
ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్లు ఎంటర్టైనర్లు ఫ్యాన్స్‌కు చేదు వార్త చెప్పారు. ఇకపై తాము విడిపోతున్నామని ప్రకటించారు సురభి-సమృద్ధి మెహ్రా (Surabhi and Samriddhi) "చింకి-మింకి" (Chinki-Minki) గా పాపులర్ అయిన ఈ బ్యూటిఫుల్ ట్విన్స్ వృత్తిపరంగా తమ దారులు వేరు అంటూ ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు. ఊహించని ఈ ప్రకటనకు ఫ్యాన్స్‌షాక్ అయ్యారు. దీంతో ఈ పోస్ట్ సంచలనంగా మారింది.
@surabhi.samriddhiలో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు. ఇన్నేళ్లుగా తమను ఆదరించి అచంచలమైన ప్రేమను పంచిన అభిమానులకు మెహ్రా సిస్టర్స్ ధన్యవాదాలు తెలిపారు. కెరీర్లు వేర్వేరు మార్గాల్లో వెళుతున్నప్పటికీ, సోదరీమణులుగా వారి బంధం చెక్కుచెదరకుండా ఉంటుందని స్పష్టం చేశారు. తమ ప్రయాణంలో తమకు తోడుగా నిలిచినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
తొలుత సురభి - సమృద్ధి ద్వయం ఆకర్షణీయమైన, ఫన్నీ షార్ట్-ఫామ్ వీడియోలదో లైమ్‌లైట్‌లోకి వచ్చారు. సహజ ఆకర్షణ .కెమిస్ట్రీ త్వరగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత ది కపిల్ శర్మ షోలో కామెట్ స్కిట్‌లకు పాపులర్ అయిన ఈ సోదరీమణులు ఎంతో మందిఅభిమానులను సంపాదించుకున్నారు. వారి కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూంత అభిమానాన్ని చూరగొన్నారు.
ఇదీ చదవండి: Tip of the Day : రాగుల జావతో మ్యాజిక్
ఈ ప్రకటనపై నెటిజనులు, అభిమానులు మిశ్రంగా స్పందించారు. అయితే “చింకి-మింకి” యుగం ముగియ వచ్చు, కానీ తమ వ్యక్తిగత ప్రయాణాల ప్రారంభం కొత్త వినోదాన్ని ఉత్సాహాన్నిస్తుందని అందరూ ఇలాగే ఆదరించాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత విభేదాలు లేవని, కేవలం వృత్తిపరంగానే ఈ మార్పు అని ప్రకటించడంతో అభిమానులు శాంతించారు. సోలో మార్గాలను అన్వేషించాలనే సురభి-సమృద్ధి నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే దీంతో వీళ్లిద్దరూ విడి విడిగా ఏం చేయబోతున్నారనే ఆసక్తి నెలకొంది.
ఇదీ చదవండి: క్యాషియర్ సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుంటే నేరమా బాస్?!