
ఓ చిరుద్యోగం చేసుకునే మహిళ ఎంతో కష్టపడి, ఇష్టపడి కారు కొనుక్కుంటే..ఆ ఉద్యోగిని ఉద్యోగంలోంచి తీసేసిన ఘటన చర్చకు దారితీసింది. మంచి జీవితం గడపడం కూడా తప్పేనా అంటూ బాధిత మహిళ సోషల్ మీడియాలో తన గోడును వెళ్ల బోసుకుంది. దీంతో ఈ స్టోరీ వైరల్‌గా మారింది.
దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్‌లో ఒక గ్యారేజ్‌లో క్యాషియర్‌గా పనిచేస్తోంది అసేజా లిమెలింటాకా (28) భారతీయ సంతతికి చెందిన షిరాజ్ పటేల్ ఆమె బాస్. సెకండ్‌హ్యాండ్ హోండా కారు కొనుక్కుని ఆ కారులో ఆఫీసుకు వెళ్లడమే ఆమె చేసిన నేరం.
జీతం తక్కువగా ఉన్నా, కారు కొన్నావా అంటూ తన బాస్ తనను తొలగించారని ఆమె ఆరోపించింది. కష్టపడి ఎన్నో నెలల పొదుపు చేసుకుని, లోన్ తీసుకుని మరీ తన కారు కొన్నానని వాపోయింది.
ఇవన్నీ చెప్పినా కూడా బాస్ పటేల్ తనను నమ్మ లేదని , వేరే చోట పనిచేస్తుందో లేదో తనిఖీ చేయడానికి ఆమె బ్యాంక్ ఖాతాను చూపించాలని డిమాండ్ చేశాడని ఆమె ఆరోపించింది. వివరాలు చూసి కొత్త ఫర్నిచర్ కొంటున్నావ్, ఇక నువ్వు క్యాషియర్‌గా ఉండటానికి వీల్లేదంటూ తనను తీసేసారని ఆమె ఫేస్‌బుక్ పోస్ట్‌లో రాసింది.అంతేకాదు దొంగతనం ఆరోపణలు కూడా చేశాడని పేర్కొంది. పెట్రోల్ పంప్ అటెండెంట్‌గా పనిచేయాలని లేదా రాజీనామా చేయాలని అతను ఆమెకు అల్టిమేటం ఇచ్చాడని ఆమె అన్నారు.
అయితే బెర్క్లీ మోటార్ గ్యారేజ్ యజమాని లిమెలింటకా చేసిన ఆరోపణలను ఖండించారు. ఆమెను తొలగించలేదని పేర్కొన్నారు. తామె ఎవరిపైనా ఎలాంటి ఆరోపణలు చేయలేదద చాలా నిజాలని దాచిపెట్టిందన్నారు. అలాగే కంపెనీపై తప్పుడు ఆరోపణలు చేసినందు వల్ల ఇకపై అప్రమత్తంగా ఉంటామని తెలిపాడు.