త్రివర్ణమయమైన ఆ కేరళ మసీదులు

Mosques Hoist Tricolour Jenda First In Kerala Over Republic Day - Sakshi

తిరువనంతపురం: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేరళలలో సరికొత్త దృశ్యం ఆవిష్కృతమైంది. రాష్ట్రంలోని అన్ని మసీదుల్లో కేరళ ముస్లిం వక్ఫ్‌ బోర్డు ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇలా కేరళలోని అన్ని మసీదుల్లో అధికారికంగా జాతీయ పండగ జరుపుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దీంతో మసీదులన్ని మూడు రంగుల జెండా అలంకరణతో కొత్త శోభను సంతరించుకున్నాయి. జెండా ఆవిష్కరణ అనంతరం మసీదుల్లో భారత రాజ్యాంగా పీఠికను చదివారు.

ముస్లింలు తమ మసీదుల్లో జాతీయా జెండాను ఎగురవేసి.. జాతీయా సమైక్యతను ప్రోత్సహించాలనే సందేశాన్ని ఇచ్చారు. జాతీయ జెండాను గౌరవిస్తూ.. దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ముస్లింలు ప్రతిజ్ఞ చేశారు. దేశవ్యాప్తంగా ముస్లింలు సీఏఏకు వ్యతిరేకంగా గళమెత్తుతున్న ఈ తరుణంతో కేరళలోని మసీదుల్లో గణతంత్ర వేడుకలు నిర్వహించడం విశేషం. కాగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని కేరళ ప్రభుత్వం వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా సీఏఏను తమ రాష్ట్రంలో అమలు చేసేది లేదని కేరళ అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top