డల్లాస్‌లో ఘనంగా 72వ రిపబ్లిక్‌ వేడుకలు | 72nd Republic Day Celebrations In Dallas | Sakshi
Sakshi News home page

డల్లాస్‌లో ఘనంగా 72వ రిపబ్లిక్‌ వేడుకలు

Jan 27 2021 9:10 PM | Updated on Jan 27 2021 9:12 PM

72nd Republic Day Celebrations In Dallas - Sakshi

డల్లాస్: టెక్సస్ - డల్లాస్లోని మహాత్మాగాంధీ మెమోరియల్ దగ్గర భారత దేశ 72 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర భారతదేశ జెండా ను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. కోవిడ్ కారణంగా అతి సాధారణంగా జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి రావు కల్వల, కో ఛైర్మన్ శైలేష్ షా లు పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని రచించిన బి. ఆర్. అంబేద్కర్, ఇతర సభ్యులకు, మహాత్మాగాంధీతో పాటు పలువురు జాతీయ నాయకులకు ఘన నివాళులర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement