breaking news
AmaravathiKi Ahvanam Movie
-
వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 'ధురంధర్ 2' హవా కొనసాగుతోంది. దీని దెబ్బకు పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్'ని అభిమానులు తప్పితే మరెవరు పట్టించుకోవట్లేదు. మరోవైపు ఓటీటీల్లోనూ చూసేందుకు ఏకంగా 26 సినిమాలు/వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి. వీటిలో తెలుగు, డబ్బింగ్ మూవీస్ చాలానే ఉన్నాయి.(ఇదీ చదవండి: ధురంధర్-2 ఫస్ట్ డే కలెక్షన్స్..)ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే విష్ణు విన్యాసం, అమరావతికి ఆహ్వానం, బోర్డర్ 2, సీతా పయనం చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్‌లోకి వచ్చిందంటే?ఓటీటీల్లోకి వచ్చిన సినిమాలు-వెబ్ సిరీస్‌లు (మార్చి 20)అమెజాన్ ప్రైమ్విష్ణు విన్యాసం - తెలుగు సినిమాడెడ్లోచ్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్లగ్నచ షాట్ - మరాఠీ సినిమా (రెంట్)లాల్: లాస్ట్ వన్ లాఫింగ్ డెన్మార్క్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ఆంఖోంఖి గుస్తాకియాన్ - హిందీ మూవీమై లార్డ్ - తమిళ సినిమాద హౌస్ మెయిడ్ - ఇంగ్లీష్ మూవీఅమోర్ యానిమల్ సీజన్ 1 - స్పానిష్ సిరీస్కంపెనీ రిట్రీట్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్వైల్డ్ క్యాట్ - ఇంగ్లీష్ సినిమాస్ట్రే కిడ్స్ - ఇంగ్లీష్ కన్సర్ట్ మూవీనెట్ఫ్లిక్స్బోర్డర్ 2 - హిందీ సినిమాపీకీ బ్లండర్స్: ద ఇమ్మొర్టల్ మ్యాన్ - ఇంగ్లీష్ మూవీద రైజ్ ఆఫ్ ద రెడ్ హాట్ చిల్లీ పెప్పర్స్ - ఇంగ్లీష్ సినిమాఏ డిఫరెంట్ మ్యాన్ - ఇంగ్లీష్ మూవీహాట్స్టార్చిరైయా - తెలుగు డబ్బింగ్ సిరీస్జీ5కాసర్గోడ్ ఎంబసీ సీజన్ 1 - మలయాళ సిరీస్ల్యాండ్ లార్డ్ - కన్నడఅగ అగ సునాబై! కాయ్ మహంతాయ్ ససుబాయ్ - మరాఠీ సినిమాసన్ నెక్స్ట్వలవార - కన్నడ చిత్రంసీతాపయనం - తెలుగు మూవీఫోర్త్ ఫ్లోర్ - తమిళ సినిమాఆపిల్ టీవీ ప్లస్వండర్ పెట్స్ - ఇంగ్లీష్ సిరీస్ఆహాఅమరావతికి ఆహ్వానం - తెలుగు సినిమామనోరమ మ్యాక్స్రిటన్ అండ్ డైరెక్టెడ్ బై గాడ్ - మలయాళ మూవీసోనీ లివ్ద జాజ్ సిటీ - తెలుగు సిరీస్(ఇదీ చదవండి: పక్క రాష్ట్రం వెనుకంజలో ఉంది: చిరంజీవి) -
ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా
ఎప్పటిలానే మరో వీకెండ్ వచ్చేసింది. ఉగాది, రంజాన్ సెలవులు కలిసి రావడంతో చాలామంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. దానికి తోడు థియేటర్లలోకి ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు వచ్చాయి. వీటిలో ధురంధర్ 2కి అద్భుతమైన టాక్ రాగా.. 'ఉస్తాద్..'కి నెగిటివ్ టాక్ గట్టిగానే వినిపిస్తోంది. మరోవైపు ఓటీటీల్లోనూ ఈ వారం చెప్పుకోదగ్గ తెలుగు మూవీస్ స్ట్రీమింగ్ కావట్లేదు. ఉన్నంతలో సీతా పయనం అనే చిత్రంతో పాటు 'బోర్డర్ 2' అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడు వీటికి తోడు ఓ తెలుగు హారర్ మిస్టరీ థ్రిల్లర్ స్ట్రీమింగ్కి సిద్ధమైపోయింది.(ఇదీ చదవండి: అనుష్క పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన టీమ్)తెలుగులో సహాయ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సురేఖావాణి కూతురు సుప్రీత.. సోషల్ మీడియాలో బాగా ఫేమస్. ఇప్పుడిప్పుడే ఒకటి అరా సినిమాలు చేస్తోంది. అలానే ఈమె ఓ ప్రధాన పాత్రధారిగా నటించిన చిత్రం 'అమరావతికి ఆహ్వానం'. శివ కంఠమనేని, ఎస్తర్, ధన్య బాలకృష్ణన్ తదితరులు మిగతా లీడ్ రోల్స్ చేశారు. ఇందులో హారర్ ఎలిమెంట్స్ పర్లేదనిపించినప్పటికీ, కొన్నిచోట్ల ఊహకందేలా సీన్స్ ఉండడం పెద్ద మైనస్ అయిందని అంటున్నారు. గత నెల 13న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఈ శుక్రవారం(మార్చి 20) నుంచి ఆహా ఓటీటీలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు.'అమరావతికి ఆహ్వానం' విషయానికొస్తే.. ఈశ్వర్ (శివ కంఠమనేని) సస్పెండ్ అయిన సీఐ. ఇతడి భార్య భానుమతి (ధన్య బాలకృష్ణ). ఈమె చెల్లెళ్లు భార్గవి(సుప్రీత), విజ్జు. భార్గవి ఓ యూట్యూబర్. దెయ్యంతో డే అండ్ నైట్ అనే కాన్సెప్ట్‌తో వీడియోలు చేస్తుంటుంది. అలా పాతబస్తీలోని డెవిల్స్ హోమ్ భవంతిలో భార్గవి చేసిన వీడియో వైరల్ కావడంతో సెలబ్రిటీ అయిపోతుంది. సడన్‌గా భార్గవికి ఓ అజ్ఞాతవ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. నిజంగా దెయ్యాలు ఉన్నాయని, లైవ్‌లో నిరూపిస్తానని, వీడియో షూట్ చేస్తే ఇంకా ఫేమ్ వస్తుందని ఈమెకు చెప్తాడు. దీంతో భార్గవి.. తన కుటుంబంతో అమరావతి అనే గ్రామానికి వెళ్తుంది. అక్కడ వీళ్లకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' తెలుగు షోలన్నీ రద్దు.. ఏమవుతోంది?) -
టాలీవుడ్ హారర్ థ్రిల్లర్.. అమరావతికి ఆహ్వానం ఎలా ఉందంటే?
టైటిల్: అమరావతికి ఆహ్వానంనటీనటులు: శివ కంఠంనేని, ఎస్తేర్, ధన్య బాలకృష్ణ, సుప్రిత, అశోక్ కుమార్, హరీష్, భద్రమ్, జెమినీ సురేష్ , నాగేంద్ర ప్రసాద్ తదితరులుదర్శకత్వం: జీవీకేనిర్మాణ సంస్థ: లైట్ హౌస్ సినీ మ్యాజిక్నిర్మాతలు: కెఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వరరావుసినిమాటోగ్రఫీ: జె ప్రభాకర్ రెడ్డిసంగీతం: పద్మనాబ్ భరద్వాజ్‌ఎడిటింగ్: సాయిబాబు తలారివిడుదల తేదీ: 13 ఫిబ్రవరి, 2026టాలీవుడ్లో హారర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. మంచి కంటెంట్ ఉన్న హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడు ఉంటుంది. అందుకే మలయాళ థ్రిల్లర్ తెగ చూసేస్తున్నారు. అందుకే డైరెక్ట్‌గా తెలుగులోనే వచ్చిన హారర్ థ్రిల్లర్ అమరావతికి ఆహ్వానం. ఈ చిత్రం ఫిబ్రవరి 13వ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ టాలీవుడ్ ఆడియన్స్‌ను ఎంతవరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.అమరావతికి ఆహ్వానం కథేంటంటే..ఈశ్వర్ (శివ కంఠమనేని) ఒక సస్పెండెడ్ సీఐ. అతని భార్య భానుమతి (ధన్య బాలకృష్ణ). భానుమతి సిస్టర్స్ భార్గవి (సుప్రిత), విజ్జు. అయితే భార్గవికి పెద్ద సెలబ్రిటీ కావాలనే కోరిక ఉంటుంది. అందుకే ఓ యూట్యూబ్ ఛానెల్‌ను రన్ చేస్తుంటుంది. ఈ యూట్యూబ్ ఛానెల్లో దెయ్యంతో డే అండ్ నైట్ అనే కాన్సెప్ట్‌తో వీడియోలు షూట్ చేసి.. కంటెంట్ అప్లోడ్ చేస్తుంటుంది. అలా పాతబస్తీలోని డెవిల్స్ హోమ్ అనే భవంతిలో భార్గవి చేసిన వీడియో వైరల్ కావడంతో రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రిటీ అయిపోతుంది.అయితే సడన్‌గా భార్గవికి ఓ అజ్ఞాతవ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. నిజంగా దెయ్యాలు ఉన్నాయని అదే విషయాన్ని లైవ్‌లో నిరూపిస్తానని.. ఈ వీడియో షూట్ చేస్తే ఇంకా ఫేమ్ వస్తుందని భార్గవికి చెప్తాడు. దీంతో మరింత ఉత్సాహంతో భార్గవి కుటుంబంతో సహా అమరావతి అనే గ్రామానికి వెళ్తుంది. అక్కడికెళ్లి ఈశ్వర్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎదురైన వింత సంఘటనలు ఏమిటి? అమరావతిలోని జమీందారు వంశ వారసురాలు రాజేశ్వరి(ఎస్తేర్)ను చంపింది ఎవరు? రాజేశ్వరి కుటుంబానికి, ఈశ్వర్ కుటుంబానికి మధ్య ఉన్న లింక్ ఏంటి? సీఐగా ఈశ్వర్ సస్సెండ్ కావడానికి కారణం ఎవరు? అన్న విషయాలు తెలియాలంటే థియేటర్స్‌కు వెళ్లాల్సిందే.ఎలా ఉందంటే..దెయ్యాలు అనే కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. తెలుగులోనూ దెయ్యం నేపథ్యంలో వచ్చి సూపర్ హిట్ కొట్టిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా మెజారిటీ హారర్ సినిమాల్లో దెయ్యాలు, క్షుద్రపూజలనే ప్రధాన కథాంశంగా చూపిస్తారు. ఈ అమరావతికి ఆహ్వానంలోనూ అదే పంథా ఫాలో అయ్యాడు డైరెక్టర్. కాకపోతే ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్ చూపించాడు. అంతేకాకుండా మంచి సందేశాన్ని ఇచ్చిన తీరు ఆడియన్స్‌ను కనెక్ట్ చేసేలా ఉంది ఈ హారర్ థ్రిల్లర్ సినిమా.అమరావతి అనే గ్రామంలో రాత్రివేళ జరిగే ఓ హారర్ సీన్‌తో కథ ప్రారంభించాడు. ఆ తర్వాత వెంటవెంటనే కథను హైదరాబాద్‌కు షిఫ్ట్ చేశాడు. ఫస్ హాఫ్‌లో భార్గవి వీడియోలు షూట్ చేయడం, మహేశ్ (శివ హరీశ్)తో ప్రేమలో పడడం లాంటివి చకచకా జరిగిపోతాయి. ప్రథమార్థంలో అంతగా ఆడియన్స్‌ను భయపెట్టే సీన్స్ పెద్దగా కనిపించవు. ఈశ్వర్ ఫ్యామిలీ అమరావతికి వెళ్లిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. అక్కడ రాజేశ్వరి గురించి అసలు నిజం తెలుసుకోవడంతో ఫస్ట్ హాఫ్‌కు ఎండ్ కార్డ్ పడుతుంది. ఇక్కడే డైరెక్టర్ ఇచ్చిన ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచేసింది.సెకండాఫ్‌లో కథ అంతా రాజేశ్వరి క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది. ఆమె ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో కథనం ఆడియన్స్‌కు ఆసక్తికరంగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో హారర్ సీన్స్ ప్రేక్షకులను భయపెట్టేస్తాయి. ఇక ప్రీ క్లైమా క్స్ వచ్చే ట్విస్ట్ థ్రిల్ చేస్తుంది. హారర్ ఎలిమెంట్స్ మెప్పించినప్పటికీ.. కొన్నిచోట్ల ప్రేక్షకులు ఊహకందేలా సీన్స్ ఉండడం పెద్ద మైనస్. హారర్ థ్రిల్లర్‌లో సాంగ్స్ ఉంటే కథ సెట్ అవ్వదు. సెకండాఫ్‌లో ముగ్గురు హీరోయిన్స్‌తో సాంగ్ చేయడం అంతగా సెట్ అవ్వలేదని అనిపిస్తుంది. ఓవరాల్‌గా చూస్తే ఓ హారర్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు డైరెక్టర్ జీవీకే. తన కథకు తగినట్లుగానే క్లైమాక్స్ డిజైన్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. హారర్, ఫ్యామిలీ ఎమోషన్స్, రివెంజ్, థ్రిల్ అందించడంలో జీవీకే మార్క్ కనిపించింది. హారర్ కంటెంట్ మూవీస్ ఇష్టపడేవాళ్లు అమరావతికి ఆహ్వానం ట్రై చేయొచ్చు. క్లైమాక్స్‌లో అమరావతికి ఆహ్వానంకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు.ఎవరెలా చేశారంటే..ఈశ్వర్, జగదీష్ పాత్రలలో శివ కంఠంనేనిగారి నటన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లోనూ తనదైన మార్క్ చూపించారు. ఈ సినిమాకు మరో మెయిన్ పిల్లర్ ఏస్తేర్. ఆమె రాజేశ్వరి పాత్రలో అదరగొట్టేశారు. భానుమతి పాత్రలో ధన్యబాలకృష్ణ మెప్పించింది. హారర్ సీన్స్‌లో ధన్య అదరగొట్టేసింది. భార్గవి పాత్రను సుప్రిత చాలా బాగా చేసింది. మహేశ్, జెమినీ సురేష్, భద్రమ్, అశోక్ కుమార్, నాగేంద్రలు వారి వారి పాత్రల పరిధిలో మెప్పించారు. సాంకేతికత విషయానికొస్తే ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. పద్మనాభ్ భరద్వాజ్ బీజీఎం హారర్ కథకు బాగా సెట్ అయింది. సాయి బాబా తలారి తన ఎడిటింగ్‌కు ఇంకాస్తా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి.


