తిప్పర్తి : ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉండడంతోపాటు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ సమయం ముగియనుండడంతో జిల్లాలోని రైతులు వరిసాగు చేసి నష్టపోవద్దని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. ఆయన గురువారం తిప్పర్తి శివారులో వరిసాగుకు సిద్ధమవుతున్న రైతులతో మాట్లాడి అవగాహన కల్పించారు. వరిపంట సాగుకు నీటి అవకాశాలే లేవని, అలాంటప్పుడు వరి ఎందుకు వేస్తున్నారని రైతులను ప్రశ్నించారు. ఆరుతడి పంటలు వేసుకుంటే నష్టం లేకుండా ఆదాయం వస్తుందన్నారు. సెప్టెంబర్ చివరి వరకు ఆరుతడి పంటలు వేసుకోవచ్చన్నారు. చౌడు భూముల్లో మినుములు, పెసర వంటి పంటలు వేసుకవాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులకు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. యాప్ ద్వారా కాకుండా నేరుగా షాపుల్లో యూరియా దొరికేలా చూడాలని రైతులు కలెక్టర్‌ను కోరగా కలెక్టర్ స్పందించి వెంటనే ఇండెంట్ పంపాలని డీఏఓను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు విజయేందర్‌రెడ్డి, ఏఓ సన్నిరాజు, గిరిరాజు, శ్రీనివాస్, ఏఈఓ సంతోషి, రైతులు మొహన్, పరుశురాం, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


