అస్సాంలో బాంబు పేలుళ్లు | Four grenade blasts shake Assam on Republic Day | Sakshi
Sakshi News home page

అస్సాంలో బాంబు పేలుళ్లు

Jan 27 2020 6:46 AM | Updated on Jan 27 2020 6:46 AM

Four grenade blasts shake Assam on Republic Day - Sakshi

గువాహటి: అస్సాంలో గణతంత్ర దినోత్సవ రోజు ఉదయం సమయంలో నాలుగు బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ బాంబులను తామే అమర్చినట్లు నిషేధిత మిలిటెంట్‌ సంస్థ యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అస్సాం– ఇండిపెండెంట్‌ (యూఎల్‌ఎఫ్‌ఏ–ఐ) ఆదివారం ప్రకటించింది. ఈ పేలుళ్లలో ఎవరూ గాయపడలేదు. అయితే గణతంత్ర వేడుకలు జరుపుకోవద్దంటూ పరేశ్‌ బారువా నేతృత్వంలోని యూఎల్‌ఎఫ్‌ఏ–ఐ సహా పలు సంస్థలు ముందే ప్రకటనలు జారీ చేశాయి.

చారైడియో జిల్లాలో ఓ బాంబు పేలుడు జరగ్గా, దిబ్రూగఢ్‌ జిల్లాలో మూడు బాంబుపేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఉదయం 8:15 నుంచి 8:25 గంటల్లోపే నాలుగు పేలుళ్లు జరిగా యి. ఇందులో ఒక పేలుడు పోలీస్‌ స్టేషన్‌కు కేవలం 100 మీటర్ల దూరంలో జరగడం గమనార్హం. బైక్‌పై వచ్చిన యువకులు గ్రెనేడ్లను ఉంచడం సీసీటీవీల్లో నమోదైంది. అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవా ల్‌ ఈ పేలుళ్లను ఖండించారు. ప్రజల చేత తిరస్కారానికి గురైన ఉగ్రసంస్థలు చేసిన పేలుళ్లు అంటూ మండిపడ్డారు. బాధ్యులపై తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ట్విట్టర్‌ ద్వారా స్పష్టంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement