ఎప్పటిలానే మరో వీకెండ్ వచ్చేసింది. ఉగాది, రంజాన్ సెలవులు కలిసి రావడంతో చాలామంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. దానికి తోడు థియేటర్లలోకి ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు వచ్చాయి. వీటిలో ధురంధర్ 2కి అద్భుతమైన టాక్ రాగా.. 'ఉస్తాద్..'కి నెగిటివ్ టాక్ గట్టిగానే వినిపిస్తోంది. మరోవైపు ఓటీటీల్లోనూ ఈ వారం చెప్పుకోదగ్గ తెలుగు మూవీస్ స్ట్రీమింగ్ కావట్లేదు. ఉన్నంతలో సీతా పయనం అనే చిత్రంతో పాటు 'బోర్డర్ 2' అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడు వీటికి తోడు ఓ తెలుగు హారర్ మిస్టరీ థ్రిల్లర్ స్ట్రీమింగ్‌కి సిద్ధమైపోయింది.
(ఇదీ చదవండి: అనుష్క పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన టీమ్)
తెలుగులో సహాయ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సురేఖావాణి కూతురు సుప్రీత.. సోషల్ మీడియాలో బాగా ఫేమస్. ఇప్పుడిప్పుడే ఒకటి అరా సినిమాలు చేస్తోంది. అలానే ఈమె ఓ ప్రధాన పాత్రధారిగా నటించిన చిత్రం 'అమరావతికి ఆహ్వానం'. శివ కంఠమనేని, ఎస్తర్, ధన్య బాలకృష్ణన్ తదితరులు మిగతా లీడ్ రోల్స్ చేశారు. ఇందులో హారర్ ఎలిమెంట్స్ పర్లేదనిపించినప్పటికీ, కొన్నిచోట్ల ఊహకందేలా సీన్స్ ఉండడం పెద్ద మైనస్ అయిందని అంటున్నారు. గత నెల 13న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఈ శుక్రవారం(మార్చి 20) నుంచి ఆహా ఓటీటీలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు.
'అమరావతికి ఆహ్వానం' విషయానికొస్తే.. ఈశ్వర్ (శివ కంఠమనేని) సస్పెండ్ అయిన సీఐ. ఇతడి భార్య భానుమతి (ధన్య బాలకృష్ణ). ఈమె చెల్లెళ్లు భార్గవి(సుప్రీత), విజ్జు. భార్గవి ఓ యూట్యూబర్. దెయ్యంతో డే అండ్ నైట్ అనే కాన్సెప్ట్‌తో వీడియోలు చేస్తుంటుంది. అలా పాతబస్తీలోని డెవిల్స్ హోమ్ భవంతిలో భార్గవి చేసిన వీడియో వైరల్ కావడంతో సెలబ్రిటీ అయిపోతుంది. సడన్‌గా భార్గవికి ఓ అజ్ఞాతవ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. నిజంగా దెయ్యాలు ఉన్నాయని, లైవ్‌లో నిరూపిస్తానని, వీడియో షూట్ చేస్తే ఇంకా ఫేమ్ వస్తుందని ఈమెకు చెప్తాడు. దీంతో భార్గవి.. తన కుటుంబంతో అమరావతి అనే గ్రామానికి వెళ్తుంది. అక్కడ వీళ్లకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' తెలుగు షోలన్నీ రద్దు.. ఏమవుతోంది?)


