తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా సభలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా సభలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. గవర్నర్ సాక్షిగా అధికార, విపక్ష సభ్యులు బాహాబాహికి దిగారు. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదులాట, తోపులాట చోటుచేసుకుంది. సభలో నిరసన తెలుపుతున్న కుకట్ పల్లి టీడీపీ ఎమ్మెల్యే మాధవరావును టీఆర్ఎస్ సభ్యులు తోసేశారు.
రేవంత్ రెడ్డిని పక్కకు నెట్టేశారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై కాంగ్రెస్, టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలారు. విపక్షాల నిరసనల నడుమ గవర్నర్ ప్రసంగం కొనసాగించారు.