41 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న నటి | Divyanka Tripathi, Vivek Dahiya Announces Pregnancy | Sakshi
Sakshi News home page

Divyanka Tripathi: పెళ్లయిన 10 ఏళ్లకు.. ట్విస్ట్‌ అదిరింది కదూ!

Mar 19 2026 2:51 PM | Updated on Mar 19 2026 3:08 PM

Divyanka Tripathi, Vivek Dahiya Announces Pregnancy

ప్రముఖ బుల్లితెర జంట దివ్యాంక త్రిపాఠి- వివేక్‌ దహియా గుడ్‌న్యూస్‌ చెప్పారు. పెళ్లయిన పదేళ్లకు పేరెంట్స్‌గా ప్రమోషన్‌ పొందనున్నట్లు వెల్లడించారు. తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది నాడు ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు దివ్యాంక తన బేబీ బంప్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

అంతా అయిపోయిందనుకునేలోపు..
'పదేళ్ల ప్రయాణంలో ట్విస్ట్‌ అదిరింది కదూ.. కొన్ని ప్రయాణాలు తొందరపెట్టవు.. అవి సిద్ధంగా ఉన్నప్పుడే మొదలవుతాయి. మన కథ పూర్తయిందనుకులోపే జీవితం ఇలాంటి అందమైన అధ్యాయానికి స్వాగతం పలుకుతుంది. ఇంకా ఆ అనుభూతిని ఆస్వాదిస్తూనే ఉన్నా.. కారణం లేకుండానే నవ్వుతున్నా.. మా మనసులు సంతోషంతో నిండిపోయాయి.. అవును, మేము బేబీ కోసం ఎదురుచూస్తున్నాం' అని నటి బ్యూటిఫుల్‌ క్యాప్షన్‌ జోడించింది.

ఇంకా షాపింగ్‌ మొదలుకాలేదు
ఓ ఇంటర్వ్యూలో దివ్యాంక మాట్లాడుతూ.. ప్రెగ్నెన్సీ పాజిటివ్‌ రాగానే మొదట నా భర్తకే చెప్పాను. ఆ వెంటనే ఇంట్లో వాళ్లందరితోనూ పంచుకున్నాం. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. దాదాపు ఆరునెలలపాటు ఈ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్తపడ్డాం. నేను ఎక్కువగా బయటకు రాకపోవడం వల్ల దీన్ని ఇంతకాలం సీక్రెట్‌గా ఉంచగలిగాం. బేబీ కోసం ఇంకా షాపింగ్‌ మొదలుపెట్టలేదు.

2016లో పెళ్లి
జూన్‌లో డెలివరీ డేట్‌ ఇచ్చారు అని పేర్కొంది. దివ్యాంక, వివేక్‌.. యే హై మొహబ్బతే సీరియల్‌ సెట్‌లో కలుసుకున్నారు. ఈ ధారావాహిక చిత్రీకరణ సమయంలోనే ప్రేమలో పడ్డారు. 2016లో భోపాల్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంట నాచ్‌ బలియే 8వ సీజన్‌లో పాల్గొని విజేతగా నిలిచింది. ఇప్పుడు 41 ఏళ్ల వయసులో దివ్యాంక తల్లి కాబోతోంది.

సీరియల్‌
దివ్యాంక త్రిపాఠి నటి మాత్రమే కాదు మోడల్‌, యాంకర్‌ కూడా! 2005లో మిస్‌ భోపాల్‌ కిరీటం అందుకుంది. బనూ మే తేరి దుల్హాన్‌ సీరియల్‌తో గుర్తింపు పొందింది. అలా వరుస ఛాన్సులు అందుకుంది. మధ్యలో తకనుమరుగైపోయినా యే హై మొహబ్బతే సీరియల్‌తో ఆమె కెరీర్‌ మలుపు తిరిగింది. 2017లో ఫోర్బ్స్‌ సెలబ్రిటీ 100 జాబితాలో చోటు దక్కించుకున్న సీరియల్‌ నటిగా రికార్డు సృష్టించింది.

 

 

చదవండి: ఓటీటీలో అమరావతికి ఆహ్వానం మూవీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement