భారతీయ వివాహాలు అంటే ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ పెళ్లి కూతురు అలంకరణ అంటే..అందరి దృష్టి ఆమెపైనే అన్నంత అందంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా కళ్లు చెదిరిపోయే రేంజ్ ఆభరణాలు, మిరుమిట్లు గొలిపే వస్త్రాలంకరణ తప్పనిసరి. అలాంటిది ఈ కంటెంట్ క్రియేటర్ పెళ్లి కూతురు రూపానికి సరికొత్త అర్థం ఇచ్చేలా రెడీ అయ్యింది. స్వచ్ఛతకు మరో రూపంలా కనిపించిన తీరు అందర్నీ అమితంగా ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
కేరళకు చెందిన కంటెంట్ క్రియేటర్, మేకప్ ఆర్టిస్ట్ హర్ష పత్తు నజీమ్ మహమ్మద్ అనే వ్యక్తితో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈ మేరకు ఆమె తన బ్రైడల్ షూట్, వివాహా వేదికకు సంబంధిచిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. అవి అందరి దృష్టిని అమితంగా ఆకర్షించాయి. ఎందుకంటే ‘క్లీన్ గర్ల్’ లుక్‌లో కనిపించడం విశేషం. కనీసం ఆ లుక్‌లో కూడా చెవికి ఇయర్ స్టడ్స్ అయినా ఉంటాయి.
కానీ ఈ మేకప్ ఆర్టిస్ట్ హర్ష అవి కూడా ధరించలేదు. కేరళకు చెందిన ఈ వధువు ఎలాంటి బంగారం, వెండి లేదా వజ్రాల ఆభరణాలు ధరించకుండా పెళ్లి పీటల మీద నడచి తన చిరకాల ఆచారాన్ని సవాలు చేసింది. చాలా నిరాడంబరంగా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కనీసం ఝంకాలు, మాంగ్ టిక్కా, లేదా ఒక సాధారణ బిందీ వంటి ప్రాథమిక ఆభరణాలకు కూడా చోటివ్వలేదామె. స్వచ్ఛమైన పెళ్లికూతురు ఇలానే ఉంటుంది అని చాటిచెప్పేలా ముస్తాబైంది.
ఆఖరికి మేకప్ విషయంలో కూడా నేచురల్‌గా కనిపించేందుకు ప్రాధాన్యత ఇచ్చింది. ఎలాంటి ఆభరణాలు ధరించకపోయినా..పెళ్లికూతురు దుస్తులు పండుగ వాతావరణాన్ని తలపించేలా ఉండగలవని తన ఆహార్యంతో నిరూపించిందామె. ఆమె పెళ్లి కూతురు లుక్‌ని హైలెట్ చేసింది ధరించిన చీర. హర్ష ధరించిన శారీ రిచ్‌గా డిటైల్డ్‌గా ఉండటమే దీనికి కారణం. సాధారణంగా నవవధువు ధరించే ఎరుపు రంగునే ఎంచుకుంది.
ఇక్కడ హర్ష్ దానిపై క్లిష్టమైన పూల ఎంబ్రాయిడరీ, ఫుల్-స్లీవ్ బ్లౌజ్‌తో స్టైల్ చేశారు. అలాగే ఆభరణాలు, మేకప్ లేకుండా కనిపించినప్పటికీ..ఓ విలక్షణమైన పెళ్లి కూతురు లుక్‌తో అక్కడున్న వారందర్నీ ఆకట్టుకోవడం విశేషం. ప్రీ వెడ్డింగ్ షూట్‌లో సైతం ఇలానే నిరాడంబరమైన లుక్‌తో అలరించింది. నెటిజన్లు సైతం ఆమె లుక్‌కి ఫిదా అవుతూ..ఆభరణాలు లేని అందమైన వధువు అంటూ పోస్టులు పెట్టారు.
(చదవండి: పాటలు పాడటం.. నిజంగానే ఊపిరితిత్తులకు మంచిదా?)


