కసాయి తండ్రి.. ఐదేళ్ల కవల కూతుళ్ల ప్రాణం తీశాడు.. | tragedy in karimnagar | Sakshi
Sakshi News home page

కసాయి తండ్రి.. ఐదేళ్ల కవల కూతుళ్ల ప్రాణం తీశాడు..

Apr 3 2026 8:27 PM | Updated on Apr 4 2026 8:55 AM

tragedy in karimnagar

సాక్షి, కరీంనగర్‌ : రూరల్‌ మండలం జూబ్లీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి ఇద్దరు కుమార్తెలను హత్య చేసి బావిలో పడేశాడు.

పోలీసుల వివరాల ప్రకారం, శుక్రవారం శ్రీశైలం తన భార్యతో గొడవపడ్డాడు. కోపోద్రికుడైన అతడు ఐదేళ్ల కవల కూతుళ్లకు గడ్డి మందు తాగించి అనంతరం బావిలో పడేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు పిల్లల మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒక కూతురు మృతదేహం లభించగా, మరో కూతురు కోసం గాలింపు కొనసాగుతోంది.

ఈ ఘటనపై ఆగ్రహించిన స్థానికులు శ్రీశైలంపై దాడి చేశారు. భార్యతో గొడవపడి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని వారు చెబుతున్నారు. నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement