సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. 2023 సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబటికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జనవరి 31 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో అంబటి ఉన్నారు.
అంబటి రాంబాబు జైలు నుంచి బయటకు రాకుండా కూటమి కుట్రలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అంబటిపై ఉన్న పాత కేసు తిరగతోడిన కూటమి సర్కార్.. ప్రజా సమస్యలపై గళం విప్పకుండా అంబటిపై కుట్రలకు తెరలేపింది. మెడికల్ ఉద్యమం సందర్భంగా అధికారులను బెదిరించారంటూ అంబటిపై పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి.మేరీ సారధనమ్మ బుధవారం(ఫిబ్రవరి 11) బెయిల్ మంజూరు చేశారు.
ఈ కేసులో విడుదల అవుతారని అనుకుంటున్న తరుణంలో వెంటనే మరో కేసులో పీటీ వారెంట్ జారీ అయ్యింది. గతంలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన నాయకుడు పెట్టిన ఓ పెట్టీ కేసులో పీటీ వారెంట్ జారీచేశారు. తాజాగా ఈ కేసులో అంబటికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.



