breaking news
bridal dress
-
వ్యాపారవేత్తతో నటి పెళ్లి, ఐవరీ కలర్ లెహంగాలో బ్రైడల్ లుక్!
బాలీవుడ్ నటి, మోడల్ షాజాన్ పదమ్సీ (Shazahn Padamsee) తన ప్రియుడు, వ్యాపారవేత్త ఆశిష్ కనకియాని (Ashish Kanakia) పెళ్లాడింది. గత కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న ఈ లవ్ బర్డ్స్ ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ముంబైలోని కోర్ట్ యార్డ్ బి మారియట్‌లో జరిగిన ఒక ప్రైవేట్ వివాహ వేడుకలో వ్యాపారవేత్త ఆశిష్ కనకియాతో షాజాన్ పదమ్సీ వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి. షాజాన్ - ఆశిష్ పెళ్లి ఫోటోలను షాజన్ స్నేహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. కొత్త జీవితానికి శుభాకాంక్షలు అంటూ అభిమానులంతా ఈ కొత్త జంటకు విషెస్ అందిస్తున్నారు.37 ఏళ్ల షాజాన్ పదమ్సీ - ఆశిష్ కనకియా ఎప్పటినుంచో డేటింగ్లో ఉన్నారు. గత ఏడాది నవంబరులో నిశితార్థం చేసుకున్నారు. తాజాగా అత్యంత గోప్యంగా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. షాజన్ స్నేహితులు పెళ్లి వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అలాగే ఇన్స్టాస్టోరీలో ఒక వీడియోను షాజన్ కూడా పోస్ట్ చేసింది. కనకియా గ్రూప్ యాజమాన్యంలోని ముంబైలోని కోర్ట్ యార్డ్ బై మారియట్‌లో రెండు రోజుల పాటు జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారట. రేపు (జూన్ 7న) గ్రాండ్‌గా పార్టీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.సొగసైన ఐవరీ లెహెంగా, ఆఫ్‌వైట్ షేర్వానీషాజాన్ పాస్టెల్ , బ్లష్ పింక్ కలర్ ఐవరీ లెహంగాలో పెళ్లికూతురి ముస్తాబైంది. దానికి మ్యాచింగ్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో జత చేసింది, తలపైనుంచి మ్యాచింగ్ దుపట్టాను అందంగా అలంకరించుకుంది. డైమండ్, నెక్లెస్, మాంగ్ టీకా, చెవిపోగులు, హెయిర్ స్టైల్, సింపుల్ మేకప్‌తో తన బ్రైడల్ లుక్‌ను పూర్తి చేసింది. మరోవైపు, ఆశిష్ సాంప్రదాయ ఆఫ్-వైట్ టెక్స్చర్డ్ ఎంబ్రాయిడరీ షేర్వానీ ధరించాడు.హౌస్‌ఫుల్ 2', 'ఆరెంజ్', 'కనిమోలి', 'మసాలా', 'పాగల్పన్ నెక్స్ట్ లెవల్', 'డిస్కో వ్యాలీ' తదితర బాలీవుడ్ మూవీల్లో నటించింది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌తో కలిసి రాకెట్ సింగ్ , హౌస్‌ఫుల్ 2 సినిమాలతో బాగా పాపులర్ అయింది. ఈమె మంచి గాయని కూడా. 2010లో రిలీజైన టాలీవుడ్ మూవీ ఆరెంజ్ సినిమాలో కూడా నటించింది. బాలీవుడ్ ప్రముఖ గాయని షారన్ ప్రభాకర్, గాంధీ సినిమాలో జిన్నా పాత్రలో మెప్పించిన నటుడు దివంగత అలిక్ పదమ్‌సీల కుమార్తె షాజన్. షాజాన్ భర్త ఆశిష్ కనకియా గ్రూప్ డైరెక్టర్ , మూవీ మాక్స్ సినిమా సీఈఓ. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా జరిగిన వీరి పరిచయం ప్రేమ,పెళ్లికి దారి తీసాయి.ఇదీ చదవండి: రూ. 5 కోట్ల ఎఫ్డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకం -
మొదటి పెళ్లి దుస్తుల్ని వేలంలో అమ్మేశా, రెండో పెళ్లి దుస్తులు..వెల్లడించిన నటి
నటి దియా మీర్జా మన హైదరాబాదీ అమ్మాయే. మిస్ ఏసియా పసిఫిక్ ఇంటర్నేషనల్‌గా అందాల సుందరిగా కిరీటాన్ని దక్కించుకున్న తర్వాత వరుసగా విభిన్న భాషల్లో సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం బాలీవుడ్లో నటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. తెలుగులో ఆమె చివరగా నాగార్జున హీరోగా నటించిన వైల్డ్ డాగ్ చిత్రంలో చేసింది. సినిమాలతో పాటు పలు రకాల వ్యాపారాలు కూడా చేస్తూ స్థిరపడిన దియా మీర్జా... వ్యక్తిగత జీవితంలో ప్రేమ పెళ్లి మాత్రం విఫలమైంది. ఆమె గత 2014లో తన వ్యాపార భాగస్వామి సాహిల్ సంఘాని పెళ్లాడింది. అయితే ఐదేళ్లలోనే ఆ పెళ్లి పెటాకులైందని ఆమే స్వయంగా ప్రకటించింది. అనంతరం రెండేళ్లు గ్యాప్ ఇచ్చి అప్పటికే వివాహితుడు, ఒక బిడ్డకు తండ్రి అయిన వైభవ్ రేఖిని పెళ్లి చేసుకుని దియా మీర్జా రేఖిగా మారింది. అయితే విడాకుల తర్వాత కూడా ఎప్పుడూ తన మొదటి పెళ్లి గురించి దియామీర్జా మాట్లాడింది లేదు. ఇటీవల మాత్రం ఒక ఇంటర్వ్యూలో, దియా మీర్జా తన పర్యావరణ అనుకూల కార్యక్రమాలు, ఆ తరహా ఆలోచనల వెనుక ఉన్న పలు అంశాల్ని గురించి మాట్లాడుతూ తన రెండవ పెళ్లిని పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ తరహాలో చేసుకున్నట్టు వివరించింది.తమ ఇంటి తోటలోనే అత్యంత నిరాడబంరంగా సహజమైన పద్ధతుల్లో వీరి పెళ్లి జరిగింది. చేతితో తయారు చేసిన వ్యక్తిగతీకరించిన బహుమతులు స్థానిక సహజమైన అలంకరణ ఉత్పత్తులనే వివాహం కోసం వాడినట్టు తెలిపారు. ఆహార వ్యర్థాలను తగ్గించడానికి అతిథులకు శాకాహార మాంసాహార వంటకాల ఖచ్చితమైన సంఖ్యను నిర్ధారిస్తూ, భోజనాలను కూడా జాగ్రత్తగా ప్లాన్ చేశామన్నారు. కేవలం ఓ మహిళా పూజారితో దంపతులు సాదాసీదాగా వేడుక పూర్తి చేశామన్నారు. వధువుగా ధరించడానికి బాలీవుడ్ వధువులకు సాధారణమైన లెహెంగాకు బదులుగా ఎరుపు రంగు బనారసీ చీరను దియా ఎంపిక చేసుకోవడం విశేషం.ఇదే సందర్భంగా ఆమె తన మొదటి పెళ్లి గురించి కూడా గుర్తు చేసుకుంది. ఆ పెళ్లి ఒక ఫార్మ్ హౌజ్‌లో జరిగింది. ఆడంబరంగా జరిగిన ఆ పెళ్లిలో ఆమె ఖరీదైన దుస్తులను ఎంచుకుంది. ఆ పెళ్లిలో ఆమె బాలీవుడ్ వధువుల తరహాలోనే లెహంగానూ ధరించింది. అయితే వివాహాల తర్వాత బ్రైడల్ లెహంగాలు తరచు నిరుపయోగంగా ఉంటాయని తెలిపింది. వాటిని పారవేయలేక, ఇటు ధరించనూ లేక వార్డ్‌రోబ్స్‌లో ఉంచుతారంది. ఒక పర్యావరణ అనుకూల మనస్తత్వంతో తాను దాన్ని ఇష్టపడలేదని చెప్పింది. దాంతో ఆమె తన మొదటి పెళ్లిలో తాను ధరించిన తన వివాహ లెహంగాను వేలం వేయాలని అనుకుంది. అనుకున్నట్టుగానే దాన్ని మంచి ధరకు వేలం వేశానని వెల్లడించింది. నిరుపయోగంగా పడి ఉండకూడదనే తాను తన రెండవ పెళ్లికి సాధారణ చీరను ఎంచుకున్నానని తన భర్త వైభవ్ రేఖీ సైతం అదే పనిచేశారని తెలిపింది. పెళ్లి తర్వాత అలమారాలో ఉపయోగించకుండా కూర్చోకుండా జీవితాంతం ధరించగలిగే దుస్తులను ఆయన కూడా ఎంచుకున్నట్లు కూడా ఆమె పేర్కొంది. ఆమె పెళ్లి రోజున, దియా మీర్జా సాంప్రదాయ ఎరుపు రంగుకు దూరంగా డిజైనర్ రీతూ కుమార్ తయారు చేసిన ఆకుపచ్చ జర్దోసీ ఘరారాను ఎంచుకుంది. -
పేద పిల్లల రిచ్ ఫ్యాషన్
లక్నోలోని నిరుపేద పిల్లలు ప్రముఖ డిజైనర్ సబ్యసాచి స్ఫూర్తితో పెళ్లి దుస్తులను రూపొందించారు. ఈ విషయాన్ని సూచిస్తూ తీసిన వీడియోను ఇటీవల ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వారు రూపొందించిన బ్రైడల్ వేర్‌ను ధరించి, మోడలింగ్ చేసిన వాళ్లలోనూ పేద పిల్లలూ ఉన్నారు.ఫ్యాషన్ పరిశ్రమపై సబ్యసాచి ముఖర్జీ ప్రభావం అతని అద్భుతమైన డిజైన్ లకు మించి విస్తరించింది. దీంతోపాటు భారతీయ సాంస్కృతిక, సంప్రదాయ హస్తకళనూ ్రపోత్సహిస్తుంది. లాభాపేక్ష లేని సంస్థ ‘ఇన్నోవేషన్ ఫర్ ఛేంజ్’ మార్గదర్శకత్వంలో సబ్యసాచి కళాఖండాలు, అతని దిగ్గజ డిజైన్ లు ఇప్పుడు లక్నోలోని నిరుపేద పిల్లల బృందానికి స్ఫూర్తినిచ్చాయి. ఈ నిరుపేద యువ డిజైనర్లు సగర్వంగా తమ క్రియేషన్ లను ధరించి కెమెరా ముందు ఆత్మవిశ్వాసంతో పోజులిచ్చారు. ’మేం లక్నో ఆధారిత ఎన్జీవోతో కలిసి 400 మంది నిరుపేద పిల్లలతో కలిసి పని చేస్తున్నాం. ఈ పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నాం. ఈ దుస్తులను మా విద్యార్థులు రూపొందించారు. ఇందులో ప్రదర్శనలు ఇస్తున్న విద్యార్థులందరూ మురికివాడల నుండి వచ్చినవారే. వారు తమ సృజనాత్మకత ద్వారా డిజైనర్ దుస్తులను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నారు. స్థానికులు, చుట్టుపక్కల వ్యక్తుల నుండి స్వచ్ఛంద సంస్థ ద్వారా పొందే అన్ని దుస్తులను రీయూజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. సబ్యసాచి సోషల్ మీడియా అకౌంట్లో మోడల్ దుస్తులను చూసిన తర్వాత వారు ఇలాంటి డిజైన్స్ చేయాలని నిర్ణయించుకున్నారు’ అని ఇన్నోవేషన్ ఫర్ ఛేంజ్ ఎన్జీవో తెలిపింది. ప్రతిరోజూ తమ నైపుణ్యాలను మెరుగుపర్చడానికి శ్రద్ధగా కృషి చేస్తున్న 15 ఏళ్ల ఉత్సాహవంతమైన పిల్లలు ఈ వీడియోను చిత్రీకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రఖ్యాత డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ కామెంట్స్ విభాగంలో హార్ట్ ఎమోజీని పోస్ట్ చేయడం ద్వారా వారికి తన ఆశీస్సులను, ప్రశంసలను అందజేశాడు. అంతేకాదు, ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ‘ఈ పిల్లలకు మరింత శక్తి... ప్రేమ, ఆశీర్వాదాలు అందాలి..’ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. -
బ్రైడల్ ఫ్యాషన్ షో.. ర్యాంప్ వాక్ తో అదరగొట్టిన మోడళ్లు (ఫొటోలు)
-
పెళ్లికూతురిలా ముస్తాబైన జబర్దస్త్ వర్ష (ఫోటోలు)
-
‘ఎంత అందంగా ఉన్నావో.. నీ పెళ్లెప్పుడు?’
బాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి టాపిక్ వస్తే చాలు.. అందరి కళ్లు రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్ల మీదకే వెళ్తాయి. గత కొన్నేళ్లుగా లవ్‌లో ఉన్న వీరిద్దరి పెళ్లి గురించి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మీడియా కూడా వీరిని అడిగే ఫస్ట్ ప్రశ్న పెళ్లి గురించే. తాజాగా మరో సారి రణ్‌బీర్-ఆలియా పెళ్లి ముచ్చట తెర మీదకు వచ్చింది. ఇందుకు కారణం ఏంటంటే కొద్ది రోజుల కిత్రం ఆలియా మెహందీ ఆర్టిస్ట్ వీణా నగ్డా కోసం బ్రైడల్ యాడ్ షూట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోని వీణా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. పీచ్ కలర్ లెహంగా.. దానికి మ్యాచింగ్ భారీ ఆభరణాలు ధరించి.. చేతుల్లో ఎర్రగా పండిన మెహందీని చూపుతూ ఆలియా దిగిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ‘‘పెళ్లి కుమార్తెగా ఎంత అందంగా.. ముద్దుగా ఉన్నావో’’.. ‘‘త్వరగా పెళ్లి చేసుకో’’.. ‘‘ఇంతకు నువ్వెప్పుడు పప్పన్నం పెడతావ్’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. ఈ ఫోటోలో ఆలియాతో పాటు మెహందీ డిజైనర్ వీణా నగ్డా కుడా ఉన్నారు. తాజాగా వీణ.. వరుణ్ ధావన్-నటాషా దలాల్ వివాహం సందర్భంగా వారికి మెహందీ డిజైనర్‌గా వ్యవహరించారు. View this post on Instagram A post shared by ᴀʟɪᴀ💕 (@mylife_aliabhatt) ఇక ఆలియా-రణ్‌బీర్‌ల విషయానికి వస్తే.. ఈ జంట 2020లోనే వివాహం చేసుకోవాల్సి ఉండేనని.. అయితే కరోనా వైరస్ వ్యాప్తితో అన్ని ప్లాన్స్ అటకెక్కాయని స్వయంగా రణ్‌బీర్ కపూరే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆలియా తెలుగులో ప్రతీష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్‌కు జోడిగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. చదవండి: నన్ను దారుణంగా తిడుతున్నారు.. -
సెలబ్రిటీల పెళ్లి వేడుక.. అదిరిపోయే డిజైన్స్
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన వేడుక. ఆరోజు మరింత అందంగా, ప్రత్యేకంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే.. వారికి సంబంధించి ప్రతీ అంశాన్ని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. వారి వివాహ వేడుకకు ఎలాంటి దుస్తులు, ఆభరణలు ధరిస్తారు అని తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆరాటపడుతుంటారు. దీంతో వేడుకకు కొన్ని నెలల ముందు నుంచే తారలు ప్రముఖ డిజైనర్లతో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటారు. అనుష్క- విరాట్ కోహ్లీ అయితే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా పెళ్లి దుస్తుల్లో సంప్రదాయక ఎరుపురంగు ఉండేలా చూసుకుంటారు. కానీ ఐశ్వర్య రాయ్ బచ్చన్, కరీనా కపూర్ ఖాన్, కాజోల్ వంటి కొందరు సెలబ్రిటీలు మాత్రం వారి పెళ్లికి కొంచెం ట్రెండు మార్చి డిఫరెంట్ కలర్స్‌ని ఎంచుకున్నారు. వారి అభిరుచికి తగ్గట్లు వాటిని డిజైన్ చేయించుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో హాఫ్ వైట్ అండ్ పింక్ కూడా సెలబ్రిటీలకు ఫేవరెట్ కలర్‌గా మారింది. అనుష్క శర్మ, మిహీకా, నటాషా సహా పలువురు ప్రముఖులు ఈ తరహా కలర్స్ లెహంగాల్లో యువరాణుల్లా కనిపించారు. అబిషేక్- ఐశ్వర్యారాయ్ సోహా అలీఖాన్- కునాల్ కరీనా కపూర్- సైఫ్ అలీఖాన్ అమృతా పూరి- ఇమ్రూన్ సేతి నేహా దూపియా-అంగడ్ బేడీ గజిని ఫేం ఆసిన్- రాహుల్ శర్మ వరుణ్ ధావన్- నటాషా రానా -మిహీకా కాజోల్- అజయ్ దేవగణ్ సంజయ్ కపూర్- కరీష్మా కపూర్ -
పరీక్షలు రాసిన పెళ్లికూతురు!
ఓ అమ్మాయికి ఆరోజే పెళ్లయింది. కానీ అదేరోజు పరీక్ష కూడా ఉంది. ఇటు జీవితంలో పరీక్ష, అటు పుస్తకాల పరీక్ష.. దేన్నీ వదులుకోవడం కుదరదు. అందుకే.. పెళ్లి చేసుకుని, ఆ పెళ్లి దుస్తుల్లోనే నేరుగా వచ్చి బీఏ మొదటి సంవత్సరం పరీక్ష రాసేసింది. పరీక్ష అయిపోయిన తర్వాత అప్పుడు అప్పగింతల కార్యక్రమంలో పాల్గొంది. రాజస్థాన్‌లోని బలేశ్వర్ ప్రాంతానికి చెందిన సంతోష్ ప్రజాపత్‌కు సోమవారం రాత్రి పెళ్లయింది. అప్పగింతల కార్యక్రమం మంగళవారం జరగాల్సి ఉంది. అయితే.. మంగళవారమే ఆమెకు బీఏ మొదటి సంవత్సరం పరీక్ష కూడా ఉంది. దానికి అందరూ ఏర్పాట్లు చేసుకుంటుండగా.. సంతోష్ మాత్రం తనకు పరీక్ష ఉందని, అందువల్ల అది అయిపోయిన తర్వాత పరీక్ష రాస్తానని పెళ్లివాళ్లను కోరింది. ఎలాగోలా వాళ్లను నానా తంటాలు పడి ఒప్పించి.. చివరకు పెళ్లి దుస్తులతోనే పరీక్ష రాసింది. ఆ పరీక్ష రాయకపోతే.. విద్యాసంవత్సరం మొత్తం వృథా అవుతుందనే తాను వాళ్లను ఒప్పించి పరీక్ష రాసినట్లు చెప్పింది.