ఆ విమానం ఎక్కడ?.. ఆచూకీ కోసం ముమ్మర గాలింపు | Sukhoi Su-30 That Went Missing Crashes In Assam Search Ops On | Sakshi
Sakshi News home page

ఆ విమానం ఎక్కడ?.. ఆచూకీ కోసం ముమ్మర గాలింపు

Mar 6 2026 7:56 AM | Updated on Mar 6 2026 8:52 AM

Sukhoi Su-30 That Went Missing Crashes In Assam Search Ops On

ఢిల్లీ: అసోంలో గల్లంతైన భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌)కి చెందిన సుఖోయ్‌–30 ఎంకేఐ యుద్ధ విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న(మార్చి 5, గురువారం) అసోంలోని జోర్హాత్‌ వైమానిక కేంద్రం నుంచి టేకాఫ్‌ తీసుకున్న విమానం కొద్ది సేపటికే, 7.42 గంటల సమయానికి విమానంతో సంబంధాలు తెగిపోయాయని ఐఏఎఫ్‌ తెలిపింది. అన్వేషణ, సహాయ కార్యక్రమాలను వెంటనే ప్రారంభించామని పేర్కొంది.

అయితే, విమానంలోని పైలట్ల పరిస్థితిపై ఇంకా ఎటువంటి సమాచారం అందలేదు. సుఖోయ్‌–30ఎంకేఐ రెండు సీట్లుండే బహుళ ప్రయోజన లాంగ్‌ రేంజ్‌ యుద్ధ విమానం. రష్యాకు చెందిన సుఖోయ్‌ కంపెనీ దీనిని అభివృద్ధి పర్చింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఏఎల్‌ వీటిని ఐఏఎఫ్‌ కోసం ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం వైమానిక దళంలో 260కిపైగా ఎస్‌యూ–30ఎంకేఐలు సేవలందిస్తున్నాయి.   

 

Advertisement
 
Advertisement
Advertisement