సాక్షి, నిజామాబాద్: ఆర్మూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోవింద్‌పేట్ ఫ్లై ఓవర్‌పై ఆగి ఉన్న ప్రైవేట్ బస్సును కంటైనర్ ఢీకొనడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మృతులను మహారాష్ట్ర వాసులుగా గుర్తించారు. బస్సు టైర్ పంచర్ కావడంతో డ్రైవర్ రోడ్డుపై నిలిపారు. దీంతో బస్సు ఎదుట డివైడర్‌పై ఇద్దరు మహిళలు కూర్చున్నారు. ఒక్కసారిగా అతివేగంతో వెనుక నుంచి బస్సును కంటైనర్ ఢీకొట్టింది.
బస్సు ముందు డివైడర్‌పై కూర్చున్న మహిళలపై బస్సు టైర్ ఎక్కడంతో ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలుకావడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు.


