పవన్‌ ఫ్యాన్స్‌ని భయపెడుతున్న మెహర్ రమేష్ | Meher Ramesh Clarify Pawan Kalyan Movie | Sakshi
Sakshi News home page

Meher Ramesh: అన్నకు ఘోరమైన ఫ్లాప్.. మరి తమ్ముడికి?

Jul 15 2025 10:31 AM | Updated on Jul 15 2025 11:03 AM

Meher Ramesh Clarify Pawan Kalyan Movie

పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కి సిద్ధమైంది. వచ్చే శుక్రవారం (జూలై 24) థియేటర్లలోకి రానుంది. ఈ మూవీపై ఎవరికీ ద్దగా అంచనాల్లేవు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కాస్త హడావుడి చేస్తున్నారు. రిజల్ట్ ఏమవుతుందనేది చూడాలి. మరోవైపు 'ఓజీ' కూడా కొన్నిరోజుల క్రితమే పూర్తయింది. దీనిపై హైప్ బాగానే ఉంది. వీటితో పాటు 'ఉస్తాద్ భగత్ సింగ్' సెట్స్‌పై ఉంది. అయితే ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కంగారు పడే న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్)

దర్శకుడు మెహర్ రమేశ్.. నెల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌తో కచ్చితంగా సినిమా చేస్తానని చెప్పుకొచ్చాడు. మరి ఏమైందో ఏమో గానీ ఇప్పుడు ఆ స్టేట్‌మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పవన్ అభిమానులు కంగారు పడుతున్నారు. ఎందుకంటే మెహర్ రమేశ్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే 'బిల్లా' తప్పితే మిగతా చిత్రాలన్నీ దాదాపు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఈయన గత చిత్రం చిరంజీవితో తీసిన 'భోళా శంకర్' అయితే ఎలాంటి ఫలితం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అన్నయ్య చిరంజీవికి ఘోరమైన డిజాస్టర్ ఇచ్చిన మెహర్ రమేశ్.. ఇప్పుడు పవన్‌తో కచ్చితంగా సినిమా తీస్తాననడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. కానీ ఇది రియాలిటీలో వర్కౌట్ అవ్వదేమో అని వాళ్లలో వాళ్లు అనుకుంటున్నారు. ఎందుకంటే పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. చేస్తున్న ప్రాజెక్టులు తప్పితే కొత్తగా ఏవి ఒప్పుకొనే స్థితిలో లేరు. కానీ ఎక్కడ మెహర్ రమేశ్ ఒప్పించేస్తాడోనని కంగారు పడుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?

(ఇదీ చదవండి: 'జూనియర్' కోసం శ్రీలీల.. అంత రెమ్యునరేషన్ ఇచ్చారా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement