విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలి

Aug 14 2026 7:50 AM | Updated on Aug 14 2026 7:50 AM

నల్లగొండ టూటౌన్‌ : స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో విద్యార్థులు దేశభక్తిని పెంపొదించుకోవాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ) వైస్‌ చాన్స్‌లర్‌ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌ అన్నారు. గురువారం ఎంజీయూలో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ పతాకం, తెలంగాణ స్వాతంత్య్ర పోరాట యోధులపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగం చేసిన సమరయోధుల గురించి తెలుసుకుని వారి స్ఫూర్తితో దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలను కాపాడటంతో పాటు దేశ అభివృద్ధిలో యువత కీలకపాత్ర వహించాలన్నారు. ఈ ఎగ్జిబిషన్‌లో స్వామి రామానంద తీర్థ, రావి నారాయణరెడ్డి, భీంరెడ్డి నరసింహారెడ్డి, రాంజీ గోండు, కొమురం భీమ్‌, దేవులపల్లి వెంకటేశ్వర్‌రావు తదితర సమరయోధుల వివరాలు పొందుపరిచారు. అనంతరం యూనివర్సిటీ విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు వీసీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జి. కోటేశ్వర్‌రావు, కె. అంజిరెడ్డి, జె. సురేష్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, మచ్చేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఫ మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement