
గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కలెక్టర్ వినయ్‌చంద్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లాను వేగంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ పేర్కొన్నారు. 70 గణతంత్ర దిన వేడుకలు శనివారం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ జాతీయ జెండాను ఎగురవేసి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 9న రామాయపట్నం పోర్టు వద్ద రూ.4,240 కోట్ల అంచనాలతో పోర్టు నిర్మాణం, రూ.24 వేల కోట్ల అంచనాతో ఏషియన్ పేపర్ అండ్ పల్ప్ లిమిటెడ్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారన్నారు. రూ.3500 కోట్లతో జిల్లాలో జిందాల్ స్టీల్స్ లిమిటెడ్ కంపెనీ స్టీల పరిశ్రమ ఏర్పాటుకు ఒప్పందం జరిగిందని చెప్పారు. దొనకొండలో మెగా ఇండస్ట్రీయల్ హబ్, పామూరు ప్రాంతంలో జాతీయ పారిశ్రామిక ఉత్పాదక జోన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు చంద్రన్న కానుక ద్వారా 10 లక్షల 55 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్లు తెలిపారు.
ఎన్‌టీఆర్ భరోసా పించన్లు, రేషన్ కార్డులు, పంట సంజీవని, ఎన్‌టీఆర్ జలసిరి, ఎన్‌టీఆర్ వైద్య పరీక్షలు, తల్లి, బిడ్డ ఎక్స్‌ప్రెస్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. రైతు రుణ ఉపశమనం కింద మూడు విడతలుగా రూ.1359 కోట్లు రైతుల ఖాతాలకు జమ చేసినట్లు చెప్పారు. రైతులకు యంత్ర పరికరాలు అందిస్తున్నామన్నారు. గత సంవత్సరం కరువు మండలాలకు సంబంధించి పెట్టుబడి రాయితీ రూ.125 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. సూక్ష్మ సాగునీటి పథకం ద్వారా 48,227 ఎకరాల్లో రూ.139.09 కోట్ల విలువైన బిందు, తుంపర పరికరాలు ఇచ్చినట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మత్స్యకారుల సంక్షేమం కోసం రూ.6 కోట్లతో సబ్సిడీపై సైకిళ్లు, వలలు, మోపెడ్స్ ఇచ్చామన్నారు. వనం–మనం కార్యక్రమం ద్వారా కోటి 20 లక్షల మొక్కలు నాటినట్లు చెప్పారు. నాగార్జున సాగర్ కాలువల ఆధునికీకరణలో భాగంగా రూ.73.63 కోట్లతో పనులు చేపట్టామన్నారు. నీరు–చెట్టు కింద రూ.652 కోట్లతో 9522 పనులు చేపట్టామన్నారు.
వెలిగొండ ప్రాజెక్టు పనులను రూ.5,150 కోట్లతో చేపట్టి త్వరగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2019 సెప్టెంబర్ నాటికి టన్నెల్ 1 పనులు, డిసెంబర్ 2019 నాటికి టన్నెల్ 2 పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుతో పాటు పోతుల చెంచయ్య పాలేరు జలాశయాన్ని పూర్తి చేస్తున్నామన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 297 లక్షల పని దినాలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ.881 కోట్లు ఖర్చు చేసి 238 లక్షల పనిదినాలు కల్పిస్తామన్నారు. ఎన్‌టీఆర్ జలసిర కింద జిల్లాలో రూ.20 కోట్లతో 6373 బోర్లు వేశామన్నారు. రూ.161.51 కోట్లతో 4686 మంది లబ్ధిదారులకు సోలార్ పంపుసెట్లు బిగించామన్నారు. ఎన్‌టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద 74,506 గృహాలు రూ.1130.64 కోట్లతో చేపట్టారన్నారు. ఎన్టీఆర్ పట్టణ గృహ నిర్మాణం కింద రూ.277.47 కోట్లతో 7928 గృహాలను మంజూరు చేశామని చెప్పారు.
రూ.250 కోట్లతో 619 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు స్థాపించి 4576 మందికి ఉపాధి కల్పించామన్నారు. పరిశ్రమలకు రాయితీ కింద రూ.84.17 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. చేనేత సహకార సంఘాలకు రూ.3.43 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. చంద్రన్న సంచార చికిత్స ద్వారా 10 లక్షల 15 వేల మందికి ఉచిత వైద్య సేవలు అందించామన్నారు. ఎన్‌టీఆర్ వైద్య సేవ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 27,865 మందికి రూ.79 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా 19741 మంది తల్లీ పిల్లలను ప్రసవానంతరం వారి గృహాలకు చేర్చామన్నారు. జిల్లాలోని 2345 ఆవాస ప్రాంతాల్లో 707 ఆవాస ప్రాంతాలకు పూర్తిగా, 1638 ఆవాస ప్రాంతాలకు పాక్షికంగా రక్షిత తాగునీరు అందించినట్లు తెలిపారు. 2017–18 విద్యా సంవత్సరంలో 10 వ తరగతి పరీక్షల్లో 97.93 శాతంతో రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. జిల్లాలో సంక్షేమ అభివృద్థి« పనులతో అన్ని వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తున్నదని కలెక్టర్ చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి, ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రశంస పత్రాలు ఇచ్చారు. వివిధ శాఖల శకటాలు ప్రదర్శించారు.
కింద మూడు విడతలుగా రూ.1359 కోట్లు రైతుల ఖాతాలకు జమ చేసినట్లు చెప్పారు. రైతులకు యంత్ర పరికరాలు అందిస్తున్నామన్నారు. గత సంవత్సరం కరువు మండలాలకు సంబంధించి పెట్టుబడి రాయితీ రూ.125 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. సూక్ష్మ సాగునీటి పథకం ద్వారా 48,227 ఎకరాల్లో రూ.139.09 కోట్ల విలువైన బిందు, తుంపర పరికరాలు ఇచ్చినట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మత్స్యకారుల సంక్షేమం కోసం రూ.6 కోట్లతో సబ్సిడీపై సైకిళ్లు, వలలు, మోపెడ్స్ ఇచ్చామన్నారు. వనం–మనం కార్యక్రమం ద్వారా కోటి 20 లక్షల మొక్కలు నాటినట్లు చెప్పారు. నాగార్జున సాగర్ కాలువల ఆధునికీకరణలో భాగంగా రూ.73.63 కోట్లతో పనులు చేపట్టామన్నారు. నీరు–చెట్టు కింద రూ.652 కోట్లతో 9522 పనులు చేపట్టామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనులను రూ.5,150 కోట్లతో చేపట్టి త్వరగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2019 సెప్టెంబర్ నాటికి టన్నెల్ 1 పనులు, డిసెంబర్ 2019 నాటికి టన్నెల్ 2 పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుతో పాటు పోతుల చెంచయ్య పాలేరు జలాశయాన్ని పూర్తి చేస్తున్నామన్నారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 297 లక్షల పని దినాలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ.881 కోట్లు ఖర్చు చేసి 238 లక్షల పనిదినాలు కల్పిస్తామన్నారు. ఎన్‌టీఆర్ జలసిర కింద జిల్లాలో రూ.20 కోట్లతో 6373 బోర్లు వేశామన్నారు. రూ.161.51 కోట్లతో 4686 మంది లబ్ధిదారులకు సోలార్ పంపుసెట్లు బిగించామన్నారు. ఎన్‌టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద 74,506 గృహాలు రూ.1130.64 కోట్లతో చేపట్టారన్నారు. ఎన్టీఆర్ పట్టణ గృహ నిర్మాణం కింద రూ.277.47 కోట్లతో 7928 గృహాలను మంజూరు చేశామని చెప్పారు. రూ.250 కోట్లతో 619 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు స్థాపించి 4576 మందికి ఉపాధి కల్పించామన్నారు. పరిశ్రమలకు రాయితీ కింద రూ.84.17 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.
చేనేత సహకార సంఘాలకు రూ.3.43 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. చంద్రన్న సంచార చికిత్స ద్వారా 10 లక్షల 15 వేల మందికి ఉచిత వైద్య సేవలు అందించామన్నారు. ఎన్‌టీఆర్ వైద్య సేవ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 27,865 మందికి రూ.79 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా 19741 మంది తల్లీ పిల్లలను ప్రసవానంతరం వారి గృహాలకు చేర్చామన్నారు. జిల్లాలోని 2345 ఆవాస ప్రాంతాల్లో 707 ఆవాస ప్రాంతాలకు పూర్తిగా, 1638 ఆవాస ప్రాంతాలకు పాక్షికంగా రక్షిత తాగునీరు అందించినట్లు తెలిపారు. 2017–18 విద్యా సంవత్సరంలో 10 వ తరగతి పరీక్షల్లో 97.93 శాతంతో రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. జిల్లాలో సంక్షేమ అభివృద్థి« పనులతో అన్ని వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తున్నదని కలెక్టర్ చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి, ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రశంస పత్రాలు ఇచ్చారు. వివిధ శాఖల శకటాలు ప్రదర్శించారు.