
40 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్నా : ప్రముఖ నటి భావోద్వేగం
తల్లికావాలనుకునే సింగిల్ విమెన్‌కు స్ఫూర్తిగా నిలవాలనుకుంటున్నా
ప్రముఖ కన్నడ నటి తన జీవితంలో ఒకముఖ్యమైన అంశం గురించి ఫ్యాన్స్‌తో షేర్ చేసింది. 40 ఏళ్ల వయసులో బిడ్డల్ని కంటున్నాను అంటూ ప్రకటించింది. తద్వారా తాను పెళ్ళికాకుండా తల్లి అవ్వాలనుకునే స్త్రీలకు ప్రేరణగా నిలవ బోతున్నాను అంటూ వెల్లడించింది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. దీని పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు ఇంతకీ ఎవరా నటి? ఎందుకు సింగిల్ మదర్‌గా ఉండాలనే సాహసోపేత నిర్ణయం తీసుకుంది?
భావన రామన్న తాను గర్భం దాల్చినట్టు తెలిపింది. ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) త్వరలోనే కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నా అంటూ ఒక ధీర ప్రకటన చేసింది నటి భావన. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆరు నెలల బేబీ బంప్‌తో రెండు చిత్రాలను పోస్ట్ చేసింది. చాలా మంది మహిళల బిడ్డను కనాలనే కలలకు తాను ప్రతిరూపమంటూ ఈ భావోద్వేప్రయాణం ఎలా ఒడిదుడుకులతో నిండి ఉందో పంచుకుంది. ఒంటరి మహిళగా తన ప్రయాణాన్ని షేర్ చేసింది.
ఇదీ చదవండి : రెండే రెండు టిప్స్ : 120 కిలోల నుంచి స్మార్ట్ అండ్ స్లిమ్‌గా
"ఇదొ కొత్త అధ్యాయం, ఇది నేను ఊహించలేదు. కవలలతో ఆరు నెలల గర్భవతిని. 20-30 ఏళ్లపుడు తల్లినవ్వాలని అస్సలు అనుకోలేదు. కానీ నాకు 40 ఏళ్లు నిండిన తరువాత ఆ కోరికను కాదనలేకపోయా. ఇపుడు ఇద్దరికి జన్మనివ్వబోతున్నా..అదీ ఒంటరి మహిళగా. ఈ జర్నీ అంత సులభంగా సాగలేదు. చాలా IVF క్లినిక్‌లు, వైద్యులు నన్ను తిరస్కరించారు.’’ అయినా సాధించాను. "తన పిల్లలకు తండ్రి ఉండరని తెలుసు, కానీ వారు కళ, సంగీతం, సంస్కృతి, ఎల్లలులేని ప్రేమతో నిండిన ఇంట్లో పెరుగుతారు. ఏంతో ప్రేమగా నమ్మకమైన చేతుల్లో పెరుగుతారు’’ అని తెలిపింది. అలాగే ఇంత కష్టమైన సమయంలో తనకు అండగా నిలిచిన, తల్లిదండ్రులు, తోబుట్టువులకు, డాక్టర్ సుష్మకు భావన కృతజ్ఞతలు తెలిపింది. ‘‘ఇదేదో తిరుగుబాటుగా ఈ నిర్ణయం తీసుకోలేదు. నా కోరికను గౌరవించడానికే ఈ నిర్ణయం. నా స్టోరీ కనీసం ఒక మహిళను ఇన్‌స్పైర్ చేసినా అది చాలు నాకు.’’ అని పేర్కొనడం విశేషం.