
సాక్షి, న్యూఢిల్లీ : భారత 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన హిందీ, ఇంగ్లీష్‌లో ట్వీట్ చేశారు. కాగా, రిపబ్లిక్ ఉత్సవాలకు దేశ రాజధాని సిద్ధమైంది. మరికాసేపట్లో.. రాజ్‌పథ్ వేదికగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ త్రివర్ణ పతాకం ఆవిష్కరించనున్నారు. రిపబ్లిక్ డే ఉత్సవాలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోస ముఖ్య అథిగా హాజరవుతున్న సంగతి తెలిసిందే.
Happy Republic Day to all fellow Indians.
— Narendra Modi (@narendramodi) January 26, 2019
सभी देशवासियों को #गणतंत्रदिवस की शुभकामनाएं।
जय हिन्द!