వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ కన్నుమూత | Former Wyra MLA Banoth Madan Lal Passes Away Due To Cardiac Arrest | Sakshi
Sakshi News home page

వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ కన్నుమూత

May 27 2025 7:33 AM | Updated on May 27 2025 9:34 AM

Former Wyra Mla Madan Lal Passes Away

సాక్షి, ఖమ్మం​: వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్ గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో మృతిచెందారు. నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయన.. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఇవాళ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు.

గతవారం ఖమ్మంలోని ఆయన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మదన్ లాల్ మృతితో వైరా నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు నేతలు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మదన్ లాల్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున వైరా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. 2018, 2023 ఎన్నికల్లో ఓటమి చవి చూశారు.

 


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement