గణతంత్ర వేడుకలకు బైడెన్‌!.. ఆహ్వానించిన ప్రధాని మోదీ | Sakshi
Sakshi News home page

గణతంత్ర వేడుకలకు బైడెన్‌!.. ఆహ్వానించిన ప్రధాని మోదీ

Published Thu, Sep 21 2023 1:35 PM

PM Modi Invites Biden To Republic Day 2024 Chief Guest - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరిలో జరగబోయే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవ్వాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారు. ఈనెల రెండో వారంలో ఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా బైడెన్‌తో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ఆయనను రిపబ్లిక్‌డే వేడుకకు మోదీ ఆహ్వానించారని భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి వెల్లడించారు.  

అయితే, భారత్‌ ప్రతీ ఏడాది గణతంత్ర వేడుకలకు ప్రపంచ దేశాల నేతలను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కూడా భారత్‌ ఆహ్వానాన్ని అంగీకరించి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇప్పుడు బైడెన్‌ కూడా మోదీ ఆహ్వానాన్ని అంగీకరిస్తే.. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అమెరికా రెండో అధ్యక్షుడిగా బైడెన్‌ నిలుస్తారు.

ఇది కూడా చదవండి: సెల్‌ఫోన్‌ యూజర్లకు వార్నింగ్‌ మెసేజ్‌.. స్పందించిన కేంద్రం

Advertisement
 
Advertisement