sukhoi 30 missing
-
కుప్పకూలిన సుఖోయ్ యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
న్యూఢిల్లీ: అసోంలోని కార్బి ఆంగ్లాంగ్ జిల్లాలో సుఖోయ్ సు-30 ఎంకేఐ యుద్ధ విమానంతో కమ్యూనికేషన్ కట్ అయినట్లు అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై భారత వాయుసేన పూర్తి వివరాలు తెలిపింది. ఆ యుద్ధ విమానం కుప్పకూలిపోయిందని, భారత వాయుసేనకు చెందిన ఇద్దరు పైలట్లు మృతి చెందారని చెప్పింది. మృతి చెందిన పైలట్లు స్క్వాడ్రన్ లీడర్ అనుజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పుర్వేశ్ దురాగ్కర్గా అధికారులు గుర్తించారు. “భారత వాయుసేనకు చెందిన సిబ్బంది అందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం” అని వాయుసేన ఎక్స్ లో తెలిపింది.సుఖోయ్ సు-30 ఎంకేఐ శిక్షణ మిషన్‌లో ఉండగా జోర్హాట్ వాయుసేన స్థావరం నుంచి ఎగిరిన కొద్ది సేపటికే కనిపించకుండా పోయింది. అది కుప్పకూలిన ప్రాంతం అక్కడి నుంచి సుమారు 60 కిలోమీటర్లు దూరంలో ఉంది.నిన్న రాత్రి 7.42 గంటలకు దానితో కమ్యూనికేషన్ కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. సుఖోయ్ సు-30 ఎంకేఐ రెండు సీట్లు ఉండే, మల్టీరోల్, దీర్ఘ శ్రేణి యుద్ధ విమానం. రష్యా విమాన తయారీ సంస్థ సుఖోయ్ దీన్ని అభివృద్ధి చేసింది.ప్రస్తుతం భారత వాయుసేన అవసరాల కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లైసెన్స్‌తో దీనిని తయారు చేస్తోంది. భారత వాయుసేన వద్ద 260కి పైగా సుఖోయ్ సు-30 ఎంకేఐ యుద్ధ విమానాలు ఉన్నాయి. IAF acknowledges the loss of Sqn Ldr Anuj and Flt Lt Purvesh Duragkar, who sustained fatal injuries in the Su-30 crash. All personnel of the IAF express sincere condolences, and stand firmly with the bereaved family in this time of grief.@DefenceMinIndia@SpokespersonMoD… pic.twitter.com/zUtfUJ2ewr— Indian Air Force (@IAF_MCC) March 6, 2026 -
ఆ విమానం ఎక్కడ?.. ఆచూకీ కోసం ముమ్మర గాలింపు
ఢిల్లీ: అసోంలో గల్లంతైన భారత వైమానిక దళం(ఐఏఎఫ్)కి చెందిన సుఖోయ్–30 ఎంకేఐ యుద్ధ విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న(మార్చి 5, గురువారం) అసోంలోని జోర్హాత్ వైమానిక కేంద్రం నుంచి టేకాఫ్ తీసుకున్న విమానం కొద్ది సేపటికే, 7.42 గంటల సమయానికి విమానంతో సంబంధాలు తెగిపోయాయని ఐఏఎఫ్ తెలిపింది. అన్వేషణ, సహాయ కార్యక్రమాలను వెంటనే ప్రారంభించామని పేర్కొంది.అయితే, విమానంలోని పైలట్ల పరిస్థితిపై ఇంకా ఎటువంటి సమాచారం అందలేదు. సుఖోయ్–30ఎంకేఐ రెండు సీట్లుండే బహుళ ప్రయోజన లాంగ్ రేంజ్ యుద్ధ విమానం. రష్యాకు చెందిన సుఖోయ్ కంపెనీ దీనిని అభివృద్ధి పర్చింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఏఎల్ వీటిని ఐఏఎఫ్ కోసం ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం వైమానిక దళంలో 260కిపైగా ఎస్‌యూ–30ఎంకేఐలు సేవలందిస్తున్నాయి. The Su-30MKI which was on a training mission, crashed in the area of Karbi Anglong, Assam, approx 60 km from Jorhat. Search operations are underway.@DefenceMinIndia@SpokespersonMoD@HQ_IDS_India@adgpi@indiannavy https://t.co/64Ii5V2fiZ— Indian Air Force (@IAF_MCC) March 5, 2026 -
ఇండియా యుద్ధ విమానం ఏమైందో తెలియదు: చైనా
బీజింగ్: కనిపించకుండా పోయిన భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ యుద్ధ విమానం జాడ తమకు తెలియదని చైనా స్పష్టం చేసింది. భారత్ చెబుతున్న ప్రకారం ప్రస్తుతానికైతే తమ వద్ద దానికి సంబంధించిన సమాచారం మాత్రం లేదని పేర్కొంది. భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ యుద్ధ విమానం చైనా సరిహద్దులో కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. గస్తీ నిర్వహించే ఈ విమానం అసోంలోని తేజ్‌పూర్‌కు సమీపంలో మంగళవారం ఉదయం మిస్సయింది. అందులో ఇద్దరు పైలట్లు ఉన్నట్లు ఎయిర్‌ఫోర్స్ అధికారులు చెప్పారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 9.30గంటల ప్రాంతంలో సుఖోయ్ టేకాఫ్ తీసుకుని చైనా సరిహద్దుకు సమీపంలోని దౌలాసాంగ్ సమీపంలో కనిపించకుండా పోయింది. చివరిసారిగా 11.30గంటల ప్రాంతంలో అస్సోంలోని తేజ్‌పూర్‌కు 60 కిలో మీటర్ల దూరంలో దీని జాడలు రికార్డయ్యాయి. తేజ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ చైనా సరిహద్దుకు 172 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రస్తుతం భారత యుద్ధ విమానం జాడ తెలియలేదు. అయితే, భారత్ యుద్ధ విమానానికి సంబంధించి తమకు సాధ్యమైన మేరకు సాయం చేస్తామని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లుకాంగ్ చెప్పారు. -
చైనా సరిహద్దులో సుఖోయ్ గల్లంతు
న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ యుద్ధ విమానం కనిపించకుండా పోయింది. సాధారణంగా చైనా సరిహద్దుకు సమీపంలోని గస్తీ నిర్వహించే ఈ విమానం అసోంలోని తేజ్‌పూర్‌కు సమీపంలో మంగళవారం ఉదయం మిస్సయింది. అందులో ఇద్దరు పైలట్లు ఉన్నట్లు ఎయిర్‌ఫోర్స్ అధికారులు చెప్పారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 9.30గంటల ప్రాంతంలో సుఖోయ్ టేకాఫ్ తీసుకుంది. అయితే, చైనా సరిహద్దకు సమీపంలోని దౌలాసాంగ్ సమీపంలో ఈ విమానం కనిపించకుండా పోయిందని, చివరిసారిగా 11.30గంటల ప్రాంతంలో అస్సోంలోని తేజ్‌పూర్‌కు 60 కిలో మీటర్ల దూరంలో దీని జాడలు రికార్డయినట్లు చెప్పారు. తేజ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ చైనా సరిహద్దుకు 172 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇదే ఏడాది మార్చి నెలలో సుఖోయ్ 30 యుద్ధ విమానం రాజస్థాన్‌లోని బార్మర్‌లో కుప్ప కూలిన విషయం తెలిసిందే.


