Telangana: ఫామ్‌హౌస్‌లకూ ఇక వినోద లైసెన్స్‌ | Hyderabad Police Tighten Scrutiny On Farmhouses, Mandatory Vinoda Licenses To Curb Illegal Activities | Sakshi
Sakshi News home page

Telangana: ఫామ్‌హౌస్‌లకూ ఇక వినోద లైసెన్స్‌

Feb 18 2026 1:37 PM | Updated on Feb 18 2026 1:53 PM

vinoda license in Farm house

సాక్షి, హైదరాబాద్‌: ఫామ్‌ హౌస్‌లలో అక్రమ, అసాంఘిక కార్యకలాపాలు సాగుతుండటంతో పోలీసు మరింత నిఘా పెంచారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ తరహాలో మల్కాజిగిరిలోనూ ఫామ్‌హౌస్‌లకు వినోద లైసెన్స్‌ తప్పనిసరి చేసేందుకు కసరత్తు సాగిస్తున్నారు. స్టార్‌ హోటళ్లు, థియేటర్లు, బార్లు, రెస్టారెంట్లు, పబ్‌లు వంటి ప్రధాన వినోద, ఆతిథ్య సంస్థలకు అమ్యూజ్‌మెంట్‌ లైసెన్స్‌ తప్పనిసరి చేస్తే ప్రత్యేక నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి నుంచి నిరభ్యంతర ధృవీకరణ పత్రం (ఎన్‌ఓసీ), మున్సిపల్‌ అధికారుల నుంచి ట్రేడ్‌ లైసెన్స్, ఆరోగ్య అధికారి నుంచి సర్టిఫికేషన్, టౌన్‌ప్లానింగ్‌ ఆమోదం, భవన నిర్మాణ అనుమతి పత్రాలతో పోలీసుల అనుమతి పొందాల్సి ఉంటుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement