నల్లగొండ టూటౌన్ : నీలగిరి నగరంలో ఇంటింటికి 24/7 తాగునీటిని సరఫరా చేయడానికి ముందడుగు పడింది. అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) కింద నిధులు మంజూరు చేయాలని కోరుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపానదలు పంపించింది. ఈ ప్రాజెక్టు ఆవశ్యకత గురించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను తయారు చేసి పంపించారు. నగరంలో ఇంటింటికి 24 గంటల పాటు తాగునీటి సరఫరాకు రూ.296.70 కోట్లు అవసరమని ప్రతిపానదలు రూపొందించారు. కొంత కాలంగా పెరిగిన నీలగిరి నగర జనాభా, రానున్న రోజుల్లో పెరగనున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని డీపీఆర్ తయారు చేశారు. నగర ప్రాధాన్యత, నగరంలో ఉన్న నీటి వనరులు తదితర వాటిని డీపీఆర్‌లో జోడించారు. ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే నీలగిరి నగరంలోని ఇంటింటికి 24 గంటల పాటు తాగునీటిని అందించనున్నారు.
2053 నాటికి 4.19 లక్షల జనాభా..
2011 తరువాత నగరం శరవేగంగా పెరుగుతూ వస్తోంది. నగరంలో ప్రైవేట్ విద్యాసంస్థలు భారీగా నెలకొల్పబడడం, పిల్లల చదువుల కోసం జిల్లా నలుమూలల నుంచి నగరానికి ప్రజలు వలస వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పిల్లల చదువుతోపాటు ఉపాధి కోసం సైతం వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకుంటున్నారు. దాంతో నగర విస్తీర్ణం పెరగడంతో పాటు జనాభా కూడా భారీగా పెరుగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 1,65,328 జనాభా ఉండగా, 2025 నాటికి 2,40,885కు చేరిందని ప్రతిపాదించారు. ఈ లెక్కన 2038 నాటికి 3,11,611, 2053 నాటికి 4,19,387 జనాభా పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రతిపాదనల్లో చూపించారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని 2038లో 49.49 ఎంఎల్‌డీ, 2053లో 66.61 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. తాగునీటికి ఎలాంటి ఢోకా లేకుండా నగరానికి పక్కనే ఉయద సముద్రం ఉండడంతో అక్కడి నుంచి పైప్‌లైన్ ద్వారా నగరంలోని అన్ని కాలనీలు తాగునీటిని అందించేలా ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో ఎక్కడైనా పైప్‌లైన్ లేకున్నా అక్కడ కొత్త డిస్ట్రిబ్యూటర్ లైన్ వేసి తాగునీరు అందించనున్నారు. ఈ ప్రాజెక్టు మంజూరైతే 2050 నాటికి నగరంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండదు.
రూ.297 కోట్లతో ప్రతిపాదనలు
ఫ కేంద్రానికి డీపీఆర్ అందజేత
ఫ పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టు రూపకల్పన
ఫ నిధులొస్తే 2050 నాటికి తాగునీటి ఇబ్బందులుండవ్


