
తమిళ నటుడు విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా ఎంట్రీ వచ్చి అరంగేట్రంలోనే మంచి మార్కులు కొట్టేశాడు. స్పోర్ట్స్ ఆధారిత యాక్షన్ డ్రామా ఫీనిక్స్‌లో సూర్య ప్రధాన పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ఈ సందర్బంగా తన వెయిల్‌లాస్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు సూర్య. ‘ఫీనిక్స్’ సినిమా మొదలుకాకముందు నా బరువు దాదాపు 120 కిలోలు ఉండేవాడినని. ఈ బరువును తగ్గించుకోవడానికి నాకు ఒకటిన్నర సంవత్సరం పట్టిందట. మరి సూర్య వెయిట్‌లాస్ జర్నీ గురించి తెలుసుకుందాం.
120 కిలోల బరువుతో బాధపడుతున్న సూర్య ఉన్నట్టుండి అంత బరువు ఎలా తగ్గాడు అనేది నెట్టింట ఆసక్తికరంగా మారింది. ‘ఫీనిక్స్’ సినిమా మొదలుకాకముందు తన బరువు దాదాపు 120 కిలోలు ఉండేదని గుర్తు చేసుకున్న సూర్య దాదాపు సగం బరువు తగ్గించుకోవడం విశేషం. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్‌లో సూర్య ఫిట్‌నెస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాలా కష్టపడి బరువు తగ్గానని తెలిపాడు. ఇందుకోసం తనకు ఒకటిన్నర సంవత్సరం పట్టిందన్నాడు. బరువు తగ్గే క్రమంలోనే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) నేర్చుకున్నానని, ఇదే సినిమాకు కూడా ప్రధానాంశం అని సూర్య వెల్లడించాడు.

చదవండి: ఆరోగ్యానికి వెరీ ‘గుడ్డూ’.. ఎగ్‌స్ట్రా వెరైటీస్ ట్రై చేశారా?
నుమ్ రౌడీ ధాన్‌లో తన తండ్రి చిన్నపటి వెర్షన్‌ను పోషించిన సూర్య ఫీనిక్స్‌లో తన ప్రధాన పాత్ర కోసం సిద్ధమయ్యేందుకు అనేక కసరత్తు చేశాడట. చాలా కఠినమైన శిక్షణ తీసుకున్నాడట. అలాగే తన ఆహార ప్రణాళికలలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాల్సి వచ్చిందని, ఈ క్రమంలో మొదటి ఆరునెలలు, ఆయిల్, షుగర్ ఫుడ్స్‌కు పూర్తిగా దూరంగా ఉన్నానని, నిజంగా ఇది చాలా ఛాలెంజింగ్ పీరియడ్ అని చెప్పు కొచ్చాడు. మొత్తానికి హీరో అవ్వాలనే డ్రీమ్‌ను నెరవేర్చుకునేందుకు, స్లిమ్ అండ్ ట్రిమ్‌గా కనిపించేందుకు బరువు తగ్గాలని నిర్ణయించాడు. పట్టుదల, కఠినమైన శిక్షణతో చాలా ఓపిగ్గా తాను అనుకున్నది సాధించాడు.
ఇదీ చదవండి: 7 నెలల్లో 35 కిలోలు..వాటికి దూరం: ఇదే నా సక్సెస్ అంటున్న నేహా