అనుష్క పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన టీమ్ | Anushka Shetty Wedding Rumours Team Clarify | Sakshi
Sakshi News home page

Anushka Shetty Wedding: ఇలా టార్గెట్ చేయడం అన్యాయం

Mar 19 2026 11:49 AM | Updated on Mar 19 2026 1:34 PM

Anushka Shetty Wedding Rumours Team Clarify

హీరోయిన్ అనుష్క శెట్టి త్వరలో ఓ బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకోనుందని ఈ మధ్య మళ్లీ రూమర్స్ వచ్చాయి. గతంలోనూ ఇలానే రాగా వాటి గురించి ఎవరూ స్పందిచంకపోయేసరికి అంతా ఊరుకున్నారు. ఇప్పుడు మాత్రం అనుష్క సీరియస్ అయింది. ఈ మేరకు ఆమె టీమ్ ఓ నోట్ విడుదల చేసింది. పెళ్లి రూమర్స్ గురించి క్లారిటీ ఇస్తూనే వయసు గురించి ఎందుకు ఇంతలా హైలైట్ చేస్తున్నారని టీమ్ ప్రశ్నించింది.

(ఇదీ చదవండి: వాళ్లు చెప్పిందే నమ్మా.. ఇలా చేస్తారనుకోలేదు: నోరా ఫతేహి)

'ఒకరి జీవితాన్ని రోజువారీ న్యూస్‌గా మార్చేముందు కనీసం అది నిజమా కాదా అని కూడా చూడటం లేదు. ఊహించడం, అంచనా వేయడం, అనధికారిక సమాచారాన్ని పదేపదే ప్రచురించడం కరెక్ట్ కాదు. ఆమె వయసుపై అనవసరమైన శ్రద్ధ చూపడం, ప్రతి పోస్టులో '44' అనే నంబర్‌ని ఏదో వివాదాస్పదమైన అంశంలా హైలైట్ చేయడం అన్నింటికంటే నిరాశ కలిగించే విషయం. వయసు అంత పెద్ద సమస్య అయితే.. హీరోల విషయంలో కూడా ఇదే ఉత్సాహం ఎందుకు కనిపించడం లేదు? మహిళలకే ఎందుకు భిన్నంగా ఉంటుంది?'

'అనుష్క శెట్టి తన కెరీర్‌ని ప్రతిభ, గౌరవంతో నిర్మించుకున్నారు. ఆమె ఎప్పుడూ పీఆర్ స్టంట్స్‌పై ఆధారపడలేదు. తన వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగా ఉంచుకోవాలని అనుకునే వ్యక్తిని ఇలా టార్గెట్ చేయడం అన్యాయం. ప్రతిఒక్కరూ తమ జీవితంలో జరిగే విషయాలనీ అందరికీ చెప్పలనుకోరు. ఆ నిర్ణయాన్ని గౌరవించాలి. వివాహం వ్యక్తిగత విషయం. ఇది బ్రేకింగ్ న్యూస్ కాదు. ట్రెండ్ కాదు. కేవలం వ్యూస్ కోసం సెన్సేషనలైజ్ చేయాల్సిన విషయం అంతకంటే కాదు. ఇకనైనా బాధ్యతగా వ్యవహరించండి. హద్దులని గౌరవించండి. ప్రచురించే ముందు నిజాన్ని నిర్ధారించుకోండి. హీరోయిన్లని కూడా హీరోలతో సమానంగా గౌరవించండి' అని అనుష్క టీమ్ రాసుకొచ్చింది.

(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' తెలుగు షోలన్నీ రద్దు.. ఏమవుతోంది?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement