
ప్రముఖ నటి, పద్మభూషణ్ పురస్కార గ్రహీత బీ సరోజా దేవి మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి సంతాపం తెలియజేశారు. చలన చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారాయన.
సాక్షి, గుంటూరు: ప్రముఖ నటి, పద్మభూషణ్ బీ సరోజా దేవి మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి సంతాపం తెలియజేశారు. తెలుగు, కన్నడ, తమిళ బాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని ఆమె పొందారని ఆయన ఒక ప్రకటనలో గుర్తుచేశారు. సరోజాదేవి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు వైఎస్ జగన్ తెలిపారు.
సరోజాదేవి గారు చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆమె ఎన్నో అద్భుతమైన పాత్రలతో సినీ ప్రేక్షకులను అలరించారు. ఆమె మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. సరోజాదేవి గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని ప్రగాఢ సానుభూతిని వైఎస్ జగన్ తెలియజేశారు.

ఇదీ చదవండి: అభినయ సరస్వతి సరోజా దేవి.. వరల్డ్ రికార్డు ఏంటో తెలుసా?