శివరాత్రి రోజున చికెన్‌ వండనని చెప్పడంతో.. | 65Year Old Man Ends Life In Hyderabad | Sakshi
Sakshi News home page

శివరాత్రి రోజున చికెన్‌ వండనని చెప్పడంతో..

Feb 18 2026 8:05 AM | Updated on Feb 18 2026 8:05 AM

65Year Old Man Ends Life In Hyderabad

చీరతో ఉరివేసుకుని వ్యక్తి అత్మహత్య 

మేడ్చల్ జిల్లా:  చికెన్‌ వండలేదని భార్యతో గొడవపడి ఓ వ్యక్తి అత్మహత్యకు పాల్పడిన ఘటన మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. విశ్రాంత ఉద్యోగి దసరాజుల ప్రకాశ్‌(66) భార్య పద్మతో కలిసి ప్రతాప్‌సింగారం లోని న్యూవెంచర్‌లో నివాసం ఉంటున్నాడు. 

ఈనెల 15 చికెన్‌ వండమని భార్యకు కోరగా అమె శివరాత్రి రోజున వండనని చెప్పడంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో  ఇంటినుంచి బయటికి వెళ్లిన పద్మ కొద్దిసేపటికి తిరిగి వచ్చి చూడగా..భర్త ప్రకాశ్‌ సీలింగ్‌ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించాడు. స్థానికుల సాయంతో కొన  ఊపిరితో ఉన్న అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి అల్లుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement