7 నెలల్లో 35 కిలోలు..వాటికి దూరం: ఇదే నా సక్సెస్‌ అంటున్న నేహా | Woman who lost 35 kg in 7 months lists 10 foods to avoid | Sakshi
Sakshi News home page

7 నెలల్లో 35 కిలోలు..వాటికి దూరం: ఇదే నా సక్సెస్‌ అంటున్న నేహా

Jul 4 2025 1:06 PM | Updated on Jul 4 2025 4:30 PM

Woman who lost 35 kg in 7 months lists 10 foods to avoid

అధిక బరువును తగ్గించుకోవాలంటే ఆహారం పాత్ర చాలా కీలకం.  ఆహారపు అలవాట్లే బరువు తగ్గడంలో  ప్రధాన  భూమిక పోషిస్తాయి.  ఇది అందరూ చెప్పేమాట.   క్రమం తప్పని వ్యాయామంతోపాటు ఏం తింటున్నాము? ఎంత తింటున్నాం? ఏ సమయంలో తింటున్నాము అనేది బేరీజు వేసుకోవాలని ఆహార నిపుణులు కూడా సూచిస్తారు.అయితే తాజాగా కేవలం 7 నెలల్లో ఏకంగా 35 కిలోల బరువు తగ్గిన మహిళ, తన అనుభవాలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. పదండి మరి  ఆమె సక్సెస్‌మంత్రా ఏంటో తెలుసుకుందాం.

ఇన్‌స్టాలో నేహా తన వెయిట్‌ లాస్‌ జర్నీ గురించి వివరించింది.  ముఖ్యంగా వ్యాయామంతోపాటు, దూరంగాపెట్టాల్సినకొన్ని ఆహారాల గురించి చెప్పుకొచ్చింది. నిజంగా బరువు తగ్గడమే అదొక యజ్ఞంలాగా చేయాలి. భారీ కసరత్తులు,  డైట్‌ చేసినా అనుకున్న ఫలితం కనపించక చాలామంది నిరాశపడిపోతారు చాలామంది . అయితే  మనం రోజూ తినే ఆహారపు అలవాట్లే బరువు తగ్గడంలో కీలకం అంటోంది నేహా తాను. కేవలం 7 నెలల్లో ఏకంగా 35 కిలోల బరువు తగ్గినట్టు వెల్లడించింది.  ‘‘బరువు తగ్గాలనుకుంటే, ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి లేదా వాటిని చాలా తక్కువగా తీసుకోవాలి" అనే క్యాప్షన్‌లో తన అనుభవాన్ని షేర్‌ చేసింది. నేహా.

p;

 

ఇదీ చదవండి: అవును మేమిద్దరమూ విడిపోతున్నాం.. కానీ!

నేహా దూరం పెట్టిన ఆ 10 రకాల ఫుడ్‌ 

  • గ్రానోలా (Granola): ఇది ఆరోగ్యకరమైన ఆహారంగా ప్రచారంలో ఉంది. కానీ ఇందులో చక్కెర, అనారోగ్యకరమైన నూనెలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మంచి కంటే చెడే ఎక్కువ చేస్తాయి.

  • ఫ్లేవర్డ్ యోగర్ట్: ఇందులో కనిపించని చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ స్థాయిలను పెంచి, శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతాయి.

  • ప్యాక్‌ చేసిన పళ్ల రసాలు: : వీటిలో ఫైబర్ ఉండదు, చక్కెర ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాలు సోడా కంటే కూడా ప్రమాదకరమైనవి.

  • డైట్ నమ్కీన్, బేక్డ్ చిప్స్ :  "డైట్" అని ఉన్నంత మాత్రాన వీటిని చూసిబుట్టలోపడిపోకండి  మోసపోకండి. ఇవి కూడా బాగా ప్రాసెస్ చేసిన ఆహారాలే. వీటిలో శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, చెడు కొవ్వులు ఉంటాయి సో.. జాగ్రత్త.

  • ప్రోటీన్ బార్స్ (Protein bars): చాలా ప్రోటీన్ బార్‌లు చక్కెర మిఠాయిల్లాగే ఉంటాయి. కేవలం కొద్దిగా ప్రోటీన్ అదనంగా చేరుస్తారు అంతే. వీటిని కొనే ముందు పదార్థాల జాబితాను జాగ్రత్తగా చూడండి.

  • తేనె, బెల్లం (Honey and jaggery): ఇవి సహజమైనవి కావచ్చు, కానీ అవి కూడా చక్కెరలే. శుద్ధి చేసిన చక్కెరలాగే ఇవి కూడా మీ ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి.

  • బ్రౌన్ బ్రెడ్ (Brown bread): ఇది తరచుగా శుద్ధి చేసిన మైదా పిండితో తయారు చేస్తారు. ఆరోగ్యకరంగా కనిపించడానికి రంగు కలుపుతారు. నిజానికి ఇందులో పోషక విలువలు తక్కువగా ఉంటాయి.

  • స్టోర్స్‌లో కొనే స్మూతీలు:  వీటిలో పండ్ల చక్కెరలు, కొన్నిసార్లు కృత్రిమ రుచులు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వు పెరగడానికి దారితీస్తాయి. (Tip of the Day : రాగుల జావతో మ్యాజిక్‌)

  • తక్కువ కొవ్వు ప్యాకేజ్డ్ ఆహారాలు: వీటిలో సహజ కొవ్వులను తొలగించి, రుచి కోసం సాధారణంగా చక్కెరను కలుపుతారు. ఇది తక్కువ కొవ్వు తీసుకునే ఉద్దేశ్యాన్ని దెబ్బతీస్తుంది.

  • సోయా ఉత్పత్తులు:  సోయా ఉత్పత్తులను  కూడా మితిమీరి, ముఖ్యంగా ప్రాసెస్ చేసిన సోయాను ఎక్కువగా తీసుకోవడం హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. (సినీ దర్శకుడవ్వడమే టార్గెట్‌ : మత్స్యకార మణిహారం)

నోట్‌ :  నేహా ఇన్‌స్టా పోస్ట్‌ ఆధారంగా అందించింది మాత్రమే అని గమనించగలరు.   వృత్తిపరమైన వైద్య సలహాకు ఇది ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా సందేహాలుంటే నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement