు అమలు చేయడం మొదలుపెట్టారు. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ప్రతి గడపకు ఆయన సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే నాలుగు లక్షలుకుపైగా ఉద్యోగాలు కల్పించారు. టీడీపీ అధ్యక్షుడు ఇచ్చిన ఏ హామీని నిలబెట్టకోలేదు’ అని తెలిపారు. -
మిగతా రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం : గవర్నర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 71వ గణతంత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. పబ్లిక్ గార్డెన్లో ఆదివారం ఉదయం గవర్నర్ తమిళసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆమె తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగిస్తూ.. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఎన్నో రకాల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ అధిగమించారని ప్రశంసించారు. ఎన్నో అంశాల్లో తెలంగాణ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. కొత్త చట్టాలతో అవినీతి రహిత రాష్ట్రంగా పేరు గాంచిన తెలంగాణ ప్రజల పనుల్లో ఆలస్యం కాకుండా సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. పల్లె ప్రగతితో తెలంగాణ గ్రామాలు సత్ఫలితాలను సాధించాయన్నారు. కొత్త రెవెన్యూ చట్టంతో అవినీతికి తావు లేని స్వచ్ఛమైన రెవెన్యూ పాలన అందించాలని నిర్ణయించామన్నారు. మిషన్ భగీరథ, 24 గంటల కరెంటు, కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులతో సాగు, తాగు నీరందిస్తున్నారని వ్యాఖ్యానించారు. అనంతరం అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జైహింద్, జై తెలంగాణ అంటూ తెలుగులో ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్, మంత్రులు, పలువురు అధికారులు హాజరయ్యారు. జెండా ఎగరేయడంలో ఆలస్యం పబ్లిక్ గార్డెన్లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ జాతీయ జెండా ఎగురవేయడంలో కాస్త ఆలస్యం జరిగింది. త్రివర్ణ పతాకం ఎగరకుండా అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. దీంతో గవర్నర్ మరోసారి జెండా ఎగరవేయగా అది పైకి వెళ్లిందే తప్ప ఎగరలేదు. దీంతో జెండాను కిందకు దించి మళ్లీ ఎగురవేశారు. ఇక ఈ సమయంలో జెండా ఆవిష్కరణ జరగకముందే జాతీయ గీలాపనను రెండు మూడు సార్లు ఆలపించడంతో సీఎం కేసీఆర్ విచారంగా చూశారు. అనంతరం గవర్నర్ మరోసారి జెండాను ఎగరేసే ప్రయత్నం చేయగా ఎట్టకేలకు త్రివర్ణ పతాకం రెపరెపలాడటంతో అందరూ జాతీయ గీతాన్ని ఆలపించారు. కోర్టులో గణతంత్ర వేడుకలు మరోవైపు తెలంగాణ హైకోర్టులో గణతంత్ర వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ వేడుకల్లో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
మిగతా రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం
-
భారత రాజ్యాంగం అన్ని వర్గాల హక్కులకు రక్షణ
-
'అభివృద్ధి వికేంద్రీకరణ వల్లే అన్ని వర్గాలకు న్యాయం'
సాక్షి, విజయవాడ : భారత రాజ్యాంగం అన్ని వర్గాల హక్కులకు రక్షణగా నిలిచిందని, దేశంకోసం త్యాగం చేసిన అమరవీరులకు ఇవే మా ఘనమైన నివాళి అంటూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉదయం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. గవర్నర్ మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణ వల్లే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణపై కేబినెట్లో నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ప్రభుత్వం విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమని పేర్కొన్నారు. (జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్) నవరత్నాల ద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృసి చేస్తుందన్నారు. గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాల ఏర్పాటు ద్వారా రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ప్రసుతం గ్రామ సచివాలయల ద్వారా 500 రకాల సేవలు అందుతున్నాయని, వీటి ద్వారా రాష్ట్రంలోని నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు లభించడం పట్ట హర్షం వ్యక్తం చేశారు. నవశకం ద్వారా అన్ని వర్గాల సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగుతుందని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా రూ.13,500 ఆర్థిక సాయం అందిస్తున్నారని, రైతులకు గిట్టుబాటు ధర అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అలాగే ధరల స్థిరీకరణ కింద రూ.3వేలకోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు, ఆక్వా రైతులకు విద్యుత్ యూనిట్ ధరల్లో రాయితీ అందజేస్తున్నట్లు విశ్వభూషణ్ వెల్లడించారు. రాష్ట్రంలో 100శాతం అక్షరాస్యత కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, విద్యకు పేదరికం అడ్డు కాకూడదని అమ్మొడి పథకం ప్రారంభించిదని గుర్తుచేశారు. ఈ పథకం కింద ప్రతి విద్యార్థి తల్లికి రూ.15 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాద్యమాన్ని ప్రవేశపెడుతున్నట్లు, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా ఉంటుందని గవర్నర్ స్పష్టం చేశారు. మనబడి, నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, జగనన్న విద్యా కానుక ద్వారా 3 జతల యూనిఫామ్‌లు, పుస్తకాలు అందజేస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. పేద వర్గాల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్, జగనన్న వసతి కార్యక్రమం ద్వారా పేద విద్యార్థులకు హాస్టల్ ఫీజులు చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. వైఎస్సార్ ఆరోగ్య పథకాన్ని మరింత మెరుగుపరచనున్నట్లు , అందుకోసం పైలట్ ప్రాజెక్టుగా పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని రకాల వైద్య సేవలు అందజేయనున్నట్లు తెలిపారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం రుణాలు అందజేస్తుందని, పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పిస్తామని గవర్నర్ పేర్కొన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో 50శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించనున్నట్లు గవర్నర్ హరిచందన్ వెల్లడించారు. -
2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: దేశంలో రాజ్యాంగ విరుద్ధంగా పాలన జరుగుతోందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదివారం గాంధీభవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ మతచిచ్చు రేపుతోందని దుయ్యబట్టారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా బీజేపీ నాయకులు నియంత పాలన చేస్తున్నారని మండిపడ్డారు. ఇక తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అదే పంథాలో నడుస్తున్నారని, నిరసనలకు కూడా అనుమతి ఇవ్వడం లేదన్నారు. ఎన్నికల్లో మద్యం, డబ్బుతో గెలుస్తున్నారని, టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. బీజేపీకి లబ్ధి కలిగేలా దేశమంతటా ఎంఐఎం పోటీ చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి గెలుపోటములు కొత్తకాదని.. గెలుపుతో పొంగిపోమని, అలాగే ఓటమితో కుంగిపోమని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నాయకులు అధికార దుర్వినియోగం చేశారని, విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేసి గెలిచారని వ్యాఖ్యానించారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని ఆయన సూచించారు. చదవండి: కారు.. వన్‌సైడ్ వార్ మహబూబ్‌నగర్‌లో కారు స్పీడు తగ్గింది.. -
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో 71వ గణతంత్ర వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పాల్గొన్నారు. ఇక గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మరోవైపు జీహెచ్ఎంసీ కార్యాలయంలో కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ మహమ్మద్ బాబా ఫసియుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జెండా ఆవిష్కరణ అనంతరం అధికారులు మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ చెక్కులు, వృద్ధులకు వీల్‌చైర్స్, చేతి కర్రలు పంపిణీ చేశారు. చదవండి: కార్యకర్తల కృషి వల్లే విజయం: కేటీఆర్ సవరించినా... సగర్వంగా! -
ఘనంగా గణతంత్రం.. ప్రధాని మోదీ నివాళి
సాక్షి, న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరానంటాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్‌లో అమర జవాన్లకు నివాళి అర్పించారు. దేశ రక్షణకు ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సైనికులు చేసిన గౌరవ వందనాన్ని మోదీ స్వీకరించారు. దేశ 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రామ్‌నాథ్ కోవింద్ త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. ఈ సందర్భంగా సైనిక దళం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిధిగా వచ్చిన బ్రెజిల్ అధ్యక్షుడు జయిర్ బొల్సనారోతో కలిసి ఆయన ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సైనికుల గౌరవందనాన్ని వారు స్వీకరించారు. ఈ వేడుకల్లో సైనికులు చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. దేశ రాజధానిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన జెండాను ఆవిష్కరించడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్‌లోని లడఖ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 17 వేల అడుగుల ఎత్తున మంచుకొండలపై ఐటీబీపీ సిబ్బంది జాతీయ జెండాను ఆవిష్కరించారు. మంచుకొండల్లో ప్రత్యేక విన్యాసాలు చేశారు. యుద్ధరంగంలో అమరులైన జవాన్లకు నివాళి అర్పించారు. -
కేసీఆర్ మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అన్ని అడ్డంకులను ఎదుర్కొని మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వివక్ష చూపడం లేదని, తెలంగాణకు రావాల్సిన నిధులను ఇస్తోందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ ప్రాంతీయ పార్టీలను కూడగడుతామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బాధ్యత గల సీఎం సీఏఏను అపహాస్యం చేసేలా మట్లాడటం ఎంతవరకు సబబని కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అవకాశవాద రాజకీయ వాదులను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అసదుద్దీన్ ఓవైసీ కుట్రలో కేసీఆర్ పావులా మాట్లాడారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని రాజకీయ పక్షాలు కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసం, సీట్ల కోసం జనగణనను వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. -
విజయవాడలో ఘనంగా గణతంత్ర వేడుకలు
-
ఏపీ అసెంబ్లీలో గణతంత్ర వేడుకలు
-
సీఎం క్యాంప్ ఆఫీసులో గణతంత్ర వేడుకలు
-
ఏపీ సచివాలయంలో గణతంత్ర వేడుకలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదివారం ఉదయం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శశిభూషణ్ కుమార్, చీఫ్ సెక్యూరిటీ అధికారి కేకే మూర్తి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఇక తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం జాతీయ జెండాను అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం ముఖ్య కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, సీఎం కార్యాలయ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, సీఎస్వోలు జోషి, పరమేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీలో గణతంత్ర వేడుకలు అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారాం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకల్లో అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు, చీఫ్ మార్షల్, అసెంబ్లీ ఉద్యోగులు పాల్గొన్నారు. అలాగే శాసనమండలిలో ఛైర్మన్ షరీఫ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. -
రిపబ్లిక్ డే వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి, అమరావతి: గణతంత్ర వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సర్వసన్నద్ధమైంది. ఆదివారం జరిగే 71వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఆయన వచ్చే ముందే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ స్టేడియానికి చేరుకోనున్నారు. ఈ వేడుకలకు నగర కమిషనర్ ద్వారకా తిరుమలరావు నేతృత్వంలో దాదాపు 700 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. సరిగ్గా ఉదయం 9 గంటలకు జాతీయ గీతంతో గణతంత్ర వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం గవర్నర్ వాహనంలో పెరేడ్‌ను తిలకిస్తారు. తర్వాత మార్చ్ఫాస్ట్ కార్యక్రమం ఉంటుంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన 14 శకటాలను ప్రదర్శిస్తారు. 9.41 గంటలకు గవర్నర్ ప్రసంగిస్తారు. 10.05 గంటలకు జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగుస్తుంది. గణతంత్ర వేడుకలకు రాజ్‌భవన్ సిద్ధం గణతంత్ర దినోత్సవ వేడుకలకు రాజ్ భవన్ సిద్ధ్దమైంది. రాజ్‌భవన్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, పలువురు ఉన్నతాధికారులు ఎట్ హోమ్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై శనివారం సమీక్ష నిర్వహించారు. భద్రతాపరమైన కారణాల నేపథ్యంలో అన్ని వాహనాలనూ రాజ్‌భవన్ మెయిన్ గేటు వద్దే నిలిపివేయనున్నట్లు మీనా తెలిపారు. సీఎం వైఎస్ జగన్, హైకోర్టు సీజే జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్‌ల వాహనాలను మాత్రమే అనుమతిస్తామన్నారు. -
కశ్మీర్ జైషే చీఫ్ హతం
శ్రీనగర్: గణతంత్ర వేడుకలకు ముందు రోజు జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. హతమైన ఉగ్రవాదుల్లో తనకు తానే జైషే మొహమ్మద్‌కు కశ్మీర్ చీఫ్‌గా ప్రకటించుకున్న ఖారీ యాసిర్ ఉన్నాడు. గత సంవత్సరం జరిగిన పుల్వామా దాడిలో యాసిర్ పాలుపంచుకున్నాడని పోలీసు అధికారులు తెలిపారు. ట్రాల్ ఎన్కౌంటర్లో మరణించిన ఖారీ ఐఈడీ పేలుడు పదార్థాల తయారీలో నిపుణుడని, అతను ఉగ్ర నియామకాలు, పాకిస్తాన్ నుంచి వచ్చే ఉగ్రవాదులను తరలించడం వంటివి చేస్తాడని తెలిపారు. గత సంవత్సరం పుల్వామా దాడి తర్వాత జైషే సంస్థను నిర్వీర్యం చేయగలిగామని లెఫ్టినెంట్ జనరల్ ధిల్లాన్ అన్నారు. -
అహింసాయుతంగా పోరాడండి
న్యూఢిల్లీ: సదాశయం కోసం జరిగే పోరాటం అహింసాయుతంగా ఉండాలని రాష్ట్రపతి కోవింద్ ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఉద్బోధించారు. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతినుద్దేశించి మాట్లాడారు. సామాజిక, ఆర్థిక ఆకాంక్షలను సాధించుకునే క్రమంలో రాజ్యాంగ పద్ధతులకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంపై పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గాంధీజీ బోధించిన సత్యం, అహింసను నిత్య జీవితంలో అంతర్భాగంగా మార్చుకునేందుకు ప్రతి ఒక్కరూ నిత్యం ఆత్మశోధన చేసుకోవాల్సిన అవసరం నేడు ఎంతో ఉందన్నారు. ‘ప్రజలే దేశ భవితను నిర్ణయించే అసలైన శక్తి. ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ కీలక పాత్ర పోషించాలి’ అని అన్నారు. ‘దేశాభివృద్ధికి అంతర్గత భద్రత ఎంతో కీలకం. దేశ అంతర్గ భద్రతా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుంది’ అని చెప్పారు. ‘స్వచ్ఛభారత్ అభియాన్ ఎంతో తక్కువకాలంలోనే ఘన విజయం సాధించింది. సబ్సిడీపై వంటగ్యాస్ నుంచి డిజిటల్ చెల్లింపుల వరకు పలు ప్రభుత్వ పథకాలను ప్రజలు తమవిగా చేసుకోవడం ద్వారా అవి విజయవంతమయ్యాయి’ అని అన్నారు. ‘ప్రజాస్వామ్యం కేవలం అలంకారప్రాయంగా కాకుండా, ఆచరణాత్మకంగా ఉండాలని భావిస్తే మనం ఏం చేయాలి? ఆర్థిక, సామాజిక లక్ష్యాల సాధన కోసం రాజ్యాంగ పద్ధతులను తప్పకుండా అనుసరించాలనేదే నా అభిప్రాయం’ అంటూ బాబా సాహెబ్ అంబేడ్కర్ చెప్పిన మాటలను రాష్ట్రపతి ఈ సందర్భంగా ఉటంకించారు. -
గణతంత్ర వేడుకలపై డేగకన్ను
సాక్షి, సిటీబ్యూరో: నాంపల్లిలోని పబ్లిక్‌గార్డెన్స్‌లో ఆదివారం జరుగనున్న గణతంత్ర వేడుకల సందర్భంగా నగర పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లను నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రిపబ్లిక్–డే పరేడ్ జరిగే పబ్లిక్ గార్డెన్స్‌ను శనివారం పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం ప్రత్యేక బాంబు నిర్వీర్య బృందాలతో అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. శనివారం జరిగే రిహార్సల్స్‌ను వీక్షించే ఉన్నతాధికారులు భద్రతా చర్యల్లో తీసుకోవాల్సిన మార్పు చేర్పులను సూచిస్తారు. పబ్లిక్గార్డెన్స్తో పాటు ఆ చుట్ట పక్కల ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున బలగాలను మోహరిస్తున్నారు. గార్డెన్స్ చుట్టూ అనునిత్యం పెట్రోలింగ్ నిర్వహించడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. శాంతి భద్రతల విభాగంతో పాటు టాస్క్‌ఫోర్స్, సిటీ సెక్యూరిటీ వింగ్, సీఏఆర్ విభాగాలు, సాయుధ బలగాలు బందోబస్తులో పాల్గొనున్నాయి. దాదాపు 1500 మంది సిబ్బందిని ఇక్కడ మోహరిస్తున్నారు. నగర వ్యాప్తంగా నిఘా, తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు పెద్ద ఎత్తున మఫ్టీ పోలీసులను మోహరించారు. పబ్లిక్‌గార్డెన్స్‌కు దారి తీసే రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో పాటు ప్రధాన ద్వారాల వద్ద మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేయనున్నారు. పరేడ్‌ను వీక్షించడానికి వచ్చే ప్రజలు తమ వెంట హ్యాండ్ బ్యాగ్స్, కెమెరాలు, టిఫిన్ బాక్సులు, బ్రీఫ్ కేసులను తీసుకురావడాన్ని నిషేధించారు. బందోబస్తు చర్యల్లో భాగంగా ఈసారి గగనతలంపై నుంచి కూడా నిఘా ఏర్పాటు చేశారు. రూఫ్ టాప్ వాచ్ కోసం ఎత్తయిన బిల్డింగ్స్‌పైన సుశిక్షితులైన సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. గణతంత్య్ర వేడుకల నేపథ్యంలో తాజ్ ఐలాండ్, ఛాపెల్ రోడ్ ‘టీ’ జంక్షన్, సైఫాబాద్ పాత పోలీస్ స్టేషన్, బషీర్‌బాగ్ జంక్షన్, ఇక్బాల్ మీనార్, ఏఆర్ పెట్రోల్ పంప్, ఆదర్స్‌నగర్ వద్ద ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. ఈ పాయింట్స్ దాటి సాధారణ ట్రాఫిక్‌ను పబ్లిక్‌గార్డెన్స్ వైపు అనుమతించరు. -
విధులను పాటించాలి
న్యూడిల్లీ: విధులను సక్రమంగా నిర్వర్తించడం ద్వారా నవభారత నిర్మాణం జరుగుతుందని, అప్పుడు హక్కులకోసం పోరాడాల్సిన అవసరం ఉండదని ప్రధాని మోదీ యువతకు సందేశమిచ్చారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న యువతను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భిన్నత్వంలో ఏకత్వమే భారత్ గొప్పదనం. భారత్‌లోని ప్రాంతాలుగానీ, ప్రజలుగానీ తాము వివక్షకు గురయ్యామన్న భావన రాకుండా మనమే చూసుకోవాలి. గత 70 ఏళ్లుగా ప్రపంచం ముందు మనం గొప్పగా నిలబడ్డాం. విధులు సక్రమంగా పాటించడం ద్వారా దీన్ని నిలుపుకోగలం. ఇదే గణతంత్ర దినోత్సవ పరేడ్ వెనుక ఉన్న అసలు లక్ష్యం’ అంటూ ప్రధాని మోదీ యువతకు పిలుపునిచ్చారు. రాజ్‌పాత్‌లో జరుగుతున్న కార్యక్రమం భారత శక్తిని ప్రపంచానికి చూపుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ కాడెట్స్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. విలువలు, ఆలోచనలు కలిగిన నవభారత్ను నిర్మించేందుకు శ్రమించాలని యువతకు సందేశం ఇచ్చారు. మీ నుంచి స్ఫూర్తి పొందుతాను.. ‘వివిధ రంగాల్లో మీరు సాధించిన విజయాలు నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇంత చిన్న వయసులో మీరు సాధించిన విజయాలు అమోఘం’ అంటూ ప్రధాని మోదీ.. ‘ప్రధానమంత్రి బాల్ పురస్కార్’ అవార్డు పొందిన పిల్లలతో ముచ్చటించారు. శుక్రవారం మోదీ తన నివాసంలో అవార్డు పొందిన పిల్లలను కలిశారు. ‘మీరు చేసిన పనుల గురించి వింటున్న సమయంలో, మీతో మాట్లాడుతున్న సమయంలో.. నేను కూడా స్ఫూర్తిని, శక్తిని పొందుతాను’ అని వ్యాఖ్యానించారు. -
గణతంత్ర వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ
సాక్షి,విజయవాడ : జనవరి 26ను పురస్కరించుకొని విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. జనవరి 26న గణతంత్ర వేడుకలను ప్రజలంతా గర్వపడేలా నిర్వహించబోతున్నామన్నారు. ఆరోజు ఉదయం 9గంటలకు వేడుకలు ప్రారంభమవుతాయని, పరేడ్ వేడుకలలో ఈసారి తెలంగాణ పోలీసులు కూడా పాల్గొనబోతున్నారని డీజీపీ స్పష్టం చేశారు. ఈసారి వేడుకలలో దిశ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుందని తెలిపారు. గణతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొననుండడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు పేర్కొన్నారు. -
సౌదీలో గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు
గల్ఫ్ డెస్క్: సౌదీ అరేబియాలోని జెద్దాలో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో, యూఏఈలోని దుబాయిలో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో ఈనెల 26న గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నారు. జెద్దాలోని కాన్సులేట్ కార్యాలయంలో ఉదయం 7.45గంటలకు జాతీయ పతాకావిష్కరణ జరగనుంది. కాన్సులేట్ జనరల్ ఎండీ నూర్ రెహమాన్ షేక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. జెద్దాలో ఉన్న ప్రవాస భారతీయులతో పాటు వివిధ దేశాలకు చెందిన వారు కూడా హాజరు కావచ్చని విదేశాంగ శాఖ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, గణతంత్ర వేడుకలకు హాజరయ్యేవారు హ్యాండ్ బ్యాగులు, మొబైల్ ఫోన్లను తీసుకురావద్దని అధికారులు సూచించారు. దుబాయిలోని అల్ హమారియా డిప్లొమెటిక్ ఎన్క్లేవ్ ఆవరణలో నిర్వహించే జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి అందరు భారతీయులు హాజరు కావాలని విదేశాంగ శాఖ అధికారులు కోరారు. -
విశాఖలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
సాక్షి, విశాఖ : గణతంత్ర దినోత్సవ వేడుకలకు విశాఖపట్నం వేదిక కానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి రిపబ్లిక్ డే పరేడ్‌ను విశాఖపట్నంలో నిర్వహించనుంది. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరు కానున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. వేడుకల నిర్వహణ ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు రిపబ్లిక్ డే సందర్భంగా దేశ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన విమానాశ్రయంలో హైఅలర్ట్ ప్రకటించారు. -
బతుకమ్మ సంబురం... వేంకటేశ్వర వైభవం
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శకటాలను ఎంపిక చేసింది. ఈమేరకు రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం అధికారికంగా వెల్లడించింది. రాష్ట్రపతిభవన్ వద్దనున్న రాయ్‌సీనా హిల్స్ నుంచి మొదలై రాజ్‌పథ్, ఇండియాగేట్ మీదుగా ఎర్రకోట వరకు జరిగే పరేడ్‌లో ఈ శకటాలు పాల్గొంటాయి. తెలంగాణ శకటాన్ని ఆ రాష్ట్ర సంస్కృతికి ప్రతీకలైన బతుకమ్మ, మేడారం సమ్మక్క–సారక్క జాతర, వేయిస్తంభాల గుడి ఇతివృత్తంతో రూపొందిస్తారు. ఏపీ శకటాన్ని కూచిపూడి నృత్యం, కొండపల్లి అంబారీ, దశావతారాల»ొమ్మలు, కలంకారీ హస్తకళలతో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల వైభవం ప్రతిబింబించేలా రూపొందిస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అస్సాం, ఛత్తీస్‌గఢ్, గోవా, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ శకటాలను ఎంపిక చేసింది. -
డల్లాస్‌లో ఘనంగా 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
డల్లాస్ : భారత 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అమెరికాలోని డల్లాస్‌లో ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎమ్జీఎమ్ఎన్టీ) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో అమెరికాలోనే అతి పెద్ద గాంధీ స్మారకంగా గుర్తింపు పొందిన మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాలో ఈ వేడుకలు జరిగాయి. మువ్వన్నెల జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి డల్లాస్‌లోని భారతీయులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరిని సంస్థ కార్యదర్శి కాల్వల రావు సాదరంగా ఆహ్వానించారు. సంస్థ చైర్మన్ డా.తోటకూర ప్రసాద్ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడిన ఆయన భారత రాజ్యాంగ విశిష్టత గురించి వివరించారు. స్వాతంత్ర్య సమరయోధుల సేవలను గుర్తుచేశారు. రాజ్యాంగాన్ని రూపోందించిన డాక్టర్ అంబేడ్కర్, జవహార్‌లాల్ నెహ్రూ, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, శ్యాం ప్రసాద్ ముఖర్జీలను గుర్తించుకోవాలన్నారు. వీరంతా మూడేళ్లపాటు ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రూపోందించారని తెలిపారు. ఇప్పటికే ఎంతో అభివృద్ధి సాధించామని.. చేయాల్సింది ఇంకా ఉందని గుర్తుచేశారు. భారతీయ అమెరికన్లుగా రెండు దేశాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.సంస్థ కోచైర్మన్ బీఎన్.రావు మాట్లాడుతూ.. స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ చేసిన కృషి మరవలేదన్నారు. వేడుకలను ముఖ్యఅతిథిగా ఇర్వింగ్ పట్టణ డిప్యూటీ మేయర్ ఆస్కార్ వార్డ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆస్కార్ వార్డు మాట్లాడుతూ..ఉన్నత సమాజ నిర్మాణంలో భారతీయులు చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఇర్వింగ్ కౌన్సిల్ సభ్యుడు ఆలన్ మేగర్ మాట్లాడుతూ.. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారత్, అతి పురాతన ప్రజాస్వామ్య దేశమైన అమెరికా కలిసి పనిచేయాల్సిన అవసరముందన్నారు. ఈ వేడుకల్లో ఎమ్జీఎమ్ఎన్టీ కోశాధికారి అభిజిత్ రాయ్‌కర్‌తో పాటు దాదాపు 150 మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. -
వేగంగా జిల్లా అభివృద్ధి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లాను వేగంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ పేర్కొన్నారు. 70 గణతంత్ర దిన వేడుకలు శనివారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ జాతీయ జెండాను ఎగురవేసి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 9న రామాయపట్నం పోర్టు వద్ద రూ.4,240 కోట్ల అంచనాలతో పోర్టు నిర్మాణం, రూ.24 వేల కోట్ల అంచనాతో ఏషియన్ పేపర్ అండ్ పల్ప్ లిమిటెడ్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారన్నారు. రూ.3500 కోట్లతో జిల్లాలో జిందాల్ స్టీల్స్ లిమిటెడ్ కంపెనీ స్టీల పరిశ్రమ ఏర్పాటుకు ఒప్పందం జరిగిందని చెప్పారు. దొనకొండలో మెగా ఇండస్ట్రీయల్ హబ్, పామూరు ప్రాంతంలో జాతీయ పారిశ్రామిక ఉత్పాదక జోన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు చంద్రన్న కానుక ద్వారా 10 లక్షల 55 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పించన్లు, రేషన్ కార్డులు, పంట సంజీవని, ఎన్టీఆర్ జలసిరి, ఎన్టీఆర్ వైద్య పరీక్షలు, తల్లి, బిడ్డ ఎక్స్‌ప్రెస్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. రైతు రుణ ఉపశమనం కింద మూడు విడతలుగా రూ.1359 కోట్లు రైతుల ఖాతాలకు జమ చేసినట్లు చెప్పారు. రైతులకు యంత్ర పరికరాలు అందిస్తున్నామన్నారు. గత సంవత్సరం కరువు మండలాలకు సంబంధించి పెట్టుబడి రాయితీ రూ.125 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. సూక్ష్మ సాగునీటి పథకం ద్వారా 48,227 ఎకరాల్లో రూ.139.09 కోట్ల విలువైన బిందు, తుంపర పరికరాలు ఇచ్చినట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మత్స్యకారుల సంక్షేమం కోసం రూ.6 కోట్లతో సబ్సిడీపై సైకిళ్లు, వలలు, మోపెడ్స్ ఇచ్చామన్నారు. వనం–మనం కార్యక్రమం ద్వారా కోటి 20 లక్షల మొక్కలు నాటినట్లు చెప్పారు. నాగార్జున సాగర్ కాలువల ఆధునికీకరణలో భాగంగా రూ.73.63 కోట్లతో పనులు చేపట్టామన్నారు. నీరు–చెట్టు కింద రూ.652 కోట్లతో 9522 పనులు చేపట్టామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనులను రూ.5,150 కోట్లతో చేపట్టి త్వరగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2019 సెప్టెంబర్ నాటికి టన్నెల్ 1 పనులు, డిసెంబర్ 2019 నాటికి టన్నెల్ 2 పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుతో పాటు పోతుల చెంచయ్య పాలేరు జలాశయాన్ని పూర్తి చేస్తున్నామన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 297 లక్షల పని దినాలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ.881 కోట్లు ఖర్చు చేసి 238 లక్షల పనిదినాలు కల్పిస్తామన్నారు. ఎన్టీఆర్ జలసిర కింద జిల్లాలో రూ.20 కోట్లతో 6373 బోర్లు వేశామన్నారు. రూ.161.51 కోట్లతో 4686 మంది లబ్ధిదారులకు సోలార్ పంపుసెట్లు బిగించామన్నారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద 74,506 గృహాలు రూ.1130.64 కోట్లతో చేపట్టారన్నారు. ఎన్టీఆర్ పట్టణ గృహ నిర్మాణం కింద రూ.277.47 కోట్లతో 7928 గృహాలను మంజూరు చేశామని చెప్పారు. రూ.250 కోట్లతో 619 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు స్థాపించి 4576 మందికి ఉపాధి కల్పించామన్నారు. పరిశ్రమలకు రాయితీ కింద రూ.84.17 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. చేనేత సహకార సంఘాలకు రూ.3.43 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. చంద్రన్న సంచార చికిత్స ద్వారా 10 లక్షల 15 వేల మందికి ఉచిత వైద్య సేవలు అందించామన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 27,865 మందికి రూ.79 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా 19741 మంది తల్లీ పిల్లలను ప్రసవానంతరం వారి గృహాలకు చేర్చామన్నారు. జిల్లాలోని 2345 ఆవాస ప్రాంతాల్లో 707 ఆవాస ప్రాంతాలకు పూర్తిగా, 1638 ఆవాస ప్రాంతాలకు పాక్షికంగా రక్షిత తాగునీరు అందించినట్లు తెలిపారు. 2017–18 విద్యా సంవత్సరంలో 10 వ తరగతి పరీక్షల్లో 97.93 శాతంతో రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. జిల్లాలో సంక్షేమ అభివృద్థి« పనులతో అన్ని వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తున్నదని కలెక్టర్ చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి, ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రశంస పత్రాలు ఇచ్చారు. వివిధ శాఖల శకటాలు ప్రదర్శించారు. కింద మూడు విడతలుగా రూ.1359 కోట్లు రైతుల ఖాతాలకు జమ చేసినట్లు చెప్పారు. రైతులకు యంత్ర పరికరాలు అందిస్తున్నామన్నారు. గత సంవత్సరం కరువు మండలాలకు సంబంధించి పెట్టుబడి రాయితీ రూ.125 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. సూక్ష్మ సాగునీటి పథకం ద్వారా 48,227 ఎకరాల్లో రూ.139.09 కోట్ల విలువైన బిందు, తుంపర పరికరాలు ఇచ్చినట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మత్స్యకారుల సంక్షేమం కోసం రూ.6 కోట్లతో సబ్సిడీపై సైకిళ్లు, వలలు, మోపెడ్స్ ఇచ్చామన్నారు. వనం–మనం కార్యక్రమం ద్వారా కోటి 20 లక్షల మొక్కలు నాటినట్లు చెప్పారు. నాగార్జున సాగర్ కాలువల ఆధునికీకరణలో భాగంగా రూ.73.63 కోట్లతో పనులు చేపట్టామన్నారు. నీరు–చెట్టు కింద రూ.652 కోట్లతో 9522 పనులు చేపట్టామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనులను రూ.5,150 కోట్లతో చేపట్టి త్వరగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2019 సెప్టెంబర్ నాటికి టన్నెల్ 1 పనులు, డిసెంబర్ 2019 నాటికి టన్నెల్ 2 పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుతో పాటు పోతుల చెంచయ్య పాలేరు జలాశయాన్ని పూర్తి చేస్తున్నామన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 297 లక్షల పని దినాలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ.881 కోట్లు ఖర్చు చేసి 238 లక్షల పనిదినాలు కల్పిస్తామన్నారు. ఎన్టీఆర్ జలసిర కింద జిల్లాలో రూ.20 కోట్లతో 6373 బోర్లు వేశామన్నారు. రూ.161.51 కోట్లతో 4686 మంది లబ్ధిదారులకు సోలార్ పంపుసెట్లు బిగించామన్నారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద 74,506 గృహాలు రూ.1130.64 కోట్లతో చేపట్టారన్నారు. ఎన్టీఆర్ పట్టణ గృహ నిర్మాణం కింద రూ.277.47 కోట్లతో 7928 గృహాలను మంజూరు చేశామని చెప్పారు. రూ.250 కోట్లతో 619 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు స్థాపించి 4576 మందికి ఉపాధి కల్పించామన్నారు. పరిశ్రమలకు రాయితీ కింద రూ.84.17 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. చేనేత సహకార సంఘాలకు రూ.3.43 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. చంద్రన్న సంచార చికిత్స ద్వారా 10 లక్షల 15 వేల మందికి ఉచిత వైద్య సేవలు అందించామన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 27,865 మందికి రూ.79 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా 19741 మంది తల్లీ పిల్లలను ప్రసవానంతరం వారి గృహాలకు చేర్చామన్నారు. జిల్లాలోని 2345 ఆవాస ప్రాంతాల్లో 707 ఆవాస ప్రాంతాలకు పూర్తిగా, 1638 ఆవాస ప్రాంతాలకు పాక్షికంగా రక్షిత తాగునీరు అందించినట్లు తెలిపారు. 2017–18 విద్యా సంవత్సరంలో 10 వ తరగతి పరీక్షల్లో 97.93 శాతంతో రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. జిల్లాలో సంక్షేమ అభివృద్థి« పనులతో అన్ని వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తున్నదని కలెక్టర్ చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి, ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రశంస పత్రాలు ఇచ్చారు. వివిధ శాఖల శకటాలు ప్రదర్శించారు. -
అంకితభావంతోనే అభివృద్ధి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ‘జాతీయ నాయకులు ఆశించిన ఉజ్వల భవిషత్ కోసం ప్రతిఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలి. జిల్లా అన్ని రంగాల్లో ప్రగతి సాధించేందుకు అందరి సహకారం అవసరం. అందరూ సహకరిస్తేనే జిల్లా ప్రగతి పథంలో పయనిస్తుందని’ కలెక్టర్ కె.ధనంజయరెడ్డి అన్నారు. 70వ గణతంత్ర వేడుకలు శ్రీకాకుళంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో శనివారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందన స్వీకరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ.. ఇటీవల జరిగిన జన్మభూమి–మా ఊరు, గ్రామ దర్శిని కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో ఉన్న సమస్యలు తెలుసుకున్నామన్నారు. సుమారు 26,335 వినతులు వచ్చాయన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో సంభవించిన తిత్లీ తుపాను జిల్లాపై తీవ్ర ప్రభావం చూపిందని, ఉద్దానం ప్రాంతం పూర్తిగా పాడైందన్నారు. బాధితులను ఆదుకోవడానికి తీవ్ర కృషి జరిగిందని చెప్పారు. ఉద్దానం పునర్నిర్మాణానికి ‘తూర్పు’ కార్యక్రమం చేపట్టామన్నారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం జిల్లా వ్యయవసాయ ఆధారితం కావడంతో రైతులు లాభసాటి వ్యవసాయం దిశగా అడుగులు వేసేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ చెప్పారు. ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, అధిక దిగుబడులు తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ఖరీప్‌లో రూ.1475 కోట్లు, రబీలో రూ. 428 కోట్లును రైతులకు రుణాలుగా అందించామన్నారు. షెడ్యూలు కులాల వారికి రాయితీతో పనిముట్లు అందజేస్తున్నామన్నారు. ఈ ఏడాది 8,305 మంది రైతులకు రూ.5.88 కోట్లు బీమాగా అందించామని, రైతు రుణ మాఫీ కింద 3 లక్షల మందికి రూ. 403 కోట్లు వారి బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు వివరించారు. తుంపర, బిందు సేద్యాలకు రూ.29 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఉద్యానవన మిషన్ద్వారా వివిధ కేంద్ర, రాష్ట్ర పథకాలకు సంబంధించి రూ. 1459.34 లక్షలు లక్ష్యంగా తీసుకున్నామన్నారు. పాడి పంట అభివృద్ధికి పశుగ్రాసం పెంపకం, వివిధ కార్పొరేషన్ల ద్వారా పశువుల పంపిణీ చేస్తామన్నారు. మత్స్య సంపదను పెంచేందుకు ఆక్వా అభివృద్ధి, చెరువుల్లో చేపల పెంపకానికి పెద్ద పీట వేశామన్నారు. జిల్లాలో 12 ఆక్వా సాగు కేంద్రాలు ప్రారంభించామన్నారు. పొలాలకు సాగునీరు అందించేందుకు బీఆర్ఆర్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని.. ప్రస్తుతం 2.4 టీఎంసీల నీరు ఉందన్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలో రెండు, మూడు పంటలు పండిం చేందుకు రైతులకు అవకాశం ఇస్తామన్నారు. వంశధార–నాగావళి అనుసంధానం వంశధార–నాగావళి నదుల అనుసంధానం పనులు జరుగుతున్నాయని కలెక్టర్ ధనంజయరెడ్డి పేర్కొన్నారు. రూ. 84.90 కోట్లుతో పనులు జరుగుతున్నట్టు చెప్పారు. రూ. 466 కోట్లుతో ఆఫషోర్ ప్రాజె పనులు చేపట్టడం జరిగిందన్నారు. వంశధార–బాహుదా నదులు అనుసంధానానికి రూ. 6,342 కోట్లుతో అంచనాలు రూపొందించామన్నారు. తాగునీటి నీటి ఎద్దడి నివారణకు.. తాగునీటి సమస్యను అ«ధిగమించేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ చెప్పారు. జలుమూరు, సావరకోట మండలాల్లోని 37 గ్రామాల్లో తాగునీరు అందించేందుకు రూ.28 కోట్లు, గార మండలంలోని 18 గ్రామాలకు రూ.4.5 కోట్లుతో పనులు జరుగుతున్నాయన్నారు. ఫోరైడ్ ప్రభావిత గ్రామాల్లో రూ.43.60 కోట్లుతో మూడు శుద్ధ జల పథకాలు మంజూరు చేశామన్నారు. ఉద్దానంలో మంచినీటి కోసం రూ.510 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. సర్కార్ బడుల బలోపేతానికి చర్యలు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతంపై దృష్టిసారించామని కలెక్టర్ చెప్పారు. భవనాలు, ప్రహరీల నిర్మాణం, మరమ్మతులు, తాగునీరు, విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నామన్నారు. 208 పాఠశాలలకు ఆదనపు తరగతి గదులు మంజూరు చేశారు. వైద్యంపై కూడా ప్రత్యేక దృష్టిసారించామన్నారు. ఆస్పతుల్లో మెరుగైన సేవలు అందించేందుకు కృషి జరగుతోందని, వైద్య పరీక్షలకు ఉచిత ల్యాబ్‌లున్నాయన్నారు. మరికొన్నింటిపై దృష్టి... –పేదవారికి గత నాలుగున్నరేళ్లలో 89,185 ఇళ్లు మంజూరు చేశామని కలెక్టర్ ధనంజయరెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. శ్రీకాకుళం నగరాన్ని సుందరంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. 3.50 ఎకరాల్లో శాంతినగర్ కాలనీలో పార్కులను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. నదీతీరంలో రివర్యూ పార్కులను ఏర్పాటు చేస్తునామన్నారు. ఆమదాలవలస, పలాస, ఇచ్ఛాపురం, రాజాం, పాలకొండ పురపాలక సంఘాల్లో అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభ్యున్నతికి కృషి జరుగుతోందన్నారు. చిన్నారి చూపు కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు, అద్దాలు సరఫరా చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 3,961 మంది పిల్లలకు కళ్లద్దాలు అందజేశామన్నారు. కిడ్నీ రోగులపై .. ్డఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వైద్యం అందించేందుకు, వారిలో భయాన్ని పొగొట్టేందుకు అవసమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రిమ్స్‌లో 16 డయాలసిస్ మిషన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉద్దానంలో ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు జరుపుతున్నామన్నారు. స్కీనింగ్ పరీక్షల్లో 13,093 మందికి మూత్రపిండాల వ్యాధి ఉన్నట్టు గుర్తించామన్నారు. పారిశ్రామికాభివృద్ధికి చర్యలు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి 451 ఎకరాల భూమి గుర్తించామని కలెక్టర్ చెప్పారు. చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. భావనపాడు పోర్టు, ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరుగుతోందని.. ఇది పూర్తయితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా రహదారులు, బీటీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హమీ పథకంలో 3,78,819 కుటుంబాలకు పని కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధరబాబు, జిల్లా జడ్డీ బబిత, ఇన్చార్జి ఎస్పీ టి.పనసారెడ్డి, జేసీ–2 పి.రజనీకాంతరావు, డీఆర్వో కె.నరేంద్ర ప్రసాద్, బీఆర్‌ఏయూ వీసీ కూన రామ్‌జీ, జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. అలాగే వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ఉద్యోగులకు, వివిధ పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలు, బహుమతులను అతిథులు ప్రదానం చేశారు. -
సుస్థిర అభివృద్ధే ధ్యేయం
చిత్తూరు కలెక్టరేట్ : సుస్థిర అభివృద్ధే ధ్యేయం కలిసికట్టుగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న పిలుపునిచ్చారు. శనివారం స్థానిక డీటీసీ పెరేడ్ మైదానంలో 70వ గణతంత్ర దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిం చారు. ఉదయం 7.45 గంటలకు కలెక్టర్ జాతీయ పతాకావిష్కరణ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం పోలీసులు, ఎన్సీసీ విద్యార్థుల నుంచి కలెక్టర్ గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశిం చి కలెక్టర్ ప్రసంగించారు. గణతంత్ర దినోత్సవ గొప్పతనాన్ని చెబుతూ జిల్లా అభివృద్ధి గురించి వివరించారు. ఈ వేడుకల్లో ఎస్పీ విక్రాంత్‌పాటిల్, జాయింట్ కలెక్టర్ గిరీషా, జేసీ– 2 చంద్రమౌళి, డీఆర్వో గంగాధరగౌడ్, ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే సత్యప్రభ, జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, నగర మేయర్ కఠారి హేమలత తదితరులు పాల్గొన్నారు. పడమటి మండలాలు సస్యశ్యామలంగా.. కరువుతో తల్లడిల్లుతున్న పడమటి కరువు సీమను రతనాల సీమగా సస్యశ్యామలంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. డీఆర్డీఏ ద్వారా జిల్లాలో దాదాపు 4.50 లక్షల మంది గ్రామీణ డ్వాక్రా మహిళలకు రూ.1571 కోట్ల బ్యాంకు రుణాలను మంజూరు చేసి జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచినట్లు చెప్పారు. మెప్మా ద్వారా రూ.399 కోట్ల బ్యాంకు రుణాలను అందజేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచామన్నారు. మహిళల ఆత్మగౌరవ నినాదంతో చేపట్టిన స్వచ్ఛభారత్ ఉద్యమానికి జిల్లా ప్రజల నుంచి గొప్ప సహకారం లభించిందన్నారు. 2017–18 సంవత్సరంలో దేశంలోనే అత్యధికంగా 2,70,251 వ్యక్తిగత మరుగుదొడ్లను ఉద్యమస్థాయిలో నిర్మించి దేశంలో ప్రథమస్థానం సాధించినట్టు చెప్పారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం డీటీసీ పోలీసు పరేడ్ మైదానంలో వేడుకలను అద్భుతం, అమోఘంగా నిర్వహిం చారు. పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు జయహో అనిపిం చాయి. దేశభక్తి, భారత దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, స్వాతంత్య్ర సమరయోధుల పోరా టం, దేశగొప్పతనం, ప్రజాస్వామ్యం విశిష్టతను చాటిచెబుతూ రచించిన గేయాలకు విద్యార్థులు అద్భుతంగా అభినయించారు. ప్రదర్శనను చూసిన కలెక్టర్ ప్రద్యుమ్న విద్యార్థులను అభినందించారు. జాగిలాల విన్యాసాలు, అగ్ని మాపక శాఖ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇక జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన అధికారు లు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. -
అభివృద్ధి సంకల్పం
అనంతపురం అర్బన్: ‘‘జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించి రాష్ట్రంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుదాం. సంక్షేమాభివృద్ధి పథకాలు అర్హులందరికీ అందేలా మెరుగైన సేవలు అందించాలనే మా సంకల్పానికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలి.’’ అని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ అన్నారు. శనివారం స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు జాతీయ పతాకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రజలకు తన సందేశాన్ని వినిపించారు. వేడుకలో జెడ్పీ చైర్మన్ పూల నాగరాజు, ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వరరెడ్డి, వి.ప్రభాకర్ చౌదరి, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, శమంతకమణి, మేయర్ ఎం.స్వరూప, జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావు, ఎస్సీ జి.వి.జి.అశోక్‌కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్, డీఆర్ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, ఏఎస్పీ చౌడేశ్వరి, ఓఎస్డీ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రెండంకెల వృద్ధికి కృషి జరుగుతోంది. వ్యవసాయం, పండ్లతోటల విస్తీర్ణం 8.91 లక్షల హెక్టార్లు కాగా.. రూ.14,731 కోట్ల ఆదాయానికి పెరిగి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని మరింతగా పెంచి జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రైతులను ప్రోత్సహిస్తున్నాం. 2024 నాటికి 8 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు పెంచడం ద్వారా 64 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడితో రూ.20 వేల కోట్ల ఆదాయం తీసుకోవాలనే లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాను వందశాతం డ్రిప్ వినియోగించే ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాం. పశు సంవర్ధక, సెరికల్చర్, మత్స్య రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం.’’ జల వనరులపై ప్రత్యేక దృష్టి జిల్లాను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో జలవనరులపై ప్రత్యేక దృష్టి సారించాం. 3.45 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే లక్ష్యంతో హంద్రీనీవా ప్రాజెక్టు రెండు దశల పనులు పూర్తయ్యాయి. పుంగనూరు బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తయ్యాయి. మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులు చివరి దశలో ఉన్నాయి. జిడిపల్లి, గొల్లపల్లితో పాటు ఈ ఏడాది మారాల, చెర్లోపల్లి జలాశయాలకు కృష్ణా జలాలను ఇచ్చాం. హెచ్ఎన్ఎస్ఎస్, హెచ్ఎల్సీ, మైనర్ ఇరిగేషన్ ద్వారా జిల్లాకు 170.817 టీఎంసీల నీరు చేరింది. మడకశిర, హిందూపురం, పెనుకొండ నియోజకవర్గాల్లోని మారుమూల ప్రాంతాలకు కృష్ణా నీటిని అందించాం. ఈ ఏడాది జిల్లాకు 92.073 టీఎంసీల నీరు విడుదల చేయగా, 82 చెరువులకు నీటిని ఇవ్వడం వల్ల 7.20 టీఎంసీల మేర భూగర్భజలం వృద్ధి చెందింది. పేదలను ఆదుకునేలా ఉపాధి ఉపాధి హామీ పథకం ద్వారా పేదలను ఆదుకునేలా పనులు కల్పిస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో రూ.302 కోట్లు వేతనంగా కూలీలకు చెల్లించాం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ నెల వరకు రూ.385 కోట్ల వేతనం చెల్లించడం ద్వారా జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచింది. భూగర్భ జలాలు పెంచే లక్ష్యంతో పంట సంజీవని కింద లక్ష పంట కుంటలు లక్ష్యం కాగా రూ.568.38 కోట్ల ఖర్చుతో 1,05,205 పంట కుంటలు పూర్తి చేయడం ద్వారా దేశంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ఉంచి, కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 59,109 మందికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా శస్త్ర చికిత్సలు చేయించాం. ఇందుకు రూ.155 కోట్లు వెచ్చించాం. 108, ఎన్టీఆర్ వైద్య పరీక్షలు, తల్లిబిడ్డా ఎక్స్‌ప్రెస్, ఈ–ఔషిధి, చంద్రన్న సంచార చికిత్స, మహిళా హెల్త్ చెకప్, తదితర పథకాల ద్వారా పేదలకు మెరుగైన సేవలు అందిస్తాం. విద్యాభివృద్ధికి ప్రత్యేక స్థానం విద్యాభివృద్ధికి ప్రత్యేక స్థానం కల్పించాం. సర్వశిక్షా అభియాన్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.83.03 కోట్లు విడుదల కాగా, రూ.55.65 కోట్లు ఖర్చు చేశాం. కస్తూరిబా పాఠశాలల్లో వసతుల కల్పన, పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం, ఆవాసరహిత ప్రత్యేక శిక్షణా కేంద్రాల ద్వారా శిక్షణ, మదరసాలతో వాలంటీర్ల నియామకం, 1 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న బాల, బాలికలకు యూనిఫాం తదితర కార్యక్రమాలకు ఈ ఖర్చు చేశాం. 125 పాఠశాలల్లో డిజిటల్ బోధన, పర్చువల్ క్లాస్ రూర్ స్టూడియో నిర్మించాం. అర్హులకు సంక్షేమ పథకాలు అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నాం. పేదలకు ఎన్టీఆర్ ఇళ్లు, రేషన్ కార్డులు, కార్పొరేషన్ల ద్వారా రుణాలు, తదితరాలను అందిస్తూ వారి ఆర్థిక ఎదుగుదలకు చర్యలు తీసుకున్నాం. పారిశ్రామికంగా జిల్లాను అభివృద్ధి పరిచేలా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. -
పాలమూరుకు పచ్చని పైట
పాలమూరు : కరవు కటకాలతో అల్లాడుతూ జీవకళ కోల్పోయిన జిల్లాకు కృష్ణమ్మ నీటిని తరలించి బీడు భూముల్లో బంగారు పంటలు పండించడానికి పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వరంగా మారనుందని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని పరేడ్‌మైదానంలో శనివారం ఉదయం ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖల వారీగా ప్రగతిని వివరించారు. ఆ వివరాలు కలెక్టర్ మాటల్లోనే... ూ సాగునీటి రంగం : పాలమూరు–రంగారెడ్డి పథకం కింద 22మండలాల్లోని 4,13,167 ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు అందించనున్నాం. ఈ పనులు పురోగతిలో ఉన్నాయి. సంగంబండ రిజర్వాయర్ కింద ఖరీఫ్, రబీ–2018లో 40వేల ఎకరాలు, రబీ–2019లో 5వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చాం. దీంతో పాటు 45 చెరువులు నింపాం. ఇక భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద ఖరీఫ్, గత రబీలో 37వేల ఎకరాల ఆయకట్టు నీళ్లు ఇవ్వడంతో పాటు 33చెరువులు నింపాం. కోయిల్‌సాగర్ ఎత్తపోతల కింద ఖరీఫ్, రబీ–2018కి సంబంధించి 25వేల ఆయకట్టుకు నీటి సరఫరా చేయడంతో పాటు 42చెరువులకు నీటిని అందించాం. మిషన్ కాకతీయ పథకం కింద జిల్లాలో 2,563 చెరువును ఐదేళ్లలో పునరుద్ధరించాలనేది లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 1,191 పనులను రూ.154.45కోట్లతో పూర్తి చేశాం. అలాగే, జిల్లాలో 3,11,894 మంది రైతులకు కొత్త పట్టదార్ పాసుపుస్తకాలు పంపిణీ చేశాం. వ్యవసాయం : రైతు బంధు పథకంలో భాగంగా జిల్లాలో 2,82,120 మంది రైతులకు రూ.316.32 కోట్ల విలువైన 2,87,075 చెక్కులు పంపిణీ చేశాం. రబీ 2018–19 సీజన్లో 2,90,611 మంది రైతులకు గాను ఇప్పటి వరకు 2,34,271 మంది రైతుల ఖాతాల్లో రూ.276.34 కోట్లు జమ చేశాం. రైతు భీమా పథకంలో భాగంగా ఇప్పటి వరకు 1,69,260 మంది అర్హులైన రైతులను గుర్తించి భీమా పత్రాలు అందజేశాం. ఇందులో ఇప్పటి వరకు 486మంది రైతులు మృతి చెందగా 413 మంది కుటుంబ సభ్యులకు రూ.20.65కోట్లు వారి ఖాతాల్లో వేశాం. భూసార ఆరోగ్య కార్డు పథకం కింద 2018–19గాను 25.519 మట్టి నమూనాలను సేకరించి 19,136 పరీక్ష ఫలితాలను రైతులకు ఇచ్చాం. సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ కింద రూ.2.03కోట్ల వ్యయంతో పండ్ల తోటల విస్తరణ, ఫాంపాండ్స్, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటుచేశాం. పశు సంవర్ధక శాఖ : జిల్లాలో పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ఇప్పటి వరకు 220మెట్రిక్ టన్నుల స్వల్పకాలిక, మేలుజాతి పశుగ్రాస విత్తనాలను 75శాతం సబ్సిడీపై రైతులకు ఇచ్చాం. ఇప్పటివరకు 2,096మందికి పశువులు పంపిణీ చేశాం. మార్కెటింగ్ : జిల్లా కేంద్రంలో రూ.5.50కోట్ల వ్యయంతో రైతు బజార్ ఏర్పాటు, 13మండలాల్లో గోదాములు 60వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేశాం. విద్యుత్ : 2018–19 ఏడాదిలో రూ.38.15 కోట్ల విలువైన 23 ఉపకేంద్రాలు మంజూరు కాగా,ఇందు లో నాలుగు ఉపకేంద్రాల పనులు పూర్తయ్యాయి. వ్యవసాయ బావుల విద్యుత్ కోసం కోసం 5,761 దరఖాస్తులు రాగా 3,983 కనెక్షన్లు ఇచ్చాం. ఆర్అండ్బీ: జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మాణం చేస్తున్న కలెక్టరేట్ కాంప్లెక్స్ కోసం రూ.43.83కోట్లు మంజూరు కాగా, పనులు పురోగతిలో ఉన్నాయి. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి అనుసంధాన రహదారుల కోసం 158.10 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.210.57 కోట్లు మంజూరయ్యాయి. మహబూబ్‌నగర్ పట్టణ బైపాస్ నిర్మాణానికి రూ.96.70కోట్లు మంజూరయ్యాయి. పౌరసరఫరాల శాఖ : రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడంలో భాగంగా ఐకేపీ ద్వారా 39వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 45676.360 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. ఇందుకోసం 11,398 మంది రైతులకు రూ.75.83కోట్లు చెల్లించాం. వైద్య, ఆరోగ్యశాఖ : కంటి వెలుగు పథకం కింద జిల్లాలో 6,96,431 మంది కంటి పరీక్షలు చేసి 1,02,796 అద్దాలు అందజేశాం. ఇక 1,177మందికి ఆపరేషన్లు చేయించాం. జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో 15 అధునాతన లేబర్ రూంలు నిర్మాణం పూర్తిచేశాం. డీఆర్డీఓ : 2018–19 ఏడాదిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం కింద రూ.99.63కోట్లతో 89,285 కుటుంబాల్లోని 1,41,203 మంది కూలీలకు 36.14లక్షల పనిదినాలు కల్పించాం. జిల్లాలోని 96 గ్రామాల్లో బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించాం. మత్స్యశాఖ : జిల్లాలో 251 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి 185 చెరువుల్లో 1.15 కోట్ల చేప విత్తనాలు వదిలాం. దీంతో పాటు మత్స్యకారులకు 2,163 ద్విచక్ర వాహనాలు, 183 నాలుగు చక్రాల వాహనాలు సబ్సిడీపై అందజేశాం. అటవీశాఖ : ఈ ఏడాది వేపూర్, మునిమోక్షం అటవీ ప్రాంతాల్లో 66.60 హెక్టార్ల విస్తీర్ణంలో 77, 572 మొక్కలను నాటాం. జాతీయ రహదారి సుం దరీకరణలో భాగంగా 57 కిలోమీటర్ల పొడవున 25, 147మొక్కలు, అంతర్రాష్ట్ర రోడ్ల వెంబడి 51,750 మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం. జిల్లా కేంద్రంలోని అప్నన్నపల్లి సమీపంలో ఉన్న మయూరి ఎకో పార్క్‌ను సుందరీకరించాం. -
జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లా సమగ్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు శ్రమిస్తామని కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ ఉద్ఘాటించారు. గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని శనివారం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పతాకావిష్కరణ చేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. మన దేశం ఆధునిక శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందన్నారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో శరవేగంగా ముందుకు సాగుతూ.. అగ్రగామిగా నిలిచిందన్నారు. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో జిల్లా పురోగతిపై ఆయన మాటల్లోనే.. రైతుల ఆర్థికాభివృద్ధికై.. వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతుల గురించి రైతులకు వివరించి.. వారి ఆర్థికాభివృద్ధి కోసం వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఖరీఫ్ లో రూ.1,170కోట్ల పంట రుణాలు అందించాం. రబీ సీజన్లో రూ.541.51కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్ణయించాం. రబీ విత్తన ప్రణాళిక కింద జిల్లాలో 4,286 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేశాం. ఆత్మ ద్వారా 2018–19లో 72 క్షేత్ర ప్రదర్శనలు నిర్వహించి.. వివిధ రైతు సంక్షేమ కార్య క్రమాల ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చాం. భూరికార్డుల సమీకరణలో భాగంగా జిల్లాలో మొత్తం 9.57 లక్షల ఎకరాల భూముల రికార్డులను సమీకరించాం. 380 రెవెన్యూ గ్రామాల్లో భూరికార్డుల ప్రక్షాళనను విజయవంతంగా చేపట్టాం. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో భాగంగా రెండు విడతల్లో 2,71,574 పుస్తకాలను రైతులకు అందించాం. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు 2,45,848 ఖాతాలను ఆన్లైన్ చేయడంతోపాటు 1,84,805 మంది రైతులకు రూ.185.48కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు జిల్లాలో 7 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండగా.. వాటిలో నాబార్డు సౌజన్యంతో రూ.36కోట్లతో 60వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 12 గోదాముల నిర్మాణాలు జరుగుతున్నాయి. ముగింపు దశలో మిషన్ భగీరథ మిషన్ భగీరథ పనులు ముగింపు దశలో ఉన్నాయి. పాలేరు, వైరా సెగ్మెంట్ల ద్వారా రూ.1,308కోట్లతో మిషన్ భగీరథ పనులు చేపట్టాం. ఇక మిషన్ కాకతీయ మొదటి మూడు దశల్లో రూ.309.52కోట్లతో 1,437 చెరువులను పునరుద్ధరించాం. నాలుగో దశ కింద రూ.29.27కోట్లతో మరో 120 పనులను చేపట్టి.. ఇప్ప టికే 72 పనులను పూర్తి చేశాం.సాగర్ ఆధు నికీకరణకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో రూ.572.22కోట్లతో పనులు చేపట్టాం. అలాగే జిల్లాలో రోడ్ల విస్తరణ, నిర్మాణానికి ప్రత్యేక చర్యలు చేపట్టాం. రూ.43కోట్లతో మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి రోడ్లను రెండు వరుసలుగా విస్తరించాం. రెండు వరుసల రోడ్ల ను నాలుగు వరుసలుగా విస్తరించేందుకు రూ.165కోట్లతో 11 పనులు చేపట్టాం. ఖమ్మం–సూర్యాపేట, ఖమ్మం–కోదాడ, ఖమ్మం–దేవరపల్లి, ఖమ్మం–వరంగల్, ఖమ్మం–విజయవాడ రోడ్లను జాతీయ రహదారులుగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన ను అందిస్తున్నాం. ఈ విద్యాసంవత్సరం 1,12,303 మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, రెండు జతల దుస్తులను ఉచితంగా పంపిణీ చేశాం. నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు.. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో భాగంగా జిల్లాకు 14,560 గృహాలు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటివరకు 9,019 నిర్మాణాలకు పరిపాలనా అనుమతులు ఇచ్చాం. 5,527 ఇళ్ల నిర్మాణాలు మొదలై వివిధ దశల్లో ఉన్నాయి. 2,158 గృహాలు పూర్తి చేసుకుని.. 620 ఇళ్లలో లబ్ధిదారులు గృహప్రవేశం చేశారు. విద్యుత్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి ద్వారా జిల్లా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. మరింత మెరుగైన విద్యుత్ సరఫరా కోసం జిల్లాలో ఇప్పటివరకు రూ.1,304కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. అంతేకాక 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.21కోట్లతో మరో 14 సబ్స్టేషన్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. సబ్సిడీ పథకం కింద ఐదేళ్లలో రూ.255.5కోట్ల సబ్సిడీ అందించాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆధునిక వైద్యం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆధునిక పరిజ్ఞానంతో కూడిన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చాం. జిల్లా ప్రధా న ఆస్పత్రిలో 150 పడకలతో ప్రారంభించిన మాతా, శిశు సంరక్షణ కేంద్రం ద్వారా మాతా, శిశు సేవలు అందిస్తున్నాం. 10 పడకలతో ఐసీయూ, 12 పడకలతో డయాలసిస్ సెంటర్ ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షే మానికి జిల్లాలో వివిధ సంక్షేమ కార్యక్రమాల లబ్ధిని అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తున్నాం. జిల్లాలోని 39 ఎస్సీ వసతి గృహాల్లో 4,107 మంది, 23 బీసీ వసతి గృహాల్లో 2,546 మంది, ఏడు మైనార్టీ గురుకుల విద్యాలయాల్లో 1,840 మంది, 11 గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 6,980 మంది విద్యార్థినీ విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నాం. పేదింటి ఆడపిల్ల పెళ్లి కుటుంబానికి భారం కాకూడదనే సంకల్పంతో అమలవుతున్న షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు 11,944 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ లబ్ధిదారులకు రూ.83,7,36,000 అందించాం. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా పలు కార్య క్రమాలను అమలు చేస్తున్నాం. ఉపాధిహామీ పథకం కింద 201819 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.96.06కోట్లతో 53.36 లక్షల పని దినాలను కల్పించాం. 3 లక్షల జన్‌ధన్ ఖాతాల ద్వారా వేతనాలు చెల్లిస్తున్నాం. ప్రధానమంత్రి సురక్షా యోజన పథకం కింద 52,396 కుటుంబాలకు బీమా చేయిం చడంతోపాటు మరణించిన 168 మంది కూలీల కుటుంబాలకు రూ.3.36కోట్లు అందించాం. ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధునిక పద్ధతుల ద్వారా జిల్లాలో 4,04,697 వివిధ కార్డుదారులకు నిత్యావసర వస్తువులు అందిస్తున్నాం. జిల్లాలో పరిశ్రమలను వేగవంతంగా విస్తరించేందుకు ఔత్సాహికులను ప్రోత్సహించడంలో భాగంగా టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తున్నాం. లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ.. గొర్రెల పంపిణీ పథకం కింద జిల్లాలో 15,099 మంది లబ్ధిదారులకు 75 శాతం రాయితీపై రూ.133.32కోట్లతో యూనిట్లను పంపిణీ చేశాం. పాల ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో రూ.3.32కోట్లతో 416 పాడిగేదెలను పంపిణీ చేశాం. హరితహారంలో భాగంగా మూడేళ్లలో 10.02 కోట్ల మొక్కలు నాటాం. 2019లో 395.60 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంతో మొక్కలను పెంచుతున్నాం. రూ.4కోట్లతో లకారం చెరువు సుందరీకరణ, రూ.13.73కోట్లతో డివైడర్ల నిర్మాణం, రూ.2.50 కోట్లతో పారిశుద్ధ్య పనుల కోసం వాహనాలు కొనుగోలు చేశాం. వయోవృద్ధుల సౌకర్యార్థం నగరంలోని గాంధీపార్కులో రూ.40లక్షలతో డేకేర్ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. వీటితోపాటు అనేక సంక్షేమ, అభి వృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్, సీపీ తఫ్సీర్ ఇక్బాల్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జేసీ ఆయేషా మస్రత్ ఖానం, ఇన్చార్జి జెడ్పీ సీఈఓ హన్మంతు కొడింబా, సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు పోలీస్ కమిషనర్ మురళీధర్ పాల్గొన్నారు. -
సాక్షి కార్యాలయంలో గణతంత్ర వేడుకలు
-
ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన హిందీ, ఇంగ్లీష్‌లో ట్వీట్ చేశారు. కాగా, రిపబ్లిక్ ఉత్సవాలకు దేశ రాజధాని సిద్ధమైంది. మరికాసేపట్లో.. రాజ్‌పథ్ వేదికగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ త్రివర్ణ పతాకం ఆవిష్కరించనున్నారు. రిపబ్లిక్ డే ఉత్సవాలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోస ముఖ్య అథిగా హాజరవుతున్న సంగతి తెలిసిందే. Happy Republic Day to all fellow Indians. सभी देशवासियों को #गणतंत्रदिवस की शुभकामनाएं। जय हिन्द! — Narendra Modi (@narendramodi) January 26, 2019 -
ఘనంగా గణతంత్ర దినోత్సవం
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్ ఆతిథ్యం ఇవ్వగా.. గవర్నర్ నరసింహన్ జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. గవర్నర్‌తో పాటు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతి అత్యంత సుందరంగా ముస్తాబైంది. -
రిపబ్లిక్ డే వేడుకలకు సర్వం సిద్ధం
-
రిపబ్లిక్ డే వేడుకల్లో ఉగ్రకుట్ర భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు
-
సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో రిపబ్లిక్ డే రిహార్సల్స్
-
గణతంత్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హా, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, అడిషనల్ డీజీ జితేందర్, హైదరాబాద్ కలెక్టర్ రఘునందన్‌రావు, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. వేడుకల్లో గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు. పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పా ట్లు చేపట్టాలని పోలీస్ శాఖను ఆదేశించారు. ఇటు జీహెచ్ఎంసీకి పరేడ్‌గ్రౌండ్స్‌లో పారిశుధ్యం, మొబైల్ టాయిలెట్లు తదితర ఏర్పాట్లు చేయాలని తెలిపారు. రాజ్‌భవన్, సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, చార్మినార్, గన్‌పార్క్, క్లాక్‌టవర్, ఫతేమైదాన్ లాంటి చారిత్రక కట్టడాలను విద్యుద్దీపాలతో అలకరించాలన్నారు. వేడుకల ప్రత్యక్ష ప్రసారానికి తగిన ఏర్పాట్లు చేయాలని విద్యుత్‌శాఖను ఆదేశించారు. వేడుకకు హాజరయ్యే పాఠశాల విద్యార్థుల కోసం ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. వేదిక వద్ద అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉంచాలని సూచిం చారు. అమరుల సైనిక స్మారక్ వద్ద సీఎం కేసీఆర్ పుష్పగుచ్ఛం సమర్పించడానికి ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. -
గణతంత్ర వేడుకలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసను ప్రత్యేక అతిథిగా ప్రభుత్వం ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఆఫ్రికా లేదా దక్షిణ అమెరికా ఖండాల్లోని ఏదైనా ఒక దేశాధినేతను గణతంత్ర వేడుకలకు అతిథిగా ప్రభుత్వం ఆహ్వానించాలనుకుంటోందనీ, రమఫోస పేరు దాదాపుగా ఖరారైనప్పటికీ ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సంబంధిత ఉన్నతాధికారులు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఈసారి గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆహ్వానించినా ఆయన రాలేనని చెప్పడం తెలిసిందే. -
రిపబ్లిక్ డే ఉత్సవాలకు రావట్లేదు
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొనాలంటూ భారత్ పంపిన ఆహ్వానాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. కొత్త ఏడాది ఆరంభంలో స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంతోపాటు తనకు వేరే పనులు ఉండటంతో రావడం కుదరదంటూ అమెరికా యంత్రాంగం భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్‌కు లేఖ పంపింది. భారతగణతంత్ర దినోత్సవంలో ప్రతిఏడాదీ ఒక దేశాధినేతను ముఖ్య అతిథిగా భారత్ ఆహ్వానిస్తుంది. అదే కోవలో వేడుకల్లో పాల్గొనాలంటూ భారత అమెరికా అధ్యక్షుడికి జూలైలో ఆహ్వానం పంపింది. అయితే, ట్రంప్ పాల్గొనేదీ లేనిదీ 2 ప్లస్ 2 చర్చల తర్వాత చెబుతామంటూ అమెరికా వాయిదా వేసింది. అనంతర పరిణామాలు ఆ దేశ వైఖరిలో మార్పునకు కారణమయ్యాయి. క్షిపణి రక్షణ వ్యవస్థ ‘ట్రయంఫ్’ కొనుగోలుకు భారత్ రష్యాతో ఒప్పందం కుదుర్చుకోవడం, ఇరాన్ నుంచి చమురును కొనరాదన్న అమెరికా ఆంక్షలను బేఖాతరు చేయడం ట్రంప్ అసంతృప్తికి కారణమయ్యాయని భావిస్తున్నారు. కాగా, గత అధ్యక్షుడు బరాక్ ఒబామా స్టేట్ ఆఫ్ ది యూనియ న్ ప్రసంగం, ఇతరత్రా కార్యక్రమాలు ఉన్నప్పటికీ 2015 గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. -
రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ట్రంప్!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే గణతంత్ర దినోత్సవానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి అమెరికా నుంచి బదులు రాలేదు, కానీ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. గతేడాది జూన్‌లో వాషింగ్టన్లో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా భారత్‌లో పర్యటించాలని మోదీ ట్రంప్‌ను కోరారు. 2019 గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనాలని ట్రంప్‌కు తాజాగా ఆహ్వానం పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
భారత్‌పర్వ్‌లో ఆకట్టుకున్న ‘తెలంగాణ’
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఏర్పాటుచేసిన భారత్‌పర్వ్ లో తెలంగాణ సంస్కృతి, కళా రూపాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దేశవ్యాప్తంగా విభిన్న కళలు, సంస్కృతులు, సంప్రదాయాలను ఒక్క చోటుకి చేర్చే లక్ష్యంతో కేంద్ర పర్యాటక శాఖ ఏటా 6 రోజుల పాటు భారత్‌పర్వ్ కార్యక్రమం నిర్వహిస్తుంది. తెలంగాణకు సంబంధించిన పేరిణీ శివతాండవం, ఒగ్గు రవి శిష్యబందం డోలు విన్యాసాలు, కళాకారుల సాంస్కతిక నత్యాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అశోక్‌కుమార్, ఏఆర్సీ వేదాంతం గిరి పాల్గొన్నారు. -
ఆస్ట్రేలియాలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
సిడ్నీ: ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం (ఏటీఫ్) ఆధ్వర్యంలో భారత 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రీడాల్మేర్ - యూప్ జాన్ పార్క్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రవాస భారతీయులు సిడ్నీలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం వ్యవస్థాపక సభ్యుడు వినోద్ ఏలేటి, అధ్యక్షుడు అశోక్ మాలిష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ పతాకానికి సెల్యూట్ చేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా జాతీయ నాయకులైన మహాత్మా గాంధీ, బీఆర్ అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేడుకలకు హాజరైన ఎన్నారైలందరికీ భారతీయ మిఠాయిలను పంచిపెట్టారు. ఏటీఫ్ స్వచ్ఛంద, సేవా కార్యక్రమాలను ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సేరి వివరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రాముఖ్యతను తెలిపారు. గాంధీ, అంబేడ్కర్, నెహ్రూ, వల్లభాయి పటేల్ లాంటి మహానీయులను గుర్తు చేసుకోవడం అదృష్టమని పేర్కొన్నారు. ఈ 69 ఏళ్లలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందిందని గణతంత్ర వేడుకల కు హాజరైన ఎన్నారైలందరికీ ప్రదీప్ సేరి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జాతీయోద్యమం, ఆటలు, సినిమా, వివిధ రంగాలపై క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోవర్దన్, సుమేష్ రెడ్డి , వాసు తాట్కూర్, ప్రమోద్ ఎలెటి, కవిత, సంగీత, రూప , సందీప్ మునగాల, అనిల్ మునగాల ప్రశాంత్ కడపర్తి, మిథున్ తదితరులు పాల్గొన్నారు. -
రుచిక కేసు దోషికి అంత గౌరవమా?
పంచకుల : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘రుచిక లైంగిక వేధింపుల కేసు’లో దోషి, హరియాణా మాజీ డీజీపీ ఎస్పీఎస్ రాథోడ్ మరోసారి వార్తల్లోకెక్కాడు. గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా పంచకులలో ప్రభుత్వం నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నాడు. ఉన్నతాధికారులతో సహా ఆయన స్టేజీ పంచుకోవటంపై తీవ్ర విమర్శలకు దారితీసింది. లైంగిక వేధింపుల కేసులో జైలు శిక్ష అనుభవించిన ఆయన.. పోలీస్ అధికార కార్యక్రమాలకు మాజీ హోదాలో కూడా హాజరుకాకూడదన్న ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. అయినప్పటికీ వాటిని ఆయన ఉల్లంఘించారు. అధికారులు కూడా ఆ అంశాన్ని పెద్దగా పట్టించుకోకుండా వేదిక మీదకు ఆయన్ని ఆహ్వానించారు. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ‘ఇది జాతీయ జెండాకు అగౌరవమేనని రుచికా స్నేహితురాలు, ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి ఆరాధన గుప్తా చెబుతున్నారు. నేరస్థులకు ప్రభుత్వం ఇంత గౌరవం ఇవ్వటమేంటని?’ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రుచిక తల్లి కూడా ఇది రాజ్యాంగాన్ని అవమానపరచటమేనని చెబుతున్నారు. హరియాణాలో ఈ మధ్య మహిళలపై అకృత్యాలు పెరిగిపోయిన నేపథ్యంలో... ఈ వ్యవహారం ప్రభుత్వానికి మరింత తలనొప్పిగా మారింది. కేసు పూర్వాపరాలు... 1990లో పోలీస్ ఉన్నతాధికారిగా ఉన్న ఎస్పీఎస్ రాథోడ్... హరియాణా టెన్సిస్ అసోషియేషన్ ప్రధానాధికారిగా కూడా వ్యవహరించారు. ఆ సమయంలో తన కూతురి క్లాస్ మేట్ అయిన రుచికా గిర్ హోత్రా అనే పదో తరగతి విద్యార్థినిని లైంగికంగా వేధించాడు. దీనిపై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా.. అక్కడి నుంచి రాథోడ్ తన అధికారంతో రుచికా కుటుంబాన్ని కష్టాలకు గురిచేశాడు. రుచికను స్కూల్ నుంచి సస్పెండ్ కావటం.. ఆమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగం కోల్పోవటం... కేసును వాదించిన న్యాయవాదికి చిక్కులు, ప్రత్యక్ష సాక్షి అయిన రుచిక స్నేహితురాలు ఆరాధాన కుటుంబానికి వేధింపులు.. చివరకు 13 ఏళ్ల రుచిక సోదరుడిని దొంగతనం కేసుల్లో అక్రమంగా ఇరికించి థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు. ఈ పరిణామాలను తట్టుకోలేక రుచిక 1993లో విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో పత్రికల కథనాలను పరిగణనలోకి తీసుకుని సుమోటోగా కోర్టు కేసును స్వీకరించి సీబీఐ విచారణకు ఆదేశించింది. విచారణ సమయంలోనే ఆయన హరియాణా డీజీపీ(అదనపు)గా బాధ్యతలు స్వీకరించటం చర్చనీయాంశమైంది. 19 ఏళ్లపాటు కొనసాగిన కేసు, 40 వాయిదాలు, 400 వాదనలు... చివరకు 2009లో రాథోడ్‌ను నిందితుడిగా తేల్చిన కోర్టు డీజీపీ బాధ్యతల నుంచి ఆయన్ని తొలగించాలని, ఆయనకిచ్చిన గౌవర పురస్కారాలను వెనక్కి తీసుకోవాలని హోం శాఖను ఆదేశిస్తూ... ఆరు నెలల శిక్షతో సరిపెట్టింది. తర్వాత సీబీఐ కోర్టులో దీనిపై వాదనలు జరగ్గా.. ఆ శిక్షను ఏడాదిన్నరకు మారుస్తూ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 2010లో కోర్టు విచారణకు హాజరై బయటకు వస్తున్న ఆయన్ని వారణాసికి చెందిన ఉత్సవ్ శర్మ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపబోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించటంతో రాథోడ్ బయటపడ్డాడు. రాథోడ్ సుప్రీం కోర్టును ఆశ్రయించటంతో ఆరేళ్ల విచారణ తర్వాత.. కోర్టు ఆయన్ని దోషిగా తేల్చి శిక్షలో 6 నెలల మినహాయింపు ఇచ్చింది. -
కాస్గంజ్లో పెరిగిన ఉద్రిక్తత
కాస్గంజ్: పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్ పట్టణంలో గణతంత్ర దినోత్సవ ర్యాలీ సందర్భంగా రేగిన ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. శనివారం కూడా కొందరు ఆగంతకులు విధ్వంసానికి పాల్పడ్డారు. ఓ బస్సు, మూడు దుకాణాలను, ఇతర వాణిజ్య సముదాయాలను తగలబెట్టారు. దీంతో పట్టణంలో శాంతిభద్రతల పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు 144 సెక్షన్ (కర్ఫ్యూ) కొనసాగిస్తున్నారు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి 49 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నగరంలో ఓ విద్యార్థి సంఘం చేపట్టిన తిరంగా ర్యాలీపై మరో వర్గం రాళ్లు రువ్వటంతో చందన్‌గుప్తా ఓ యువకుడు చనిపోగా మరో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. దీంతో వివాదం రేగింది. శనివారం గుప్తా అంత్యక్రియల అనంతరం ఓ వర్గం బస్సును తగులబెట్టగా.. ప్రత్యర్థి వర్గం దుకాణ సముదాయాలపై దాడులు చేసిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని.. ముందు జాగ్రత్త చర్యగా నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నామని యూపీ పోలీసు అదనపు డీజీ ఆనంద్ తెలిపారు. ఈ అల్లర్ల ఘటన దురదృష్టకరమని యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులను వదిలిపెట్టబోమన్నారు. -
డల్లాస్‌లో ‘ఘన’తంత్ర వేడుకలు
డల్లాస్ : భారత 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అమెరికాలోని డల్లాస్‌లో ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎమ్జీఎమ్ఎన్టీ) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో ఉత్తర టెక్సాస్‌లోని ఇర్వింగ్‌లోని మహాత్మాగాంధీ స్మారక స్థూపం వద్ద ఈ వేడుకలు జరిగాయి. మువ్వన్నెల జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి డల్లాస్‌లోని భారతీయులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా నగరం నడిబొడ్డున గాంధీ మెమోరియల్ స్వప్నం సాకారానికి కృషి చేసిన వారందరిని ఎమ్జీఎమ్ఎన్టీ సెక్రటరీ రావు కల్వల కొనియాడారు. గణతంత్ర వేడుకకు వచ్చిన వారందరికీ స్వాగతం పలికి, ఎమ్జీఎమ్ఎన్టీ నిర్వహించే కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్జీఎమ్ఎన్టీ ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోట కూర భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందువులకు భగవద్గీత, ముస్లింలకు ఖురాన్, క్రైస్తవులకు బైబిల్ అంటూ ప్రతి మతానికి ఓ గ్రంథం ఉందని, కానీ భారత పౌరులందరికి కలిపి ఒకే గ్రంథం ఉందని అది రాజ్యాంగమని తెలిపారు. ఈ పవిత్ర గంథం పౌరుల సూత్రాలు, విధానాలు, అధికారాలు, విధులు, బాధ్యతలు మరియు ప్రాథమిక హక్కులను నిర్వచిస్తుందన్నారు. రాజ్యాంగమే సుప్రీమని, ప్రతి పౌరుడు రాజ్యాంగం యొక్క విలువలను అర్ధం చేసుకోని అనుసరించాలన్నారు. రాజ్యాంగాన్ని రూపోందించిన డాక్టర్ అంబేడ్కర్, జవహార్‌లాల్ నెహ్రూ, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, శ్యాం ప్రసాద్ ముఖర్జీలను గుర్తించుకోవాలన్నారు. వీరంతా మూడేళ్లపాటు ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రూపోందించారని తెలిపారు. గాంధీ విగ్రహానికి ఎమ్జీఎమ్ఎన్టీ డైరెక్టర్ కమల్ కౌశల్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. మరో డైరెక్టర్ షబ్నమ్ మోడ్గిల్ గాంధీ వర్థంతిని పురస్కరించుకొని జనవరి 30న అందరం మళ్లీ కలుసుకుని మహాత్ముడికి నివాళులు అర్పిద్దామని పేర్కొన్నారు. ఈ వేడుకలకు అమెరికాలోని భారత పౌరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. సుల్తానాబాద్‌లో విద్యార్థులు ఇండియా చిత్రపటంలా నిలిచారు. ధర్మారంలో సాయిమణికంఠ, బ్రిలియంట్ మోడల్ స్కూల్ విద్యార్థులు జాతీయ గీతాలపై నృత్యాలు చేశారు. కాల్వశ్రీరాంపూర్ అల్ఫోర్స్, గర్రెపెల్లి పాఠశాలల్లో విద్యార్థులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. -
అయ్యో సార్లూ.. ఇదేం తీరు..
సిరిసిల్లటౌన్: గణతంత్ర వేడుకల్లో ఉద్యోగులకు ఇచ్చే సేవా పురస్కార అవార్డుల్లో అధికారుల తీరుపై పలువురి నుంచి విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఓ మహిళాధికారి ఏకంగా కన్నీళ్లు పెట్టుకుంది. జిల్లా బీసీడీవో కార్యాలయంలో ఏబీసీడబ్ల్యూగా సంపూర్ణ ఏడాదిగా విధులు నిర్వహిస్తున్నారు. గణతంత్ర వేడుకలు పురస్కరించుకుని అధికారులు గురువారం రాత్రి ఫోన్‌చేసి అవార్డుకు ఎంపికైనట్లు చెప్పి ఆహ్వానించారు. దీంతో ఆమె శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న గణతంత్ర వేడుకలకు వచ్చారు. తీరా అవార్డు ఇచ్చే సమయంలో బీసీ వెల్ఫేర్ శాఖకు అతీతంగా ఎస్సీ వెల్ఫేర్ శాఖకు చెందిన మరో వ్యక్తికి ఇచ్చారు. దీంతో ఏబీసీ డబ్ల్యూ సంపూర్ణ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఎస్సీ వెల్ఫేర్ శాఖను తమ శాఖలో పూర్తిగా విలీనం చేయకుండానే తమ శాఖకు చెంది న వారికి కాకుండా ఇతరలకు ఎలా ఇస్తారంటూ..రోదించారు. అవార్డు వచ్చిం దని పిలిచి..అవమానిస్తారా అంటూ.. బీసీడివో అఫ్జల్‌మోహీయోద్దీన్‌తో వాగ్వాదానికి దిగారు. విషయాన్ని డీఆర్వో శ్యాంప్రసాద్‌లాల్ దృష్టికి తీసుకుపోయానని ఆమె వివరించారు. శాఖలో పనిచేసే అధికారుల వృత్తిలో ప్రతిభను ఉన్నతాధికారులకు నివేదించడమే మావంతని అవార్డులు ఇవ్వడం మా పరిధిలో లేదని వివరించారు. -
జయహో జెండా పండుగ
-
రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగం అమల్లోకి వచ్చిన గణతంత్ర దినోత్సవం నాడే ప్రజాహక్కులు కాలరాసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి ఆరోపించారు. పరుషంగా మాట్లాడితే పోలీసులే జోక్యం చేసుకుని జైలుకు తరలించే చట్టాన్ని తేవటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడినా, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినా, మీడియా చర్చల్లో పరుష వ్యాఖ్యలు చేసినా అరెస్టులు చేసేలా ప్రభుత్వం చట్టం చేస్తుందన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే రాష్ట్రంలో నియంత పాలన జరుగుతోందన్నారు. ఈ కొత్త చట్టంతో నియంతృత్వం మరింత పెరుగుతుందని, ప్రజలు దీన్ని గుర్తించి టీఆర్ఎస్కు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. మిషన్ కాకతీయ, భగీరథ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం, పురపాలక శాఖలోని కొన్ని పథకాలు...ఇవన్నీ పెద్ద కుంభకోణాలని ఆరోపించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంచంద్రరావు, సీనియర్ నేతలు శేషగిరిరావు, మేచినేని కిషన్‌రావు, ఇంద్రసేనారెడ్డి, పుష్పలీల తదితరులు పాల్గొన్నారు. -
గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్న వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/సాక్షి, హైదరాబాద్/విజయవాడ సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఓజిలి మండలం సగుటూరు గ్రామంలో గణతంత్రదిన వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ పాదయాత్ర ఓజిలి మండలం సగుటూరులో గురువారం ముగిసింది. రాత్రి ఆయన బసచేసిన క్యాంప్ కార్యాలయం వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన గణతంత్రదిన వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొని జాతీయజెండా ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు. జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వేడుకల్లో పాల్గొన్న చిన్నారులతో జగన్ ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, తిరుపతి, నెల్లూరు పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షులు, శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్, జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్, పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నాయకుడు పేర్నేటి శ్యాంప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఉత్సవాలు హైదరాబాద్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో జరిగిన రిపబ్లిక్ దినోత్సవాల్లో శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫున, పార్టీ నేతలందరి తరఫునా భారతీయులకు, ఎన్ఆర్ఐలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఉమ్మారెడ్డి అన్నారు. ఈ ఉత్సవాల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, పీఎన్వి ప్రసాద్, పార్టీ నేతలు కరణం ధర్మశ్రీ, వాసిరెడ్డి పద్మ, వైఎస్ వివేకానందరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, టీజీవీ కృష్ణారెడ్డి, బత్తుల బ్రహ్మానందరెడ్డి, రొంగలి జగన్నాథం, చల్లా మధుసూదన్‌రెడ్డి, హర్షవర్థన్, కాకుమాను రాజశేఖర్‌తో సహా పలువురు పాల్గొన్నారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలోనూ గణతంత్ర దిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ కృష్ణా జిల్లా కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతోనే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చేపట్టారన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జెండా ఆవిష్కరిస్తున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. చిత్రంలో విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, వైఎస్ వివేకానందరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి తదితరులు -
జయహో జెండా పండుగ
న్యూఢిల్లీ: భారత దేశభక్తిని, అస్త్ర శక్తిని ప్రతిబింబించేలా 69వ గణతంత్ర వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా హాజరైన ఆసియాన్ దేశాధినేతల సమక్షంలో భారత సంప్రదాయాలు, సైనిక పాటవ ప్రదర్శనల నడుమ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. రాజ్‌పథ్ రోడ్డులో జరిగిన ఈ కార్యక్రమానికి వేలమంది ప్రజలు, ప్రముఖులు హాజరయ్యారు. త్రివర్ణపతాక ఆవిష్కరణ అనంతరం భారత త్రివిధ దళాల అధిపతి, రాష్ట్రపతి రామ్‌నాథ్ పరేడ్‌లో సైనిక వందనం స్వీకరించారు. రాష్ట్రపతిగా కోవింద్‌కు ఇదే తొలి గణతంత్ర దినోత్సవ వేడుక. చీఫ్ గెస్ట్లుగా.. ఆసియాన్ దేశాల వ్యూహాత్మక సంబంధాలతో బలమైన కూటమిగా ఎదిగే క్రమంలో భారత్‌లో జరుగుతున్న జాతీయ వేడుకలకు ఈ 10 దేశాల అధినేతలు ముఖ్య అతిథులుగా హాజరవటం ఇదే తొలిసారి. మయన్మార్ కౌన్సెలర్ ఆంగ్‌సాన్ సూచీ, వియత్నాం ప్రధాని ఎన్‌గెయెన్ జువాన్, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటర్టె, థాయలాండ్ ప్రధాని ప్రయుత్ చానోచా, సింగపూర్ చీఫ్ సీన్ లూంగ్, బ్రూనై సుల్తాన్ హాజీ బోల్‌కయా, ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో, మలేసియా ప్రధాని నజీబ్ రజాక్, లావోస్ పీఎం థాంగ్లౌన్ సిసౌలిత్, కంబోడియన్ అధ్యక్షుడు హున్సేన్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల ప్రారంభానికి ముందు ప్రధాని.. రక్షణ మంత్రి, త్రివిధ దళాల చీఫ్‌లతో కలిసి ఇండియా గేట్ వద్ద అమర జవాన్ జ్యోతి వద్ద నివాళులర్పించారు. గణతంత్ర వేడుకల్లో.. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, జైట్లీ, జేపీ నడ్డా, రవిశంకర్ ప్రసాద్ సహా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, మాజీ ప్రధాని మన్మోహన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 61 మంది గిరిజన ప్రముఖులు ఈ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించారు. కళ్లన్నీ ఆకాశంలోనే.. పరేడ్ చివర్లో ఎమ్ఐ–17 యుద్ధ విమానాలు, రుద్ర హెలికాప్టర్లు, ఐఏఎఫ్ విమానాలతో వైమానికదళం చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. ఎల్‌హెచ్, ఎంకే–4, డబ్ల్యూఎస్ఐ హెలికాప్టర్లు, సీ–130జే సూపర్ హెర్క్యులస్ యుద్ధ విమానం చేసిన విన్యాసాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. 21 గన్ సెల్యూట్ సంప్రదాయం ప్రకారం త్రివర్ణ పతాకావిష్కరణ తర్వాత జాతీయగీతం ఆలాపనతోపాటు 52 సెకన్లపాటు 21 గన్ సెల్యూట్ నిర్వహించారు. 2281 రెజిమెంట్‌కు చెందిన ఏడు ఫిరంగుల ద్వారా ఈ గన్ సెల్యూట్ నిర్వహించారు. గణతంత్ర దినోత్సవంతోపాటు, ఆగస్టు 15, ఆర్మీడే (జనవరి 15), అమరవీరుల దినం (జనవరి 30)న ఈ రకమైన గన్‌సెల్యూట్ చేస్తారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా 13 రాష్ట్రాలు, పలు మంత్రిత్వ శాఖలు తమ శకటాలను ప్రదర్శించాయి. డీఆర్డీవో సంస్థ.. నిర్భయ్ క్షిపణిని, అశ్విని రాడార్ వ్యవస్థతో కూడిన శకటంతో పరేడ్‌లో పాల్గొంది. ‘జగమంత’ వేడుకలు ఢిల్లీతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లు త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు. ప్రజలు ప్రాథమిక హక్కులను పొందటంతోపాటు తమ బాధ్యతలు గుర్తెరిగి మసలుకోవాలని ప్రజలకు సూచించారు. రాజస్తాన్‌లోని పోఖ్రాన్లో ఓ భారతీయుడు, ఇద్దరు సౌదీ జాతీయులు శాటిలైట్ ఫోన్లతో సంచరిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చైనా, రష్యా, యూకే, ఈజిప్ట్, ఇండోనేసియా, సింగపూర్, బంగ్లాదేశ్, నేపాల్ తదితర దేశాల్లోని దౌత్యకార్యాలయాల్లోనూ పతాకావిష్కరణ ఘనంగా జరిగింది. భద్రతను పక్కనపెట్టి.. గణతంత్ర దినోత్సవ సంబరాల అనంతరం ప్రధాని మోదీ భద్రతను పక్కనపెట్టి వేడుకలను చూసేందుకు రాజ్‌పథ్‌కు వచ్చిన ప్రేక్షకులకు బారికేడ్ల వద్దకెళ్లి అభివాదం చేశారు. తలపై కాషాయం, ఎరుపు, ఆకుపచ్చని సంప్రదాయ తలపాగాతో ప్రత్యేకంగా కనిపించిన మోదీ.. తమ వద్దకు వస్తుండటంతో ప్రేక్షకుల్లో హర్షం వ్యక్తమైంది. మోదీ, మోదీ నినాదాలతో వాతావరణాన్ని వారంతా మరింత హుషారుగా మార్చారు. గతేడాది స్వాతంత్య్ర దినోత్సవం అనంతరం కూడా ప్రజల వద్దకెళ్లి వారితో కరచాలనం చేశారు. ఆసియాన్ దేశాల అధినేతలు పాల్గొన్న ఈ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 60వేల మంది ఢిల్లీ పోలీసు, ఆర్మీ బలగాలు, షార్ప్ షూటర్లతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆకట్టుకున్న పరేడ్ మార్చ్‌పాస్ట్‌లో ఆసియాన్ జెండాతోపాటుగా 10 దేశాల జాతీయజెండాలనూ ప్రదర్శించారు.బీఎస్ఎఫ్ మహిళా సైనికుల ‘సీమా భవానీ’ బృందం చేసిన మోటార్ సైకిల్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారత ఆర్మీ యుద్ధ ట్యాంకు టీ–90 (భీష్మ), బ్రహ్మోస్ మిసైల్ వ్యవస్థ, శత్రువుల ఆయుధాలను పసిగట్టే రాడార్, బ్రిడ్జ్ లేయింగ్ ట్యాంక్ టీ–72, ఆకాశ్ ఆయుధ వ్యవస్థ సహా తదితర భారత మిలటరీ సామర్థ్యాలను పరేడ్‌లో ప్రదర్శించారు. ఆర్మీ అశ్వికదళం, పంజాబ్ రెజిమెంట్, మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ, డోగ్రా రెజిమెంట్, నౌక, వైమానిక దళాలూ మార్చ్ఫాస్ట్ నిర్వహించాయి. ఢిల్లీ, నాగ్‌పూర్‌లోని పాఠశాలల విద్యార్థుల నృత్యప్రదర్శన ఆకట్టుకుంది. రాష్ట్రపతి ఉద్వేగం ఈ వేడుకల్లో భారత అత్యుత్తమ మిలటరీ సేవా పురస్కారం (శాంతి సమయాల్లో ఇచ్చే) అశోకచక్రను ఐఏఎఫ్ గరుడ్ కమాండో కార్పొరల్ జ్యోతి ప్రకాశ్ నిరాలా (మరణానంతరం)కు అందజేశారు. ఈ అవార్డు ఇస్తున్న సమయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉద్వేగానికి గురయ్యారు. గతేడాది నవంబర్‌లో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ అమరుడైన ఎయిర్‌ఫోర్స్ గరుడ్ కమాండో, కార్పొరల్ జ్యోతి ప్రకాశ్ నిరాలా ఈ ఏడాది అశోకచక్ర అవార్డుకు ఎంపికయ్యారు. నిరాలా భార్య సుష్మానంద్, ఆయన తల్లి మాలతీ దేవీ ఈ అవార్డును అందుకున్నారు. అశోక చక్ర అందిస్తున్న సందర్భంగా రాష్ట్రపతి ఉద్వేగానికి గురయ్యారు. తన సీట్లో తిరిగి కూర్చోగానే చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకుంటూ కనిపించారు. పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆసియాన్ దేశాల శకటం రాజ్‌పథ్ పరేడ్‌లో పాల్గొన్న సైనిక వాహనాలు నిరాలా కుటుంబానికి అశోకచక్రను ప్రదానం చేస్తున్న రాష్ట్రపతి కోవింద్ -
ఆ దేశాధినేతలకు మన ‘ప్రాథమిక’ సందేశం
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం భారత్ గణతంత్ర దినోత్సవం వేడుకలకు విశిష్ట అతిథులుగా ఆగ్నేయ ఆసియా దేశాల సంఘానికి చెందిన పది మంది నాయకులను ఆహ్వానించడం ఎంతో విశేషం. దీన్ని ప్రాంతీయ సహకారం దిశగా భారత్ వేస్తున్న ముందడుగుగా భావించవచ్చు. పైగా గత దశాబ్దకాలంగా ఈ దేశాలను తన వైపు తిప్పుకునేందుకు చైనా ప్రయత్నిస్తున్న దశలో ఆ దేశాల అధినేతలను మన గణతంత్ర వేడుకలకు ఆహ్వానించడం ఎంతో ముదావహం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామన్న విషయం తెల్సిందే. అమెరికా, బ్రిటన్, రష్యాలాంటి రాజ్యాంగాలతోపాటు ‘ఫ్రెంచ్ విప్లవం’ను ప్రధాన స్ఫూర్తిగా తీసుకొని డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ నాయకత్వంలోని భారత రాజ్యాంగ పరిషత్తు దీన్ని రూపొందించింది. ఫ్రెంచ్ విప్లవం నుంచి స్ఫూర్తిగా తీసుకొని రూపొందించినవి ప్రాథమిక హక్కులు. అందులో ప్రధానమైనది భావ ప్రకటనా స్వాతంత్య్రం. దీన్ని ఇప్పుడు పత్రికా స్వేచ్ఛగా కూడా పరిగణిస్తున్నాం. ఆగ్నేయాసియా దేశాల నుంచి హాజరైన నాయకుల్లో ఎక్కువ మంది తమ దేశాల్లో భావ ప్రకటనా స్వేచ్ఛను అణచి వేస్తున్నవారే. మన దేశంలో కూడా అప్పుడప్పుడు అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అలాంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడి మనం భావ ప్రకటనా స్వేచ్ఛను నిలబెట్టుకుంటున్నాం. వివాదాస్పదమైన ‘పద్మావత్’ చిత్రం విడుదలను అడ్డుకునేందుకు రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో ప్రయత్నించడం రాజ్యాంగం ప్రకారం మనకు సంక్రమించిన భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే. ఈ నాలుగు రాష్ట్రాల్లో నిషేధాన్ని సుప్రీం కోర్టు కొట్టివేయడం ద్వారా మన స్వేచ్ఛను రక్షించింది. సొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసును విచారిస్తున్న జడ్జీ లోయా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం పట్ల దాఖలైన పిటిషన్ విచారణకు ముంబై జర్నలిస్టులను ట్రయల్ కోర్టు అనుమతించలేదు. వారు దీన్ని హైకోర్టులో సవాల్ చేయడం ద్వారా విజయం సాధించారు. సోహ్రాబుద్ధీన్ ఎన్కౌంటర్ కేసులో ఇదివరకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెల్సిందే. పత్రికా స్వేచ్ఛ విషయంలో ఆగ్నేయ ఆసియా దేశాలు దారుణంగా వ్యవహరిస్తున్నాయి. లావోస్ 2014లో కఠినమైన సైబర్ చట్టాన్ని తీసుకొచ్చింది. సైబర్ నేరాలను అరికట్టేందుకు అంత కఠినమైన చట్టం అవసరం లేదని ప్రపంచ దేశాలు విమర్శించాయి. అదే తరహాలో అక్కడి ఆంగ్ల పత్రిక ‘కాంబోడియా డెయిలీ’ విమర్శించింది. ప్రధాన మంత్రి హన్ సెన్ బహిరంగంగా ఆ పత్రికను తీవ్రంగా విమర్శించారు. ఆ రోజు నుంచి పన్నుల నోటీసుల పేరిట ప్రభుత్వం వేధించడంతో కొన్ని రోజుల్లోనే ఆ పత్రిక మూత పడింది. ప్రధాని అణచివేత ధోరణులను భరించలేక అనేక స్వచ్ఛంద సంస్థలు దేశం విడిచిపోయాయి. మలేసియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో కూడా స్వతంత్ర పత్రికలు, వెబ్సైట్లు ప్రభుత్వ వేధింపులను ఎదుర్కొంటున్నాయి. మలేసియాకు చెందిన ‘మలేసియాకిని’పై భారీ మొత్తంలో పరువు నష్టం దావా వేసి కోలుకోకుండా చేస్తున్నారు. రాజ్యాంగేతర హత్యలను ప్రశ్నించినందుకు ఫిలిప్పీన్స్ ప్రభుత్వం తక్షణం ‘ర్యాప్లర్’ పత్రికను మూసేయాల్సిందిగా ఆదేశించింది. మయన్మార్‌లో రోహింగ్య జాతి పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును విమర్శించినందుకు ఆంగ్సాక్ సూచీ ప్రభుత్వం ఇద్దరు ‘రాయటర్స్’ జర్నలిస్టులపై కఠినమైన ప్రభుత్వ రహస్య చట్టం కింద కేసులు పెట్టి వేధిస్తోంది. భారత గణతంత్ర వేడుకులకు విశిష్ట అతిథులుగా వచ్చిన ఆగ్నేయాసియా దేశాధినేతలు ఏ ఉద్దేశంతో వచ్చినా భారత రాజ్యాంగ స్ఫూర్తిని తెలుసుకుంటే వారి రాకకు సార్థకత చేకూరుతుంది. -
జై కిసాన్.. జై భారత్..
పశ్చిమగోదావరి: రైతే రాజు అనే నిజాన్ని ప్రతి ఒక్కరూ ఒప్పుకుని తీరాలి. రైతు లేనిదే దేశం లేదు. దేశానికి ఆహార అవసరాలు తీర్చే రైతును విస్మరించకూడదు. చదువు ఏదైనా వ్యవసాయంపై మాత్రం ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలంటూ భీమవరం జీవీఐటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులు తుందుర్రు గ్రామం వద్ద పొలంలోకి దిగారు. వరినాట్లు వేస్తున్న కూలీలకు కొద్దిసేపు సహాయపడ్డారు. రిపబ్లిక్ డేకి ఇదే మా స్వాగతం అంటూ ఆహ్వానం పలికారు. వారంతా జాతీయతా భావం ఉట్టిపడేలా మువ్వన్నెల రంగు వస్త్రాలు ధరించడం విశేషం. – సాక్షి ఫొటోగ్రాఫర్ / ఏలూరు -
గాంధీభవన్‌లో గణతంత్ర వేడుకలు
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్చగా జరుగుతోందన్నారు. రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనపై కాంగ్రెస్ కార్యకర్తలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.