32 ఏళ్ల తర్వాత ఇలా..: మోహన్‌బాబు | Mohan Babu Birthday Special: Shikanja Maalik Glimpse out from The Paradise | Sakshi
Sakshi News home page

మోహన్‌బాబు బర్త్‌డే స్పెషల్‌: ప్యారడైజ్‌ గ్లింప్స్‌ అవుట్‌

Mar 19 2026 3:54 PM | Updated on Mar 19 2026 4:50 PM

Mohan Babu Birthday Special: Shikanja Maalik Glimpse out from The Paradise

టాలీవుడ్‌ హీరో నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ది ప్యారడైజ్‌. విలక్షణ నటుడు మోహన్‌బాబు విలన్‌గా యాక్ట్‌ చేస్తున్నారు. నేడు (మార్చి 19న) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్‌ స్పెషల్‌ వీడియో విడుదల చేశారు. అందులో మోహన్‌బాబు 32 సంవత్సరాల తర్వాత నేను విలన్‌గా యాక్ట్‌ చేస్తున్నాను. డైరెక్టర్‌ శ్రీకాంత్‌ నన్ను మాయ చేశాడు అని పేర్కొన్నారు. ఆయనను షికంజి పాత్ర కోసం ఎలా సన్నద్ధం చేస్తున్నారనేది చూపించారు.

మోహన్‌బాబు బర్త్‌డే స్పెషల్‌  గ్లింప్స్‌
చివర్లో మోహన్‌బాబుకు ఎలివేషన్‌ ఇచ్చాడు శ్రీకాంత్‌ ఓదెల. ఈ జనరేషన్‌కు మోహన్‌బాబు సర్‌ అంటే కొంచెం అర్థం కాకపోవచ్చు. కానీ, ప్యారడైజ్‌తో ఆయనేంటో చూపిస్తాం అన్నాడు. అయితే ఈ గ్లింప్స్‌ నిడివి కేవలం 46 సెకన్లు మాత్రమే కలిగి ఉంది. ఈ సినిమా విషయానికి వస్తే అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఎస్వీఎల్‌ సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. ఈ మూవీ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

 

చదవండి: 41 ఏళ్ల వయసులో తల్లయిన బుల్లితెర నటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement