విశాఖలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

సాక్షి, విశాఖ : గణతంత్ర దినోత్సవ వేడుకలకు విశాఖపట్నం వేదిక కానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి రిపబ్లిక్ డే పరేడ్‌ను విశాఖపట్నంలో నిర్వహించనుంది. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరు కానున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. వేడుకల నిర్వహణ ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు రిపబ్లిక్ డే సందర్భంగా దేశ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన విమానాశ్రయంలో హైఅలర్ట్ ప్రకటించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి