
బాలీవుడ్ నటుడి మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ సంతాపం తెలిపారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా ఆయనకు నివాళులర్పించారు. ముకుల్ దేవ్ మృతి చెందడం బాధాకరం.. ఈ విషాద సమయంలో అదుర్స్ మూవీలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నామని రాసుకొచ్చారు. కష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.. ఓం శాంతి అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
కాగా..బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్(54) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. సీరియల్ నటుడిగా కెరీర్ ప్రారంభించిన ముకుల్ దేవ్ (Mukul Dev) బాలీవుడ్ మూవీ ‘దస్తక్’తో వెండితెరకి పరిచయం అయ్యాడు. హిందీతో పాటు తెలుగు, పంజాబీ, కన్న చిత్రాల్లోనూ నటించాడు.
ముకుల్ దేవ్‌కి టాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు ఉంది. తెలుగులో కృష్ణ, ఏక్ నిరంజన్, కేడీ, అదుర్స్, నిప్పు, భాయ్ తదితర సినిమాల్లో నటించాడు. కృష్ణ సినిమాలో పోషించిన విలన్ పాత్ర మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2022లో విడుదలైన ‘అంత్ ది ఎండ్’ తర్వాత ఆయన సినిమాల్లో కనిపించలేదు. సింహాద్రి, సీతయ్య, అతడు చిత్రాల్లో నటించారు.
Saddened by the passing of Mukul Dev garu. Remembering our time in Adhurs and his commitment to the craft. My condolences to his family. Om Shanti. 🙏 pic.twitter.com/Rp4HsrLR2I
— Jr NTR (@tarak9999) May 24, 2025