ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ | Telangana Speaker Gaddam Prasad To Hear Disqualification Petition Against Danam Nagender Today | Sakshi
Sakshi News home page

ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ

Feb 18 2026 11:45 AM | Updated on Mar 7 2026 8:27 AM

Speaker Gaddam Prasad to question Danam Nagender today

సాక్షి హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై నేడు స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపట్టనున్నారు. ఖైరతాబాద్ఎమ్మెల్యే దానం నాగేందర్ పై వచ్చిన పిటిషన్ ను విచారించనున్నారు. దానం నాగేందర్ రెడ్డిపై అనర్హత వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు దానం నాగేందర్ అనర్హత పిటిషన్ విచారించనున్నారు. 

అయితే మెుత్తం పది మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడినట్లు బీఆర్ఎస్ పార్టీస్పీకర్ కార్యాలయంలో  ఫిర్యాదు చేసింది. అయితే ఇందులో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, గుడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాశ్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, సంజయ్ లు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ గడ్డంప్రసాద్ వారిపై నమోదైన అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. ఇక మిగిలిన ఇద్దరు కడియం శ్రీహరి, దానం నాగేందర్ పిటిషన్లను విచారించాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో దానం నాగేందర్ పిటిషన్ ను ఈ రోజు విచారణ చేపట్టనున్న స్పీకర్, రేపు కడియం శ్రీహరి పిటిషన్ ను విచారించనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం దానం నాగేందర్ తరపు లాయర్లు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. అనంతరం ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇంతకాలం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా ఉన్న ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement