రాళ్ల దాడి కేసు.. బాల్క సుమన్‌ అరెస్టు | Heavy Police Presence in Kyathanpalli Amid Balka Suman Arrest Attempt | Sakshi
Sakshi News home page

రాళ్ల దాడి కేసు.. బాల్క సుమన్‌ అరెస్టు

Feb 18 2026 4:29 PM | Updated on Feb 18 2026 6:57 PM

Heavy Police Presence in Kyathanpalli Amid Balka Suman Arrest Attempt

సాక్షి,మంచిర్యాల జిల్లా: రాళ్ల దాడి కేసులో అరెస్టయిన బాల్క సుమన్‌కు మంచిర్యాల కోర్టు రిమాండ్‌ విధించింది. 14 రోజుల పాటు జ్యుడిషియల్‌  రిమాండ్‌ విధించింది. మంచిర్యాల ఫస్ట్‌ క్లాస్‌ అడిషన్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జ్‌ రిమాండ్‌ విధించడంతో పోలీసులు ఆదిలాబాద్‌ జైలుకు తరలించనున్నట్లు సమాచారం. 

బాల్క సుమన్‌ అరెస్టు సమయంలో ఆయన నివాస ప్రాంతమైన క్యాతన పల్లిలో ఉద్రిక్తత నెలకొంది. బాల్క సుమన్‌ను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు భారీగా తరలి వచ్చారు. ఇంట్లో ఉన్న బాల్క సుమన్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆయన ఇంటిగేటును బలవంతంగా ఓపెన్‌ చేసేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసుల రాకపై సమాచారం అందుకున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.  బాల్క సుమన్‌ ఇంటి గేట్‌ ఓపెన్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్న పోలీసుల్ని బీఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బాల్క సుమన్‌ ఇంటి గేట్లను బలవంతంగా ఓపెన్‌ చేశారు. ఇంట్లో ఉన్న బాల్క సుమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 

మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మంత్రి వివేక్‌ కాన్వాయ్‌పై బాల్క సుమన్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు రాళ్ల దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాల్క సుమన్‌ను అరెస్టు చేశారు. 

సుమన్‌ను విడుదల చేయాలి: హ‌రీశ్‌రావు
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. బాల్క సుమన్‌ను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని ఆయ‌న ఖండించారు. క్యాతనపల్లిలో కాంగ్రెస్ అప్రజాస్వామిక, అహంకార చర్యలను అడ్డుకున్నందుకే ఆయ‌న‌ను అరెస్ట్ చేశార‌ని ఆరోపించారు. అధికార బలం, పోలీసు బలం, ధన బలంతో చట్టాలను తుంగలో తొక్కడం కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట అని ధ్వ‌జ‌మెత్తారు.  

Advertisement
 
Advertisement
Advertisement