రూ.10 ఆశచూపి.. ఇద్దరు చిన్నారులపై అఘాయిత్యం | incident in Kumuram Bheem Asifabad district | Sakshi
Sakshi News home page

రూ.10 ఆశచూపి.. ఇద్దరు చిన్నారులపై అఘాయిత్యం

Feb 3 2026 1:02 AM | Updated on Feb 3 2026 1:02 AM

incident in Kumuram Bheem Asifabad district

లైంగిక దాడికి పాల్పడిన బాలుడు

కుమురంభీం జిల్లాలో ఘటన

చింతలమానేపల్లి: కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రూ.10 ఆశచూపి జులాయిగా తిరిగే ఓ మైనర్‌ బాలుడు పదేళ్లలోపు వయసున్న ఇద్దరు చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కులపెద్దలు పంచాయి తీ నిర్వహించి బాలుడిని ఊరి నుంచి బహిష్కరించారు. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నా యి. చింతలమానేపల్లి మండలంలోని ఓ గ్రామా నికి చెందిన 16 ఏళ్ల బాలుడు ఇంటివద్దే ఖాళీగా ఉంటున్నాడు. అతడి ఇంటికి సమీపంలో ఆరేళ్లు, తొమ్మిదేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారుల ఇళ్లు ఉన్నాయి. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో ఇంటి వద్ద ఆడుకుంటున్న ఇద్దరు చిన్నా రులపై అతడి కన్ను పడింది.

ఇంటివద్ద ఎవరూ లేకపోవడంతో ప్రణాళిక ప్రకారం చిన్నారులతో కాసేపు మాట్లాడాడు. రూ.10 ఇస్తా ఆడుకోవడానికి వెళ్దామని వారికి ఆశ చూపాడు. దుర్మార్గపు ఆలోచన పసిగట్టలేనివారు అతడి వెంట వెళ్లేందుకు ఒప్పుకున్నారు. సైకిల్‌పై చిన్నారుల ఇంటి నుంచి దూరంగా నిర్మాణంలో ఉన్న ఒక ఇంటి వద్దకు తీసుకెళ్లాడు.

అక్కడ వారిపై లైంగికదాడికి పాల్పడుతుండగా.. అటువైపుగా వెళ్లిన గ్రామస్తుడొకరు గమనించి బెదిరించడంతో అక్క డి నుంచి పారిపోయాడు. గ్రామస్తుడు చిన్నారుల కుటుంబ సభ్యులు, స్థానికులకు కొందరికి సమాచారం అందించాడు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం గ్రామంలో దీనిపై పంచాయితీ నిర్వహించారు. కులపెద్దలు బాలుడిని, అతడి తల్లిని మందలించారు. చిన్నారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గ్రామం నుంచి బా లుడిని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి, సోమవా రం సాయంత్రంలోగా గ్రామాన్ని వదిలి వెళ్లాలని హెచ్చరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement