పుష్కర పనుల్లో అపశ్రుతి | man dies with electric shock | Sakshi
Sakshi News home page

పుష్కర పనుల్లో అపశ్రుతి

Aug 6 2016 1:35 PM | Updated on Sep 5 2018 2:26 PM

నగరంలోని వన్‌టౌన్‌లో గాంధీ కాలేజి సమీపంలో కొనసాగుతున్న పుష్కర పనుల్లో శనివారం అపశ్రుతి దొర్లింది.

విజయవాడ: నగరంలోని వన్‌టౌన్‌లో గాంధీ కాలేజి సమీపంలో కొనసాగుతున్న పుష్కర పనుల్లో శనివారం అపశ్రుతి దొర్లింది. విద్యుత్ స్తంభానికి రంగులు వేస్తున్న కాంట్రాక్టు కార్మికుడు మాధవరావు (25)  కరెంట్ షాక్‌ తగిలింది. దీంతో అతడు తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు. సహచర కార్మికులు వెంటనే స్పందించి... అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు కొద్ది సేపటికే మరణించాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement