టీ20 వరల్డ్ కప్ విజేత భారత జట్టుకు వైఎస్ జగన్ ప్రశంస | YS Jagan congratulates Indian cricket team On T20 World Cup Victory | Sakshi
Sakshi News home page

టీ20 వరల్డ్ కప్ విజేత భారత జట్టుకు వైఎస్ జగన్ ప్రశంస

Mar 8 2026 11:47 PM | Updated on Mar 9 2026 1:35 PM

YS Jagan congratulates Indian cricket team On T20 World Cup Victory

సాక్షి, తాడేపల్లి: టీ20 వరల్డ్ కప్‌లో భారత్ విజయం సాధించిన సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు మొత్తం టీమ్ ఇండియాకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.  
 

అద్భుతమైన ఆటతీరు కనబరిచిన అభి, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లకు ప్రత్యేక అభినందనలు. దేశం అంతా గర్వపడే లాంటి విజయం సాధించారు. ఈ గెలుపు ప్రతి భారతీయుడి హృదయాన్ని ఆనందంతో నింపింది అని పేర్కొన్నారు. భారత్ జట్టు కృషి, పట్టుదల, జట్టు స్పూర్తి వల్లే ఈ విజయాన్ని సాధించగలిగిందని జగన్ అన్నారు. ఈ విజయం యువతకు ప్రేరణగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement