నియంతృత్వ ధోరణికి ప్రజలు చరమగీతం పాడారు: తమిళిసై | Republic Day Celebrations In Telangana Live Updates | Sakshi
Sakshi News home page

నియంతృత్వ ధోరణికి ప్రజలు చరమగీతం పాడారు: తమిళిసై

Jan 26 2024 7:36 AM | Updated on Jan 26 2024 3:58 PM

Republic Day Celebrations In Telangana Live Updates - Sakshi

Live Updates..

►ఈరోజు సాయంత్రం రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్‌ కార్యక్రమం

►ఎట్‌ హోమ్‌ కార్యక్రమానికి హాజరు కానున్న సీఎం రేవంత్‌, మంత్రులు

►హైదరాబాద్ సెక్రటేరియట్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు.

►జాతీయ పతాకవిష్కరణ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.

రిపబ్లిడ్‌ డే సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగిస్తూ.. ‘తెలంగాణలో గత పదేళ్లలో పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారు. తెలంగాణ సమాజం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల ఎన్నికల్లో నియంతృత్వ ధోరణికి ప్రజలు తమ తీర్పు ద్వారా చరమగీతం పాడారు. అహంకారం, నియంతృత్వం చెల్లదని ప్రజలు స్పష్టమైన తీర్పు ప్రకటించారు. నియంతృత్వ ధోరణిని ప్రజలు సహించలేదు. 

►పదేళ్ల పాలనలో రాజ్యాంగ విలువలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, వ్యవస్థలు ఈ ప్రజా ప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే మళ్లీ పునర్ నిర్మించుకుంటున్నాం. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో రాజ్యాంగబద్ధమైన విలువలు, విధానాలు, పద్ధతులను పునరుద్ధరణ చేసుకుంటున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగించినప్పుడే ప్రజాస్వామ్య, సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందుతాయి.

►ఏకపక్ష నిర్ణయాలు, నియంత పోకడలు ఎప్పుడూ ప్రజాస్వామ్యానికి శోభనివ్వవు. కొత్తగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఈ స్పృహతో పని మొదలు పెట్టింది. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో పని చేస్తోంది. గత ప్రభుత్వ విధానాలతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది’.

►గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో ఆర్థికస్థితి దిగజారింది. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా నిలిచిన యువతకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది. వంద రోజుల్లో అన్ని గ్యారంటీలను అమలు చేస్తాం. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రజా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 

►సైనికుల గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్‌ తమిళిసై 

►పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్‌ తమిళిసై. 

►జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, అధికారులు

►నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌కు చేరుకున్న గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, సీఎం రేవంత్‌ రెడ్డి. 

►హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వం రిపబ్లిక్‌ డే వేడుకలను నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారు. 

►రిపబ్లిక్ డే వేడుకల కోసం పబ్లిక్ గార్డెన్‌ను అధికారులు సిద్ధం చేశారు. సీఎంతో పాటు మంత్రులు, ఐఏఎస్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. గవర్నర్ తమిళి సై జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పోలీసుల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

►శుక్రవారం ఉదయం సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌ సీఎం రేవంత్‌ చేరుకున్నారు. పరేడ్ గ్రౌండ్‌లో  వీరుల సైనిక్ స్మారక్ వద్ద సీఎం రేవంత్‌ రెడ్డికి త్రివిధ దళాలు స్వాగతం పలికాయి. రిపబ్లిక్‌ డే సందర్భంగా వీరుల సైనిక్‌ స్మారకం వద్ద యుద్ధ వీరులకు సీఎం రేవంత్‌ నివాళులు అర్పించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement