చైనా సరిహద్దులో సుఖోయ్‌ గల్లంతు | Air Force's Sukhoi-30 Jet Missing Near China Border | Sakshi
Sakshi News home page

చైనా సరిహద్దులో సుఖోయ్‌ గల్లంతు

May 23 2017 4:08 PM | Updated on Sep 5 2017 11:49 AM

చైనా సరిహద్దులో సుఖోయ్‌ గల్లంతు

చైనా సరిహద్దులో సుఖోయ్‌ గల్లంతు

భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్‌ యుద్ధ విమానం కనిపించకుండా పోయింది. సాధారణంగా చైనా సరిహద్దుకు సమీపంలోని గస్తీ నిర్వహించే ఈ విమానం అసోంలోని తేజ్‌పూర్‌కు సమీపంలో మంగళవారం ఉదయం మిస్సయింది.

న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్‌ యుద్ధ విమానం కనిపించకుండా పోయింది. సాధారణంగా చైనా సరిహద్దుకు సమీపంలోని గస్తీ నిర్వహించే ఈ విమానం అసోంలోని తేజ్‌పూర్‌కు సమీపంలో మంగళవారం ఉదయం మిస్సయింది. అందులో ఇద్దరు పైలట్‌లు ఉన్నట్లు ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు చెప్పారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 9.30గంటల ప్రాంతంలో సుఖోయ్‌ టేకాఫ్‌ తీసుకుంది.

అయితే, చైనా సరిహద్దకు సమీపంలోని దౌలాసాంగ్‌ సమీపంలో ఈ విమానం కనిపించకుండా పోయిందని, చివరిసారిగా 11.30గంటల ప్రాంతంలో అస్సోంలోని తేజ్‌పూర్‌కు 60 కిలో మీటర్ల దూరంలో దీని జాడలు రికార్డయినట్లు చెప్పారు. తేజ్‌పూర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ చైనా సరిహద్దుకు 172 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇదే ఏడాది మార్చి నెలలో సుఖోయ్‌ 30 యుద్ధ విమానం రాజస్థాన్‌లోని బార్మర్‌లో కుప్ప కూలిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement