రైల్వేలో రోబో పోలీస్‌ | Humanoid robot at Vizag railway station to enhance security | Sakshi
Sakshi News home page

రైల్వేలో రోబో పోలీస్‌

Jan 23 2026 6:15 AM | Updated on Jan 23 2026 6:15 AM

Humanoid robot at Vizag railway station to enhance security

రోబో పనితీరును వివరిస్తున్న సిబ్బంది

తొలి హ్యూమనాయిడ్‌ రోబో ఏఎస్‌సీ అర్జున్‌ ప్రారంభం 

తాటిచెట్లపాలెం: ప్రయాణికుల భద్రత, రక్షణ, సేవ­ల నిర్వహణను మరింత మెరుగుపర్చేందు­కు ఆధునిక సాంకేతికతను వినియోగించే దిశగా ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే, వాల్తేర్‌ డివిజన్‌ అడుగులు వేసింది. భారతీయ రైల్వేలోనే తొలిసారిగా హ్యూమనాయిడ్‌ రోబో ‘‘ఏఎస్‌సీ అర్జున్‌’’ను విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో రైల్వే భద్రతా దళం ప్రవేశపెట్టింది. ఈ రోబోను ఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ అలోక్‌ బోహ్ర, డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ లలిత్‌బోహ్ర సీని­యర్‌ డివిజనల్‌ సెక్యూరిటీ కమాండెంట్‌ (ఆర్పీఎఫ్‌) ఎ.కె.దూబె సమక్షంలో విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో గురువారం సాయంత్రం ప్రారంభించారు.

పూర్తిగా విశాఖపట్నంలోనే సీనియర్‌ అధికారుల మార్గదర్శకత్వంలో దాదాపు ఏడాది పాటు కృషిచేసి, అభివృద్ధి చేసిన ఈ రో­బో­ను ఆర్పిఎఫ్‌ ఆధునికీకరణ, డిజిటల్‌ మార్పు కార్యక్రమాల్లో భాగంగా ప్రారంభించారు. ఈ ఏఎస్‌సీ అర్జున్‌ ఏఐ, ఐఓటీ, రియల్‌టైం మేనేజ్‌మెంట్‌ పర్యవేక్షణ, సామర్థ్యాలతో ఫేస్‌ ఐడెంటిటి ద్వారా నేరస్తుల గుర్తింపు, కదలికలు, అక్ర­మ చొరబాట్లు, ప్రయాణికుల రద్దీ, ప్రమాదాలు, నేరాలు వంటివి ముందుగానే గుర్తించి ఆర్పి­ఎఫ్‌ సిబ్బందికి సమాచారం అందజేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement