తెలుగురాష్ట్రాల్లో...కోర్టులకు బాంబు బెదిరింపులు | Bomb threats to courts in Telugu states | Sakshi
Sakshi News home page

తెలుగురాష్ట్రాల్లో...కోర్టులకు బాంబు బెదిరింపులు

Feb 18 2026 11:57 AM | Updated on Feb 18 2026 1:13 PM

Bomb threats to courts in Telugu states

తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. రాజమండ్రి జిల్లా కోర్టులో  బాంబు ఉందంటూ బెదిరింపు  రావడంతో వెంటనేపోలీసులు అప్రమత్తమయ్యారు. కోర్టు భవనాన్ని ఖాళీ చేయించి డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. మరోవైపు నాంపల్లి సీబీఐ కోర్డుకు, కరీంనగర్ కోర్టుకు బాంబు బెదింరింపులు రావడంతో పోలీసులు హుటాహుటీన అక్కడికి చేరుకున్నారు. న్యాయవాదులను కోర్టు సిబ్బందిని బయిటకి పంపారు. అనంతరం డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు.

మద్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు పేలతాయని 12 చోట్ల ఆర్డీఎక్స్ పెట్టామంటూ బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.అయితే అవి బెదిరింపు ఫోన్లా లేక నిజంగానే పేలుడు పదార్థాలు ఉన్నాయా అనే సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ఇటీవల తరచుగా కోర్టులకు, పాఠశాలలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలోని ఓ కోర్టు భవనంలో బాంబు పెట్టామంటూ బెదిరింపులు వచ్చాయి. అంతే కాకుండా తరచుగా విద్యాలయాలకు బెదిరింపులు వస్తున్నాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement