గణతంత్ర వేడుకలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు!

South African leader Cyril Ramaphosa may be Chief guest of R-day - Sakshi

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసను ప్రత్యేక అతిథిగా ప్రభుత్వం ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఆఫ్రికా లేదా దక్షిణ అమెరికా ఖండాల్లోని ఏదైనా ఒక దేశాధినేతను గణతంత్ర వేడుకలకు అతిథిగా ప్రభుత్వం ఆహ్వానించాలనుకుంటోందనీ, రమఫోస పేరు దాదాపుగా ఖరారైనప్పటికీ ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సంబంధిత ఉన్నతాధికారులు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఈసారి గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ఆహ్వానించినా ఆయన రాలేనని చెప్పడం తెలిసిందే.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top