సాక్షి, విజయవాడ: మండలి సాక్షిగా చంద్రబాబు అప్పుల అబద్ధాలు బట్టబయలయ్యాయి. వైఎస్ జగన్ హయాంలో బడ్జెట్ అప్పులు 2,34,225 కోట్లు మాత్రమే.. కార్పొరేషన్ల అప్పులు పదేళ్లలో 1,40,479 కోట్లుగా ప్రకటించారు. వైఎస్ జగన్ హయాంలో 14 లక్షలంటూ చంద్రబాబు అండ్ కో అబద్ధపు ప్రచారం చేస్తూ వచ్చింది. మండలి సాక్షిగా అప్పుల వివరాలు మంత్రి పయ్యావుల వెల్లడించారు.
మొత్తం ఏపీ అప్పులు 2024 వరకు 4,91,734 కోట్లుగా ప్రకటించారు. 2024 వరకు కార్పొరేషన్ల ద్వారా అప్పులు 1,40,479 కోట్లుగా ఉన్నాయన్నారు. 2024 నుంచి చేసిన కార్పొరేషన్ల అప్పులను ప్రభుత్వం వెల్లడించలేదు.
ఇదిలా ఉండగా.. బడ్జెట్‌లో రంగాల వారీగా ఆదాయ వివరాలపైనా చంద్రబాబు సర్కార్ దాగుడు మూతలు ఆడింది. అప్పులపై వాస్తవాలను చంద్రబాబు ప్రభుత్వం మరోసారి కప్పిపుచ్చింది. కూటమి సర్కారు గ్యారెంటీతో చేసిన అప్పులను బడ్జెట్ ఇన్ బ్రీఫ్‌లో చూపకుండా దాచేసింది. ఇలా అసంపూర్తి లెక్కలతో బడ్జెట్ ఇన్ బ్రీఫ్ ఇవ్వడం చంద్రబాబు సర్కారుకు ఇది రెండోసారి కావడం గమనార్హం. గత బడ్జెట్‌లోనూ ఐదేళ్ల అప్పుల వివరాలు ఇవ్వకుండా ఎగరగొట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్ ఇన్ బ్రీఫ్‌లో కేవలం బడ్జెట్ అప్పులను మాత్రమే చంద్రబాబు సర్కారు పేర్కొంది. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పుల వివరాలను వెల్లడించకపోవడం గమనార్హం.


