
బాలీవుడ్ నటి, మోడల్ షాజాన్ పదమ్సీ (Shazahn Padamsee) తన ప్రియుడు, వ్యాపారవేత్త ఆశిష్ కనకియాని (Ashish Kanakia) పెళ్లాడింది. గత కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ లవ్ బర్డ్స్ ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. ముంబైలోని కోర్ట్ యార్డ్ బి మారియట్‌లో జరిగిన ఒక ప్రైవేట్ వివాహ వేడుకలో వ్యాపారవేత్త ఆశిష్ కనకియాతో షాజాన్ పదమ్సీ వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో సందడి చేస్తున్నాయి. షాజాన్ - ఆశిష్ పెళ్లి ఫోటోలను షాజన్ స్నేహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. కొత్త జీవితానికి శుభాకాంక్షలు అంటూ అభిమానులంతా ఈ కొత్త జంటకు విషెస్ అందిస్తున్నారు.
37 ఏళ్ల షాజాన్ పదమ్సీ - ఆశిష్ కనకియా ఎప్పటినుంచో డేటింగ్‌లో ఉన్నారు. గత ఏడాది నవంబరులో నిశితార్థం చేసుకున్నారు. తాజాగా అత్యంత గోప్యంగా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. షాజన్ స్నేహితులు పెళ్లి వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అలాగే ఇన్‌స్టాస్టోరీలో ఒక వీడియోను షాజన్ కూడా పోస్ట్ చేసింది. కనకియా గ్రూప్ యాజమాన్యంలోని ముంబైలోని కోర్ట్ యార్డ్ బై మారియట్‌లో రెండు రోజుల పాటు జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారట. రేపు (జూన్ 7న) గ్రాండ్‌గా పార్టీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
సొగసైన ఐవరీ లెహెంగా, ఆఫ్‌వైట్ షేర్వానీ
షాజాన్ పాస్టెల్ , బ్లష్ పింక్ కలర్ ఐవరీ లెహంగాలో పెళ్లికూతురి ముస్తాబైంది. దానికి మ్యాచింగ్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో జత చేసింది, తలపైనుంచి మ్యాచింగ్ దుపట్టాను అందంగా అలంకరించుకుంది. డైమండ్, నెక్లెస్, మాంగ్ టీకా, చెవిపోగులు, హెయిర్ స్టైల్, సింపుల్ మేకప్‌తో తన బ్రైడల్ లుక్‌ను పూర్తి చేసింది. మరోవైపు, ఆశిష్ సాంప్రదాయ ఆఫ్-వైట్ టెక్స్చర్డ్ ఎంబ్రాయిడరీ షేర్వానీ ధరించాడు.
హౌస్‌ఫుల్ 2', 'ఆరెంజ్', 'కనిమోలి', 'మసాలా', 'పాగల్‌పన్ నెక్స్ట్ లెవల్', 'డిస్కో వ్యాలీ' తదితర బాలీవుడ్ మూవీల్లో నటించింది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌తో కలిసి రాకెట్ సింగ్ , హౌస్‌ఫుల్ 2 సినిమాలతో బాగా పాపులర్ అయింది. ఈమె మంచి గాయని కూడా. 2010లో రిలీజైన టాలీవుడ్ మూవీ ఆరెంజ్ సినిమాలో కూడా నటించింది. బాలీవుడ్ ప్రముఖ గాయని షారన్ ప్రభాకర్, గాంధీ సినిమాలో జిన్నా పాత్రలో మెప్పించిన నటుడు దివంగత అలిక్ పదమ్‌సీల కుమార్తె షాజన్. షాజాన్ భర్త ఆశిష్ కనకియా గ్రూప్ డైరెక్టర్ , మూవీ మాక్స్ సినిమా సీఈఓ. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా జరిగిన వీరి పరిచయం ప్రేమ,పెళ్లికి దారి తీసాయి.
ఇదీ చదవండి: రూ. 5 కోట్ల ఎఫ్‌డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకం