ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ కు మాతృ వియోగం
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ ఇంట విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి నిమ్మల సక్కుబాయమ్మ కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె..బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అంతిమ సంస్కారాలు రేపు (జనవరి 29)మధ్యాహ్నం జరుగుతాయని శంకర్ కుటుంబ సభ్యులు తెలిపారు.
సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలను కమర్షియల్ యాంగిల్‌లో తెరకెక్కించి సక్సెస్ అందుకున్న దర్శకుడు శంకర్. 1997లో ‘ఎన్‌కౌంటర్’తో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. శ్రీరాములయ్య, భద్రాచలం, జయం మనదేరా, ఆయుధం, జైబోలో తెలంగాణ లాంటి సూపర్ హిట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు.


