పోలీసుల స్వాధీనంలో 2,193 వాహనాలు.. 6 నెలల్లో క్లెయిమ్‌ చేసుకోండి | Claim seized vehicles within six months Hyderabad City Police | Sakshi
Sakshi News home page

పోలీసుల స్వాధీనంలో 2,193 వాహనాలు.. 6 నెలల్లో క్లెయిమ్‌ చేసుకోండి

Aug 13 2026 9:36 PM | Updated on Aug 13 2026 9:38 PM

Claim seized vehicles within six months Hyderabad City Police

హైదరాబాద్:  నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ కేసుల్లో జప్తు చేసిన, అలాగే రోడ్లపై వదిలేసిన (అనాథ/యాజమాన్యం లేని) విభిన్న రకాలకు చెందిన మొత్తం 2,193 వాహనాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు పోలీస్ శాఖ నిర్ణయించింది. 'హైదరాబాద్ (మెట్రోపాలిటన్ ఏరియా) పోలీస్ యాక్ట్ 2004' సెక్షన్ 7 మరియు 'హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్' సెక్షన్ 40 కింద లభించిన అధికారాల మేరకు ఈ వేలం ప్రక్రియను నిర్వహించనున్నారు.

ఈ వాహనాలపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా, లేదా వాహన యాజమాన్య హక్కులు, ఫైనాన్స్/హైపోథికేషన్ క్లెయిమ్‌లు ఉన్నవారు సంబంధిత ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ సూచించారు. ఈ ప్రకటన విడుదలైన తేదీ నుండి ఆరు నెలల వ్యవధిలో బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ (ICCC) భవనంలో ఉన్న సిటీ పోలీస్ కమిషనర్‌కు దరఖాస్తు సమర్పించి తమ వాహనాలను క్లెయిమ్ చేసుకోవచ్చు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోరని, ఆ వాహనాలను వేలం వేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.

వేలానికి సిద్ధంగా ఉన్న వాహనాల పూర్తి వివరాలు అంబర్‌పేట్ పోలీస్ ఆసుపత్రి వెనుక ఉన్న SAR CPL పోలీస్ గ్రౌండ్స్‌లోని 'ఆక్షన్ టీమ్' వద్ద అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారిక వెబ్‌సైట్ www.hyderabadpolice.gov.in లో కూడా ఈ వివరాలను పరిశీలించవచ్చని ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement